గీతాంజలి (1989 సినిమా)
| గీతాంజలి (1989) | |
| దర్శకత్వం | మణిరత్నం |
|---|---|
| నిర్మాణం | నరసారెడ్డి |
| కథ | మణిరత్నం |
| తారాగణం | అక్కినేని నాగార్జున (ప్రకాష్), గిరిజ (గీతాంజలి), విజయకుమార్, షావుకారు జానకి (ఛాన్సలర్), ముచ్చెర్ల అరుణ (డాక్టర్), రాధాబాయి, డిస్కో శాంతి, సిల్క్ స్మిత, సుమిత్ర, విజయచందర్ |
| సంగీతం | ఇళయరాజా |
| నేపథ్య గానం | బాలు, ఎస్. జానకి |
| సంభాషణలు | రాజశ్రీ |
| ఛాయాగ్రహణం | పి.సి.శ్రీరాం |
| నిర్మాణ సంస్థ | భాగ్యలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
గీతాంజలి , 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం మరియు మలయాళం భాషలలోకి కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి.
విషయ సూచిక |
కథ [మార్చు]
చిత్ర కథానాయకుడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున) పరిచయంతో కథ మొదలవుతుంది. ప్రకాష్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే యువకుడు. కాలేజీ లో చదువుతుంటాడు. అయితే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉంది అని తెలుస్తుంది. విరక్తి చెందిన ప్రకాష్ అన్నింటినీ వదిలేసి ఊటీ వెళ్ళిపొతాడు. అక్కడ అతనికి గీతాంజలి (గిరిజ) పరిచయం అవుతుంది. గీతాంజలి తండ్రి ఊటీ లో పెద్ద వైద్యుడు. గీతంజలి చాలా చురుకైన అమ్మాయి. ఎప్పుడూ అందరిని ఆటపట్టిస్తూ, నవ్వుతూ ఉంటుంది. అయితే ఆమె కూడా ఒక వ్యాధి తో బాధ పడుతుంది. అయితే ప్రకాష్ కు భిన్నంగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలొచించకుండా జీవితాన్ని చలాకీగా గడుపుతుంది. ప్రకాష్, గీతంజలి ల మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ ప్రకాష్‌కి వ్యాధి ఉన్న విషయం గీతాంజలికి తెలియదు.
కథ అభివృద్ది మరియు చిత్రీకరణ [మార్చు]
"యంగ్ డై ఫస్ట్" అనే అంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన దర్శకుడు మణిరత్నం అదే తరహాలో ఈ కథ రాసుకున్నాడు. [1] కథానాయిక పేరు గీతాంజలి ఢిల్లీ కి చెందిన 11 సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 12అక్టోబర్,1988 నాడు చిత్రీకరణ మొదలయింది. చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి అయింది. గిరిజ పాత్రకు ఎస్.పి.శైలజ, గిరిజ నానమ్మ పాత్రకు జానకి పాటలు పాడారు.
పాటలు [మార్చు]
- జగడ జగడ జగడం...
- ఒళ్లంత జల్లంత తుళ్ళింత...
- ఆమనీ పాడవే...
- నందికొండ వాగుల్లో...
- ఓం నమహా...
- ఓ ప్రియా,ప్రియా...
- ఓ పాపా లాలీ..