క్రిస్ గేల్
1979, సెప్టెంబర్ 21న జమైకా లోని కింగ్‌స్టన్ లో జన్మించిన క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్ (Christopher "Chris" Henry Gayle) వెస్ట్‌ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఇతనికి ఉంది. 2001 జూలైలో క్రిస్ గేల్స్, డారెన్ గంగా]తో కలిసి జింబాబ్వేపై బులావయో మ్యాచ్‌లో తొలి వికెట్టుకు 214 పరుగుల భాగస్వామ్యం చేసి రికార్డు సృష్టించారు.
విషయ సూచిక |
[మార్చు] టెస్ట్ క్రికెట్
క్రిస్ గేల్స్ ఇంతవరకు 70 టెస్టుమ్యాచ్‌లు ఆడి 4658 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు మరియు 28 అర్థసెంచరీలు కలవు. అతని అత్యధిక టెస్ట్ స్కోరు 317 పరుగులు. బౌలింగ్‌లో 59 టెస్ట్ వికెట్లు కూడా సాధించాడు.
[మార్చు] వన్డే క్రికెట్
వన్డేలలో 176 మ్యాచ్‌లు ఆడి 6244 పరుగులు సాధించాడు. అందులో 15 సెంచరీలు మరియు 34 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 153 (నాటౌట్). బౌలింగ్‌లో 142 వన్డే వికెట్లు కూడా సాధించాడు.
[మార్చు] ప్రపంచ కప్ క్రికెట్
క్రిస్ గేల్ 2003 మరియు 2007 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో వెస్ట్‌ఇండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
[మార్చు] ట్రిపుల్ సెంచరీ
2005లో దక్షిణాఫ్రికా]]తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 317 పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించినాడు. అంతకు ముందు అదే సీరీస్ తొలి టెస్టులో జట్టు తరఫున స్పాన్సర్‌షిప్ వివాదం వల్ల మరో ఆరుగురు వెస్ట్‌ఇండీస్ క్రికెటర్లతో పాటు ఆడలేకపోయాడు. రెండో మరియు మూడవ టెస్టు మ్యాచ్ ఆడిననూ అంతగా రాణించలేడు. ఆ తరువాత నాలుగవ మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చితకబాది తన క్రీడా జీవితంలోనే అత్యధిక టెస్ట్ స్కోరును సాధించాడు.
[మార్చు] బయటి లింకులు
- CricketArchive page on Chris Gayle
- Cricinfo page on Chris Gayle
- 75 Years of West Indies Cricket 1928-2000 by Ray Goble and Keith AP Sandiford ISBN 1-870518-78-0
- BBC
- Highest ODI Scores
|
|||||
|
|
|
|---|---|
| బ్రియాన్ లారా · ఇయాన్ బ్రాడ్ షా · డ్వేనే బ్రేవొ · చందర్‌పాల్ · కాలిమోర్ · క్రిస్ గేల్ · డారెన్ పొవెల్ · కీరొన్ పొలాక్ · దినేష్ రాందిన్ · మార్లన్ శామ్యూల్స్ · రాంనరేష్ శర్వాణ్ · సిమ్మన్స్ · డ్వేనే స్మిత్ · డేవన్ స్మిత్ · జెరోమ్ టేలర్ |