కొండ
వికీపీడియా నుండి
The panoramic view from Connors Hill, near Swifts Creek, Victoria
కొండలు (Hills) భూమి మీద చుట్టున్న ప్రాంతం కన్నా ఎత్తుండి, శిఖరం కలిగిన ప్రదేశాలు.
విషయ సూచిక |
[మార్చు] నామీకరణం
- చిన్న కొండలను గుట్టలు అంటారు.
- కొండలను పర్వతాలనుండి వేరుచేయడం కష్టం. అయినా సామాన్యంగా బాగా ఎత్తున్న కొండల్ని పర్వతాలు అంటారు. ఇంగ్లండులో సర్వే నియమాల ప్రకారం పర్వతం అనడానికి సముద్రమట్టం కన్నా 1000 అడుగులు లేదా (305 మీటర్లు) ఎత్తుండాలి. అయితే ఆక్స్ ఫర్డ్ నిఘంటువు 2000 అడుగులు (610 మీటర్లు) తీసుకోవాలని ప్రతిపాదించినది.
- కొన్ని పర్వతాలు వరుసగా ఉంటే వాటిని కనుమలు లేదా పర్వతశ్రేణులు అంటారు.
- కృత్రిమంగా చీమలు మొదలైన జీవుల చేత తయారుచేయబడిన వాటిని పుట్టలు అంటారు.
[మార్చు] ప్రాముఖ్యత
కొండలు చరిత్రలో చాలా ప్రాముఖ్యాన్ని పొందాయి. చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శతృవుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన రోము నగరం ఏడు కోడల మీద నిర్మించారు.
భారతదేశంలో చాలా కోటలు నిర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: గోల్కొండ, గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు యుద్ధం సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శతృవులు అంత సులభంగా ఎదుర్కోలేరు.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] చిత్రమాలిక
|
A coffee plantation on a conical hill near Orosí, Costa Rica. |
Some hills can be quite small, such as this Ant-hill |
Hills south west of Sanandaj near the village of Kilaneh, Kurdistan Province of Iran. |