Coordinates: 13°31′20″N 79°18′16″E / 13.522344°N 79.304350°E / 13.522344; 79.304350

గంగుడుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంగుడుపల్లి, తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం తిరుపతి నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది.

గంగుడుపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
గంగుడుపల్లి is located in Andhra Pradesh
గంగుడుపల్లి
గంగుడుపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°31′20″N 79°18′16″E / 13.522344°N 79.304350°E / 13.522344; 79.304350
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం చంద్రగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517102
ఎస్.టి.డి కోడ్ 0877(లేద)+91877

గ్రామ చరిత్ర[మార్చు]

గంగుడుపల్లి గ్రామం చంద్రగిరి కోట నుంచి 6 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం చుట్టూ పచ్చని పంట పొలాలు, కొండలు కలిగి ప్రకృతి ఒడిలో ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. ఈ గ్రామంలో సుమారుగా 250 ఇళ్ళు ఉన్నాయి. ప్రాచీన కాలంలో గంగుడుపల్లిని గండు ముద్దల పల్లిగా పిలవబడేది. అనగా పెద్దముద్దలు అని అర్దం. తరువాత కొంత కాలానికి గంగుడుపల్లిగా మార్పు చెందినది.

వ్యవసాయం[మార్చు]

ప్రస్తుతం అక్కడ ప్రధాన పంటలు పట్టు, చెరకు, వేరుశనగ పండిస్తారు.అంతే కాక ఇప్పుడు రైతులు ఎక్కువగా పండ్ల తోటలపై దృష్టి సారించారు.ఇక్కడ ఎక్కువగా మామిడి  పండ్ల తోటలు,జామ తోటలు,సపోటా తోటలు ఈ మధ్య కాలంలో 2016 నుండి కొంతమంది బొప్పాయి తోటలు కూడా సాగు చేస్తున్నారు.ఇంటి అవసరాలకు కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. ఎక్కువ శాతం మంది రైతులు వ్యవసాయం నష్టాలు,రాబడి తక్కువగా రావటం (లేదా) ఆదాయం తక్కువ రావటం వలన ఆవుల పైనే  ఆధారపడుతున్నారు.

దేవాలయాలు[మార్చు]

మొదట వినాయక గుడి ఉంది.ఈ గ్రామంలో రాములవారి గుడి ఉంది. గ్రామంలో సంక్రాంతికి పండుగ, గ్రామ దేవత గంగమ్మ జాతర పండుగ చాల వేడుకగా జరుగుతాయి. శ్రీ రాముని గుడి వద్ద ప్రతి సంవత్సరం మార్చి నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతారు.

సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలో ఒక చెరువు ఉంది. ఈ చెరువు నాలుగు గ్రామాల వరకు నీటిని అందిస్తున్నది. ఈ గ్రామంలోని అందరికీ మాతృభాష తెలుగు.ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ  చౌక దుకాణము ఉంది.అలాగే ఒక ప్రభుత్వ అంగన్ వాడి  కేంద్రం,ప్రభుత్వ పాఠశాల ఉంది.ఇందులో ఐదవ తరగతి వరకు ఉంది.ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం (2017-2018) విద్యా సంవత్సరం నుండి మొదలు పెట్టారు.ఒక కాన్మెంటు పాఠశాల కూడా ఉంది.ఇందులో నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు ఉంది.ఇక గ్రామం నుండి చంద్రగిరి వెళ్ళటానికి ఆర్టీసీ బస్సు అలాగే ఆటోలు సౌకర్యం ఉన్నాయి.ఈ గ్రామం నుండి చిత్తూరు వెళ్ళటానికి రోడ్డు మార్గం (వయా అనుప్పల్లి—చవటగుంట ) సుమారుగా 57 కి.మీ దూరం ఉంది, పనబాకం 18 కి.మీ దూరంలో ఉంది.

ఇతర విశేషాలు[మార్చు]

ఇటీవలి కాలంలో ప్రజలు విద్య పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఫలితంగా ఎంతో మంది విద్యా వేత్హలై చుట్టు ప్రక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గంగుడుపల్లి గ్రామం చుట్టూ ఉన్న అడవిలో అక్కడక్కడ అడవి జంతువులు కోసం బావులు తవ్వినారు.

రవాణా సదుపాయం[మార్చు]

రైలు రవాణా

ఈ గ్రామానికి సమీపంలో పాకాల తిరుపతి రైల్వే లైను ఉంది. కొటాల, చంద్రగిరి రైల్వే స్టేషనులు సమీపంలో ఉన్నాయి.

రోడ్డు మార్గం

అగరాలకు దగ్గరి పట్టణం తిరుపతి 15 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి సమీపంలో చంద్రగిరి, తిరుపతి పి.ఆర్.పల్లి, బస్ స్టేషనులు ఉన్నాయి. . ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్డురవాణా సంస్థ అనేక బస్సులు నడుపుతుంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]