కొండగట్టు

వికీపీడియా నుండి

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దృశ్యాలు

కొండగట్టు, కరీంనగర్ నుండి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కెలోమీటర్ల దూరములో కలదు. కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

పూర్వము రామ రావణ యుద్దము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొందగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.


[మార్చు] దేవాలయ చరిత్ర

ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించినాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము క్రిష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడినది.


[మార్చు] ఇతర విశేషాలు

ఈ గుడియే కాక, కొండగట్టు దగ్గర కొండలరాయుని కోట మరియు బొజ్జపోతన గుహలు వంటి చూడదగిన ప్రదేశాలు కలవు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దృశ్యాలు
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దృశ్యాలు
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దృశ్యాలు
(కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దృశ్యాలు
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దృశ్యాలు
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం దృశ్యాలు

[మార్చు] బయటి లింకులు

కొండగట్టు వెబ్‌ సైటు

పేజీకి సంభందించిన లింకులు