కొలిన్ కౌడ్రి

వికీపీడియా నుండి

1932, డిసెంబర్ 24న భారత్ లోని ఉదగమండలంలో జన్మించిన కొలిన్ కౌడ్రి (Colin Cowdrey) ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1954 నుంచి 1975 వరకు ఇంగ్లాండు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కౌడ్రి 114 టెస్టులు మరియు ఒక వన్డే ఆడినాడు. 692 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటిలను కూడా ఆడి 107 సెంచరీలతో 42719 పరుగులు చేశాడు. తన క్రీడాజీవిత కాలంలో 6 సార్లు ఆస్ట్రేలియా పర్యటించి ఆ ఘనత వహించిన రెండో ఇంగ్లాండు క్రికెటర్‌గా అవతరించాడు. [1] 2000, డిసెంబర్ 4న 67 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

విషయ సూచిక

[మార్చు] టెస్ట్ క్రికెట్ గణాంకాలు

1954 నవంబర్ లో తొలిసారిగా ఆస్ట్రేలియాపై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసిన కొలిన్ కౌడ్రి 1975 ఫిబ్రవరి వరకు 114 టెస్టులు ఆడి 44.06 సగటుతొ 7624 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు మరియు 38 అర్థసెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 182 పరుగులు. ఫీల్డర్‌గా 120 క్యాచ్‌లు అందుకున్నాడు.

[మార్చు] వన్డే క్రికెట్ గణాంకాలు

కౌడ్రి తన క్రీడాజీవిత కాలంలో ఒకే ఒక్క వన్డే పోటీ ఆడినాడు. 1971, జనవరి 5న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగులు మాత్రమే చేశాడు.

[మార్చు] ఫస్ట్ క్లాస్ పోటీలు

692 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కొలిన్ కౌడ్రి 42.89 సగటుతో 42719 పరుగులు చేశాడు. అందులో 107 సెంచరీలు మరియు 231 అర్థసెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 307 పరుగులు. ఫస్ట్ క్లాస్‌లో 65 వికెట్లను కూడా సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 4 వికెట్లు.

[మార్చు] అవార్డులు, గుర్తింపులు

  • 1972: CBE అవార్డు లభించింది.
  • 1992: నైట్‌హుడ్ అవార్డు లభించింది.
  • 1997: బ్రిటన్ ప్రతినిధుల సభకు (హౌస్ ఆఫ్ లార్డ్స్) నియమించబడ్డాడు.

[మార్చు] బయటి లింకులు


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు