గుర్రంకొండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


గుర్రంకొండ
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో గుర్రంకొండ మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో గుర్రంకొండ మండలం యొక్క స్థానము
గుర్రంకొండ is located in ఆంధ్ర ప్రదేశ్
గుర్రంకొండ
ఆంధ్రప్రదేశ్ పటములో గుర్రంకొండ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°47′00″N 78°35′00″E / 13.7833°N 78.5833°E / 13.7833; 78.5833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము గుర్రంకొండ
గ్రామాలు 10885
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,772
 - పురుషులు 21,710
 - స్త్రీలు 21,062
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.18%
 - పురుషులు 71.88%
 - స్త్రీలు 46.36%
పిన్ కోడ్ 517297

గుర్రంకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 517297. గుర్రంకొండ కడప మరియు బెంగళూరు రహదారిలో గలదు. గుర్రంకొండ 13.7833° N 78.5833° E.[1] సముద్రమట్టానికి 647 మీటర్ల (2125 అడుగుల) ఎత్తునగలదు. గుర్రంకొండ ఒక పర్యాటక ప్రదేశం. దీనికి చారిత్రకంగా జాఫరాబాదు అని కూడా పేరు కలదు.

గుర్రంకొండ కోట[మార్చు]

గుర్రంకొండ గిరిదుర్గము. శత్రుదుర్భేద్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తానులు కట్టించారు. నిర్మాణశైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉన్నది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్పకొండపై ఉన్నది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉన్నది. నాలుగోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉన్నది. కోటలో నలభైకి పైగా మసీదులు ఉండేవి. కానీ అవి శిధిలమైనవి. పర్షియాలోని కిర్మాన్ నుండి వచ్చిన హజ్రత్ షా కమాల్ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశాడు.

ఈ కోట 18వ శతాబ్దపు చివరలో కొన్నాళ్లు టిప్పూసుల్తాను ఆధీనంలో ఉన్నది. టిప్పూసుల్తాను ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు.[2] ఆ తరువాత కడప నవాబుల పాలనలోకి వచ్చింది. ఇచ్చట గల కోట చాలా ప్రసిద్ధమైనది. ఈ కోటలో గల 'రంగిన్ మహల్' చూపరులకు ఆకట్టుకుంటుంది.

  • మక్బరా: గుర్రంకొండకు 3 కి.మీ. దూరంలో మక్బరా (ఖండ్రిగ) గ్రామం కలదు. ఈ మక్బరాలో టిప్పు సుల్తాన్ మేనమామ మీర్ రజా అలీఖాన్ సమాధి కలదు. సమాధిపై ఉన్న పారశీక శాసనంలో ఈయన మరణించిన సంవత్సరం 1780గా సూచించబడింది. ఈ సమాధి వలనే ఈ గ్రామానికి మక్బరా (సమాధి) అనే పేరు వచ్చింది. ఈ సమాధి పై గల గుంబద్, బిజాపూర్ లోని గోల్ గుంబద్ తరువాత స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ ప్రదేశాలన్నీ "పురావస్తుశాఖ" వారి ఆధ్వర్యంలో వున్నవి.

మండలంలోని పట్టణములు[మార్చు]

  • గుర్రంకొండ

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]


బయటి లంకెలు[మార్చు]