గుమ్మా వీరన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుమ్మా వీరన్న వర్ణ చిత్రం

గుమ్మా వీరన్న ప్రముఖ హేతువాది. కర్నూలు జిల్లా నాగలదిన్నె గ్రామంలో 1952 మే 22 వ తారీకున గుమ్మా నరసమ్మ, గుమ్మా భద్రప్ప దంపతులకు జన్మించిన గుమ్మా వీరన్న ప్రాథమిక విద్యాభ్యాసం ఎమ్మిగనూరులో, ఉన్నత విద్య (ఎం.ఏ., ఎల్.ఎల్.బి) హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశాడు. 1982 లో గుమ్మా వీరన్న గ్రూప్ 1 ఆఫీసర్ గా పదవి బాధ్యతలు చెప్పటారు. రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీస్ అండ్ అక్కౌంట్స్ శాఖలో అదనపు సంచాలకుడిగా పనిచేసి 2010 మే మాసంలో పదవీ విరమణ చేశాడు.

ఎం.ఎన్ రాయ్, రావిపూడి వెంకటాద్రి రచనలు చదవగా హేతువాద ఉద్యమం పట్ల వీరన్నకు ఆసక్తి కలిగింది. గుమ్మా వీరన్న 1984 ఫిబ్రవరి 26 న గుడివాడలో లక్ష్మిని కులాంతర వివాహం చేసుకొన్నాడు. ఈ వివాహం హేతువాద పద్ధతిలో జరిగింది. తొలుత కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితుడైనా తరువాతి దశలో 1980 నుంచి హేతువాద, మానవవాద ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.

2008 వ సంవత్సరంలో హేతువాద భావ ప్రచారంలో చేసిన కృషికి గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కవిరాజు త్రిపురనేని రామస్వామి ధర్మనిధి పురస్కారాన్ని అందచేశారు. వీరన్న హేతువాదే కాకుండా రచయిత కూడా. గుమ్మా వీరన్న హేతువాద, మానవవాద తత్వాలపై, ఇతర విషయాలపై పలు పుస్తకాలు రచించాడు.

2008లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన "భారతీయ సంస్కృతి-తత్వం" వీరి రచనల్లో అత్యంత ఎక్కువ కీర్తిప్రతిష్టలను సాధించిన పుస్తకంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వేలాది కాపీలు అమ్ముడుపోయాయి కూడా. వివిధ కాంపిటీటివ్ ఎగ్జామ్ లకు ఈ పుస్తకాన్ని రిఫరెన్సు పుస్తకం గా పలువురు సూచిస్తున్నారు. గుమ్మా వీరన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్మే, ఎల్.ఎల్.బి పట్టాలు తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ  ట్రెజరీ అండ్ అకౌంట్లో ఉద్యోగం చేసి అడిషనల్ డైరెక్టర్ గా 2010 మే లో పదవీ విరమణ చేశారు. వీరన్న ఉద్యమ కార్యకర్తగా, హేతువాద మానవవాద రచయితగా క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు . హేతువాద మానవవాదాలు అనే అంశంపై సుమారు 100 పుస్తకాలు రాసిన వెంకటాద్రి గారి పై పరిశోధనకు ఆయన ఉపక్రమించారు. "రావిపూడి వెంకటాద్రి రచనలు- హేతువాద మానవవాదాలు" అనే అంశంపై సుదీర్ఘ కాలం శోధన చేసి 2016లో గుమ్మా వీరన్న తన 62 వ యేట పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన పత్రం సమర్పించి పి.హెచ్ .డి పట్టా పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ సంవత్సరానికి కి ఉత్తమ పరిశోధనాత్మక గ్రంథం గా బంగారు పతకం ప్రకటించగా, 2018 లో డాక్టరేటు పట్టా, రాష్ట్ర గవర్నర్ చేతుల మీదగా బంగారు పతకం అందుకున్నారు .  భావ విప్లవ ఉద్యమం లో 1982 నుండి కొనసాగుతూ ఉద్యమం ద్వారా మానవవాద పునాదుల పై సమాజ పునర్నిర్మాణానికి కృషి చేయడం గుమ్మా వీరన్న జీవిత లక్ష్యం .

1.  హేతువాదం -భావవిప్లవం (1984)

2.  హేతువాదం - మార్క్సిజం (1987 )

3.  నవ్యమానవవాదమీనాటి బాట (1996)

4.  స్వేచ్ఛ (2001)

5.  హేతువాదం - స్వరూప స్వభావాలు (2007)

6.  భారతీయ సంస్కృతి - తత్వం (2008 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)

7.  హేతువాదం: అపోహలు అపార్థాలు (2012)

8.  రావిపూడి రచనల సంపుటాల  సమీక్షలు (2014, 2016 ) రెండు భాగాలు రచించారు.

9.  రాడికల్ హ్యూమనిజం (2005 - తార్కుండే పుస్తకానికి అనువాదం -తెలుగు అకాడమీ, హైదరాబాదు)

10. మానవజాతికి మతమెందుకు? (2010 - Why Religion for Humankind? -Kottapalli Wilson పుస్తకానికి ఆనువాదం)

11. ఆంధ్ర ప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర (ఇన్నయ్య ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం - హేతువాది మాసపత్రికలో ప్రచురితం)

12. గతితార్కిక భౌతికవాదం శాస్త్రీయమా? (రావిపూడి వెంకటాద్రి గారి ఆంగ్ల రచనకు అనువాదం )

13. శాస్త్రం - తత్వం (ఎం న్ రాయ్ గారి ఆంగ్ల రచనకు అనువాదం )

14. భారతదేశంలో బౌద్ధ నిర్ములన (దొప్పలపూడి సత్యనారాయణ గారి ఆంగ్ల రచనకు అనువాదం )

ప్రస్తుతం గుమ్మా వీరన్న భారత హేతువాద సంఘానికి ఉపాధ్యాక్షుడిగాను, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి అధ్యక్షుడిగాను కొనసాగుతున్నాడు.

గుమ్మా వీరన్న The Humanist Way లో అనేక అనేక అంశాల పై  ప్రసంగాలు చేసారు. వారి వీడియోలు ఈ క్రింద లింక్ లో చూడగలరు

https://www.youtube.com/playlist?list=PL5obT1lHfw3RMqhulrSgMfM2DdXJ7BRva