కేదార్‌నాథ్
కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఇది భారత దేశాంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో ఉంది.మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కోడల మద్య ఉంది.హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం.శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్.
విషయ సూచిక |
[మార్చు] కేదార్‌నాథ్ గుడి
కేదార్‌నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కోడల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతియ నుండి దీపావళి వరకు భక్త సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలోని ప్రతిష్టితమన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించ బడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్‌నాథ్ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాధ్ లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడూ భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కధనం.తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
[మార్చు] ప్రత్యేకత
కేదార్‌నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. హిమాలయాల్లోని చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి.
[మార్చు] ప్రయాణ సౌకర్యాలు
రిషికేశ్ నుండి హరిద్వార్ వరకు పోయే మార్గంలో ఉన్న గౌరీకుండ్ నుండి కాలిబాటనలో 14 కిలోమీటర్ల కేదార్‌నాధుని గుడి ప్రతిష్టితమై ఉంది. ఈ గుడిని కాలి బాటలో నడవడం ద్వారా గుర్రాలమీద, మరియు డోలీ ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ యాత్రీకులు కొరకు గురాలు, డోలీలు బాడుగ చెల్లిస్తే లభిస్తాయి. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతియ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.
[మార్చు] ఆలయ మార్గం
కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రీకులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రీకులను గుర్రాలలోను, డోలీలలోను మరియు బుట్టలలోనూ చేరుస్తుంటారు. బుట్టలలో యాత్రీకులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రీకులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరవాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రీకులకు తోడు వస్తారు దర్శనానినికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బసవరకు తీసుకు వస్తారు. పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రీకులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. ఈ ప్ర్యాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరుగంటలు వచ్చేసమయం 3నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రీకులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రీకులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయ అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రీకులకు గౌరీ కుండులో ఆక్సిజన్ సిలిండర్లు వారి బసయజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రీకులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కోంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచులో కప్పబడి ఉంటుంది.పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రీకులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదికి మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్ట్ ద్వారా యాత్రీకులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రీకులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రీకులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రీకులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.
[మార్చు] జనసంఖ్య
2001జనాభా లెక్కలను అనుసరించి కేదార్‌నాథ్ జనసంఖ్య 429.పురుషులు 98% స్త్రీలు2%.అక్షరాశ్యత 63%.పురుషుల అక్ష్రాశ్యత 63%స్త్రీల అక్షరాశ్యత 36%. 6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్య 0%.
|
|||||||