ఖమ్మం జిల్లా

వికీపీడియా నుండి

  ?ఖమ్మం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°15′N 80°09′E / 17.25, 80.15
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 16,029 కి.మీ² (6,189 చ.మై)
ముఖ్య పట్టణము ఖమ్మం
ప్రాంతం తెలంగాణ
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
2,215,000 (2001)
• 137/కి.మీ² (355/చ.మై)
• 447000
• 1130000
• 1085000
• 34.26

అక్షాంశరేఖాంశాలు: 17°15′N 80°09′E / 17.25, 80.15 ఖమ్మం భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఖమ్మం దీని ముఖ్యపట్టణం.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసిం౦హాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేణా అది స్థంభ శిఖరిగాను ఆపై స్థంభాద్రి గా పిలువబడినట్టు తెలుస్తూంది. ఉర్దూ భాషలో కంబ అనగా రాతి స్థంభము కావున ఖమ్మం అను పేరు ఆ ఫట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఖమ్మం లో కల నరసింహాలయం త్రేతా యుగము నాటిదని నమ్మకం. పవిత్ర గోదావరి తీరంలో శ్రీరాముడు వెలసిన భధ్రాద్రి (భద్రాచలం), సి౦గరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లయిన ఇల్లందు పట్టణాలు ఖమ్మం జిల్లాలో కలవు. ఖమ్మం జిల్లా 1953 లొ పరిపాలనా సౌలబ్యం కొసము ఏర్పరచబడినది, అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, మణుగూరు, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు.

కౄరమయిన నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.

[మార్చు] భౌగోళికము

ఖమ్మం భౌగోళికంగా ౧౬-౪౫ మరియు ౧౮-౩౫ ఉత్తర అక్షాంశాలు మరియు ౭౯-౪౭ మరియు ౮౦-౪౭ తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. ఉత్తరాన ఛత్తీస్‌గడ్ రాష్ట్రము, నైరుతి దిశలో నల్గొండ జిల్లా, తూర్పున ఉభయగోదావరి జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లా, ఈశాన్యాన ఒరిస్సా రాష్ట్రము, పశ్చిమాన వరంగల్లు జిల్లా ఎల్లలుగా కలవు.

ఖమ్మం జిల్లాలో గోదావరి,కిన్నెరసాని, వైరా, పాలేరు, శబరి, మున్నేరు, తాలిపేరు, లంకాసాగరు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి.

[మార్చు] జిల్లా గణాంకాలు

పని చేయువారు 10.21 లక్షలు
పని చేయని వారు 11.94 లక్షలు
వ్యవసాయదారులు 2.59 లక్షలు
వ్యవసాయకూలీలు 4.60 లక్షలు
వెనకబడిన కులములు 3.60 లక్షలు
వెనకబడిన జాతులు 5.59 లక్షలు
పట్టణములు 9
జనాభా వివరాలు [1]
వర్గం ఇల్లు మనుషులు మగవారు ఆడవారు
మొత్తం 601,659 2,578,927 1,305,543 1,273,384
గ్రామీణ 486,856 2,068,066 1,047,248 1,020,818
పట్టణ 114,803 510,861 258,295 252,566
ఖమ్మం పట్టణం
ఖమ్మం పట్టణం

[మార్చు] మండలాలు

భౌగోళికంగా ఖమ్మం జిల్లాను 46 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[2].

ఖమ్మం మండలాలు

1. వాజేడు

2. వేంకటాపురం

3. చర్ల

4. పినపాక

5. గుండాల

6. మణుగూరు

7. అశ్వాపురం

8. దుమ్ముగూడెం

9. భద్రాచలం

10. కూనవరం

11. చింతూరు

12. వరరామచంద్రపురం (వి.ఆర్.పురం)

13. వేలేరుపాడు

14. కుక్కునూరు

15. బూర్గంపాడు (బూర్గం పహాడ్)

16. పాల్వంచ

17. కొత్తగూడెం

18. టేకులపల్లి

19. ఇల్లందు

20. సింగరేణి

21. బయ్యారం

22. గార్ల

23. కామేపల్లి

24. జూలూరుపాడు

25. చంద్రుగొండ

26. ములకలపల్లి

27. అశ్వారావుపేట

28. దమ్మపేట

29. సత్తుపల్లి

30. వేంసూరు

31. పెనుబల్లి

32. కల్లూరు

33. తల్లాడ

34. ఏనుకూరు

35. కొణిజర్ల

36. ఖమ్మం (అర్బన్)

37. ఖమ్మం (రూరల్)

38. తిరుమలాయపాలెం

39. కూసుమంచి

40. నేలకొండపల్లి

41. ముదిగొండ

42. చింతకాని

43. వైరా

44. బోనకల్లు (బోనకాలు)

45. మధిర

46. ఎర్రుపాలెం

[మార్చు] శాసనసభ నియోజకవర్గాలు

2008 పునర్వ్యవస్థీకరణ తరువాత ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అవి: 110. పినపాక · 111. ఇల్లందు · 112. ఖమ్మం · 113. పాలేరు · 114. మధిర · 115. వైరా · 116. సత్తుపల్లి · 117. కొత్తగూడెం · 118. అశ్వారావుపేట · 119. భద్రాచలం మరియు ఒక లోక్ సభ నియోజకవర్గము కలదు. అది ఖమ్మం. ఇంతకు ముందు భద్రాచలం కేంద్రంగా గల లోక్ సభ నియోజకవర్గం 2008 పునర్విభజన తరవాత వరంగల్ జిల్లా లోని మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కలిసింది.

[మార్చు] నీటి పారుదల వివరాలు

ఖమ్మం జిల్లాలో 4 మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.[3]

  1. వైరా ప్రాజెక్టు (Wyra Project) : వైరా నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట పొడవు 1,320 అడుగులు. ఇది వైరా గ్రామం మరియు మండలం దగ్గర ఉన్నది. దీని మూలంగా సుమారు 17,396 ఎకరాల భూమికి సాగునీరు అందుతున్నది.
  2. పాలేరు ప్రాజెక్టు :
    పాలేరు జలాశయం
    ఇది ఒక మధ్య తరహా ప్రాజెక్టు. ఖమ్మం పట్టణానికి 30 కి.మీ. దూరంలో పాలేరు నదిపై కట్టబడింది. 1928లో 20.7 లక్షల రూపాయలతో కట్టబడింది. 19,694 ఎకరాలకు నీరు అందిస్తుంది.తరువాత దీనిని నాగార్జునసాగర్ ఎడమ కాళువ బాలన్సింగ్ రిజర్వాయిర్‌గా వాడుతున్నారు.
  3. లంకసాగర్ ప్రాజెక్టు : పెనుబల్లి మండలం అడవిమల్లాల వద్ద కొత్తలేరుపై కట్టబడిన నీరునిలువ రిజర్వాయిర్. దీనిని -----(?)లో 101 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. దీని ఆయకట్టు 7,353 ఎకరాలు. అందులో 6,800 ఎకరాలకు ఇది జల వనరుగా ఉంది.
  4. కిన్నెరసాని ప్రాజెక్టు  : కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలంలోని యానంబైలు వద్ద రిజర్వాయిర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
  5. ము(క్క?)ఖమామిడి ప్రాజెక్టు : గోదావరి ఉపనది అయిన పాములేరుపై ముక్కమామిడి వద్ద ఇది 1981లో పూర్తి చేయబడింది. వ్యయం 113.93 లక్షల రూపాయలు. ఆయకట్టు 3,262 ఎకరాలు.
  6. పెద్దవాగు ప్రాజెక్టు  : ఇది అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి వద్ద పెద్దవాగుపై కట్టారు. 1987లో 810 లక్షల వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టు ఆయకట్టు 16,005 ఎకరాలు. అందులో 6,501 ఎకరాలను అభివృద్ధి చేశారు.
  7. ఎల్.టి. బయ్యారం (L.T.BAYYARAM) : మున్నేరు నదిలో కలిసే ఒక వాగుపై కట్టిన ప్రాజెక్టు ఇది. దీని ఆయకట్టు 6005 ఎకరాలు.
  8. తాలిపేరు ప్రాజెక్టు (Taliperu Project) : ఇది ఒక మధ్య తరహా నీటిపారుదల పధకం. ఇది తాలిపేరు నది మీద చర్ల మండలంలోని పెద మిడిసిలేరు గ్రామం దగ్గర నిర్మించబడినది. దీని పూర్తి సామర్ధ్యం ఐన సుమారు 24,710 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

[మార్చు] పర్యాటక కేంద్రాలు

[మార్చు] మూలాలు

  1. భారత ప్రభుత్వ సైటు [1]
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఖమ్మం జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
  3. ఖమ్మం జిల్లా నీటిపారుదల వివరాలు.

పెద్ద కొరు కొండి

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు