క్రిస్టియాన్ హైగెన్స్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| Christiaan Huygens | |
|---|---|
Christiaan Huygens
|
|
| Born | 14 April 1629 The Hague, Netherlands |
| Died | 8 July 1695 (aged 66) Netherlands |
| నివాసం | Netherlands, France |
| జాతీయత | Dutch |
| Fields | Physics Mathematics Astronomy Horology Science fiction |
| విద్యాసంస్థలు | Royal Society of London French Academy of Sciences |
| Alma mater | University of Leiden College of Orange |
| Doctoral advisor | Frans van Schooten John Pell |
| ప్రసిద్ధి | Titan Explanation Saturn's rings Centrifugal force Collision formulae Pendulum clock Huygens–Fresnel principle Wave theory Birefringence First theoretical physicist |
| Influences | René Descartes Frans van Schooten Blaise Pascal Marin Mersenne |
| Influenced | Gottfried Wilhelm Leibniz Isaac Newton |
క్రిస్టియాన్ హైగెన్స్ ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త మరియు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచయిత.
ఈనాడు వాడుకలో ఉన్న రేడియో, టెలివిజన్, లేజర్, ఇంటర్నెట్ సాధనాలకు కారణమయ్యే విద్యుదయస్కాంత తరంగ వినియోగాలకు మూలాధారమైన సిద్ధాంతాన్ని చెప్పిన శాస్త్రవేత్త.
కాంతి తరంగ సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన వ్యక్తిగా ప్రాచుర్యం పొందినా ఈయన ఎన్నో రంగాల్లో మేటి పరిశోధనలు చేశాడు. గణిత, ఖగోళ, న్యాయ, భౌతిక, కాంతి శాస్త్రాల్లో ఎన్నో సిద్ధాంతాలు, సూత్రాలు ఆవిష్కరించడమే కాకుండా సైన్స్ ఫిక్షన్ రచయిత కూడా. లోలకపు గడియారం, శని ఉపగ్రహమైన టైటాన్, అపకేంద్ర బలం లాంటివెన్నో కనిపెట్టాడు.
నెదర్లాండ్స్ ముఖ్యపట్టణం హేగ్‌లో 1629 ఏప్రిల్ 14న పుట్టిన హ్యూజీన్స్ పదహారేళ్ల వరకూ ఇంటి వద్దనే ట్యూషన్ల సాయంతో చదువుకున్నాడు. ఆపై విశ్వవిద్యాలయాల్లో చేరి సైన్స్, గణిత, న్యాయ శాస్త్రాలు అభ్యసించాడు. తన 34వ ఏట ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఎన్నికైన ఈయన గెలిలియో ఉపయోగించిన లఘులోలకానికి మార్పులు చేసి కాలాన్ని కొలవడానికి ఉపయోగించే లోలకపు గడియారాన్ని కనుగొన్నాడు. ధ్రువ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ దిశగా ప్రయాణించేప్పుడు లోలకపు గడియారం చూపించే మార్పులకు కారణం భూమి పరిభ్రమణం వల్ల కలిగే అపకేంద్రక బలమేనని చెప్పాడు. అప్పటి టెలిస్కోపులో లోపాలను గమనించిన హ్యూజీన్స్ స్వయంగా కటకాలను తయారు చేసుకుని వాటితో శనిగ్రహం వలయాలను పరిశీలించాడు. దాని అతి పెద్ద ఉపగ్రహం టైటాన్‌ను కనిపెట్టాడు.
ఆయన ప్రతిపాదించిన 'కాంతి తరంగ సిద్ధాంతం' (wave theory of light) భౌతిక శాస్త్రాన్నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. నీటి తరంగాల్లా, ధ్వని తరంగాల్లా కాంతి, ఈథర్ అనే మాథ్యమంలో తరంగాల రూపంలో పయనిస్తుందని చెప్పిన ఈ సిద్ధాంతం కాంతి ధర్మాలైన పరావర్తనం, వక్రీభవనం, వ్యతికరణం, వివర్తనం, ధ్రువీకరణాలన్నింటినీ వివరించగలిగింది. దీని ఆధారంగానే తర్వాత కాలంలో విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతానికి పునాది పడింది. హ్యూజీన్స్ రాసిన 'Treatise on Light'ఇప్పటికీ ప్రామాణిక గ్రంథమే.