కోటిలింగాల
కోటిలింగాల, కరీంనగర్ జిల్లా, వెలగటూరు మండలానికి చెందిన గ్రామము. కోటిలింగాల మండల కేంద్రమైన వెల్గటూరు నుండి ఈశాన్య దిశలో నాలుగు కిలోమీటర్ల దూరంలో, గోదావరి నది, పెద్దవాగు సంగమస్థలంలో ఉన్నది. గ్రామానికి ఉత్తరాన పడమర నుండి తూర్పుకు ప్రవహించు గోదావరి నది కలదు. గోదావరి దక్షిణ ఒడ్డున కోటిలింగాల దేవస్థానం (శివాలయం) కలదు. గ్రామానికి తూర్పున దక్షిణం నుండి ఈశాన్యం వైపు ప్రవహించి గోదావరి నదిలో కలుస్తున్న పెద్దవాగు కలదు. ఈ రెండు కలిసే చోటు మునేరు అందురు. వెనుకట ఇక్కడ మునులు స్నానం చేసేవారట. అందుకే ఆ పేరు వచ్చింది. కోటిలింగాల చారిత్రక బౌద్ధక్షేత్రము. చరిత్రకారులు ఇది శాతవాహనుల తొలి రాజధానిగా భావిస్తున్నారు. శ్రీపాద సాగర్ ప్రాజెక్టు (ఎల్లంపల్లి ప్రాజెక్టు) పూర్తయితే జలాయశ్రపు నీటిలో కోటిలింగాల చారిత్రక ప్రదేశము మునిగిపోతుందని భావిస్తున్నారు.
కోటిలింగాల అంటే ఇక్కడ కోటి శివలింగాలు లేవు. కోటలో లింగముండటం వళ్ల కోటలింగమైంది. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్దకోట ఉండేది. దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిధిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్టించగా దానిని కోటలింగం అని, అదే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులోని దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు.
ఈ కోట గోడలు గోదావరి నది ఒడ్డు వెంబటి తూర్పు పడమరగా, మరియు పెద్దవాగు ఉత్తర దక్షిణములుగా దాదాపు 300 మీటర్ల ఆనవాళ్లను బట్టి తెలియుచున్నది. ఇక్కడ పురావస్తు శాఖ వారు రెండు సార్లు త్రవ్వకాలు జరిపారు. మొదట 1979 నుండి 1984 వరకు, రెండవసారి ఫిబ్రవరి 2009లో జరిగాయి. మొదటిసారి 1979లోత్రవ్వకాలు జరిపినపుడు ఈ ప్రాచీన నగరం బయల్పడింది.
చరిత్ర [మార్చు]
మూడూ దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు. క్రమక్రమంగా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్థారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహనులూ రాజధాని అని ఏటుకూరి బలరామయ్య అన్నాడు.[1] పైఠాన్, ధాన్యకటకంలకు ముందు ఇదే శాతవాహనులకు రాజధానిగా పనిచేసిందని జైశెట్టి రమణయ్య, శాతవాహనుల జన్మభూమి తెలంగాణయే అనే విషయంలో సందేహానికీ రావులేకుండా పోయిందని శ్రీరామశర్మ, శాతవాహనులు తొలుత కోటిలింగాలలోనే రాజ్యమొనర్చినారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బి.ఎన్.శర్మ వివరించారు.
మూలాలు [మార్చు]
- ↑ తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 42
|
|
|
|---|---|
| జగ్దేవ్పేట · వెల్గటూరు · కప్పరావుపేట · ముత్తునూర్ · రామ్నూర్ · కిషన్రావుపేట · సాకపురం · కొండాపూర్ · గుళ్ళకోట · అంబారీపేట · సంకెనపల్లి · పైడిపల్లి · చెగ్గావ్ · ఉందెడ · ముంజంపల్లి · సానబండ · గుడిసెలపేట్ · పడ్కల్ · కొత్తపేట్ · ఎండపల్లి · పాతగూదూర్ · సూరారం · మారేడుపల్లి |