కొండమీద ప్రసంగం
మత్తయి 5 వ అధ్యాయము
ఆయన ఆ జనసమూహమును చూచి కొండయెక్కి కూర్ఛండగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చిరి.1
అప్పుడాయన నోరు తెరచి యీలాగున బోదింపసాగెను--2
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు;పరలోకరాజ్యము వారిది.3
దు:ఖపడువారు ధన్యులు;వారు ఓదార్ఛబడుదురు.4
సాత్వికులు ధన్యులు;వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.5
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు;వారు త్రుప్తిపరచబడుదురు.6
కనికరముగలవారు ధన్యులు;వారు దేవుని చూచెదరు.7
హ్రుదయశుద్దిగలవారు ధన్యులు;వారు దేవుని చూచెదరు.8
సమాధానపరచువారు ధన్యులు;వారు దేవుని కుమారులనబడుదురు.9
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు;పరలోకరాజ్యము వారిది.10
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.11
సంతోషించి ఆనందించుడి,పరలోకమందు మీ ఫలము అధికమగును.ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.12
మూలాలు [మార్చు]
- ↑ "Sermon on the Mount." Cross, F. L., ed. The Oxford dictionary of the Christian church. New York: Oxford University Press. 2005
- ↑ See also Antithesis of the Law.