కోణార్క సూర్య దేవాలయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Konark
କୋଣାର୍କ
Town
Sun temple, Konark
కోణార్క సూర్య దేవాలయం is located in Odisha
Konark
Location in Odisha, India
Coordinates: 19°54′N 86°07′E / 19.90°N 86.12°E / 19.90; 86.12Coordinates: 19°54′N 86°07′E / 19.90°N 86.12°E / 19.90; 86.12
Country  India
State Odisha
District Puri
ఎత్తు  m ( ft)
జనాభా (2001)
 • మొత్తం 15,015
Languages
 • Official Oriya
టైమ్‌జోన్ IST (UTC+5:30)
వెబ్‌సైటు http://konark.nic.in


కోణార్క సూర్యదేవాలయం, 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం, ఒరిస్సా ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. గంగావంశానికి చెందిన నరసింహదేవ I (క్రీ.శ. 1236-1264) లో నిర్మించాడు. దీనికి నల్ల పగోడా అనికూడా అంటారు. దీనిని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశం గా ప్రకటించారు.

కోణార్క్ సూర్యదేవాలయము

భారతదేశములో పేరెన్నికగన్న సందర్శనా ప్రదేశములలో ఒడిషా లో వున్న కోణార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ క్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో కలదు. ఎర్ర ఇసుకరాతితో కట్టిన పదమూడవ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గాంగ వంశానికి చెందిన నరసింహదేవుడు (1236 - 1264) నిర్మించాడు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం గా గుర్తించ బడినది. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత శిల్ప కళాకృతులు కలిగి అపరూపంగా వున్నది. ఈ ఆలయ సముదాయం 12 జతల అలంకృత చక్రాలతో ఏడు గుర్రాలతో లాగ బడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. సూర్య గమనమునకు అనగా కాల గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంటుంది.

చిత్రమాలిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]