గార్డన్ గ్రీనిడ్జ్
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| పూర్తి పేరు | కద్బర్ట్ గార్డన్ గ్రీనిడ్జ్ | |||
| జననం | మే 1 1951 (వయసు 62) బ్లాక్ బెస్, సెయింట్ పీటర్, బార్బడోస్ |
|||
| బ్యాటింగ్ శైలి | కుడి చేయి | |||
| బౌలింగ్ శైలి | కుడి చేయి మీడియం/ఆఫ్ బ్రేక్ | |||
| పాత్ర | Opening Batsman | |||
| సంబంధాలు | కార్ల్ గ్రీనిడ్జ్ (కుమారుడు) | |||
| అంతర్జాతీయ సమాచారం | ||||
| జాతీయ జట్టు | West Indies | |||
| టెస్టు అరంగ్రేటం(cap 150) | 22 నవంబరు 1974 v India | |||
| చివరి టెస్టు | 27 ఏప్రిల్ 1991 v Australia | |||
| వన్డే ప్రవేశం(cap 16) | 11 జూన్ 1975 v Pakistan | |||
| చివరి వన్డే | 25 మే 1991 v England | |||
| దేశవాళీ జట్టు సమాచారం | ||||
| సంవత్సరాలు | జట్టు | |||
| 1973–1991 | బార్బడోస్ | |||
| 1990 | స్కాట్లాండ్ | |||
| 1970–1987 | హాంప్‌షైర్ | |||
| 1987 | MCC | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| పోటీ | టెస్ట్ | వన్డే | FC | LA |
| మ్యాచ్‌లు | 108 | 128 | 523 | 440 |
| సాధించిన పరుగులు | 7,558 | 5,134 | 37,354 | 16,349 |
| బ్యాటింగ్ సగటు | 44.72 | 45.03 | 45.88 | 40.56 |
| 100s/50s | 19/34 | 11/31 | 92/183 | 33/94 |
| ఉత్తమ స్కోరు | 226 | 133* | 273* | 186* |
| బాల్స్ వేసినవి | 26 | 60 | 955 | 286 |
| వికెట్లు | – | 1 | 18 | 2 |
| బౌలింగ్ సగటు | – | 45.00 | 26.61 | 105.50 |
| ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | – | 0 | 1 | 0 |
| మ్యాచ్ లో 10 వికెట్లు | – | 0 | 0 | 0 |
| ఉత్తమ బౌలింగ్ | – | 1/21 | 5/49 | 1/21 |
| క్యాచులు/స్టంపింగులు | 96/– | 45/– | 516/– | 172/– |
| Source: CricketArchive, 24 జనవరి 2009 | ||||
గార్డన్ గ్రీనిడ్జ్ (Cuthbert Gordon Greenidge) వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1951, మే 1న బార్బడస్ లో జన్మించినాడు. గ్రీనిడ్జ్ వెస్టీండీస్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా 1974 నుంచి 1991 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించినాడు. అతడి తొలి టెస్ట్ మ్యాచ్ భారత్ పై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంగేట్రం చేసినాడు. గ్రీనిడ్జ్ 108 టెస్టులు ఆడి 44.72 సగటుతో 7558 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు కలవు. వన్డేలలో 128 మ్యాచ్‌లు ఆడి 45.03 సగటుతో 5134 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు సాధించాడు. 1975, 1979 మరియు 1983 ప్రపంచ కప్ క్రికెట్‌లో కూడా ప్రాతినిధ్యం వహించినాడు.
అతని యొక్క ఉత్తమ ప్రదర్శన 1984లో ఇంగ్లాండుతో జరిగిన సీరీస్‌లో సాధించాడు. ఆ సీరీస్ లోలార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో మరియు ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన నాల్గవ టెస్టులో రెండింటిలోనూ డబుల్ సెంచరీలు సాధించాడు. ఆ సీరీస్‌లో వెస్టీండీస్ 5-0 తేడాతో ఇంగ్లాండును చిత్తు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తరువాత 1997లో బంగ్లాదేశ్ కు కోచ్‌గా వ్యవహరించాడు. అతని మార్గదర్శకత్వంలో 1997లో బంగ్లాదేశ్ ఐ.సి.సి.ట్రోఫీని గెలిచింది. 1999లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌కు కూడా అర్హత పొందినది.
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · కీత్ బోయిస్ · రాయ్ ఫ్రెడరిక్ · లాన్స్ గిబ్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · వాన్బర్న్ హోల్డర్ · బెర్నార్డ్ జూలియెన్ · ఆల్విన్ కాళీచరణ్ · రోహన్ కన్హాయ్ · డెరిక్ ముర్రే (వికెట్ కీపర్) · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · కొలిన్ క్రాప్ట్ · జోయెల్ గార్నర్ · డెస్మండ్ హేన్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · మైఖెల్ హోల్డింగ్ · కొలిస్ కింగ్ · ఆల్విన్ కాళీచరణ్ · డెరిక్ ముర్రే (వికెట్ కీపర్) · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · ఫావుడ్ బచుస్ · వేనె డేనియల్ · విన్స్టన్ డేవిస్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్ · జోయెల్ గార్నర్ · లారీ గోమ్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · డెస్మండ్ హేన్స్ · మైకెల్ హోల్డింగ్ · గస్ లోగీ · మాల్కం మార్షల్ · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |