కొరటాల సత్యనారాయణ

వికీపీడియా నుండి
2005లో ఢిల్లీలో జరిగిన 18వ పార్టీ సమావేశంలో సత్యనారాయణ

కొరటాల సత్యనారాయణ (సెప్టెంబరు 24, 1923 – జూలై 1, 2006) ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (సి.పి.ఎం) యొక్క పాలిట్‌బ్యూరో సభ్యుడు.

విషయ సూచిక

[మార్చు] బాల్యము

సత్యనారాయణ గుంటూరు జిల్లా , అమృతలూరు మండలము, ప్యాపర్రు గ్రామములో 1924 సెప్టెంబర్ 24న పిచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ఒక సోదరుడు, ముగ్గురు సోదరీమణులు. కర్షక పరివారములో పుట్టి, జీవితాన్ని బడుగుల ఉద్ధరణకై ధార పోసి, గుంటూరు జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి పునాదులు వేశాడు.

[మార్చు] రాజకీయ పంథా

తెలుగు నాట సామ్యవాద ఉద్యమానికి ఆద్యులలో ఒకడు సత్యనారాయణ. పాఠశాల దశలోనే న్యాయ పోరాటమునకు తొలి అడుగులు వేశాడు. 1938-39 తురుమెళ్ళ పాఠశాలలో పరీక్షా విధాన పద్ధతిని వ్యతిరేకించి 11 రోజులు ఉద్యమము చేశాడు. ప్రధానోపాధ్యాయుడు మొండికేసిన ఆ సందర్భములో గుంటూరులో ఉన్న విద్యార్ధి నాయకుడు మాకినేని బసవపున్నయ్య ను కలవడం తటస్థించింది. అదే సత్యనారాయణ లోని కమ్యూనిస్ట్ భావాలకు నాంది. బావమరిది పాతూరి సుబ్బయ్య ఆ సమయములో స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొంటున్నాడు.

బసవపున్నయ్య జోక్యముతో ప్రధానోపాధ్యాయుడు దిగి వచ్చాడు. దాంతో సత్యనారాయణ సమ్మె విరమించాడు. ఆ సమయములో ఒక పాఠశాల పత్రిక నడిపాడు. వామవాద భావాలున్న పాఠశాల డ్రిల్ ఉపాద్యాయుడు, ఆతని బావమరిఫది మోటూరు హనుమంతరావు ప్రభావముతో సత్యనారాయణ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆకర్షితుడయాడు.

ప్రధానోపాధ్యాయుని హఠాన్మరణముతో ఆతని కుటుంబము ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనగా, తోటి విద్యార్థులతో బాటు పల్లెలు తిరిగి 5,000 రూపాయలు సేకరించి వారిని ఆదుకున్నాడు. పిమ్మట రేపల్లె లో విద్య కొనసాగించిన సమయములో మరొక కమ్యూనిస్ట్ నాయకుడు లావు బాలగంగాధరరావు పరిచయము కలిగింది. 1942లో గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరాడు. విద్యార్ధి నాయకుడుగా ఎదిగాడు. క్విట్ ఇండియా ఉద్యమము, గుంటూరులో పోలీసు కాల్పులు, విద్యార్థుల మరణం ఉద్యమ స్ఫూర్తిని పెంచాయి. 1942లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు. 1943లో జిల్లా విద్యార్ధి సంఘ సభ్యుడయ్యాడు.

[మార్చు] ఎన్నికలు

[మార్చు] మరణము

సత్యనారాయణ జీవిత చరమాంకములో కాన్సర్ తో పోరాడి జులై 1, 2006 న హైదరాబాదులో మరణించాడు. సత్యనారాయణకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. [1]

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు