కోట్ల విజయభాస్కరరెడ్డి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశాడు. 1982 - 1983 లో మొదటిసారి, మరియు 1992 నుండి 1995 వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి1920 ఆగష్టు 16 న కర్నూలు జిల్లాలోని లద్దగిరి గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి సెప్టెంబర్ 27, 2001 న మరణించాడు.
[మార్చు] రాజకీయ జీవితం
తొలిసారి 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు.
[మార్చు] విశేషాలు
- పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ.
- ఎన్.టి.రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ. 1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు.రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెస్.ను వోడించి ఎన్.టి. రామారావుకు అధికారం కట్టబెట్టిన పేరు విజయభాస్కర రెడ్డికే దక్కింది.
[మార్చు] లోకసభ సభ్యుడిగా
విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు కర్నూలు లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. మొదటిసారి 1977లో ఆరవ లోకసభకు ఎన్నికవగా , మద్యలో 8 వ లోకసభకు మినహా 12వ లోకసభ వరకు వరుసగా ఎన్నికైనాడు. ప్రస్తుతం 14వ లోకసభకు కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుంచి అతడి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
| ఇంతకు ముందు ఉన్నవారు: భవనం వెంకట్రామ్ |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 20/09/1982—09/01/1983 |
తరువాత వచ్చినవారు: నందమూరి తారక రామారావు |
| ఇంతకు ముందు ఉన్నవారు: నేదురుమిల్లి జనార్ధనరెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 09/10/1992—12/12/1994 |
తరువాత వచ్చినవారు: నందమూరి తారక రామారావు |