క్రైస్ట్ ద రిడీమర్ (శిలా విగ్రహం)
| Christ the Redeemer క్రైస్ట్ ద రిడీమర్ |
|
|---|---|
| దగ్గరి నగరం | Rio de Janeiro, Brazil |
| వ్యవస్థాపన | Dedicated October 12, 1931 Consecrated October 12, 2006 ప్రపంచంలోని కొత్త ఏడు అద్భుతాలు July 7, 2007 |
క్రైస్ట్ ద రిడీమర్ అనేదిమూస:Lang-pt బ్రెజిల్‌లోని రియో డి జనైరోలో ఉన్న యేసుక్రీస్తు విగ్రహం. ప్రపంచంలోనే దీనిని అతిపెద్ద రెండో ఆర్ట్ డెకో విగ్రహంగా పరిగణిస్తున్నారు.[1] [2]9.5 మీటర్ల (31 అడుగుల)మూస:39.6 ft పెడస్తల్ తో పాటుగా ఈ విగ్రహం పొడవు మరియు మూస:30 ft వెడల్పు ఉంది. దీని బరువు 635 టన్నులు. టిజూకా ఫారెస్ట్ నేషనల్ పార్క్‌లో ఉన్న కార్కోవాడో పర్వతం పైన ఉందిమూస:700 ft. ఈ పర్వతం పై నుంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. ఇది క్రైస్తవ మతానికి గుర్తుగా, రియో మరియు బ్రెజిల్‌లకు చిహ్నంగా మారిపోయింది.[3] ఈ విగ్రహం తయారీలో కాంక్రీట్, సోప్‌స్టోన్‌లను ఉపయోగించారు. 1922 మరియు 1931 మధ్యలో దీనిని నిర్మించారు.[1][4][5]
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
కార్కొవాడో పర్వతం పై ఇంత పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాలన్న ఆలోచన 1850ల మధ్యకాలంలో వచ్చింది. కేథలిక్ మత బోధకుడు పెడ్రో మరియా బాస్, మతపరమైన ఈ విగ్రహాన్ని తయారుచేయడానికి యువరాణి ఇజేబుల్‌ని ధనసహాయం అడిగాడు. యువరాణి ఇజేబుల్ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1889లో ఈ ప్రతిపాదనను రద్దుచేసింది. బ్రెజిల్ ఎప్పుడైతే చట్టాలతో కూడిన గణతంత్ర రాజ్యంగా అవతరించిందో, అప్పటి నుంచి చర్చ్ మరియు రాజ్యం విడిపోయాయి.[6] ల్యాండ్‌మార్క్ లాంటి ఈ విగ్రహాన్ని పర్వతం పై ఏర్పాటు చేయాలని రియోలోని కేథలిక్ వర్గమంతా కలిసి 1921లో రెండోసారి ప్రతిపాదించింది.[7] విగ్రహం నిర్మాణానికి మద్దతుగా విరాళాలు మరియు సంతకాల సేకరణ కోసం Semana do Monumento ("మాన్యుమెంట్ వీక్") అనే కార్యక్రమాన్ని నిర్వహించిందీ వర్గం. బ్రెజిల్‌లోని కేథలిక్కుల నుంచే ఎక్కువగా విరాళాలు వచ్చాయి.[1] క్రీస్తు విగ్రహం నిర్మాణం కోసం చాలా నమూనాలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో క్రైస్తవ మతానికి ప్రతిగా ఉండే శిలువ ఆకారంలో నమూనా, చేతిలో గ్లోబ్ పట్టుకున్న క్రీస్తు విగ్రహం, ప్రపంచాన్ని ప్రతిబింబించేలా, విగ్రహాన్ని నిలపడానికి ఆధారమైన బేస్‌మెంట్ కూడా ఉన్నాయి.[8] వీటిలో చేతులు చాచి ఉన్న క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహాన్ని ఎంపిక చేశారు. దీనిని శాంతికి చిహ్నంగా కూడా భావిస్తారు. విగ్రహం పై పక్షులు వాలకుండా ఉండేలా, వాటి నుంచి రక్షణ పొందేలా, విగ్రహం పైభాగంలో చిన్న చిన్న ముళ్ళు ఏర్పాటు చేశారు.
స్థానిక ఇంజనీర్ అయిన హెయ్‌టార్ ద సిల్వ కోస్తా, ఈ విగ్రహా నమూనా తయారు చేశాడు. పాల్ లాండోస్కీ అనే ఫ్రెంచ్ శిల్పి దీనిని తయారుచేశాడు.[1][9] లాండోస్కీ ఇచ్చిన ప్రతిపాదనలను, ఇంజినీర్లు సాంకేతిక నిపుణులతో కూడిన బృందం అధ్యయనం చేసింది. స్టీలుకు బదులుగా రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఆల్బర్ట్ కేకట్ దీనికి రూపకర్త)ను, ఈ క్రాస్‌షేపుడ్ విగ్రహ తయారీకి వాడాలని నిర్ణయం తీసుకున్నారు.[6] ఉపయోగించడానికి సులభంగా అత్యంత నాణ్యంగా ఉండే సోప్‌స్టోన్‌తో విగ్రహం బాహ్యనిర్మాణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు.[4] దీని నిర్మాణానికి 1922 నుంచి 1931 వరకు, అంటే తొమ్మిదేళ్లు పట్టింది. ఈ విగ్రహం తయారీకి 2,50,000 అమెరికా డాలర్లు ఖర్చయింది. (2009 ప్రకారం చూస్తే అది 3.5 మిలియన్ల అమెరికా డాలర్లు) ఈ విగ్రహం 1931 అక్టోబర్ 12న ప్రారంభమైంది.[4][5] రేడియో పయనీర్ గుగ్లీమో మార్కోనీ ద్వారా ఈ విగ్రహానికి బ్యాటరీ ఫ్లడ్లలైట్లతో లైటింగ్ సదుపాయం కల్పించారు. దీని స్టేషన్ km రోమ్‌కి దూరంగా ఉంటుంది. కాని వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, రియోలోని పనివాళ్లు వీటిని ఆపరేట్ చేస్తారు.[7][6]
2006 అక్టోబర్‌లో ఈ విగ్రహం 75 వార్షికోత్సవంలో రియోకు చెందిన ఆర్చి బిషప్ కార్డినల్ యుసేబియో ఆస్కార్ షీద్, (బ్రెజిల్ యొక్క పేట్రన్ సెయింట్ పేరుమీదుగా- నొస్సా సెన్‌హోరా అపరెకిడా లేదా అవర్ లేడీ ఆఫ్ ద అప్పరిషన్)విగ్రహం కింది ప్రాంతాన్ని ప్రార్థనా స్థలంగా పరిగణించాడు. దీనివల్ల కేథలిక్కుల బాప్టిజానికి, వివాహ కార్యక్రమాలకు అవకాశం లభిస్తుంది.[5]
ఫిబ్రవరి 10, 2008 ఆదివారంనాడు విద్యుత్ సరఫరాలో తేడా వల్ల చేతి వేళ్ళు, తల, కనుబొమ్మల భాగాలలో విగ్రహం దెబ్బతింది. విగ్రహం బాహ్య తయారీలో ఉపయోగించిన సోప్‌స్టోన్ లేయర్స్‌లో కొన్నింటిని కొత్తవాటితో భర్తీ చేయడానికి మరియు విగ్రహం పైభాగంలో ఉన్న విద్యుత్ వెలుగులు ప్రసరింపచేసే స్తంభాలను మరమ్మతు చేయడానికి, రియో డి జనేరియో ప్రభుత్వం మరియు ఆర్క్‌డియోసిజ్ కలిసి విగ్రహ పునర్నిర్మాణ పనులు చేపట్టాయి.[10][11][12]
2010 ఏప్రిల్ 15న విగ్రహం తల మరియు కుడిచేతి పై గ్రాఫిటీని స్ప్రే చేశారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే దాన్ని జాతి వ్యతిరక నేరంగా పరిగణిస్తామని మేయర్ ఎడ్యుర్డో పాస్ చెప్పారు. ఎవరైనా దీనికి సంబంధించిన సమాచారం ఇస్తే 10,000 డాలర్ల బహుమతితో పాటు నేరానికి పాల్పడినవారిని శిక్షిస్తామన్నారు.[13][14] అసలీ పని చేసింది ఇళ్లకు రంగులు వేసే పాలో సౌజా దాస్ సాంటోస్ అనే పెయింటరని మిలటరీ పోలీసులు గుర్తించారు.
ప్రపంచపు ఏడు కొత్త వింతలు [మార్చు]
ప్రపంచపు ఏడు కొత్త వింతల్లో ఒకటిగా జూలై 7, 2007న క్రైస్ట్ ది రిడీమర్ పేరు నమోదు చేసుకుంది. ఈ జాబితాని స్విట్జర్లాండ్‌కి చెందిన ది న్యూ ఓపెన్ వరల్డ్ కార్పొరేషన్ రూపొందించింది.[15] తొలి ఏడు పేర్లలో ఒకటిగా దీనికి ఓట్లు వచ్చేలా, కార్పొరేట్ స్పాన్సర్లయిన బాన్కో బ్రాడెస్కో మరియు రెడె గ్లోబోలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి.[16]
పునరుద్దరణ [మార్చు]
2009లో నేషనల్ హెరిటేజ్ ఇనిస్టిట్యూట్, IPHAN వాళ్లు దీనిని రక్షిత శిల్పంగా ప్రకటించారు. 1980లో పోప్ జాన్‌పాల్ II సందర్శించడానికి ముందు క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహానికి పునర్నిర్మాణ చర్యలు చేపట్టారు.
రియో డి జనైరోకు చెందిన ఆర్క్‌డియోసీజ్, మీడియా కంపెనీ అయిన రెడె గ్లోబో, చమురు సంస్థ అయిన షెల్ డు బ్రాసిల్, పర్యావరణ పరిరక్షకురాలైన IBAMA, నేషనల్ హెరిటేజ్ సెక్రటేరియట్ SPHAN, రియో డి జనైరో యొక్క ప్రభుత్వం మధ్య ఒప్పందం మేరకు, 1990లో మిగిలిన పునర్నిర్మాణ పనులను చేపట్టారు.
విగ్రహానికి సంబంధించిన మరింత పనిని 2003లో మరియు 2010 తొలినాళ్లలో చేపట్టారు. 2003లో విగ్రహం పరిసరాల్లో నడిచే మార్గాలతో పాటు కొన్ని ఎస్కలేటర్లు మరియు ఎలివేటర్లను సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు.
మైనింగ్ కంపెని వాలే మరియు ఆర్క్‌డియోసీజ్ లు భాగస్వాములుగా 2010లో ఈ విగ్రహానికి 4 నెలల పునర్నిర్మాణ పనులు చేపట్టారు.[17][citation needed] విగ్రహం మరింత కొత్తగా కనిపించేలా విగ్రహం అంతర్గత నిర్మాణాన్ని పునరుద్దరించారు మరియు విగ్రహం వెలుపలి భాగంలో ఉన్న సోప్‌స్టోన్ మెజాయిక్ కవరింగ్‌ని మార్చారు. దీనికున్న చిన్నపగుళ్లను మరమ్మతు చేయడంతో పాటు శైవలాల తెట్టులను మరియు ఇతర సూక్ష్మక్రిములను తొలగించారు. విగ్రహం తల మరియు చేతుల్లో ఉన్న లైటెనింగ్ రాడ్స్‌ని మరమ్మతు చేశారు.
ఈ పునరుద్దరణ పనుల్లో వందమంది పాల్గొన్నారు. విగ్రహం అసలు కొలతలకు సరిపడేలా 60 వేల రాతిఫలకాలను ఉపయోగించారు.[17] 2010 ఫిఫా ప్రపంచ కప్ లో ఆడుతున్న బ్రెజిల్ జాతీయ ఫుట్ బాల్ జట్టుకు మద్దతుగా విగ్రహానికి ఆకుపచ్చ మరియు పసుపుపచ్చ రంగుల్లో లైటింగ్ ను ఏర్పాటు చేశారు.[17]
బలమైన గాలులు మరియు వర్షాల వల్ల కాలానుగుణంగా విగ్రహానికి సంబంధించి నిర్వహణ పనులను చేయాల్సిన అవసరముంది.[18]
కల్పితగాధాలలో చిత్రీకరణ [మార్చు]
మీడియాలో మరియు కల్పిత కథల్లో క్రైస్ట్ ది రిడీమర్ ను ప్రస్తావిస్తారు. 2012 సినిమాలో ఈ భారీ విగ్రహం కూలిపోయే సన్నివేశాలున్నాయి. టామ్ క్లాంకీ యొక్క H..A..W.X. , డ్రైవర్2 , ట్రొపికో 3, w:en:Call of Duty: Modern Warfare 2 , w:en:OSS 117: Lost in Rio , w:en:Civilization IV: Beyond the Sword , మరియు సివిలైజేషన్ V వీడియోగేమ్స్‌లో దీని ప్రస్తవన ఉంది. జానెట్ జాక్సన్ యొక్క "రన్‌వే" అనే వీడియోలో మరియు లాటిన్ గ్రూప్ విజిన్ & యాండిల్స్ యొక్క "పామ్ పామ్" వీడియోలోనూ దీనిని చూడొచ్చు.
వీటిని కూడా చూడండి [మార్చు]
- క్రిస్టో రిడెంటోర్, క్రైస్ట్ ది రిడీమర్ ఆఫ్ మరాటీ, ఇటలీ
- క్రిస్ట్ ఆఫ్ ఉంగ్ తావ్ ఇన్ వియత్నాం (32 m)
- క్రిస్టో-రియో ఇన్ పోర్చుగల్: ఎ 28 మీటర్‌హై రెప్లికా ఆఫ్ క్రైస్ట్ ది రిడీమర్
- క్రిస్టో రియో ఆఫ్ డిల్లీ: ఎ 27 మీటర్ హై స్టాట్యూ ఇన్ డిల్లీ, టిమోర్ లిస్టే
- సెర్రో డెల్ క్యుబిలెట్ ఇన్ గౌనాజూటో, మెక్సికో: 23 మీటర్ హై స్టాట్యూ ఇన్‌స్పైర్‌డ్ బై క్రైస్ట్ రిడీమర్
- క్రిస్టో రె ఇన్ ఇజుట్లా, జలిస్కో బై రియో డి జనైరోస్ వన్
- క్రైస్ట్ ఆఫ్ ది ఓజార్క్స్ ఇన్ ఆర్కాన్సాస్, యుఎస్‌ఏ: ఎ 20 మీటర్ హై స్టాట్యూ ఇన్‌స్పైర్‌డ్ బై క్రైస్ట్ రిడీమర్
- క్రైస్ట్ ఆఫ్ హవానా ఇన్ హవానా, క్యూబా: ఎ 20 మీటర్ హై స్టాట్యూ ఇన్‌స్పైర్‌డ్ బై క్రైస్ట్ రిడీమర్
- క్రైస్ట్ ది రిడీమర్ ఆఫ్ ద ఆండిస్ (అర్జెంటీనా/చిలీ)
- క్రిస్టో డి లా కాన్‌కార్డియా ఇన్ కోచబాంబ, బొలీవియా
- క్రిస్టో బ్లాంకో ఇన్ కుజ్‌కో, పెరూ
- క్రిస్టో డి లాస్ నోవాస్ ఇన్ టొర్రాయిన్, మెక్సికో
- క్రైస్ట్ ఆఫ్ ద అబిస్ ఇన్ వేరియస్ అండర్‌వాటర్ లొకేషన్స్
- క్రిస్టో రెడెంటర్ డెల్ టియడ్, టెనెరైఫ్, కెనరీ ఐలాండ్స్, స్పెయిన్
- క్రైస్ట్ ద కింగ్,(Pomnik Chrystusa Króla)33 ft[19] టాల్ అండ్ వెయింగ్ 440 టన్స్. ఇన్ స్విబాడ్జిన్, పోలాండ్
సూచనలు [మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 "Christ the redeemer", TIME, 1931-10-26. Retrieved on 2007-07-11.
- ↑ "How big is Jesus?", Guardian.co.uk, 2010-10-28. Retrieved on 2010-11-06.
- ↑ "The new Seven Wonders of the world". Hindustan Times. 2007-07-08. Retrieved 2007-07-11.
- ↑ 4.0 4.1 4.2 "Brazil: Crocovado mountain - Statue of Christ". Travel Channel. Retrieved 2007-07-07.
- ↑ 5.0 5.1 5.2 "Sanctuary Status for Rio landmark", BBC, 2006-10-13. Retrieved on 2007-07-07.
- ↑ 6.0 6.1 6.2 "O Dia Online - Cristo Redentor".
- ↑ 7.0 7.1 "Cristo Redentor - Histórico da Construção" (in Portuguese).
- ↑ Victor, Duilo. "Redentor, carioca até a alma", Jornal do Brasil. Retrieved on 2008-07-17. (in Portuguese)
- ↑ Phillip, Martin. "Vote now for Phonehenge", The Sun, 2007-06-29.
- ↑ "Cristo Redentor vai passar por restauração até junho (Christ the Redeemer under restoration 'til June)", Estadão.
- ↑ Moratelli, Valmir. "Cristo Redentor, castigado por raios, passa por ampla reforma (Christ the Redeemer, punished by lightnings, go by ample refit)", Último Segundo.
- ↑ "["Cristo Redentor renovado para 2010" www.obras.rj.gov.br/boletins/Boletim_Dezembro_2009.pdf "Cristo Redentor renovado para 2010"]", Rio de Janeiro Government, 2010-Dec.
- ↑ "Vandals cover Rio's Christ statue with graffiti", Reuters, 2010-04-16.
- ↑ Tabak, Bernardo. "Estátua do Cristo Redentor é alvo de pichação", Globo.
- ↑ "Global vote picks Seven Wonders. It was drew by Carlos Oswald, whose family still lives in Rio and apreciate a lot his work.", BBC News, 2007-07-07. Retrieved on 2007-07-10.
- ↑ Dwoskin, Elizabeth. "Vote for Christ", 2007-07-09. Retrieved on 2007-12-21.
- ↑ 17.0 17.1 17.2 "Brazil's Christ statue returns after renovation", 1 July 2010. Retrieved on 1 July 2010.
- ↑ మూస:Cite uhbubybybynews
- ↑ "Rio wschodu". 2009-01-29. Retrieved 2010-11-04.
బాహ్య లింకులు [మార్చు]
- అధికారిక వెబ్సైట్
- క్రైస్ట్ ద రిడీమర్ స్టాట్యూ గురించి ఉపయోగకరమైన సమాచారం(వికీ ఫార్మాట్)
- పటం
- పోలాండ్ మరియు ద రిడీమర్ స్టాట్యూ గురించి BBC న్యూస్ వీడియో
- గవర్నమెంట్ బుల్లెటిన్ అబౌట్ ద స్టాట్యూస్ రెస్టోరేషన్
- ఫ్రీ ఇంటరాక్టివ్ ౩డ్ మోడల్ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ క్రైస్ట్ ద రిడీమర్
|
|||||
- All articles with unsourced statements
- Articles with unsourced statements from July 2010
- Articles with invalid date parameter in template
- మౌంటైన్ మాన్యుమెంట్స్ అండ్ మేమోరియల్స్
- మాన్యుమెంట్స్ అండ్ మేమోరియల్స్ ఇన్ బ్రెజిల్
- 1931 వర్క్స్
- కొలస్సాల్ స్టాట్యూస్ ఆఫ్ జీసస్
- కాంక్రీట్ విగ్రహాలు
- ఆర్ట్ డెకో విగ్రహాలు మరియు జ్ఞాపికలు