గుండప్ప విశ్వనాథ్
1949 జనవరి 12 న జన్మించిన గండప్ప రంగన్న విశ్వనాథ్ (Gundappa Rangnath Viswanath) (Kannada:ಗುಂಡಪ್ಪ ರಂಗನಾಥ್ ವಿಶ್ವನಾಥ್) భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దపు భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. 1969 నుంచి 1983 వరకు భారత జట్టుకు ప్రాతినిద్యం వహించి 91 టెస్టులు ఆడి 6080 పరుగులు సాధించాడు. 1974 మరియు 1982 మద్యలో వన్డే పోటీలను కూడా ఆడినాడు. 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ రతఫున పాల్గొన్నాడు. దేశవాళి క్రికెట్ లో అతను కర్ణాటక తరఫున ప్రాతినిద్యం వహించాడు. ఇతను సునీల్ గవాస్కర్ సోదరిని వివాహం చేసుకున్నాడు.
1969 లో కాన్పూర్ లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్ లో సున్నాకే అవుటై, ఈ విధంగా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డకౌట్ రికార్డు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఇతను మూడోవాడు మాత్రమే. అతను టెస్ట్ క్రికెట్ లో మొత్తం 14 సెంచరీలు సాధించగా వాటిలో భారత్ ఒక్కటి కూడా ఓటమి చెందకపోవడం గమనార్హం. ఆ కాలంలో బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడే ఆస్ట్రేలియా, వెస్ట్‌ఇండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆ దేశాలపై 50 కి పైగా సగటు సాధించడం సామాన్యం కాదు[1]. అతని అత్యున్నత ఇన్నింగ్సులలో ఒకటైన మద్రాసు టెస్ట్ లో వెస్ట్‌ఇండీస్ పై ఆండీ రాబర్ట్స్ బౌలింగ్‌ను ఎదుర్కొని 97 పరుగులతో నాటౌట్ గా నిల్చినాడు. ఆ ఇన్నింగ్సులో జట్టు స్కోరు 190 మాత్రమే. సెంచరీ సాధించకుననూ భారతీయుడు సాధించిన అత్యుత్తమ ఇన్నింగ్సు లలో ఇది ఒకటి [2] భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో విజయం కూడా సాధించింది. 2001 లో వెజ్డెన్ ప్రకటించిన 100 అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ఇన్నింగ్సులలో ఇది 38 వ స్థానం ఆక్రమించింది, కాగా సెంచరీ లేని ఇన్నింగ్సులలో ఇది రెండో స్థానంలో ఉంది. [3]. 1975-76 లో గుండప్ప విశ్వనాథ్ వెస్ట్‌ఇండీస్ పై 112 పరుగులు చేసి తన మరో ప్రతిభను నిరూపించాడు. దానితో ఆ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 403 పరుగులు చేసి గెల్వడమే కాకుండా అప్పటి వరకు ఛేజింగ్ రికార్డును అధికమించింది [4]. 1978-79 లో మరో పర్యాయం మద్రాసు టెస్టులో విస్వనాథ్ 124 పరుగులతో నాటౌట్ గా నిల్చినాడు. ఆ ఇన్నింగ్సులో టీం స్కోర్ కేవలం 255 మాత్రమే. అతని ప్రతిభతో ఆ టెస్ట్ కూడా భారత్ గెల్చి 6 టెస్టుల సీరీస్ లో 1-0 తో ముందంజవేసింది. 1979-80 లలో కొద్దికాలం గుండప్ప విశ్వనాథ్ భారత కెప్టెన్ గా వ్యవహరించాడు. అతను నేతృత్వం వహించిన రెండూ టెస్టులలో ఒకటి డ్రా కాగా, మరికటి ఓడిపోయింది. ఆ టెస్టులో భారత్ ఓడిననూ విశ్వనాథ్ మంచితనం మాత్రం చెప్పుకోవాల్సిందే. బాబ్ టేలర్ ను అంపైర్ ఔట్ ఇచ్చిననూ విశ్వనాథ్ జోక్యం చేసుకొని అతనిని మళ్ళీ క్రీజుకు పిల్వడం అతను ధాటిగా ఆడి మంచి పరుగులు చేయడం భారత్ ఆ టెస్ట్ కోల్పోవడం జర్గాయి.
గుండప్ప విశ్వనాథ్ 1983 లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మ్యాచ్ రిఫరీ గా పనిచేశాడు.
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|
|
|---|---|
| వెంకట రాఘవన్ (కెప్టెన్) · ఏక్నాథ్ సోల్కర్ · అంశుమన్ గైక్వాడ్ · కర్సన్ ఘావ్రి · బ్రిజేష్ పటేల్ · గుండప్ప విశ్వనాథ్ · ఫరూక్ ఇంజనీర్ (వికెట్ కీపర్) · అబిద్ అలీ · మోహిందర్ అమర్నాథ్ · మదన్‌లాల్ · బిషన్ సింగ్ బేడీ |
|
|
|
|---|---|
| వెంకట రాఘవన్ (కెప్టెన్) · సునీల్ గవాస్కర్ · మోహిందర్ అమర్నాథ్ · గుండప్ప విశ్వనాథ్ · దిలీప్ వెంగ్‌సర్కార్ · అంశుమన్ గైక్వాడ్ · కర్సన్ ఘావ్రి · కపిల్ దేవ్ · బ్రిజేష్ పటేల్ · సురీందర్ ఖన్నా · బిషన్ సింగ్ బేడీ · భరత్ రెడ్డి · యశ్పాల్ శర్మ |
మూలాలు [మార్చు]
- ↑ Statsguru - GR Viswanath - Tests - Career summary from Cricinfo.com
- ↑ The 26th anniversary of an immortal innings from Cricinfo.com 11 January 2001
- ↑ Wisden 100 - Top 100 Batsmen from Rediff.com
- ↑ Tests - Highest Fourth Innings Totals from Cricinfo.com