క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (రుణ రేటింగ్ సంస్థ)
మూస:Corporate Finance కొన్ని రకాల రుణ భాధ్యతల జారీ దారులకు మరియు వారి రుణ సాధనాలకు క్రెడిట్ రేటింగ్స్‌ను అందించే ఒక కంపెనీని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (CRA ) అంటారు. కొన్ని సందర్భాల్లో ఇది పరోక్షంగా రుణం మంజూరు చేసేవారికి లేదా అంతర్లీనంగా రుణాలు ఇచ్చే సంస్థలకు కూడా రేటింగ్స్ ఇస్తుంది. ఎక్కువ సందర్భాల్లో, సెక్యూరిటీస్‌ను జారీ చేసే కంపెనీలు, ప్రత్యేక ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సంస్థలు, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు, లాభాపేక్ష లేని సంస్థలు లేదా జాతీయ ప్రభుత్వాలు రుణాల మాదిరి సెక్యూరిటీలను (అనగా బాండ్లు) జారీ చేస్తాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్‌లో కూడా వీటి క్రయవిక్రయాలు జరపవచ్చు. జారీ చేసేవారి కొరకు క్రెడిట్ రేటింగ్ వారి యొక్క రుణ విలువ (బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం)ను పరిగణనలోకి తీసుకుని రేటింగ్ ఇస్తుంది మరియు జారీ చేసిన నిర్దిష్ట సెక్యూరిటీకి అమలయ్యే వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. (CRAలకు భిన్నంగా, వ్యక్తుల రుణవిలువకు క్రెడిట్ స్కోర్‌ను ఇచ్చే సంస్థలను క్రెడిట్ బ్యూరో లేదా వినియోగదారుల క్రెడిట్ రిపోర్టింగ్ ఏజన్సీ అని పిలుస్తారు). ఈ రేటింగ్‌ల విలువను 2007/2009 ఆర్థిక సంక్షోభం తర్వాత బాగా ప్రశ్నించడం మొదలైంది. 2003లో ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, కాంగ్రెస్‌కు ఒక నివేదిక ఇచ్చింది. క్రెడిట్ రేటింగ్ సంస్థల మధ్య ఉన్న అనవసర పోటీ వల్ల ఏర్పడుతున్న వివాదాలను పరిశోధించడంతో పాటు, వడ్డీరేట్లలో తేడాల గురించి ఈ నివేదిక పేర్కొంది.[1]
విషయ సూచిక |
[మార్చు] కార్పొరేషన్‌లు మరియు ప్రభుత్వ సంస్థలకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు
మరింత సమాచారం కోసం, బాండ్ క్రెడిట్ రేటింగ్‌ను చూడండి.
కార్పొరేషన్స్‌కు క్రెడిట్ రేటింగ్‌లు ఇచ్చే సంస్థలు:
- ఎ.ఎమ్.బెస్ట్ (U.S.)
- బేకార్ప్ అడ్వాంటేజ్ (ఆస్ట్రేలియా)
- డొమినియన్ బాండ్ రేటింగ్ సర్వీస్ (కెనడా)
- డన్ అండ్ బ్రాడ్షీట్
- చైనా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (చైనా)
- ఫిచ్ రేటింగ్స్ (U.S.)
- జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ (జపాన్)
- మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (U.S.)
- స్టాండర్డ్ అండ్ పూర్స్ (U.S.)
- రేటింగ్ ఏజన్సీ మలేషియా (మలేషియా)
- క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ లిమిటెడ్ (చైనా)
- ఈగన్ జోన్స్ రేటింగ్ కంపెనీ (U.S.)
- CRISIL లిమిటెడ్(భారతదేశం)
- జపాన్ క్రెడిట్ రేటింగ్ వైటల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (పాకిస్థాన్)
- పాకిస్థాన్ క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ లిమిటెడ్ (పాకిస్థాన్)
[మార్చు] రేటింగ్స్ వల్ల ఉపయోగాలు
క్రెడిట్ రేటింగ్స్‌ను పెట్టుబడిదారులు, జారీదారులు, పెట్టుబడి బ్యాంక్‌లు, బ్రోకర్ డీలర్లు, మరియు ప్రభుత్వం ఉపయోగిస్తాయి. పెట్టుబడిదారుల కోసం, క్రెడిట్ రేటింగ్ సంస్థలు పెట్టుబడి ప్రత్యామ్నాయాల పరిధిని పెంచుతాయి. స్వతంత్రంగా సులభంగా వాడేందుకు సంబంధిత క్రెడిట్ రిస్క్ యొక్క పద్దతులను ఉపయోగిస్తాయి. ఇది సహజంగా మార్కెట్ యొక్క సామర్ధ్యాన్ని పెంచుతాయి. అటు అప్పు ఇచ్చేవారికి, అప్పు తీసుకునేవారికి కూడా ఖర్చును తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో నష్టం భయం ఉన్న పెట్టుబడి యొక్క ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది బలమైన అభివృద్ధికి దారి తీస్తుంది. ఇది పెట్టుబడి మార్కెట్‌లో కొనుగోలుదారులకు అనేక అవకాశాలను కల్పిస్తుంది లేకపోతే వారు పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. చిన్న ప్రభుత్వాలు, అప్పుడే ప్రారంభమైన కంపెనీలు, ఆసుపత్రులు మరియు విశ్వవిద్యాలయాలు ఇలాంటి వాటి వల్ల లబ్ది పొందుతాయి.
[మార్చు] బాండ్లు జారీచేసేవారికి రేటింగ్స్ ఉపయోగం
సాధారణంగా జారీదారులు తమ సొంత రుణ సంపద పై స్వతంత్రంగా ఇచ్చే క్రెడిట్ రేటింగ్ పై మరియు తాము జారీచేసే పరికరాల ఫలితంగా వచ్చే విలువ పై ఆధారపడతాయి. ఎక్కువ సందర్భాల్లో, బాండ్లు జారీచేసేవారు కనీసం ఒక మంచి CRA నుంచి ఒక రేటింగ్‌నైనా ఆశిస్తారు. విజయవంతంగా బాండ్లు జారీచేయాలంటే ఇది అవసరం (ఇలాంటి రేటింగ్ లేకుండా, బాండ్లు జారీ చేస్తే, పెట్టుబడి దారులు, బాండ్ విలువ కంటే తక్కువ మొత్తాన్ని ఇస్తామని అంటారు). బాండ్ మార్కెట్ సంఘం యొక్క అధ్యయనం ప్రకారం, అనేక సంస్థల పెట్టుబడిదారులు, కనీసం మూడు రేటింగ్స్ అయినా ఉండాలని కోరుకుంటున్నారు.
కొన్ని సంస్థాగత ఆర్థిక వ్యవహారాల కోసం కూడా జారీదారులు క్రెడిట్ రేటింగ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థ, ప్రమాదకర పరిశోధనా ప్రాజెక్ట్ చేపట్టాలని అనుకుంటే, ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. దీని కోసం కొన్ని ఆస్థులను కేటాయించి, ప్రత్యేకంగా ఆ పని చేపడుతుంది. ఈ ప్రత్యేక ఉద్దేశ్య సంస్థ (SPE) పరిశోధన యొక్క అపాయాన్ని అంచనా వేసి, ఆర్థిక వనరుల కోసం సొంత రుణ సెక్యూరిటీలను జారీ చేస్తుంది. సాధారణంగా SPEల యొక్క క్రెడిట్ రేటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తాము జారీ చేసిన బాండ్లకు, చాలా ఎక్కువ మొత్తం తిరిగి చెల్లించేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. ఏదేమైనా, ఈ రిస్క్ మాతృ సంస్థ యొక్క మొత్తం క్రెడిట్ రేటింగ్‌ను ఏ మాత్రం తగ్గించదు. కారణం, SPE న్యాయపరంగా ప్రత్యేక సంస్థ. దీనికి విరుద్ధంగా, కొన్ని సందర్భాల్లో తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీలు, మంచి మొత్తాలను తెచ్చుకోవడానికి ప్రత్యేక SPEలను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రత్యామ్నాయం కోసం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్థులను బదిలీ చేస్తాయి. తద్వారా భద్రత కలిగిన రుణ సెక్యూరిటీస్‌ను జారీ చేయగలగుతాయి. ఈ పద్దతిలో, ఒకవేళ కొత్త వెంచర్ విఫలమైనా, SPEకి ఉన్న ఆస్థుల వల్ల పెట్టుబడిదారులకు నష్టం జరగదు. కాకపోతే ఈ SPEలో రుణ ప్రతిపాదనలోనే, వడ్డీరేటు కొద్దిగా తక్కువగా ఉంటుంది.
ఒకే జారీదారు భిన్న బాండ్లకు భిన్న క్రెడిట్ రేటింగ్స్‌ను కలిగి ఉండొచ్చు. ఈ తేడా బాండ్ల యొక్క నిర్మాణం పై ఆధారపడి ఉంటుంది. బాండ్ ఎంత మేరకు సురక్షితం, ఇతర అప్పుకు ఈ బాండ్ ఏ మేరకు అనుబంధంగా ఉంది అనే అంశాలనూ పరిగణలోకి తీసుకున్నాక ఈ తేడా ఇవ్వబడుతుంది. అధిక సంఖ్యలో CRAలు క్రెడిట్ రేటింగ్ అడ్వైజరీ సర్వీస్‌లను ప్రతిపాదిస్తున్నాయి. ఇవి జారీదారులకు బాండ్ నిర్మాణంలో దిశానిర్దేశం చేస్తాయి. దీనివల్ల అప్పు కోసం మార్కెట్‌లోకి వెళ్లే సమయానికి సరైన క్రెడిట్ రేటింగ్‌ను సంపాదించవచ్చు. ఇది ఆసక్తిలో తేడాను సృష్టించే అవకాశం ఉంది. బాండ్ నిర్మాణంలో ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని రేటింగ్‌ను సంపాదించడం ద్వారా జారీదారుకు CRA జారీ చేసే మార్గదర్శకాల పై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని CRAలు రుణ రేటు ప్రతిపాదనలను తిరస్కరించడం ద్వారా దీనిని నుంచి తప్పుకుంటాయి. ఇలాంటి వాటికి తమ సలహా సర్వీసులను వినియోగించుకుంటాయి.
[మార్చు] ప్రభుత్వ రెగ్యులేటరీలకు రేటింగ్స్ ఉపయోగం
ప్రభుత్వ సంస్థలు కూడా క్రెడిట్ రేటింగ్స్‌ను ఉపయోగించుకుంటాయి లేదా సంస్కరణల కోసం రేటింగ్‌లను ఉపయోగించుకోవడానికి అనమతి ఇస్తాయి. ఉదాహరణకు, బ్యాకింగ్ సూపర్ విజన్ మీద ఏర్పడిన బేసెల్ కమిటీ యొక్క బేసిల్ II ఒప్పందం ప్రకారం, బ్యాకింగ్ రెగ్యులేటరీలు కొన్ని నిర్దేశిత CRA (వీటిని "ECAI"లు అని పిలుస్తారు లేదా "బాహ్యా క్రెడిట్ అంచనా సంస్థలు")ల దగ్గర నుంచి క్రెడిట్ రేటింగ్ పొందేందుకు బ్యాంక్‌లకు అనుమతి ఇచ్చాయి. నికర పెట్టుబడుల్లో అవసరమైన నిల్వలు సంపాదించడానికి వీటిని ఉపయోగించుకోవాలి. యునైటెడ్ స్టేట్స్‌లో ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) జాతీయంగా గుర్తింపు పొందిన స్టాటస్టికల్ రేటింగ్ సంస్థలు (లేదా "NRSRO"లు) నుంచి ఇదే ఉపయోగం కోసం పెట్టుబడి బ్యాంక్‌లు మరియు బ్రోకర్ డీలర్స్ క్రెడిట్ రేటింగ్స్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. బ్యాంక్‌లు మరియు ఇతర ఆర్థిక సంస్థలు అదే మొత్తాన్ని రిజర్వ్‌గా ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా చేయడానికే ఈ ఆలోచన చెయ్యబడింది. ఇది బ్యాంక్ మీద రన్‌ను సంస్థ రక్షించుకోవడానికి మాత్రమే. అది కూడా ఆర్థిక సంస్థలు ఎక్కువ లిక్విడ్ మరియు సురక్షిత సెక్యూరిటీలలో (U.S. ప్రభుత్వ బాండ్లు మరియు నిలకడగా ఉన్న కంపెనీల యొక్క స్వల్పకాలిక వాణిజ్య పేపర్లు) పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రమే చెల్లుతుంది.
CRA రేటింగ్స్‌ను ఇతర సంస్కరణ ఉపయోగాల కోసం కూడా ఉపయోగిస్తారు. US SEC, ఉదాహరణకు, ఓ స్థాయిలో క్రెడిట్ రేటింగ్స్ ఉన్న సంస్థలు జారీ చేసిన బాండ్లును కలిగి ఉన్న సంస్థలు, పాత ఇష్యూలలోని బాండ్లను జారీ చేస్తుంటే, తక్కువ ప్రాస్పెక్టస్‌ను బాండ్ జారీ చేయడానికి ఉపయోగించటానికి అనుమతి ఇస్తుంది. ఎక్కువ NRSRO రేటింగ్ ఉన్న సెక్యూరిటీలు కలిగిన ద్రవ్య మార్కెట్ ఫండ్లు (బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ యొక్క లిక్విడిటీ, భద్రత ఉన్న మ్యూచువల్ ఫండ్స్, FDIC భీమా లేకుండా) జారీ చేయడానికి కూడా SEC సంస్కరణలను పాటించాలి. ఇదే మాదిరిగా, భీమా సంస్కర్తలు కూడా క్రెడిట్ రేటింగ్స్‌ను భీమా కంపెనీల యొక్క బలాన్ని, నిల్వలను అంచనా వేయడానికి ఉపయోగిస్తాయి.
బేసెల్ II మరియు SEC నిబంధనల ప్రకారం, సంస్కర్త ఉపయోగం కోసం, CRA యొక్క రేటింగ్‌లను ఉపయోగించకూడదు. (ఒకవేళ ఇదే జరిగితే, ఇది నైతిక కష్టాలను ప్రతిబింబిస్తుంది[citation needed]) దీనికోసం అనేక రకాల వెట్టింగ్ ప్రాసెస్ ఉంది. ది బేసెల్ II నిబంధనల ప్రకారం (పారాగ్రాఫ్ 91, మొదలైనవి ) ఉదాహరణకి, ఓ నిర్దేశిత CRA నుంచి రేటింగ్స్‌కు అనుమతి ఇచ్చినప్పుడు, ఏ విధానంలో దానిని అంగీరిస్తున్నారో స్పష్టంగా నిర్వచించాలి. ఇవి అంశాల పరంగా ఉండటం, "స్వతంత్రం", పారదర్శకత మరియు ఇతర అంశాలను కలిపి ఉంటాయి. అప్పటి నుంచి అనేక పరిధుల్లో బ్యాంకింగ్ సంస్కర్తలు ఈ విషయం మీద చర్చకు మరియు ఈ విషయాలు వాస్తవంలో ఎలా అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి తమ సొంత కాగితాలను జారీచేస్తున్నాయి. The Committee of European Banking Supervisors Discussion Paper,లేదా ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ ECAI అవసరాలను చూడొచ్చు.
అమెరికాలో 1975 నుంచి, NRSRO నో యాక్షన్ లెటర్‌ను SEC సిబ్బంది ద్వారా పంపడం ద్వారా గుర్తింపును ఇచ్చారు. ఈ విధానాన్ని అనుసరిస్తూ, ఒకవేళ ఓ CRA ( లేదా పెట్టుడి బ్యాంక్ లేదా బ్రోకర్ డీలర్) మరో ప్రత్యేకమైన CRA యొక్క రేటింగ్‌లను ఉపయోగించడంలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటే, SEC సిబ్బంది మార్కెట్‌ను పరిశోధించి, ఆ CRA రేటింగ్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారా? పరిగణనలోకి తీసుకుంటున్నారా? అనే విషయాలు నమ్మదగినవి మరియు నమ్మశక్యమైనవి అని తెలుసుకుంటారు. SEC సిబ్బంది ఇదే విషయాన్ని తెలుసుకుంటే, అది CRAకు ఓ ఉత్తరం పంపుతుంది. ఒక సంస్కరణ సంస్థ CRA రేటింగ్స్ మీద ఆధారపడాలని అనుకుంటే, ఆ సంస్థ పై తీసుకునే చర్యల గురించి SEC సిబ్బంది ఎలాంటి ప్రతిపాదనలు చేయరు. ఈ నో యాక్షన్ ఉత్తరాలు ప్రజలకు తెలిపి, ఇతర సంస్కరణల సంస్థల పై ఆధారపడాలని సూచిస్తారు. సంస్థ అసలు కోరిన విషయాన్ని మాత్రమే కాదు, వాటిని అంచనా వేయడంలో కూడా SEC ఇతర నిర్వచనాల పద్దతిని పేర్కొంది. మార్చి 2005లో ఈ ప్రభావంతో ఒక ప్రతిపాదించిన సంస్కరణను ప్రచురించింది.
2006 సెప్టెంబరు 29న, అమెరికా అధ్యక్షడు జార్డ్ డబ్ల్యు. బుష్ క్రెడిట్ రేటింగ్ సంస్కరణ చట్టం, 2006 చట్టం పై సంతకం చేశారు.[2] ఈ చట్టం యుఎస్ సెక్యూరిటీస్ మరియు ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌ను NRSROకు గుర్తింపు ఎలా ఇచ్చింది చెప్పాలని చూసించింది. నో యాక్షన్ లెటర్ విధానాన్ని రద్దు చేసింది మరియు NRSROను ఓ కమిషన్ (SEC సిబ్బంది కాకుండా) నిర్ణయంగా గుర్తింపు తెచ్చింది. అయితే SEC, S & P ఈ చట్టం పై నిరసన తెలిపాయి. ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మాట్లాడే స్వేచ్ఛను హరించడమేనని విమర్శించాయి.[2] 2007 వేసవిలో, SEC ఈ చట్టం పై ఆచరించాల్సిన నిబంధనలను జారీ చేసింది. దీని ప్రకారం పబ్లికేతర సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా రేటింగ్ ఏజన్సీలు విధానాలను పాటించాలని స్పష్టం చేసింది. తప్పుడు ఆచరణలుపై నిషేధం మరియు ఆసక్తిలోని వివాదాలను దుర్వినియోగం చేయకుండా చూడటం జరిగింది.[3]
పెట్టుబడి స్థాపనలో CRA యొక్క పాత్రను గుర్తిస్తూ, కొన్ని ప్రభుత్వాలు తమ దేశవాళీ రేటింగ్ ఏజెన్సీ వ్యాపారాన్ని రకరకాల ప్రోత్సాహకాలు ఇచ్చి చేసుకునేందుకు ప్రోత్సహించాయి. ఏదేమైనా ఇది ఉత్పత్తిదాయక పని కాదు. సబ్సిడీలు ఇచ్చి, తక్కువ సామర్ధ్యం ఉన్న ఏజన్సీలను ఏర్పాటు చేయడం ద్వారా మార్కెట్ వ్యవస్థ దెబ్బ తింటే, ఎక్కువ నాణ్యత ఉన్న అంశాల వైపు వనరులు తరలిపోతాయి.
[మార్చు] నిర్మాణాత్మక ఆర్థిక సంస్థలలో రేటింగ్స్ ఉపయోగం
క్రెడిట్ రేటింగ్ సంస్థలు నిర్మాణాత్మక ఆర్థిక సంస్థల వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ఒక సంక్లిష్టమైన ఋణం లేదా బాండ్ జారీ చేయడం మాదిరిగా కాకుండా, ఒక అప్పు తీసుకున వ్యక్తి అప్పు మీద కొంత మొత్తం వడ్డీ ప్రతిపాదిస్తాడు. నిర్మాణాత్మక ఆర్ధిక వ్యవహారాలు విభిన్న లక్షణాలు ఉన్న అప్పుల వరుసగా చెప్చొచ్చు లేదా ఒక సిరీస్ ఆఫ్ బకెట్ (బకెట్స్‌తో లేదా ట్రాంచెస్ అని పిలిచే విభిన్న రుణాలు)లో కలిసి ఉన్న ఒకే తరహా రుణాలు, అంటే కొన్ని చిన్న రుణాలు కలిపి ఒక ప్యాకేజ్‌లా ఉంటాయి. ఒక ప్రత్యేక ట్రాంచ్ యొక్క వడ్డీ రేటు లేదా ధరను క్రెడిట్ రేటింగ్ సంస్థలు తరచుగా నిర్దేశిస్తుంటాయి. దీని కోసం ఆ సమూహంలో ఉన్న అప్పులలో నాణ్యత, ఆస్థుల నాణ్యతను పరిగణనలోకి తీసుకుంటారు.
నిర్మాణాత్మక ఆర్ధిక వ్యవహారాలలో, ఏర్పాట్లలో ఉన్న కంపెనీలు తరచుగా క్రెడిట్ రేటింగ్ ఏజన్సీల సహాయాన్ని తీసుకుంటాయి. ట్రాంచెస్ యొక్క నిర్మాణం ఎలా ఉండాలో తెలుసుకోవడం ద్వారా, కోరుకున్న క్రెడిట్ రేటింగ్‌ను పొందగలుగుతారు. ఉదాహరణకు, ఓ సంస్థ రుణ సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా భారీ మొత్తం సేకరించాలని అనుకుంటోంది. భారీ మొత్తం కావడంతో, పెట్టుబడి దారులు తిరిగి కోరే సమయంలో ఒకేసారి మొత్తం చెల్లించడం కష్టం. దీంతో ఈ సంస్థ మూడు విభిన్న బాండ్లను జారీ చేయాలని నిర్ణయించింది. మూడు క్రెడిట్ రేటింగ్స్, A (మధ్యస్థ తక్కువ ప్రమాదం), BBB (మధ్యస్థ ప్రమాదం), మరియు BB (ప్రమాదకరమైన) (స్టాండర్డ్ అండ్ పూర్ యొక్క రేటింగ్ పద్దతిని ఉపయోగించి) అని మూడు రకాలు విడుదల చేసింది. BB రేటెడ్ బాండ్స్ మీద చెల్లించాల్సిన వడ్డీ రేటు కంటే A రేటెడ్ బాండ్స్ మీద చెల్లించాల్సిన వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. కానీ, నికరంగా మొత్తం సృష్టించిన పెట్టుబడి మీద చెల్లించాల్సిన వడ్డీ, ఒకే తరహా బాండ్‌లు విడుదల చేయడం ద్వారా చెల్లించాల్సి వచ్చే వడ్డీ కంటే తక్కువ. ఈ పద్దతిని అవలంబించాలని అనుకున్న తర్వాత, ఈ సంస్థ ఒక క్రెడిట్ రేటింగ్ సంస్థను సంప్రదించి, తన ట్రాంచ్ నిర్మాణం ఎలా ఉండాలనే సూచన తీసుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే ప్రతి ట్రాంచ్‌లో భద్రత కోసం ఉంచాల్సిన ఆస్థుల రకాల గురించి తెలుసుకుంటుంది. దీని వల్ల ప్రతి ట్రాంచ్‌కు జారీ చేసినన సమయంలో, తనకు కావలసిన రేటింగ్‌ను పొందగలుగుతుంది.
తాకట్టు రుణ ఆబ్లిగేషన్ (CDO) మార్కెట్‌లో వచ్చిన భారీ నష్టాలను చూసిన తర్వాత దీని పై చాలా విమర్శలు వచ్చాయి. పెద్ద పేరున్న CRAల నుంచి రేటింగ్‌లు పొందాక కూడా ఇలా జరిగింది. ప్రధాన రేటింగ్ సంస్థలు స్టాండర్డ్ అండ్ పూర్, మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మరియు ఫిచ్ గ్రూప్‌ల నుంచి AAA రేటింగ్ పొందిన తర్వాత 340.7 మిలియన్ డాలర్ల విలువైన ఆస్థులను తాకట్గు పెట్టి తాకట్టు రుణ విధానానికి వచ్చిన సుసీ గ్రూఫ్ 125 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.[4]
అయితే రేటింగ్ ఏజన్సీలు తాము ఎవరికైనా ఒక నిర్ణీత సమయం కొరకు మాత్రమే సలహాలు ఇస్తామని, తామెప్పుడూ ఎవరికీ ఎలాంటి హామీ గానీ, ట్రాంచ్ రేటింగ్‌ల గురించి ఎలాంటి నమ్మకాన్నిగానీ ఇవ్వలేదని పేర్కొన్నాయి. ఒక ట్రాంచ్‌లో రిస్క్ అంశాలు పరిస్థితుల్లో జరిగే మార్పుల వల్ల మారే అవకాశం ఉంటుందని, ఇలాంటి సందర్భాల్తో తమ విశ్లేషన తప్పుతుందని, మరోసారి ప్రత్యేకంగా క్రెడిట్ రేటింగ్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. కొన్ని CRAలు బాండ్లు గురించి రేటింగ్స్ ఇవ్వవు. ఇలాంటి సలహాలకు అవి దూరంగా ఉంటాయి.
నిర్మాణాత్మక ఆర్థిక వ్యవహారాలు విషయంలో అంశాలను మరింత క్లిష్టం చేస్తూ, రేటింగ్ సంస్థలు, రేటింగ్స్ అభిప్రాయాలు (విమర్శలకు తావు లేకుండా చూసుకునేలా, కార్పొరేషన్లలోని వ్యక్తుల వల్ల ఇవి చేస్తామని) ఇచ్చిన సెక్యూరిటీ అనుకున్న సమయంలో ఫలితాలు ఇవ్వలేకపోవడం తమ బాధ్యత కాదని తెలిపాయి. తమ అభిప్రాయాలు ఆ సెక్యూరిటీ యొక్క విలువ గురించి పేర్కొంటాయేగానీ, అందులో పెట్టుబడి పెట్టాలని సూచించవని పేర్కొన్నాయి. అన్నింటికంటే పెద్ద రేటెడ్ (AAA) రుణ సెక్యూరిటీలు తక్కువ విలువతో, ఎక్కువ లిక్విడిటీ ఉండేలా తయారు చేస్తారని, మరో మాటలో చెప్పాలంటే ఎక్కువ ధర ఉన్న బాండ్ ప్రతి రోజూ విలువను మారుస్తూ ఉండదని, ఇలాంటి బాండ్లు అమ్మాలకునేవారికి తొందరగా కొనేవాళ్లు దొరుకుతారని పేర్కొన్నాయి. ఏదేమైనా, వేల కొద్దీ ఒకే తరహా సెక్యూరిటీలను కట్టగా కట్టిన నిర్మాణాత్మక విధానాలు, ప్రమాదం కూడా ఒకేలా ఉండేలా చూశాయి. దివాళా తీస్తుందనే అంశం ఒక్క దాని విషయంలో వినిపించినా, అది మొత్తం సెక్యూరిటీల కట్టలో ఉన్న అన్నింటి మీదా పడుతుంది. దీని అర్థం ఏమిటంటే, ఒక స్ట్రక్చర్డ్ ఉత్పత్తి దివాళా తీయడానికి అవకాశం చాలా తక్కువగా ఉందని, ఒక రేటింగ్ సంస్థ సరిగానే నిర్ధారించినా, మర్కెట్‌లో ప్రమాదం గురించి అంచనాల్లో స్వల్ప మార్పులు రాగానే ఈ ఉత్పత్తి యొక్క మార్కెట్ ధర పై ప్రభావం పడుతోంది. దీని ఫలితంగా AAA రేట్ ఉన్న సెక్యూరిటీ విలువ, దాని పనితీరుతో సంబంధం లేకుండానే కుప్పకూలిపోతోంది. ఈ అవకాశం అనేక సంస్కరణ అంశాల పై చర్చించాల్సిన అవశ్యకతను బయటపెట్టింది. సెక్యూరిటీస్‌లో బ్యాంకింగ్ సంస్కరణలలో అధిక రేటింగ్స్ ఉండాలంటే, వొలాటిలిటీ తక్కువగా ఉండి, లిక్విడిటీ ఎక్కువగా ఉండాలి.
[మార్చు] విమర్శ
క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఈ కింద పేర్కొన్న విమర్శలను ఎదుర్కొంటున్నాయి:
- క్రెడిట్ రేటింగ్ సంస్థలు కంపెనీల విలువను కచ్చితంగా లెక్కించలేకపోతున్నాయి . ఉదాహరణకు, ఎన్‌రాన్స్ రేటింగ్ ఇన్‌వెస్ట్‌మెంట్ గ్రేడ్‌లో అలాగే ఉంది. కానీ నాలుగు రోజుల్లోనే కంపెనీ దివాళా తీసింది. దీనికి కారణం నెలల తరబడి కంపెనీల ఆర్థిక పరిస్థితిని రేటింగ్ సంస్థలు తెలుసుకోకపోవడం.[5][6] కొన్ని విశ్లేషణాత్మక అధ్యయనాల ప్రకారం, కార్పొరేట్ బాండ్స్‌లో సంపద విస్తరించడం ప్రారంభమయ్యే సమయానికి క్రెడిట్ నాణ్యత తగ్గిపోతోంది. రేటింగ్ తగ్గిపోతోంది. తరచుగా మార్కెట్ తగ్గిపోవడం దీనికి కారణం. ఇది క్రెడిట్ రేటింగ్స్ విలువను ప్రశ్నార్థకం చేస్తోంది.[7] ఇది ఇతర సలహాలకు దారి తీసింది. ఆర్ధిక సంస్కరణలో CRA రేటింగ్స్ పై ఆధారపడే బదులు, ఆర్ధిక సంస్కర్తలు బ్యాంక్‌లు, బ్రోకర్ డీలర్స్, మరియు భీమా సంస్థల పై తమ జాబితాలో ఉన్న అపాయాన్ని తెలుసుకోవడానికి క్రెడిట్ స్ప్రేడ్స్ ను వినియోగించటం మంచిది.
- పెద్ద కార్పొరేట్ రేటింగ్ సంస్థలు కంపెనీల యాజమాన్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటున్నాయనే విమర్శలు ఎదురవయ్యాయి. దీనివల్ల తప్పుదోవ పట్డడానికి వారి పై ప్రభావం పడుతోంది.[8] ఈ ఏజన్సీలు తరచుగా చాలా కంపెనీల్లోని మేనేజ్‌మెంట్‌లో ఉన్న వ్యక్తులను కలుస్తున్నాయి. సరైన రేటింగ్‌ను నిలబెట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నాయి. దీనికి అదనంగా, పెద్ద CRAలు ఇస్తున్న రేటింగ్స్ గురించిన సమాచారం ముందే తెలిసిపోతోంది. (నోటి ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా) CRAలు పెట్టుబడిదారుల దగ్గర్నించి కాకుండా, అప్పు జారీచేసేవారి దగ్గర నుంచి తమ చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల సరైన, నిజాయతితో కూడిన రేటింగ్స్ ఇవ్వడానికి వారి వ్యక్తిగత అవసరాలు, లాభాలు అడ్డుపడుతున్నాయి. ఇదే సమయంలో, చాలా సాధారణంగా చాలా పెద్ద ఏజన్సీలు (మూడీస్ మరియు స్టాండర్డ్ అండ్ పూర్) ప్రపంచీకరణలో ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఆంగ్లో అమెరికన్ మార్కెట్‌లో శక్తులుగానూ ఉన్నాయి. ఇది కంపెనీలు తమ క్రెడిట్ రేటింగ్‌ను ఎలా ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకునేందుకు కారణమవుతోంది. ఉద్యోగుల ఖర్చు, వాతావరణం, దీర్ఘకాలిక పరిశోధన మరియు అభివృద్ధి దీనికి ఫణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ ఆరోపణలన్నీ స్థిరమైనవి కాదు. ఒకవైపు, పెద్ద CRAలు తాము రేటింగ్ ఇస్తున్న కంపెనీలతో చాలా సన్నిహితంగా మెలుగుతుంటే, మరో వైపు కంపెనీ యొక్క చర్యల వివరణను వినడానికి కంపెనీ బాటమ్ లైన్ ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
- CRAలు ఇస్తున్న క్రెడిట్ స్కోరు తగ్గుదల విస్కాస్ సైకిల్ ను సృష్టిస్తున్నాయి. దీనివల్ల కంపెనీల వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, తదనుగునంగా ఆర్ధిక సంస్థలతో ఒప్పందాల పై ప్రభావం పడుతోంది. ఇది ఖర్చుల పెరుగుదలకు కారణం కావడంతో పాటు, రుణ విలువను తగ్గిస్తోంది. కొన్ని సందర్భాల్లో, కంపెనీలకు ఉన్న పెద్ద అప్పులలో ఒక నిబంధన చేరుతోంది. ఒక నిర్దేశిత స్థాయి కంటే కంపెనీ క్రెడిట్ రేటింగ్ పడిపోతే అప్పు మొత్తం చెల్లించాలనే నిబంధన ప్రతిబంధకంగా మారింది (సాధారణంగా పుకార్ల వల్ల, జంక్ బాండ్ రేటింగ్ వల్ల కూడా క్రెడిట్ రేటింగ్ పడిపోయే అవకాశం ఉంది). ఒకవేళ కంపెనీ దివాళా తీసే స్థితికి చేరి, కంపెనీ మీద ఉన్న డివిడెండ్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి రిసీవర్‌ను నియమిస్తే ముందుగా బ్యాంకులు కంపెనీ ఆస్థులను స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించడం, ఈ రేటింగ్ ట్రిగ్గర్స్ ఏర్పాటు చేయడానికి కారణం అయింది. ఈ రేటింగ్స్ ట్రిగ్గర్స్ యొక్క ప్రభావం, అతి దారుణమైన పరిస్థితికి కంపెనీ చేరినప్పుడే పడుతుంది. ఒకసారి కంపెనీ అప్పులను CRA డౌన్‌గ్రేడెడ్ చేస్తే, కంపెనీ అప్పుడు పూర్తి మొత్తం బాకీ ఉంటుంది. ఒకేసారి ఇన్ని అప్పులు తీర్చడం కంపెనీకి సాధ్యం కాదు కాబట్టి, అది దివాళా దరఖాస్తు దాఖలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది (ఇది "డెత్-స్పైరల్" అని పిలువబడుతుంది.) ఈ రేటింగ్ ట్రిగ్గర్స్ ఎన్‌రాన్ కుప్పకూలడానికి కారణమయ్యాయి. అప్పట్నించి, ఈ ట్రిగ్గర్స్‌ను కనుగొనడంలో పెద్ద సంస్థలన్నీ అదనపు శ్రమ తీసుకుంటున్నాయి. వాటిని వాడటాన్ని ప్రోత్సహించడం లేదు. U.S. సెక్యూరిటీస్ మరియు ఎక్స్‌ఛేంజ్ కమిషన్, ఇలాంటి విషయాలు ఉంటే బయటకు చెప్పాలని యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రభుత్వ కంపెనీలను కోరింది.
- సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆలిగోపాలిస్ట్స్ [9]గా మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌లో ప్రవేశించాలంటేనే చాలా అడ్డంకులు ఉన్నాయి. రేటింగ్ ఏజన్సీ వ్యాపారం పేరు మీద ఆధారపడి ఉంటుంది. (పెద్దగా గుర్తింపు లేని రేటింగ్ ఏజన్సీ గురించి ఆర్థిక పరిశ్రమ పెద్దగా పట్టించుకోదు). పెద్ద ఏజన్సీలలో, కేవలం మూడిస్ మాత్రమే ప్రత్యేకం, ఇది పబ్లిక్‌లో ఉన్న కార్పొరేషన్, తన ఆర్థిక ఫలితాలను నాన్ రేటింగ్ వ్యాపారాలతోనే వెల్లడించగలదు. దీని అధిక లాబాలు (అనేకసార్లు గ్రాస్ మార్జిన్‌లో 50 శాతం కంటే అధికంగా) స్థిరంగా ఉండటం వల్ల, రిటర్న్స్ అధికంగా ఇస్తుందని భావించారు. అడ్డంకులు ఉండే పరిశ్రమలోనూ దీనికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు.
- క్రెడిట్ రేటింగ్ సంస్థలు నిర్మాణాత్మక ఉత్పత్తుల రేటింగ్ అంచనా వేయడంలో తరచుగా తప్పులు చేస్తున్నాయి . ఒక నిర్మాణాత్మక అప్పుకు AAA రేటింగ్ ఇచ్చే విషయంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల తర్వాతి క్రమంలో అనేక డౌన్‌గ్రేడ్, డీఫాల్ట్‌లు జరుగుతున్నాయి. మూడి కంపెనీ CDOలను రేట్ చేసిన అసలు పద్దతి సమగ్ర అధ్యయనానికి వచ్చింది. నష్టపోయే రకాలు మధ్యవర్తితో పాటు నష్టపోయే సమాచారం ఇస్తున్నాయి. రేటింగ్స్ అంశాలు నిజమైన స్థాయికి కంటే తక్కువగా పోలుస్తూ పక్షపాత ధోరణితో చూపిస్తున్నారు. మూడిస్ పద్దతి సగటు నష్టాలను సరైన పద్దతిలో అంచనా వేయలేకపోతోంది. CDOల నుంచి అత్యధిక రిటర్న్‌లు వస్తాయని తప్పుగా చూపుతున్నారు. దీని వల్ల పెట్టుబడిదారుల పై రేటింగ్ ఏజన్సీస్ బాగా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.[10]. ఆధునిక CRA వ్యవస్థలో నాణ్యమైన రేటింగ్స్ చూపించడానికి రేటింగ్ ఏజన్సీస్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీనివల్ల అనేక బ్యాంకులు నష్టపోతున్నాయి. తమ నిర్మాణాత్మక ఆస్థుల విలువ యొక్క రేటింగ్ పై ఆధారపడి ఉన్న బ్యాంక్‌లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.[11][12][13] AAA రేటెడ్ తనఖా సెక్యూరిటీలను ఒక డాలరు విలువ ఉన్న వాటిని 80 సెంట్లకు అమ్మాల్సి వస్తోంది. దీని వల్ల 20 శాతం వరకూ డీఫాల్ట్ అయ్యే అవకాశం ఏర్పడినట్లే మరియు 8.9 శాతం AAA రేటెడ్ నిర్మాణాత్మక CDOలు ఫిచ్ ద్వారా డౌన్‌గ్రేడ్ చేయబడ్డాయి. దీనివల్ల సగటున BB నుంచి BBBకి రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. పునః అంచనాలో ఈ స్థాయులు AAA రేటెడ్ బాండ్ల విషయంలో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇవి US ప్రభుత్వ బాండ్లతో పాటు సమాన రేటింగ్‌క కలిగి ఉన్నాయి.[14][15]. చాలా రేటింగ్ సంస్థలు నిర్మాణాత్మక ఫైనాన్స్‌లో AAA రేటింగ్‌కు, కార్పొరేట్ లేదా ప్రభుత్వ బాండ్లలో AAA రేటింగ్‌కు మధ్య తేడాను చూపించలేకపోతున్నాయి. AIG లాంటి చాలా బ్యాంక్‌లు, తమ CDO జాబితాలో డౌన్‌గ్రేడ్ సమయంలో తమ పెట్టుబడిలో నిల్వలు ఉంచుకోకుండా తప్పులు చేస్తున్నాయి. బేసెల్ 2 ఒప్పందం నిర్మాణం ప్రకారం, CDOల యొక్క పెట్టుబడి అవసరం విస్తృతంగా ఉండాలి. ఇది CDOల పోర్ట్‌ఫోలియోల విలువను అనేక స్థాయిల్లో విలువను పెంచింది. దీంతో వీటిని లార్జ్ మార్జిన్ కాల్స్ అంటున్నారు. ఉదాహరణకు బేసెల్ II ప్రకారం, AAA రేటెడ్ సెక్యూరిటైజేషన్ చేయడానికి పెట్టుబడిలో కేవలం 0.6 శాతం కేటాయింపులు సరిపోతాయి. BBBలో 4.8 శాతం, BBలో 34 శాతం, BB(-)లో 52 శాతం వరకూ పెట్టుబడి కేటాయింపులు ఉండాలి. అనేక కారణాల వల్ల, చాలా మంది సంస్తాగత పెట్టుబడిదారులు రేటింగ్ ఏజన్సీల మీద సొంతగా ఆధారపడుతున్నారు. సొంత విశ్లేషణలు చేసి రిస్క్‌ను అంచనా వేసే బదులు ఇదే ఉత్తమమని భావిస్తున్నారు. (ఉదాహరణకు కొన్ని CDOలను విశ్లేషణ చేయడం వ్యక్తులకు కష్టం. CDO నిర్మాణంలో 51 అంశాలు నగదుకు సంబంధించి, మరో 129 అంశాలు నిర్మాణానికి సంబంధించి ఉంటాయి. మొత్తం 180 కాంట్రాక్టులకు CDSలో 1.4 బిలియన్ డాలర్ల సంస్థలు ఉన్నాయి. ఇందులో 40 ఉదాహరణగా తీసుకుంటే, సంస్థలో సగటున 6500కు పైగా రుణాలు ఉంటాయి. మొత్తం 180ని కలిపి పరిగణనలోకి తీసుకుంటే అవి 1.2 మిలియన్ల రుణాలు ఉంటాయి. కాబట్టి విశ్లేషణ చేయడం కష్టం). పిమ్‌కో వ్యవస్థాపకుడు విలియమ్ గ్రాస్ పెట్టుబడిదారులను, రేటింగ్ సంస్థల యొక్క తీర్పులను పట్టించుకోవద్దని కోరారు. ఆయన వీటిని లెక్కల గురించి తెలిసి, వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియని, ఒక పనికిమాలిన సంస్థలుగా అభివర్ణించారు.[16]
- రేటింగ్ సంస్థలు, ముఖ్యంగా ఫిచ్, మూడిస్ మరియు స్టాండర్డ్ అండ్ పూర్‌లు క్వాజి సంస్కర్తల పాత్ర పోషించేందుకు ప్రభుత్వం నుంచి అనమతి పొందాయి. కానీ ఇవి లాభం కోసం ఏర్పాటైన సంస్థలు, వారికి వచ్చే లాభాలు తప్పుగా నిర్ధారించారు. సెక్యూరిటీస్ విడుదల చేయడం కోసం కంపెనీలు రేటింగ్ సంస్థలకు డబ్బు చెల్లించడంలోనే అసలు సమస్యలు వస్తున్నాయి. పెట్టుబడిదారుల తరఫున విజిలెంట్ ఏజన్సీలకు ఇన్‌సెంటివ్ కాదన్న నిర్ణయం పెద్ద వివాదానికి దారితీసింది. మార్కెట్‌లో ఉన్న చాలా మంది పెట్టుబడిదారులు ఎక్కువ కాలం క్రెడిట్ రేటింగ్ సంస్థల పై ఆధారపడటం లేదు. 2007-08 ఆర్థిక మాంద్యం కంటే ముందు నుంచే ఇది జరిగింది. క్రెడిట్ వ్యాప్తిని ప్రధాన గుర్తుగా వాడుకునే బదులు ట్రెజరీస్‌ను లేదా సూచికలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. ఏదేమైనా, ఫెడరల్ రిజర్వ్, స్ట్రక్చరల్ సంస్థలు కనీసం రెండు లేదా మూడు సంస్థల నుంచి రేటింగ్ తెచ్చుకోవాలని చెప్పడటంతో, చేసేది ఏమీ లేక ఆ పని చేయాల్సి వస్తోంది.
- నిర్మాణాత్మక ఉత్పత్తుల్లో అనేకం రేటింగ్‌కు కారణం అవుతున్నాయి. తక్కువ నాణ్యత ఉన్న BBB రేటెడ్ రుణాలు కలిగి ఉంటున్నాయి. కానీ ఒకసారి CDOగా కలిసిపోయినప్పుడు, AAA రేటింగ్‌ను పొందుతున్నాయి. CDOల బలం అంతరంగా ఉన్న రుణాల పై పూర్తిగా ఆధారపడి లేదు. కానీ CDOల నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతి ప్రశ్నార్థకం. CDOలు సహజంగా వాటర్‌ఫాల్ తరహాలో చెల్లించడతాయి. ఇక్కడ తొలుత స్వీకరించిన ఆదాయం, ఎక్కువ విలువ ఉన్న ట్రెంచ్‌కు ముందు చేరుతుంది. మిగిలిన ఆదాయం తక్కువ నాణ్యత ఉన్న ట్రెంచ్ (ఎఎఎకంటే తక్కువ)లకు క్రమంగా చేరుతుంది. CDOల నిర్మాణం చాలా సంక్లిష్టంగా జరుగుతుంది. AAA ట్రాంచెస్‌కు, BBB రేటెడ్ ద్రవ్య ప్రవాహం కంటే ముందు క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది. అదే నష్టాలు ఎదురైతే, తక్కువ నాణ్యత ఉన్న ట్రెచెస్ నుంచి ముందు తీసుకుంటారు. సొంత దారు నష్టపోయినప్పుడు కూడా డబ్బు ప్రవాహం విషయంలో ఎక్కువ స్థాయిలో వీటికి ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ హౌసింగ్ ధరల్లో క్రెడిట్ రేటింగ్ సంస్థలు అతి తక్కువగా కేవలం 5 శాతం తగ్గుదలను మాత్రమే చూశారు. దీనివల్ల రేటింగ్ విషయంలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ CDOల్లో రుణ నాన్యతలు ఎక్కువగా AAA వలె ఉన్నాయి. ఇది ఫైనాన్షియల్ సంస్థలకు, క్రెడిట్ సంస్థలకు మధ్య సంబంధాలను పెంచలేకపోయింది. తమ దగ్గర ఉన్న CDOలకు మంచి రేటింగ్ వచ్చే వరకూ ప్దె ఏజన్సీలు మూడు ఒకదాని తర్వాత ఒకదానికి రేటింగ్‌లు ఇస్తూ పోయాయి. కోరుకున్న రేటింగ్, సాధారణంగా AAA వచ్చే వరకూ కనిష్ట ప్రమాణాలను పాటించటానికి రుణాలను కలుపుతూ, తీస్తూ పోయారు. తరచుగా ఇలాంటి రేటింగ్‌ల మీద ఫీజు 3 లక్షల నుంచి 5 లక్షల డాలర్ల వరకూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో 1 మిలియన్ డాలర్లు వరకూ వెళ్లింది. [1]
- క్రెడిట్ సంస్థలు సావరీన్ క్రెడిట్ రేటింగ్స్‌ను ఇవ్వడంలో వివాదంలో ఉన్నట్లు తెలుసుకోవచ్చు. వీటికి రాజకీయ తాయిలాలు వస్తుండటంతో, గట్టి నిబంధనలను పాటించాల్సిన అవసరం లేకుండా పోయింది. వారు నియంత్రించగలిగిన విషయాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా అంచనా వేయటంలో విఫలమయ్యాయి.[17]
2002 సార్‌బేనెస్ - ఓక్స్‌లీ చట్టం ప్రకారం, కాంగ్రెస్ U.S. SECని ఒక నివేదిక అభివృద్ధి చేయమని చెప్పింది. దీని టైటిల్ రిపోర్ట్ ఆన్ ది రోల్ అండ్ ఫంక్షన్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఎజన్సీస్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్. ఇందులో క్రెడిట్ రేటింగ్స్ U.S. సంస్కరణలో మరియు దాని విధాన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు తెస్తున్నాయో తెలపాలని సూచించింది. 2003 జూన్‌లో ఈ నివేదిక ఫలితంగా పాక్షికంగా, కాన్సెస్ట్ రిలీజ్ అని పిలిచే రేటింగ్ ఏజన్సీస్ అండ్ ది యూజ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్స్ అండర్ ద ఫెడరల్ సక్యూరిటీస్ లాస్ అనే ఒక ప్రచురణను SEC చేసింది. ఇది అనేక అంశాల పై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ కామెంట్స్ అనే కాన్సెప్ట్‌తో దీనిని విడుదల చేసింది. దీనిని SEC యొక్క వెబ్‌సైట్‌లోనూ ప్రచురించారు.
2004 డిసెంబరులో, అంతర్జాతీయ సెక్యూరిటీస్ కమిషన్ సంస్థ (IOSCO) CRAల కోసం కోడ్ ఆఫ్ కండక్ట్ (నిబంధనావళి)ని ప్రచురించింది. ఇందులో CRAలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి ప్రస్తావన ఉంది. అన్ని పెద్ద CRAలు ఈ నిబంధనావళి పై సంతకాలు చేయడానికి అంగీకరించాయి. U.S. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌లోని యూరోపియన్ కమిషన్ దీనిని ప్రశంసించింది.
[మార్చు] మరింత చదవటానికి
- క్రెడిట్ సంస్థల చరిత్ర మరియు మూలాల గురించి తెలుసుకోవడానికి బార్న్ లూజర్స్: ఎ హిస్టరీ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ అమెరికా చూడండి. దీనిని స్కాట్ ఎ సాండేజ్ (హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 2005) రాశారు, అధ్యాయాలు 4-6.
- సమకాలీన డైనమిక్స్ మీద, టిమోతి జె. సింక్లెయిర్ రాసిన, ద న్యూ మాస్టర్స్ ఆఫ్ క్యాపిటల్; అమెరికన్ బాండ్ రేటింగ్ ఏజన్సీస్ అండ్ ద పొలిటికల్ క్రెడిట్ వర్తీనెస్ ను చూడొచ్చు (ఇతాక, NY: కార్నెల్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం, 2005).
- కార్పొరేట్ అంశంలో CRAలు ఏం చేస్తున్నాయనే వివరణ కోసం చూడండి, IOSCO రిపోర్ట్ ఆన్ ద యాక్టివిస్ట్స్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజన్సీస్ మరియు IOSCO స్టేట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ రిగార్డింగ్ ద యాక్టివిస్ట్స్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజన్సీస్.
- ప్రస్తుత ఇస్యూయర్ పేస్ యొక్క పరిధులు, వ్యాపార మోడల్ కోసం చూడండి, కెనెత్ సి కెటెరింగ్ యొక్క సెక్యూరైజేషన్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్; ద డైనమిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, 29 CDZLR 1553, 60 (2008).
- CRA యొక్క బిజినెస్ మోడల్లో మారిన విధానం కోసం, విన్సెంట్ ఫాబి; ఎ రెస్క్యూ ప్లాన్ ఫర్ రేటింగ్ ఏజన్సీస్, బ్లూ స్కై - న్యూ ఐడియాస్ ఫర్ ద ఒబామా అడ్మినిస్ట్రేషన్ చూడండి: http://ideas.berkeleylawblogs.org/2009/04/19/a-rescue-plan-for-rating-agencies/.
- ఫ్రాంక్ జె ఫాబజ్జి అండ్ డెన్నిస్ వింక్ (2009). ఆన్ సెక్యూరిటైజేషన్ అండ్ ఓవర్ రిలయన్స్ ఆన్ క్రెడిట్ రేటింగ్స్. యేల్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్స్
- రేటింగ్ సంస్థల వ్యాపార తరహాపై ప్రభావం గురించి థియరీ విశ్లేషణను చూడండి, రేటింగ్ ఏజన్సీస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రెగ్యులేషన్ - రేటింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్, బై ఆప్. క్రిస్ట్రియన్ సి. ఆప్ మార్కస్ ఎం. అండ్ హారిస్, మిల్టన్ (2010).
[మార్చు] సూచనలు
- ↑ Teather, David. "SEC seeks rating sector clean-up | Business", The Guardian, 28 January 2003. Retrieved on 10 May 2009.
- ↑ 2.0 2.1 Leone, Marie. "Bush Signs Rating Agency Reform Act", CFO (Magazine), 2 October 2006. Retrieved on 9 May 2009.
- ↑ Jonathan S. Sack and Stephen M. Juris (2007). "Rating Agencies: Civil Liability Past and Future" (PDF). New York Law Journal 238 (88). Retrieved on 9 May 2009.
- ↑ Tomlinson, Richard. "CDOs mask huge subprime losses, abetted by credit rating agencies", 1 June 2007.
- ↑ Borrus, Amy. "The Credit-Raters: How They Work and How They Might Work Better", 8 April 2002.
- ↑ Wyatt, Edward (8 February 2002). Credit Agencies Waited Months to Voice Doubt About Enron ([dead link] – Scholar search).
- ↑ చూడుము, అక్కువుగా , క్లిగర్, D. మరియు O. శరిగ్ (2000), ది ఇంఫర్మేషన్ వాల్యు అఫ్ బాండ్ రేటింగ్స్ , జోర్నల్ అఫ్ ఫైనాన్స్, డిసెంబర్: 2879-2902 మరియు గలిల్, కోరేష్ (2003). ది క్వాలిటీ అఫ్ కార్పోరేట్ క్రెడిట్ రేటింగ్: యాన్ ఏమ్పరికల్ ఇన్వెస్టిగేషన్ . EFMA 2003 హెల్సింకి మీటింగ్స్. యురోపియాన్ ఫైనాన్షియల్ మానేజ్మెంట్ అస్సోసియేషన్.
- ↑ Partnoy, Frank (2006). "How and why credit rating agencies are not like other gatekeepers", in R. E. Litan & Y. Fuchita: Financial gatekeepers: Can they protect investors?. Brookings Institution.
- ↑ "Measuring the measurers", 31 May 2007.
- ↑ Wadden IV, William "Biv". "Interpreting Moody’s Historical Default Rate Data".
- ↑ Norris, Floyd. "Being Kept in the Dark on Wall Street", The New York Times, 2 November 2007. Retrieved on 30 April 2010.
- ↑ Buiter, Willem. "Basel II: back to the drawing board?", 21 September 2007.
- ↑ Kerr, Duncan (18 October 2007). Banks learn to reprice risk in post-crisis credit market. ISBN 2448964990.
- ↑ Fitch Completes Review of All Fitch-Rated SF CDOs; Places $36.8B on Rating Watch Negative. Fitch Ratings. తీసుకొన్న తేదీ: 10 May 2009.
- ↑ "Credit markets | CDOh no! | Economist.com", Economist.com<!, 8 November 2007. Retrieved on 10 May 2009.
- ↑ "Buffett and the Ratings Cartel", The Wall Street Journal, 2 June 2010. Retrieved on 21 June 2010.
- ↑ విల్ ఫైనాన్షియల్ రేఫోరం నెగిటివ్లీ బయాస్ U.S. సోవరిన్ క్రెడిట్ రేటింగ్స్?, Thoughtsworththinking.net, మే 21, 2010, http://www.thoughtsworththinking.net/2010/05/will-financial-reform-negatively-bias-us-sovereign-credit-ratings/.
[మార్చు] బాహ్య లింకులు
- "స్పాట్లైట్ ఆన్ నేష్ణల్లీ రికగ్నైజేడ్ స్టేటస్టికల్ రేటింగ్ ఓర్గనైజేషన్స్ (NRSROs)", సెక్యురిటీస్ అండ్ ఏక్ష్చేంజ్ కమిషన్
- క్రెడిట్ రేటింగ్ అజేన్సి టాస్క్ ఫోర్స్ , SIFMA