కొండవలస లక్ష్మణరావు
| కొండవలస లక్ష్మణరావు | |
![]() |
|
| జన్మ నామం | కొండవలస లక్ష్మణరావు |
| జననం | ఆగష్టు 10 1946 (వయసు 66) |
| ప్రముఖ పాత్రలు | ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం లో పొట్టిరాజు, ఎవడి గోల వాడిది లో బక్కరెడ్ది |
కొండవలస లక్ష్మణరావు గారు సుప్రసిద్ద తెలుగు నాటక మరియు చలనచిత్ర నటులు. వీరు మొదట నాటక రంగం లో లబ్ద ప్రతిష్టులు. పిమ్మట ప్రసిద్ద దర్శకులు వంశీ, తన ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం తో వీరిని తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం చేసారు. ఇప్పటి వరకూ సుమారు 200 సినిమాల్లో నటించాడు.
ఆయనది శ్రీకాకుళం జిల్లా లోని కొండవలస అనే పల్లెటూరు. ఆయన ఇంటిపేరు కూడా అదే. తండ్రి రైల్వే ఉద్యోగి. కళాశాల చదువు విశాఖపట్టణం లో సాగింది. కళాశాలలో ఉండగానే నాటకాలు బాగా వేసేవాడు. డిగ్రీ పూర్తవగానే విశాఖ పోర్టు ట్రస్ట్ లో గుమాస్తాగా ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చేస్తూ కూడా అందులోని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.
సినిమా రంగంలో దర్శకుడు వంశీ ఆయనకు మొదటగా ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో అవకాశం ఇచ్చాడు. నాటకరంగంలో ఆయనకు 378 అవార్డులు వచ్చాయి. అందులో రెండు నంది అవార్డులు కూడా ఉన్నాయి. నవరాగం అనే నాటకానికి ఉత్తమ నటుడు, కేళీ విలాసం అనే నాటకంలో ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డులు లభించాయి.
ఆయన కుమారుడు మణిధర్ కూడా సినీరంగంలోనే ఉన్నాడు.
