గుంటూరు

వికీపీడియా నుండి


  ?గుంటూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
గుంటూరు నగర కూడలి మరియు పురపాలక సంఘం
గుంటూరు నగర కూడలి మరియు పురపాలక సంఘం
అక్షాంశరేఖాంశాలు: 16°18′N 80°27′E / 16.3, 80.45
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 11,391 కి.మీ² (4,398 చ.మై)
ముఖ్య పట్టణము గుంటూరు
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
4,406,000 (2001)
• 387/కి.మీ² (1,002/చ.మై)
• 1231000
• 2220000
• 2185000
• 62.8
• 71.32
• 54.17

అక్షాంశరేఖాంశాలు: 16°18′N 80°27′E / 16.3, 80.45 గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుతో గల జిల్లాకు పరిపాలనా కేంద్రము. ఈ పట్టణము 6,00,000 జనాభాతో రాష్ట్రం లోని నాలుగవ పెద్ద నగరము. భారత దేశములోని పెద్ద విశ్వవిద్యాలయములలో ఒకటైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము గుంటూరు - మంగళగిరి మధ్యలో ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] గుంటూరు నగరము

గుంటూరు బస్ స్టేషను దృశ్యము

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఈశాన్యాన సుందరమైన కొండవీడు పర్వత శ్రేణికి 9 కి మీ ల తూర్పున గుంటూరు పట్టణం ఉన్నది. అదే పేరుతోనున్న జిల్లా, రెవెన్యూ విభాగం, తాలూకా కు ఈ పట్టణం కేంద్రము. 1866 లో ఏర్పడిన గుంటూరు పురపాలక సంఘం రాష్ట్రం లోని అతి పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి. 18 వ శతాబ్దపు మధ్యలో ఇది ఫ్రెంచి వారి చేతుల్లోకి వెళ్ళినా, 1788 లో శాశ్వతంగా బ్రిటిషు వారికి సొంతమైంది. 1995లో నగరపాలక సంస్థగా మార్చ బడినది.

ప్రస్తుతం గుంటూరు పట్టణంలో భాగమైన రామచంద్రాపురము అగ్రహారము అను గ్రామము గుంటూరు కంటే ఎంతో ప్రాచీనమైనదిగా భావించుచున్నారు. లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయపు మంటపం యొక్క స్థంభంపైనున్న 1296 నాటి శాసనాలలో దీని పేరు కనిపించుచున్నది.

గుంటూరు ప్రముఖ రైల్వే జంక్షను. ఇది విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరాబాదు, మాచర్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉన్నది. గుంటూరు ప్రముఖ విద్యా కేంద్రము మరియు వ్యాపార కేంద్రము. పత్తి, నూనె, ధాన్యం మిల్లులే కాక పొగాకును శుద్ధి చేసే బారనులు పట్టణము చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వర్జీనియా పొగాకుకు గుంటూరు ముఖ్య కేంద్రం. భారత పొగాకు నియంత్రణ బోర్డు కూడ గుంటూరు లో కలదు.

నాసా వారి గుంటూరు చిత్రం

[మార్చు] గుంటూరు ప్రత్యేకతలు

  • 1868, ఆగష్టు 18 న గుంటూరులో నుండి సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు. అప్పటి సూర్యగ్రహణం అసాధారణంగా 10 నిముషాల సేపు వచ్చి, ఎందరో శాస్త్రవేత్తలను ఆకర్షించింది.
  • మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్ నౌక లోనున్న ఒక కుటుంబం గుంటూరు కు సంబంధించినది.
  • పాకిస్తాన్ ఏర్పాటుకు కర్త అయిన మొహమ్మదు ఆలీ జిన్నా పేరిట గుంటూరులో ఒక స్థూపం ఉన్నది. (హిందూ పత్రికలోని ఈ వ్యాసం దీని ప్రత్యేకతను వివరిస్తుంది)
  • గుంటూరు యొక్క ప్రాచీన నామము గర్తపురి.
  • గుంటూరు నగరంలోని రామచంద్రాపుర అగ్రహారం అతిపురాతనమైన ప్రాంతం.
  • స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త వావిలాల గోపాలక్రిష్ణయ్య గారి జన్మస్ధలం గుంటూరు.
  • గుంటూరు నగరానికి విద్య, ఆరోగ్య రంగాలలో మంచి గుర్తింపు గలదు.
  • కేంద్రీయ వ్యవసాయ పరిశోధన కేంద్రము గుంటూరు సమీపములోని ' లాం ' వద్ద కలదు. ఇచ్చట వివిధ వ్యవసాయ ఉత్పత్తులలో సరిక్రొత్త వంగడాలను కనుగొనడానికి పరిశోధోన జరుగును.
  • గుంటూరు పొగాకు వ్యాపారానికి మరియు మిర్చి, ప్రత్తి ఉత్పత్తికి బాగా ప్రసిద్ది చెందినది.
  • అభ్రకము (మైకా) 2200 సంవత్చరాల క్రితము మొదట గుంటూరు ప్రాంతము లొనే కనుగొనపడింది.
  • తొలి భారత కళాశాలలో ఒకటైన ఆంధ్ర క్రైస్తవ కళాశాల 1885 లొ గుంటూరులో స్థాపించబడినది.

[మార్చు] గుంటూరు మండలంలోని గ్రామాలు

[మార్చు] మూలాలు


[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు