గుగ్గిలం కలప చెట్టు

వికీపీడియా నుండి
గుగ్గిలం
Shorea robusta.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Malvales
కుటుంబము: డిప్టెరోకార్పేసి
ప్రజాతి: షోరియా
జాతి: షో. రొబస్టా
ద్వినామము
షోరియా రొబస్టా
Roth

గుగ్గిలం కలప చెట్టు బెరడు ముదురు బూడిద రంగులో గరుగ్గా ఉంటుంది. లేత నిన్నగా మృదువుగా ఉంటాయి. ఆకులు కోలగా, పెద్దవిగా నున్నగా మెరుస్తూ ఉంటాయి. కొమ్మలు గుగ్గిలం పూలు పసుపు పచ్చగా మద్యభాగంలో నారింజ పండు రంగులో ఉంటాయి. రేకులు కొంతభాగం బూడిద రంగులో ఉంటాయి. గుగ్గిలం కాయ కోలగా ఉండి ఒకే ఒక గింజ ఉంటుంది.

[మార్చు] పేరు కారణాలు

కెంటకీ వృక్ష శాస్త్రజ్ఞుడు డాక్టర్ చార్లస్ డబ్ల్యూ. షోర్ పేరుమీద 'షోరియా' అనే పేరు వచ్చింది. రొబస్టా అంటే లావు అని అర్ధం. మరాఠీలో ర్ల అంటే చెట్టునుండి స్రవించే ద్రవం అని అర్ధం.

[మార్చు] సంప్రదాయంలో గుగ్గిలం

బాగ్డీ, బౌరీలనే బెంగాలీ ఆదివాసులు గుగ్గిలం చెట్టుతో నిర్మించిన పందిట్లో పెళ్ళి చేసుకుంటారు. మరి కొందరు ఆదివాసులు గుగ్గిలం చెట్టు మీద భూతాలు ఉంటాయని విశ్వసిస్తారు. బౌద్ధులు గుగ్గిలం చెట్టుని పూజిస్తారు. బుద్దుని తల్లి మాయాదేవి బుద్దుని జనన సమయంలో గుగ్గిలం చెట్టుని ఆసరాగా పట్టుకుందని కధనం. బుద్దుని నిర్యాణం గుగ్గిలం వనంలో జరిగిందని విశ్వాసం. గ్రామాల్లో పిల్లలు లేని దంపతులు గుగ్గిం చెట్టుని పూజించే ఆచారం ఉంది.

[మార్చు] ఉపయోగాలు

గుగ్గిలం కలప చాలా దృఢమైనది కనుక వంతెనలూ, పడవలు, రైల్వే బోగీలు, బండి చక్రాలు మరియు ఇంటికి కావలసిన కొయ్య సామానులు చేస్తారు.

గుగ్గిలం
లాటీన్‌నామం షొరియా రోబస్టా
ఇంగ్లీష్ సాల్‌
బెంగాలీ సాల్
హిందీ సాల్, సెకువా
మరాఠీ రల
పంజాబీ సాల్, సెలియా
ఒరియా సకువా
మలయాళం మరమరం
తెలుగు గుగ్గిలం
సంస్కృతం సాల, దీర్ఘఫల
తమిళం కుంగిలియం
కుటుంబం Diptero Capaceae
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు