కొలనుపాక
కొలనుపాక (Kolanupaka) , నల్గొండ జిల్లా, ఆలేరు మండలానికి చెందిన గ్రామము
కొలనుపాక గ్రామము భువనగిరి డివిజన్ లో మేజరు గ్రామ పంచాయితి. వరంగల్ - హైదరాబాదు మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరు కు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామములో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మంది జనాభా కలదు. అందులో సుమారుగా ఆరు వేల ఓటర్లు ఉన్నారు.
విషయ సూచిక |
[మార్చు] రవాణ సదుపాయాలు
ఆంద్ర ప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు కలవు. హైదరాబాదు మహత్మ గాంధి బస్ స్టాప్ నుండి వరంగల్ లేద హన్మకొండ వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్లో కాని అటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.
[మార్చు] గ్రామ చరిత్ర
ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో ఇసుక మేటలో దొరకిన గంటపై స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ అని ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలంనాటికి కొల్‌పాక్''గా మారింది. ప్రస్తుతం కూల్‌పాక్ లేదా కొలనుపాక అని పిలువబడుతున్నది.
[మార్చు] గ్రామ చరిత్ర, విశేషాలు
- ఈ గ్రామము చాల చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క(కొటి ఓక్కటి )లింగము నూట ఓక్క చెరువు - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామి గా అవతరించాడు , వీరనారయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము),రేణుకా చార్యుని జన్మ స్తలము, వివిధ కమ్యునిటిలకు (కులాలకు) చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) కలవు. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది.
- క్రీ.శ. 11వ శతాబ్దంలో ఇది కళ్యాణి చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సంప్రదాయానికీ, శైవ సంప్రదాయానికీ కూడా ప్రముఖ కేంద్రము. ప్రసిద్ధ శైవాచార్యుడైన రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెబుతున్నాయి. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది.
- క్రీ.శ.11వ శతాబ్దం నాటికి ఇది ఎల్లోరా, పటాన్‌చెరువు, కొబ్బల్ వంటి జైన మహా పుణ్య క్షేత్రాల స్థాయిలో వెలుగొందింది. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది.
- మధ్య యుగం - క్రీ.శ. 1008 - 1015 అయిదవ విక్రమాదిత్యుని కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన కోటగా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడింది.
[మార్చు] మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము.
ఈ విగ్రహం మధ్య గర్భగుడిలో మూల నాయక రూపంలో నెలకొని యున్నది. ఇది నలుపు రంగులో శ్రేష్టమైన రత్నంతో నిర్మించబడి యున్నది. 38.5 అంగుళాల వెడల్పు, 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ విగ్రహం. విగ్రహం ఆహార్యము బహు గొప్పగా మలచబడినది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు, నాభి పై ఆకారం, అరచేతి మీద శంఖం మరియు చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం.
[మార్చు] భగవాన్ మహావీర్
ఈ విగ్రహం మూల విరాట్టుకు కుడి వైపున గల గర్భ గుడి లో ఉన్నది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం మరియు అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉన్నది. వేళ్ళు పొడువుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉన్నది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారత దేశంలో మరెక్కడా లేదు.
[మార్చు] శిల్పకళ
ఆలయ ప్రవేశ ద్వారం చూస్తే కోటద్వారాన్ని తలపిస్తుంది.అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
కొలనుపాక వస్తుప్రదర్శనశాలలో జైనుల, వీరశైవుల చరిత్రను చెప్పే అనేక బొమ్మలు, చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. వీరశైవులకు పూజ్యనీయులైన రేణుకాచార్యుల వారు లింగంలోనుంచి ఉద్భవించిన ప్రదేశం కూడా కొలనుపాకే అని భావిస్తున్నారు. సోమేశ్వరాలయంగా చెప్పే ఈ ఆలయంలో రేణుకాచార్యుల లింగోద్భవ శిల్పాన్ని చూడవచ్చు. ఆలయంలో ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటిచెప్పే శిల్పసంపదను చూడవచ్చు. అయితే ప్రస్తుతం అవన్నీ నిరాదరణకు గురై ఉన్నాయి.
[మార్చు] ముఖ్యమైన వ్యక్తులు
ఈ గ్రామములో ముఖ్యులు కామ్రేడ్ ఆరుట్ల రాంచంద్రా రెడ్డి-కమలాదేవి (రజాకర్ల వ్యతిరేఖ ఉద్యమ పోరాట యోధులు) ,మాధవులు మరియు మాజీ M.L.A Dr. కుడుదుల నగేష్ గారు
[మార్చు] వనరులు, బయటి లింకులు
- కొలనుపాక పురావస్తు ప్రదర్శన శాల, ఎన్.రమాకాంతం రచన, పురావస్తు పరిశోధనా శాఖ - రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ
- ఇక్కడి గుడుల గురించి
- ఇక్కడి శిల్పాల గురించి
|
|
|
|---|---|
| కొలనుపాక · ఆలేరు · రాఘవాపురం (కొలనుపాక) · శ్రీనివాసపురం · పటేల్‌గూడెం · టంగుటూరు · షారాజీపేట · తూర్పుగూడెం · బహదూర్‌పేట · మంతపురి · దిలావర్పూర్ · ఇక్కుర్తి · కొల్లూరు · శర్బనాపురం · మాటూరు · అమ్మనబోలు · గోలంకొండ · మందనపల్లి |