కోచ్ కార్టర్
| Coach Carter | |
| దస్త్రం:Coach Carter poster.JPG Promotional poster |
|
| దర్శకత్వం | Thomas Carter |
|---|---|
| నిర్మాత | David Gale Brian Robbins Michael Tollin |
| రచన | Mark Schwahn John Gatins |
| తారాగణం | Samuel L. Jackson Robert Ri'chard Rob Brown Debbi Morgan Ashanti Rick Gonzalez Antwon Tanner Nana Gbewonyo Channing Tatum |
| సంగీతం | Kenneth Burgomaster DMX Paul Linford Trevor Rabin |
| ఛాయాగ్రహణం | Sharone Meir |
| కూర్పు | Peter Berger |
| పంపిణీదారు | Paramount Pictures |
| విడుదలైన తేదీ | జనవరి 14, 2005 |
| నిడివి | 136 minutes |
| దేశం | United States |
| భాష | English |
| పెట్టుబడి | $30 million |
| వసూళ్లు | $76,669,806[1] |
కోచ్ కార్టర్ 2005లో పారమౌంట్ పిక్చర్స్ ద్వారా విడుదలైన ఆంగ్ల చిత్రం.థామస్ కార్టర్దీనికి దర్శకత్వం వహించారు. 1999లో రిచ్మండ్ ఉన్నత పాఠశాల (రిచ్మండ్, కలిఫొర్నియా, USA) ప్రధాన బాస్కెట్ బాల్ శిక్షకుడైన కెన్ కార్టర్, విద్యా సంవత్సర ఫలితాలు ఆశించిన స్థాయిలో రాని కారణంగా అజేయమైన తన జట్టును ఆడించని వార్త అప్పటి పత్రికా శీర్షికలలో నిలిచింది. ఈ నిజజీవిత కధాంశం ఆధారితంగా ప్రస్తుత చిత్రం నిర్మింపబడింది.
ఈ చిత్ర స్క్రీన్ ప్లే సహరచయిత ఒన్ ట్రీ హిల్ అనే టి.వి పరంపరను ప్రారంభించిన మార్క్ ష్వాన్. దీని దర్శకుడు థామస్ కార్టర్ నటించిన ది వైట్ షాడో అనే మరొక టి.వి పరంపర నుంచి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో చిన్న కథాంశాలను ఈ చిత్రం తిరిగి ఉపయోగించుకుంది.
విషయ సూచిక |
[మార్చు] కథాంశం
ఈ చిత్రం రిచ్మండ్ ఒలియర్స్, సెయింట్ ఫ్రాన్సిస్ తో తలపడుతుండగా మొదలవుతుంది. కాని ఈ ఆట చివర్లో రెండు జట్ల కొట్లాటతో ముగుస్తుంది. ఆట తర్వాత, కెన్నెత్ కార్టర్(సామ్యూల్.ఎల్.జాక్సన్)కు ఖాళీ సమయపు మరియు తక్కువ జీత (మొత్తం బాస్కెట్ బాల్ కాలానికి $1500) ఉద్యోగమైన రిచ్మండ్ ఒలియర్స్ బాస్కెట్ బాల్ జట్టు శిక్షకుడిగా అధికారిక ఆహ్వానం అందుతుంది. క్రితంలో అతను ఇదే ఉన్నత పాఠశాల తరపున ఆడి ఇప్పటికీ బద్ధలవని కొన్ని రికార్డులను స్థాపిస్తాడు. జట్టు క్రీడాకారుల్లో క్రమశిక్షణ లోపించినట్లుగా గుర్తించినా అతను ఆ ఉద్యోగం చేయడానికి అంగీకరించి, క్రీడాకారుల గౌరవాన్ని పొందటం మొదలుపెడతాడు.
కోచ్ కార్టర్ ఒప్పందాల రూపంలో క్రీడాకారులకు కఠినమైన కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెడతాడు. అవి - వాళ్ళు 2.3 తరగతి పాయింట్ల సరాసరి నిర్వహించాలి(CHSAA పెట్టిన 2.0 GPA మాత్రమే కాదు), తరగతులకు హాజరవుతూ మొదటి వరుసలో కూర్చోవాలి మరియు ఆట రోజుల్లో టైలు, జాకెట్లు ధరించాలి. కార్టర్ తో తేడాల వల్ల క్రీడాకారుల్లో ఒకడైన టిమో క్రజ్(రిక్ గొన్జలేజ్) మొదటి రోజునే అభ్యాసం నుంచి వెళ్ళిపోతాడు. కాని తర్వాత మాదక ద్రవ్య వ్యాపారైన తన అన్నయ్య రెన్నితో తిరుగుతూ కనబడతాడు. గత సీజన్ లో అధిక గోల్స్ చేసిన మరొక ఇద్దరు జట్టు సభ్యులు కూడా బయటకు వెళ్ళిపోతారు. కాని క్రితంలో ప్రైవేటు పాఠశాల సెయింట్ ఫ్రాన్సిస్ కు బాస్కెట్ బాల్ ఆడి మంచి విద్యార్ధి గా పేరు తెచ్చుకొన్న కార్టర్ కొడుకైన దేమ్యిన్, తండ్రి ఆదేశాలకు విరుద్ధంగా తన తండ్రి బాస్కెట్ బాల్ జట్టులో ఆడడానికి తన పాఠశాల నుంచి రిచ్మండ్ ఉన్నత పాఠశాలకు మార్పిడి చేయించుకుంటాడు. దేమ్యిన్ 3.7 GPAను నిర్వహిస్తానని ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత చివరకు కార్టర్ అంగీకరిస్తాడు.
ఈ చిత్రం కెన్యన్(రాబ్ బ్రౌన్) లాంటి క్రీడాకారుల వ్యక్తిగత విషయాలను కూడా చూపిస్తుంది. గర్బవతి అయిన అతని ప్రియురాలు కైరా (అశాంతి) క్రితంలో తన అక్కకు జరిగిన ఉదంతం తెలిసి కూడా, బిడ్డ కోసం తన కళాశాల యోచనలను విరమించుకుంటుంది. దీంతో కెన్యన్ విద్యాసంవత్సరాన్ని కొనసాగిస్తూ బాస్కెట్ బాల్ ఆడాలా లేక బిడ్డ బాగోగులు చూసుకోవాలా అని కలవర పడుతూ ఉంటాడు. ఇంతలో క్రజ్ కూడా ఆడాలో లేక మాదక ద్రవ్య వ్యాపారం చెయ్యాలో తెలియక సంశయంలో ఉంటాడు. ఒక రోజున అభ్యాస సమయంలో తిరిగి జట్టులో చోటు కోసం అతను కార్టర్ ను కలుస్తాడు. కాని కార్టర్ అతనికి దాదాపు అసాధ్యమైన 'వారంలో 1000 సుయిసైడ్స్ మరియు 2500 పుషప్స్ చేయడం' అనే పనికి సవాలు విసురుతాడు. క్రజ్ తనను తానే వేదన పరుచుకుంటూ మరియు తనతో పాటు అతని సహచరులు కూడా వాటిని చేయడం చేత సవాలును పూర్తి చేయగలుగుతాడు. దీంతో కార్టర్ అతనిని జట్టులోకి చేర్చుకుంటాడు. కార్టర్, అతని జట్టు కలసి, కఠినమైన అభ్యాసాల పరంపరలు చేసి మొదటి ఆటను గెలుస్తుంది. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన ఆటలను గెలుస్తుంది. కాని క్రిత సంవత్సరం ఇదే జట్టు 22 ఆటలలో ఓటమిపాలై కేవలం నాలుగింటిలో గెలిచి వుంటుంది. ఈ చిత్రం ఆసాంతమూ అనేక సందర్భాలలో కార్టర్ క్రజ్‌ను తనకు ఏదంటే అత్యంత భయమని అడుగుతూ ఉంటాడు. కార్టర్ జట్టు విశ్రాంతి బాస్కెట్‌బాల్ ఆటల పోటీని గెలుస్తుంది.
కానీ జట్టు సభ్యులకు వచ్చిన తక్కువ మార్కుల వల్ల ఫిర్యాదు అందిన తర్వాత, కార్టర్ వాళ్ళను తిట్టి, ప్రస్తుత సంవత్సరంలో అజేయంగా ఉన్న తన జట్టును వ్యాయామశాల నుంచి బయటకు పంపి తాళం వేస్తాడు. అతను బాస్కెట్‌బాల్ అభ్యాసాలను రద్దు చేసి ఆ సంవత్సరంలో అత్యంత కీలకమైన ఆటతో సహా మిగతా ఆటలను వదిలింప చేసి, జట్టును అభ్యాస కాలంలో అభ్యాసానికి బదులు గ్రంధాలయంలో ఉంచి కొంత మంది ఉపాధ్యాయుల చేత చదువు చెప్పిస్తాడు. కొంతమంది క్రీడాకారులు ఒప్పందాన్ని అమలు చేస్తున్నా(3.3 GPA కలిగుంది నిరసిస్తున్న వారితో సహా), కార్టర్ మాత్రం మొత్తం జట్టుగా ఉండడం వల్ల వచ్చే ఫలితాలను మాత్రమే క్రీడాకారులు స్వీకరించాలని తెలియచేస్తూ ఉంటాడు. ఇవన్నీ క్రజ్ ను రెండవ సారి జట్టు వీడేలా చేసి, రెన్నితో కలిసి పని చేయడానికి దారి తీస్తాయి.
కానీ ఒక అర్థరాత్రి, రోడ్డు ప్రక్కన దారిలో నడుస్తుండగా రెన్ని కాల్పులకు గురవుతాడు. అప్పుడు క్రజ్ జట్టులోని మిత్రులు కలవడం చేత రెన్ని వెనక నడుస్తూ ఉంటాడు. ఈ సంఘటన వల్ల క్రజ్ ఆ రాత్రి కార్టర్ ఇంటికి వెళ్లి, తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పి, జట్టులోకి తిరిగి అనుమతించాలని అడుగుతాడు. అందుకు కార్టర్ అంగీకరించి, క్రూజ్ ను టీం లోనికి తీసుకుని తద్వారా అతని భవిష్యత్తు తన కజిన్ కు వలే కాకుండా కాపాడతాడు.
ఫలితంగా, పాఠశాల బోర్డు మరియు తల్లిదండ్రులు కార్టర్ పనులకు విరుద్ధంగా పోరాడతారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు బోర్డు అధ్యక్షురాలు వ్యతిరేకించినా 402 ఓట్లతో బోర్డు చివరకు వ్యాయామశాలను తిరిగి తెరిపిస్తుంది. దీంతో కార్టర్ ఉద్యగం వదిలి వెళ్లి పోదామని నిర్ణయించుకుని వ్యాయామశాలకు వచ్చి తన వస్తువులతో వెళ్తుండగా, తన విద్యార్ధులు అక్కడ బెంచీల మీద కూర్చుని ఉపాధ్యాయుల పాఠాలను శ్రద్ధగా వింటుండడం చూస్తాడు. బోర్డు వ్యాయామశాలను తిరిగి తెరిపించినా తమను ఆడామని ఒత్తిడి చేయలేదని అతనితో వారు అంటారు. మెరియన్ విలియంసన్ను చూపిస్తూ క్రజ్, కార్టర్ అడిగే ప్రశ్న "నీకు ఏదంటే ఎక్కువ భయం?" కు సమాధానమిస్తాడు.
| “ | Our deepest fear is not that we are inadequate. Our deepest fear is that we are powerful beyond measure. It is our light, not our darkness that most frightens us. We ask ourselves, 'Who am I to be brilliant, gorgeous, talented and fabulous?' Your playing small doesn't serve the world. There is nothing enlightened about shrinking so that other people won't feel insecure around you. It is not just in some of us, it is in everyone, and as we let our own light shine, we unconsciously give other people permission to do the same. As we are liberated from our own fear, our presence automatically liberates others. | ” |
తన పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించలేకపోవడమే తనను అత్యంత భయ పెట్టేదిగా చెప్తాడు. దీంతో కార్టర్ ఉత్సాహపడి క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడ ఉండడానికే నిర్ణయించుకుంటాడు.
ఆ జట్టు రాష్ట్ర ఉన్నత పాఠశాల ఆటల పోటీకి అర్హత సాధిస్తుంది. వాళ్ళకు అతి పెద్ద మరియు చివరిదైన ఆట రాష్ట్ర ఆటల పోటి మొదటి రౌండ్లో ఎదురవుతుంది. దీంట్లో వాళ్ళు రాష్ట్రంలోనే #1 ర్యాంకు పొందిన సెయింట్ ఫ్రాన్సిస్ (NBA కు సూపర్ స్టార్ కాబోయే వ్యక్తి) తో తలపడతారు. ఒలియర్స్ గట్టి ప్రయత్నము చేసినా కానీ కార్టర్ జట్టు ఓటమి పాలవుతుంది.
ముగింపు పాటలో, ఆరుగురు జట్టు సభ్యలు కాలేజికి వెళ్ళినట్లు చూపిస్తారు.(ప్రతే ఏటా ఈ పాఠశాల నుంచి 50% మంది మాత్రమే పట్టభద్రులైతే, వాళ్ళలో 6% మంది మాత్రమే కాలేజికి వెళ్తుంటారు). జూనియర్ బేటిల్ మొత్తం ఉపకారవేతనం మీద శాన్ జోస్ రాష్ట్ర విశ్వ విద్యాలయంలో చేరతాడు. జేసన్ లైల్ శాన్ డియాగో రాష్ట్ర విశ్వ విద్యాలయంలో చేరి బిజినెస్ అడ్మినిష్ట్రేషన్లో పట్టా పొందుతాడు. టిమో క్రజ్ హంబోల్ట్ రాష్ట్ర విశ్వ విద్యాలయంలో చేరి తర్వాత అక్కడే బాస్కెట్ బాల్ ఆటలోని స్టార్టింగ్ గార్డ్ అవుతాడు. వాం(అసలు పేరు జారన్ విల్లీస్)శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్ర విశ్వ విద్యాలయం నుంచి ఉపకార వేతనం పొంది తర్వాత అక్కడే నాలుగేళ్ల పాటు ఆటలో పాయింటు గార్డుగా ఆడతాడు. కెన్యన్ స్టోన్ సాక్రామెంతో రాష్ట్ర విశ్వ విద్యాలయంలో చేరి, కమ్యునికేషన్స్‌లో పట్టా పొందుతాడు. దేమ్యిన్ కార్టర్ తర్వాత రిచ్మండ్ ఉన్నత పాఠశాల పాయింట్ల సంఖ్యను బద్దల కొట్టి తన తండ్రి రికార్డులను సమం చేస్తాడు. పట్టభద్రుడయ్యాక అతను వెస్ట్ పాయింట్‌లో ఉన్న U.S రక్షక విభాగంలో చేరతాడు.
[మార్చు] విమర్శకుల స్వీకృతి
ఈ చిత్రానికి పరిశీలకులనుంచి రెండు రకాలగాను ఫలితాలు వచ్చాయి. ఆగష్టు 16,2010 నాటికి ఈ చిత్రానికి రాటెన్టమాటోస్.కామ్ వాళ్ళ ఫ్రెష్ మీటర్ 65%గా ఉన్నది. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో కెల్లా జాక్సన్ యొక్క మంచి ప్రదర్శనగా నమ్మడం చేత ఈ చిత్రానికి విమర్శకుల నుంచి చెప్పుకోదగ్గ ప్రశంసలు అందాయి.
[మార్చు] బాక్స్ ఆఫీస్
U.S బాక్సాఫీస్ దగ్గర #1గా మొదలైన ఈ చిత్రం ఇప్పటివరకు $67 మిలియన్లకు పైగా సంపాదించింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా అంత పెద్దగా విజయవంతం కాలేదు. బయటి దేశాల్లో ఈ చిత్రానికి $9 మిలియన్లను మాత్రమే వచ్చాయి. వీటితో కలిపి మొత్తం $76 మిలియన్లను ఈ చిత్రం ఆర్జించింది.
[మార్చు] సౌండ్‌ట్రాక్
- ప్రధాన వ్యాసం: Coach Carter (soundtrack)
ఈ చిత్ర పాటలవరుసలో ట్విష్టా మరియు ఫెయిత్ ఇవాన్స్ చేసిన "హోప్" పాటకు ప్రధమ పాటగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ చిత్రానికి అసలు పాటలవరుస నుంచి వేరుగా పొడిగించబడిన బయట వరుసల పాటలు ఉన్నాయి. రికార్డు చేయబడిన అయిదు పాటలు ఈ చిత్రంలో లేవు అవి: ట్రే సాంగ్జ్ చేసిన అబౌట్ ద గేమ్; మాక్ 10 , ద హుడ్ కలిసి పాడిన బల్ల; జార్నాక్ చేసిన బ్యూటీ క్వీన్ ; లేటోయ పాడిన వాట్ లవ్ కెన్ డు; మరియు కేన్ వెస్ట్, మాలిక్ ఉసేఫ్, కామన్ కలిసి పాడిన వుడింట్ యు లైక్ టు రైడ్.
[మార్చు] అవార్డులు/నామినేషన్లు
- బ్లాక్ చిత్ర పురస్కారాలు
- దర్శకత్వం లో అత్యుత్తమ ప్రతిభ: థామస్ కార్టర్ (విజేత)
- అత్యుత్తమ చలనచిత్ర కథానాయకుడు : సామ్యుల్ ఎల్. జాక్సన్ (ప్రతిపాదింపబడిన )
- అత్యుత్తమ చలనచిత్రం : డేవిడ్ గాలే, బ్రియన్ రాబిన్స్ & మైకేల్ టోలిన్ (ప్రతిపాదింపబడిన )
- బ్లాక్ రీల్ పురస్కారాలు
- ఉత్తమ దర్శకుడు: థామస్ కార్టర్ (విజేత)
- ఉత్తమ నటుడు: సామ్యుల్ ఎల్. జాక్సన్ (ప్రతిపాదింపబడిన )
- ఉత్తమ నూతన ప్రదర్శన : అశాంతి (ప్రతిపాదింపబడిన )
- ఇమేజ్ పురస్కారాలు
- అత్యుత్తమ చలనచిత్రం: (ప్రతిపాదింపబడిన )
- అత్యుత్తమ చలనచిత్ర నటుడు: సామ్యుల్ ఎల్. జాక్సన్ (విజేత )
- అత్యుత్తమ చలనచిత్ర దర్శకుడు: థామస్ కార్టర్ (ప్రతిపాదింపబడిన )
- అత్యుత్తమ చలనచిత్ర సహాయ నటి: అశాంతి (ప్రతిపాదింపబడిన )
- MTV చిత్ర పురస్కారాలు
- ఉత్తమ నూతన ప్రదర్శన(స్త్రీ) అశాంటి (ప్రతిపాదింపబడిన)
[మార్చు] స్వల్ప ప్రాముఖ్యంగల విషయాలు
- అసలు సంఘటనలు 1999లో జరగగా ఈ చిత్రం 2004లో జరిగినట్లుగా చూపించారు.
- మేరియన్ విలియమ్సన్ చేసిన "అవర్ గ్రేటెస్ట్ ఫిఅర్" ను ఈ చిత్రం ఆసాంతమూ కోచ్ కార్టర్ సూచిస్తూ ఉంటాడు మరియు దేనికీ లొంగని ఒక యువకుడు(టిమో క్రజ్) తనలో మార్పునకు సూచకంగా "యాక్చుఅల్లీ హూ ఆర్ యు నట టు బి? యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ ","వి వర్ బోన్ టు మేక్ మేనిఫెస్ట్ ధీ గ్లోరి ఆఫ్ గాడ్ దట్ ఈజ్ వితిన్ అజ్ " అనే వాక్యాలను వదిలి వేసి ఈ పాటను గుర్తుచేసుకుంటాడు.
- అసలు ఒలియర్స్ ను ఓడించిన పాఠశాల పేరు మోంట్ విస్టా ఉన్నత పాఠశాల, సెయింట్ ఫ్రాన్సిస్ కాదు.
- ఈ చిత్రం కోచ్ కార్టర్ జార్జ్ మేసన్ విశ్వవిద్యాలయంలో చేరాడని చెబుతుంది. అసలు అతను జార్గ్ ఫాక్స్ విశ్వవిద్యాలయంలో చేరి ఉన్నాడు.
[మార్చు] తారాగణం
- సామ్యుల్ ఎల్. జాక్సన్ — కోచ్ కెన్ రే కార్టర్
- రాబ్ బ్రౌన్ — కెన్యన్ స్టోన్
- రాబర్ట్ రిచర్డ్ — డామియన్ కార్టర్
- రిక్ గొంజాలెజ్ — టిమో క్రజ్
- నానా బెవోన్యో — జూనియర్ బాటిల్
- అన్త్వన్ టేన్నార్ — జారన్ 'వాం' విల్లిస్
- చన్నింగ్ టాటం — జేసన్ లైల్
- అశాంటి — కైరా
- టెక్సాస్ బాటిల్ — మడ్డుక్స్
- డెనిస్ డూస్ — ప్రిన్సిపాల్ గర్రిసన్
- డెబ్బి మోర్గాన్ — తోన్య కార్టర్
- మేల్ వింక్లేర్ — కోచ్ వైట్
- విన్సెంట్ లరేస్కా — రెన్ని
- సిడ్నీ ఫైసన్ — టై క్రేన్
- ఆక్టేవియా స్పెన్సర్ — విల్లా బాటిల్
- అడ్రియన్ బైలన్ — డొమినిక్
- డాన డేవిస్ — పేయ్టన్
- బాబ్ కోస్టాస్ - అతనే
- లోర్కాన్ రియాన్ - టైరీక్
- షోర్టీ మాక్ - పినోలె గై
[మార్చు] మూలాలు
[మార్చు] బాహ్య లింకులు
- అధికారిక చిత్ర సైట్
- అధికారిక కోచ్ కార్టర్ సౌండ్‌ట్రాక్
- రొటెన్టమాటోస్ లో కొచ్ కార్టర్
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో Coach Carter పేజీ
- మూస:Mojo title
- కోచ్ కార్టర్ (చిత్రానికి సంబంధం లేని)