కొవ్వు ఆమ్లం

వికీపీడియా నుండి
Three dimensional representations of several fatty acids

కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ అసిడ్లు లేదా ఫ్యాటి ఆమ్లములు (Fatty acids) నూనెలలో వుండును. ఫ్యాటి ఆమ్లములు మరియు గ్లిసెరొల్ సంయోగం చెందటం వలన నూనెలు (oils), కొవ్వులు (fats) ఏర్పడును. మూడు ఫ్యాటి్‌ ఆసిడులు మరియు ఒక గ్లిసరోల్ సంయోగం చెందటం వలన ఒక ట్రైగ్లిసెరైడ్‌ + 3 నీటి బిందువులు ఏర్పడును.

ట్రైగ్లిసెరైడ్‌లోని మూడు కొవ్వు ఆమ్లములు ఒకే రకమునకు చెందినవి అయినచో వాటిని సింపుల్ ట్రైగ్లిసెరైడ్ (simple glyceride) అని, రెండు లేదా మూడు రకాల (different kinds) ఫ్యాటి్‌ ఆసిడ్ల సంయోగము వలన ఏర్పడినచో మిశ్రమ గ్లిసెరైడ్ (Mixed glyceride) అందురు.

ప్రతిరోజు 10 గ్రాముల ఫ్యాటి ఆసిడ్ లను ఎదో రూపములో తీసుకొవడం అవసరం. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలులను (unsaturared fatty acids) ఆధిక మొత్తం లో కలిగివున్న వాటిని ఆహరంలో తీసుకొనవలెను. ఈ ఆమ్లాలు కొవ్వులలో అధిక మొత్తంలో వుండటం వలన వీటికి "ఫ్యాటి ఆసిడ్" లనే పేరు వచ్చినది.

విషయ సూచిక

[మార్చు] నిర్మాణం

ఫ్యాటి ఆసిడ్ లు Carbon, hydrogen, oxygenల సమ్మేళనం వలన ఏర్పడును. ఫ్యాటి ఆసిడ్ లు కార్బోక్షిల్ ఆసిడ్ గ్రూప్ నకు చెందినవి. ఫ్యాటి ఆసిడ్ లో ఒక COOH (carboxyl) వుండటం వలన ఈ ఫ్యాటి అసిడ్లను మోనో కార్బొక్షిల్ అసిడ్ లు అని కూడా అంటారు. హైడ్రొకార్బోను శృంఖలం (Hydrocarbon chain) యొక చివర హెడ్రొక్షిల్ గౄప్ (COOH), మరో చివర CH3 వుండటం వలన ఫ్యాటి ఆమ్లములు ఏర్పడును. ఇవి సాధారణంగా ఏటువంటి శాఖలు (branches) లు లేకుండగా సరళముగా (straight) గా వుండును. కొమ్మలు (branches) వున్న ఫ్యాటి ఆసిడ్ లను కూడా కొన్ని నూనెలలో గుర్తించడం జరిగినది. మనం వాడే వంటనూనెలలో శాఖరహిత (un branched) ఫ్యాటీ ఆమ్లములే వుండును.

ఫ్యాటి ఆసిడ్ లలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు (Saturated fatty acids) మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (unsaturated fatty acids) లని రెండు రకములు. సంతృప్త ఫ్యాటి ఆసిడ్ హెడ్రొకార్బను గొలుసులో ఏటువంటి ద్విబంధాలు వుండవు. అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లలో ద్విబంధాలు వుండును. కార్బను వెలన్సి (valancy) విలువ 4. అనగా కార్బను పరమాణువు (Atom) ఏక కాలములో 4 పరమాణువులతో బంధాలను (Bonds) ఏర్పరచ గలదు. ఫ్యాటి ఆసిడ్ లలో ప్రతి కార్బను ఇరుపక్కల మిగతా రెండు కార్బనులతోను, మిగతా రెండు పక్కల రెండు hydrogen పరమాణువులతోను సంయోగం చెంది వుండును. ఫ్యాటి ఆసిడ్లలో కార్బనుల సంఖ్య 4 నుంచి మొదలుకొని 30 కార్బనుల వరకు వుండును. 30 కన్న ఎక్కువ కార్బనులున్న ఫ్యాటి ఆసిడులు వున్నప్పటికి, అంత ఏక్కువ ప్రమాణం లో లేవు.

ఫ్యాటి ఆమ్లములోని కార్బను- కార్బను మధ్య ద్విబంధం లేకున్నచో సంతృప్త ఫ్యాటి ఆమ్లములని (Saturared fatty acids) అనియు, కార్బను-కార్బను మధ్య ద్విబంధం (Double bond) వున్నచో అసంతృప్త ఫ్యాటి ఆమ్లములని (Unsaturared fatty acids) అందురు. ఒక ద్విబంధం వున్నచో ఏక ద్విబంధ అసంతృప్త (monounsaturated) ఫ్యాటి ఆసిడ్ అనియు, ఒకటీ కన్న ఎక్కువ బంధాలున్నచో బహుళ బంధ (poly unsaturated) ఫ్యాటి ఆసిడ్ లని అంటారు. ఫ్యాటి ఆసిడ్ లోని కార్బనుల సంఖ్యని బట్టీ అమ్లముల పేర్లు వుండును.

మనం వాడే నూనెలలో 10-18 కార్బనులున్న సంతృప్త ఫ్యాటి ఆసిడులు, 16-18 కార్బనులున్న అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు వున్నాయి. వంట నూనెలలో లారిక్, మిరిస్టిక్, పామిటిక్ మరియు స్టియరిక్ సంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు వుండును, మరియు ఎక ద్విబంధమున్న ఒలిక్ ఆసిడ్, ద్వి ద్విబంధాలున్న లినొలిక్ ఆసిడులు అధిక మొత్తములో వున్నాయి. ఫ్యాటి ఆమ్లములు సాధారణంగా కార్బనులను సరిసంఖ్యలో(even) కలిగి వుండును. కాని అతి తక్కువ మొత్తములో బేసి (odd) సంఖ్యలో కార్బనులను కలిగి వుండును. లారిక్, మిరిస్టిక్, పామిటిక్. స్టొయరిక్, ఒలిక్ మరియు లినొలిక్ ఆసిడ్ లనేవి వాడుక పేర్లు.

[మార్చు] నామకరణం

అయితే ఫ్యాటి ఆసిడులను సాంకేతికంగా 'జెనెవ' (Geneva) నామ విధానం ప్రకారం పిలుస్తారు. జెనెవా నామ విధానము ప్రకారము ఫ్యాటి ఆసిడు లోని కార్బనుల సంఖ్యను ముందు పదముగా (గ్రీకు పదము) వుంచెదరు. ఊదాహరణకు 12, 14, 16 మరియు 18 కార్బనులను కలిగివున్న ఫ్యాటి ఆసిడుల కార్బనుల సంఖ్యను సూచిస్తూ వరుసగా డొడెక్ (dodec), టెట్రాడెక్ (tetradec), హెక్సాడెక్ (hexadec), మరియు ఆక్టాడెక్ (octadec) లను ముందు పదముగా వుంచెదరు. సంతృప్త ఫ్యాటి ఆసిడ్ (saturated fatty acid) అయినచో పేరు చివర అనొయిక్ (anoic) అనే పదంను, అసంతృప్త ఫ్యాటి ఆసిడు (unsaturated) అయినచో ఇనొయిక్ (enoic)అనేపదమును చేర్చి పిలిచెదరు. జెనెవ నామవిధానము ప్రకారము 12 కార్బనులు వున్న లారిక़్అసిడ్ ను డొడెకనొయిక్ (dodecanoic) అని, 14 కార్బనులు వున్న మిరిస్టిక़్అసిడును టెట్రడెకనొయిక్ (tetradecanoic) ఆసిడు అనియు, 16 కార్బనులున్న పామిటిక్ ఆసిడును హెక్సాడెకనొయిక్ (hexadecanoic)ఆసిడ్ అనియు, మరి 18 కార్బనులు వున్న ఒలిక్`ఆసిడ్ ను ఆక్టాడెకనొయిక్ (octade canoic) ఆసిడ్ అని పిలుస్తారు. పైన పెర్కొన్న ఆసిడ్ లన్ని సంతృప్త ఫ్యాటి ఆసిడులు. అసంతృప్త ఫ్యాటిఆమ్లములు అయినచో ఏకద్విబంధమువున్న ఒలిక్ ఆసిడ్ ను అక్టాడెకెనొయిక్ (octadecenoic) అనియు, రెండు ద్విబంధములున్న లొనొలిక్ ఆసిడ్ ను అక్టడెకడైనొయిక్ (octadecadienoic) ఆసిడ్ అనియు, మూడు ద్విబంధాలున్న లినొలెనిక్ ఆసిడును ఆక్టాడెక ట్రయినొయిక్ (octadecatrienoic) అని పిలుస్తారు.

[మార్చు] అసంతృప్త కొవ్వు ఆమ్లాలు

ప్రధాన వ్యాసం: అసంతృప్త కొవ్వు ఆమ్లాలు
Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది

[మార్చు] సంతృప్త కొవ్వు ఆమ్లాలు

ప్రధాన వ్యాసం: సంతృప్త కొవ్వు ఆమ్లాలు

[మార్చు] ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు

ప్రధాన వ్యాసం: ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు

[మార్చు] మూలాలు

1.A.E.Bailey's 'industrial oil&fat products

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు