కోరాపుట్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరాపుట్ జిల్లా
జిల్లా
కోరాపుట్ జిల్లా లోని లక్ష్మీపూర్ రైలుమార్గం వద్ద దృశ్యం
కోరాపుట్ జిల్లా లోని లక్ష్మీపూర్ రైలుమార్గం వద్ద దృశ్యం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఒడిషా
స్థాపన1936
ముఖ్యపట్టణంకోరాపుట్
Government
 • కలక్టరుసచిన్ ఆర్. జాదవ్, IAS
 • లోక్ సభ సభ్యుడుజయరాం పంగి, బిజూ జనతా దళ్
Area
 • Total8,379 km2 (3,235 sq mi)
Population
 (2001)
 • Total11,77,954
 • Density140.58/km2 (364.1/sq mi)
భాషలు
 • అధికారికఒరియా, ఇంగ్లీషు
 • ఇతర ముఖ్యమైనతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
764 xxx
Vehicle registrationOD-10
లింగ నిష్పత్తి1.038 /
అక్షరాస్యత36.20%
లోక్ సభ నియోజకవర్గంకొరాపుట్
Vidhan Sabha constituency5
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,522 millimetres (59.9 in)
సగటు వేసవి ఉష్ణోగ్రత38 °C (100 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత12 °C (54 °F)

కొరాపుట్ జిల్లా, భారతదేశం ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. ఈ జిల్లాకు కొరాపుట్ పట్టణం కేంద్రం. జాజ్‌పూర్ సంస్థానం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకి వాయవ్య సరిహద్దుగా ఉంది.

చరిత్ర[మార్చు]

కొరాపుట్ జిల్లా ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, నలులు, గంగా రాజులు, ఇతర సూర్యవంశ రాజులు పరిపాలించారు. ఇది ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1936 ఏప్రిల్ 1 తేదీన ఒడిషా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఇదొక జిల్లాగా మారింది. 1992 అక్టోబరులో ఈ జిల్లాను విభజించి, మల్కనగిరి, రాయగడ, నవరంగపూర్ లను ఏర్పరచారు. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్‌కారిడార్గా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధుల్ని పొందుతుంది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారం, [2] కొరాపుట్ పట్టణం జనాభా 39,523. వీరిలో పురుషులు 52%, స్త్రీలు48%. ఇక్కడి సగటు అక్షరాస్యత 68%, జాతీయ సగటు కన్నా ఎక్కువ. కొరాపుట్ జనాభాలో 12% మంది చిన్న పిల్లలు.
  • 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కొరాపుట్ జిల్లా జనాభా of 1,376,934, [3] ఇది భారతదేశంలో 356వ ర్యాంకులో ఉన్నది (మొత్తం జిల్లాలు-640).[3] ఇక్కడి జనసాంధ్రత 156/చ.కి.మీ.[3] దీని జనాభా వృద్ధి రేటు 2001-2011 కంటే 16.63% ఎక్కువ.[3] కొరాపుట్ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1031 స్త్రీలు ఉన్నారు, [3], ఇక్కడి అక్షరాస్యత రేటు 49.87 %.[3]

భౌగోళికం[మార్చు]

మేజర్ పట్టణాలు[మార్చు]

  • జయపూర్
  • కోరాపుట్
  • సునాబెడా
  • డామన్‌జాబ్
  • సెమిలిగుడా
  • కాట్పాడి
  • బొరిగుమ్మా

విభాగాలు[మార్చు]

  • కోరాపుట్ జిల్లా 2 ఉపవిభజన, 14 బ్లాక్స్ విభజించబడింది. 2 ఉప విభాగాలు కోరాపుట్, జయపూర్ ఉంటాయి
  • కోరాపుట్ ఉపవిభజన మండలాలు : 1. కోరాపుట్ 2. సెమిలిగుద 3.నందపుర్ 4. పొత్తంగి 5. దస్మంథ్పుర్ 6. లంతపుత్ 7. లక్ష్మిపూర్ 8. నారాయణపత్న 9. బందుగఒన్
  • జయపూర్ ఉపవిభజనలో మండలాలు: 1. జయపూర్ 2. భొఇపరిగుద 3. కొత్పద్ 4. కుంద్రా 5. బొరిగుమ

సంస్కృతి[మార్చు]

స్థలాలను[మార్చు]

  • ఘుప్తెస్వర్ శివ్ దేవాలయం
  • జగన్నాథ్ ఆలయం (కోరాపుట్)
  • ఉన్నత ఖొలబ్ బొటానికల్ గార్డెన్
  • మాలిగుడా టన్నెల్
  • దుడుమ జలపాతం
  • భరినిపుత్
  • డెఒమలి హిల్
  • భతిసిణసన & గణేష్ ఆలయం
  • మాతా కాంటా భౌసుని పీట డమంజొది
  • జైన్ టెంపుల్ సుబై ణందపుర్
  • పాడువా టౌన్
  • మాతా శితల ఆలయం ఖోట్ఫాడ్
  • డమయంత్య్ సాగర్ ఖోట్ఫాడ్
  • డెఒద శివ టెంపుల్, ఖోట్ఫాడ్ ఛందిలి ఘ్.ఫ్
  • దమొంజొది కొండ వద్ద

ప్రజలు[మార్చు]

ఒడిషాలోని కోరాపుట్ జిల్లాలోని షెడ్యూల్డు తెగల ప్రజలు

కోరౌట్ జిల్లాలో ఆదివాసీ ప్రజలు అధికంగా ఉన్నారు. ఒక్కో భాషకు ఒక్కొక భాష, ఒక్కొక ప్రత్యేక సంరదాయం ఉంది. గిరిజనులకు వారి వారి ప్రత్యేక మతాచారాలు ఉన్నాయి. వీరు దేశ గణాంకాలలో తమను హిందువులుగా నమోదు చేసుకుంటున్నారు. అందువలన వీరు క్రమంగా హిందూ ప్రవాహంలో కలిసి పోతున్నారు. గిరిజనుల మీద మతపరంగా హిందువులు, క్రైస్తవులు ఒకే కాలంలో దాడి సాగించారు.[4][5]

వ్యవసాయం[మార్చు]

కోరాపుట్ జిల్లాలోని జైపోర్ భూభాగం వరి పంటకు ఆరంభ భూభాగంగా భావిస్తున్నారు. కోరౌట్ ఆఫివాసీ ప్రజలు పలు జాతుల వరి పంటను ఉత్పత్తు చేసి పండిస్తున్నారు. వీరు ఆరిన భూభాగం, చిత్తడి నేలలలో పండించగల వరిపంటను పండిస్తున్నారు. 2012లో " ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ " కోరాపుట్ ప్రజల సేవలను గుర్తించి ఫుడ్ సెక్యూరిటీని మంజూరు చేసింది.[6]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కోరాపుట్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[7] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి[7]

  • హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - సునబెడా
  • నేషనల్ అల్యూమినియం కంపెనీ ( నాల్కో) - దమంజొడి
  • బిట్-జయపూర్
  • కొలాబ్ జలవిద్యుత్ స్టేషను
  • మచ్కుండ్ - జలవిద్యుత్ స్టేషను

కళాశాలలు[మార్చు]

  • 1. గతంలో ఎ.సి.ఎ. అని పిలుస్తారు ఏరోనాటిక్స్ కళాశాల, కాలేజ్ (1981 లో స్థాపించబడింది)
  • 2. వ్యోమయానా సమస్థ విద్యాలయ (1968 లో స్థాపించబడింది)
  • 3. డి.ఎ.వి కాలేజ్, కోరాపుట్ (1981 ఆగస్టు 10 న స్థాపించబడింది)
  • 4. విక్రమ్ దేవ్ కాలేజ్ జయపూర్ (1947 లో స్థాపించబడింది)
  • 5. ఇంజనీరింగ్ & టెక్నాలజీ గోపాల్ కృష్ణ కాలేజ్ (సంవత్సరంలో స్థాపించబడిన 1989)
  • 6. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ & మేనేజ్మెంట్, జయపూర్
  • 7. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (హెచ్.ఐ.ఐ.టి ), జయపూర్ యొక్క హెచ్.ఐ- టెక్ ఇంస్టిట్యూట్
  • 8. ఇంజనీరింగ్, టెక్నాలజీ, జయపూర్ యొక్క జయపూర్ పాఠశాల
  • 9. టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సమంత చంద్ర శేఖర్ ఇన్స్టిట్యూట్ (2001 లో స్థాపించబడింది)
  • 10.భైరబ మహావిద్యాలయ కాలేజ్, బొరిగుమ్మ. ఒడిషా, కోరాపుట్
  • 11.సెంట్రల్ విశ్వవిద్యాలయం
  • 12. కోట్‌పాడ్ కాలేజ్, కోట్‌పాడ్ .
  • 13. మా సంతోషి సంస్కృత కళాశాల, కోట్‌పాడ్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,376,934, [3]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 356వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 156 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.63%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1031:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 49.87%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అతి స్వల్పం

భాషలు[మార్చు]

జిల్లాలో ఒరియా బృందానికి చెందిన భత్రి, 60% ప్రజలలో (6,00,000) వాడుకలో ఉంది.[10] భుంజియా, భాషను జిల్లాలో 7,000 మంది ఆదివాసీలలో వాడుకలో ఉంది. [11]

నక్సలిజం[మార్చు]

దక్షిణ ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలలో 2000 నుండి నక్సలిజం ఆలోచించవలసి విషయం. ఆరంభంలో పరిసర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మల్కనగిరిలో నక్సలిజం ఆరంభం అయింది. తరువాత నక్సలిజం కోరాపుట్ జిల్లా, రాయగడ, నవరంగపూర్ జిల్లాలకు వ్యాపించింది. కొండలు, దట్టమైన భూభాగం, అభివృద్ధి పనులు తక్కువగా ఉండడం, గిరిజనులు, పేదల దుస్థితి, నిర్వహణా లోపం నక్సలిజం బలపడడానికి కారణంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలో నక్సలైటుల దాడి తరువాత ఈ ప్రాంతంలో నక్సలైటు సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. .[12] పీ పుల్స్ వార్ గ్రూపుకు చెందిన నక్సలైట్లు ఈ ప్రాంతంలోని జిల్లాలల మీద పలు దాడులు (రైతులు, పోలీస్, పెట్టుబడిదారులు, రాజకీయనాయకులు, గోడౌన్లు ) జరిపారు.[13]

రాజాకీయాలు[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గం[మార్చు]

కిందివి కోరాపుట్ జిల్లాలోని 5 విధాన సభ నియోజకవర్గాలు, ఎన్నికైన సభ్యులు వివరాలు.[14][15][16]

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
141 లక్ష్మీపూర్ షెడ్యూల్డ్ తెగలు లక్ష్మీపూర్, దసమంతపూర్, బంధుగావ్, నారాయణపతనా. ఝిన హికల బి.జెడి
142 కొట్పాడ్ షెడ్యూల్డ్ తెగలు కోట్పాడ్ (ఎన్.ఎ.సి), కోట్పాడ్, కుంద్రా, బొరిగుమ్మా (భాగం)

, Boipariguda (part)

బసుదేవ్ మఝి/శ్రీ చంద్ర శేఖర్మఝి (ప్రస్తుత ఎం.ఎల్.ఎ) ఐ.ఎన్.సి
143 జాజ్‌పూర్ లేదు జెఉపోర్ (ఎం), జెయ్పోర్, బొరిగుమ్మ (భాగం) రబి నారాయణ్ నందా బి.జె.డి
144 కొరాపుట్ షెడ్యూల్డ్ కులాలు కొరాపుట్ (ఎన్.ఎ.సి), సునబెడా (ఎన్.ఎ.సి), లాంప్తపుట్, కోరౌట్ (భాగం) , బొయిపరిగుడా (భాగం) రఘురాం పాడల్ BJD
145 పొట్టంగి షెడ్యూల్డ్ తెగలు పొట్టంగి, సెమిలిగుడా, నందాపూర్, కోరాపుట్ (భాగం) రామా చంద్ర కడం ఐ.ఎన్.సి

మూలాలు[మార్చు]

  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. "SikhSpectrum.com Monthly. Hindu Nationalism and Orissa: Minorities as Other". web.archive.org. 2008-11-15. Archived from the original on 2008-11-15. Retrieved 2023-06-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Kandhamal: The March Of Hindutva In Tribal Orissa | PRAGOTI". web.archive.org. 2015-04-06. Archived from the original on 2015-04-06. Retrieved 2023-06-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. https://www.fao.org/fileadmin/templates/giahs/PDF/Koraput_Traditional_Agricultural_System_to_be_designated_as_GIAHS_site.pdf
  7. 7.0 7.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  10. M. Paul Lewis, ed. (2009). "Bhatri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  11. M. Paul Lewis, ed. (2009). "Bhunjia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.
  12. "Maoists in Orissa Growing Tentacles and a Dormant State".
  13. "Naxalite Consolidation In Orissa".
  14. Assembly Constituencies and their EXtent
  15. Seats of Odisha
  16. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు[మార్చు]