గుప్త సామ్రాజ్యము
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
|||||||||||||||||||||||||||||||
గుప్త సామ్రాజ్యము (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश,Gupta Rājavaṃśa) గుప్త వంశపు రాజులచే సుమారు 280 నుండి 550 CE వరకు పాలించబడినది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్ మరియు రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రాంతాలను పాలించారు. వీరి రాజధాని పాటలీపుత్రము, ప్రస్తుత బీహార్ రాజధాని పాట్నా.
శాంతి మరియు అభివృద్ధి ధ్యేయంగా సాగిన వీరి పరిపాలన శాస్త్ర మరియు కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలాన్ని హాన్ సామ్రాజ్యం, టాంగ్ సామ్రాజ్యం మరియు రోమన్ సామ్రాజ్యం తో సరిసమానంగా పోలుస్తారు.
గుప్తుల కాలాన్ని "భారతదేశపు స్వర్ణయుగం (Golden Age of India)" అని పిలుస్తారు. ఈ కాలంలో భారతదేశపు శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ఖగోళశాస్త్రం, తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందాయి.
[మార్చు] కళలు
వీరి కాలంలో శిల్పకళ చాలా ప్రసిద్ధి గాంచింది.