కొణిజేటి రోశయ్య
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| కొణిజేటి రోశయ్య | |
![]() |
|
|
తమిళనాడు గవర్నర్
|
|
| పదవీ కాలము ఆగస్టు 31, 2011 నుండి ప్రస్తుతము వరకు |
|
|
|
|
| జననం | జూలై 4 1933 (వయసు 79) |
|---|---|
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
| భార్య/భర్త | శివలక్ష్మి |
| మతం | హిందూ |
| సెప్టెంబర్ 3, 2009
|
|
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించాడు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974 మరియు 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ మరియు రవాణ శాఖల మంత్రిగా పని చేసాడు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించాడు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి నవంబరు 24, 2010 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 31, 2011న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.
విషయ సూచిక |
వ్యక్తిగత జీవితం [మార్చు]
కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించాడు. వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. 1968లో తొలిసారిగా విధానమండలికి ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ ప్రస్థానం [మార్చు]
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యుడు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డి తో బాటు రాజకీయ పాఠాలు నేర్చాడు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ మరియు గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004 మరియు 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంద్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశాడు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[2]
ఆర్థికమంత్రిగా [మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుధీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టాడు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.[3] బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినాడు.[4]
ముఖ్యమంత్రిగా [మార్చు]
వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం నవంబర్ 24, 2010 వ తేదీన పదవికి రాజీనామ చేసాడు.
కాలరేఖ [మార్చు]
- 1968-85: విధానమండలికి సభ్యుడు.
- 1978-79: విధానమండలిలో ప్రతిపక్షనేత.
- 1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
- 1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
- 1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
- 2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
- 2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
- 2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
- 2009, సెప్టెంబర్ - 2010 నవంబర్ 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
- 2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.
గుర్తింపులు [మార్చు]
- 2007లో ఆంధ్రా విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.
బయటి లింకులు [మార్చు]
http://www.aponline.gov.in/apportal/index.asp http://manampmla.com/2009/K.Rosaiah%20Mana%20Cm/index.html
మూలాలు [మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
- ↑ http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/
- ↑ http://www.hindu.com/2009/07/24/stories/2009072456680100.htm
- ↑ సాక్షి దినపత్రిక, తేది 26-05-2009
| ఇంతకు ముందు ఉన్నవారు: వై.యస్. రాజశేఖరరెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 02/09/2009 — 16/11/2010 |
తరువాత వచ్చినవారు: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి |
|
|||||
