గూగుల్‌ ఎనలిటిక్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Google Analytics
Google Analytics logo
అభివృద్ధిచేసినవారు Google
నిర్వహణ వ్యవస్థ Cross-platform (web-based application)
రకము Statistics, Analysis
వెబ్‌సైట్ http://google.com/analytics

గూగుల్‌ ఎనలిటిక్స్(GA) ఒక వెబ్‌సైట్‌ను ఎంత మంది సందర్శిస్తున్నారన్న సవిస్తర గణాంకాలను అందించేందుకు గూగుల్‌ అందిస్తున్న ఉచిత సేవాకార్యక్రమమే గూగుల్‌ ఎనలిటిక్స్. వెబ్‌మాస్టర్లు మరియు టెక్నాలజిస్టులను లక్ష్యంగా చేసుకొని వాస్తవంగా వెబ్‌ ఎనలిటిక్స్ పరిశ్రమ రూపుదిద్దుకున్నప్పటికీ, దీనికి విరుద్ధంగా మార్కెటింగ్‌ వర్గాలను లక్ష్యంగా చేసుకోవడమే ఈ ఉత్పత్తి యొక్క ప్రధాన కీలకాంశం. విస్త్రతంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్‌ స్టాటస్టిక్స్ సర్వీస్‌ ఇది.[1] అత్యంత ప్రజాదరణ ఉన్న వెయ్యి వెబ్‌సైట్లలో 57శాతం సైట్లు ఈ సర్వీసును ఉపయోగిస్తున్నాయి.[2]

సెర్చ్ ఇంజన్లు, డిస్‌ప్లే ఎడ్వర్టైజ్‌మెంట్లు, పే-ఫర్‌- క్లిక్‌ నెట్‌వర్క్స్, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, పీడీఎఫ్‌డాక్యుమెంట్స్ వంటి డిజిటల్‌ మార్గాల ద్వారా వెబ్‌సైట్‌కు వచ్చే సందర్శకులను GA గుర్తించగలుగుతుంది.

యాడ్‌వర్డ్స్తో అనుసంధానం చేయడం ద్వారా ల్యాండింగ్‌ పేజీ నాణ్యత మరియు కన్వర్షన్‌(గోల్స్) గుర్తించడం ద్వారా దీన్ని ఉపయోగించే వారు, తమ ఆన్‌లైన్‌ ప్రచార కార్యక్రమాలను సమీక్షించుకుంటారు. గోల్స్ అనేవి సాధారణంగా అమ్మకాలు, లీడ్‌ జనరేషన్‌, నిర్ధారిత పేజీని చూడటం లేదా ఓ నిర్ధిష్టమైన ఫైలును డౌన్‌లోడు చేసుకోవడం వంటివి. వీటన్నింటనీ మానిటర్‌ చేయవచ్చు. జిఎ సాయంతో ఏ యాడ్స్‌ప్రభావవంతంగా ఉన్నాయి, ఏ యాడ్స్ ప్రభావవంతంగా లేవన్న విషయాన్ని మార్కెటింగ్‌ చేసే వారు గుర్తించవచ్చు. తద్వారా ప్రచారాన్ని ఆప్టిమైజ్‌ చేయాలా లేదా అన్న సమాచారం లభిస్తుంది.

సాధారణంగా ఉపయోగించే వారికి కూడా డ్యాష్‌బోర్డ్ తరహా ఉన్నత స్థాయి సమాచారాన్ని అందించడం, అదేవిధంగా,ఆ తరువాత రిపోర్ట్ సెట్‌లో మరింత లోతైన సమాచారాన్ని ఇవ్వడమే జీఏ యొక్క వైఖరిగా చెప్పవచ్చు. ఫన్నెల్‌ విజువలైజేషన్‌, ఎక్కడ నుంచి వెబ్‌సైట్‌కు సందర్శకుల వస్తున్నారు(రీఫరల్స్), ఎంత సమయం వారు వెబ్‌సైట్‌ను చూశారు, వారి ఏ ప్రాంతానికి చెందిన వారన్న అంశాలను తెలుసుకోవచ్చు. తద్వారా జీఏ ఎనలిటిక్స్‌ సాయంతో అంత ఎక్కువగా ప్రజాదరణ పొందని పేజీలను గుర్తించవచ్చు. కస్టమ్‌ విజిటర్‌ సెగ్మంటెషన్‌ వంటి విస్త్రతమైన సేవల్ని కూడా ఇది అందిస్తుంది.

సాధారణంగా యూజర్‌ దీనికి 50 వెబ్‌సైట్ల యొక్క ప్రొఫైల్స్‌ను అనుసంధానం చేయవచ్చు. ప్రతి ప్రొఫైల్‌ ఒక వెబ్‌సైట్‌ను సంబంధించినదై ఉంటుంది. నెలకు ఐదు మిలియన్‌ పేజీ వ్యూస్‌ కంటే తక్కువ ఉన్నవెబ్‌సైట్లకే( సెకండ్‌కు రెండు పేజ్‌ వ్యూస్‌), లేని పక్షంలో యాడ్‌వర్డ్స్ ప్రచారానికి అనుసంధానం చేసిన వెబ్‌సైట్లకే దీన్ని పరిమితం చేశారు.[3]

చరిత్ర[మార్చు]

యుర్‌చిన్‌ సాఫ్ట్ వేర్ కార్పొరేషన్‌ రూపొందించిన ఎనలిటిక్స్‌ సిస్టమ్ ‌యుర్‌చిన్‌ ఆన్‌ డిమాండ్‌ అన్న సర్వీస్‌ను అభివృద్ధి చేయడం ద్వారా గూగుల్‌ ఈ సర్వీస్‌ను అందిస్తోంది.(యూర్‌చిన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏప్రిల్‌ 2005లో గూగుల్‌ కొనుగోలు చేసింది). ఈ సిస్టమ్‌,మేజర్‌ మ్యాప్‌ అనే ఉత్పత్తిని రూపొందించిన అడాఫ్టివ్‌ పాత్‌ నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకొని గూగుల్‌ ఎనలిటిక్స్‌ను 2006లో రీ డిజైన్‌ చేసింది. [4]వాల్యూ బేస్డ్‌ రీ సెల్లర్ల నెట్‌వర్క్ ద్వారా ఇప్పటికీ గూగుల్‌ స్టాండ్‌ ఎలోన్‌ ఇన్‌స్టబుల్‌ యూర్‌చిన్‌ సాఫ్ట్ వేర్‌ను విక్రయిస్తోంది.2008 ఏప్రిల్‌ urchin‌6 మార్కెట్లోకి విడుదలైంది.

సైన్‌అప్‌ చేసిన ఎవరికైనా అందుబాటులో ఉండే గూగుల్‌ బ్రాండెడ్‌ వెర్షన్‌ నవంబర్‌, 2005లో మార్కెట్లోకి విడుదలైంది. ఈ సర్వీస్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడటంతో, దీన్ని ప్రారంభించిన వారం రోజుల్లోనే సైన్‌అప్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ సిస్టమ్‌కు మరింత సామర్థ్యాన్ని జోడించడంతో, గూగుల్‌ లాటరీ టైప్‌లో ఇన్విటేషన్‌ కోడ్‌ మోడల్‌ను అనుసరించింది. ఆగస్టు 2006 తరువాత సర్వర్‌ లభ్యత ఆధారంగా ఇన్విటేషన్‌ కోడ్స్‌ను బ్యాచ్‌ల రూపంలో పంపించడం ప్రారంభించింది.ఆగస్టు 2006 మధ్య నాటికి గూగుల్‌ను తమ ఎడ్వర్టైజ్‌మెంట్‌కు ఉపయోగించుకున్నా, లేకపోయినా అందరూ దీన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది. 2007 నాటికి యూజర్‌ ఇంటర్‌పేజ్‌ కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.[5]

2007లో గూగుల్‌ కొత్త ga.js పేజ్‌ ట్యాగ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త డొమైన్లు, కొత్త ప్రొఫైల్స్‌, కొత్త ఎకౌంట్ల ప్రారంభించాలనుకునే వారు ఈ పేజ్‌ ట్యాగ్‌ను వినియోగించుకోవాలని రికమెండ్‌ చేసింది. అప్‌డేట్‌ ట్రాకింగ్‌ ఫంక్షన్స్‌తోపాటు,మల్టిపుల్‌ డేటా పాయింట్స్‌కు సంబంధించి గ్రాఫ్‌లను అందించడం, ఈ కామర్స్‌ ట్రాన్సాక్షన్స్‌ను మరంత సమర్థంగా ట్రాక్‌ చేయడం వంటి అత్యాధునిక సర్వీసులను కొత్త పేజ్‌ట్యాగ్‌ వెబ్‌సైట్‌ యజమానులకు అందిస్తున్నప్పటికీ, పాత పేజీ ట్యాగ్‌ కొనసాగుతుందని పేర్కొంది.[6]

ఈ ప్రొడక్స్ ఫ్లాట్‌ఫామ్‌కు ఎలాంటి బీటా వెర్షన్‌ లేకపోవడంతో, న్యూ బీటా ఫీచర్స్‌ను క్రమేపీ చేర్చారు.

సాంకేతిక విజ్ఞానం[మార్చు]

మూస:Refimprovesect గూగుల్‌ ఎనలిటిక్స్‌ మనం చేర్చే పేజ్‌ ట్యాగ్‌ ద్వారా అమలువుతుంది. దీన్ని గూగుల్‌ ఎనలిటిక్స్‌ ట్రాకింగ్‌ కోడ్‌(GATC) అంటారు. ఇది జావా స్క్రిప్ట్‌లో ఉండే ఒక హిడెన్‌ స్నిప్పెట్‌. దీన్ని యూజర్‌ వెబ్‌సైట్‌లోని ప్రతి పేజీకి అమరుస్తాడు. ఇది విజిటర్‌ యొక్క ప్రయివేటు డేటాను సేకరించి ప్రాసిసింగ్‌ కోసం గూగుల్‌ డేటా కలెక్షన్‌ సర్వర్‌కు పంపుతుంది. డేటాను గంటకు ఒకసారి సేకరిస్తారు. అయితే రియల్‌టైమ్‌తో పోలిస్తే మూడు నుంచి నాలుగు గంటలు వెనక ఉంటుంది. అయితే వెబ్‌ ఎనలిటిక్స్‌ బ్లాగ్‌కు సంబంధించిన ఒక కామెంట్‌లో డేటాను సేకరించిన 12 గంటల తరువాత మాత్రమే మొత్తం డేటా ప్రాసిసింగ్‌ జరుగుతుందని వెబ్‌ ఎనలిటిక్స్ బ్లాగ్‌లో గూగుల్‌ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు.

ఇది పనిచేయడానికి జీఏటీసీ గూగుల్‌ వెబ్‌ సర్వర్లనుంచి పెద్దఫైల్‌ను లోడ్‌ చేస్తుంది. యూజర్‌ ఎకౌంట్‌ నంబర్‌కు అనుగుణంగా వేరియబుల్స్‌ను సెట్‌ చేస్తుంది. ఈ పెద్దఫైల్‌ (ప్రస్తుతం ga.jsగా వ్యవహరిస్తారు) సుమారు 18KB సైజు ఉంటుంది. వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు మాత్రమే ఇది డౌన్‌లోడ్‌ అవుతుంది. ఆ తరువాత సెషన్‌ మొత్తం దీని క్యాచీ ఉపయోగపడుతుంది. ga.js ద్వారా జీఏను ఉపయోగిస్తున్న అన్ని వెబ్‌సైట్లు గూగుల్‌ అందించే మాస్టర్‌ ఫైల్‌ను ఉపయోగించుకుంటాయి. ఆ వెబ్‌సైట్‌ను సందర్శించే సందర్శకుడు అంతకు ముందు ఇదే కోడ్‌ను ఉపయోగించే వెబ్‌సైట్‌ను సందర్శించినట్లయితే, ఆ ఫైల్‌కు ఆ కంప్యూటర్‌ మీద క్యాచ్‌ అవుతుంది. దీని ఫలితంగా వెబ్‌పేజీల పై జీఏటీసీ చేర్చడం వల్ల పేజీలోడ్‌ పెరగడాన్ని స్వల్పం చేయవచ్చు.

గూగుల్‌ సర్వర్లకు సమాచారాన్ని అందించడంతోపాటు, GATC సందర్శకుడి యొక్క కంప్యూటర్‌పై ఫస్ట్ పార్టీ కుకీస్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ సందర్శకుడు ఆ వెబ్‌సైట్‌ను ఇంతకు ముందు సందర్శించాడా లేదా (కొత్త లేక రిటర్న్ విజటర్‌). ప్రస్తుతం ఎంత సేపు వెబ్‌సైట్‌ను సందర్శించాడు, రిఫరల్‌ సైట్‌ లేదా సెర్చ్‌ ఇంజిన్‌, కీ వర్డ్స్, బ్యానర్‌, ఈమెయిల్‌ ఇలా ఎలాంటి క్యాంపైన్‌ ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించాడన్న సమాచారాన్ని నిల్వ చేస్తుంది.

పరిమితులు[మార్చు]

ఎన్నో యాడ్‌ ఫిల్టర్‌ ప్రోగ్రామ్స్ మరియు ఎక్స్‌టెన్షన్లు (ఫైర్‌ఫాక్స్ యాడ్‌ లాక్‌ మరియు నో స్క్రిప్ట్) వంటివి జీఏటీసిని బ్లాక్‌ చేస్తాయి. కొత్త ట్రాఫిక్‌ను అదే విధంగా యూజర్‌ను గుర్తించడాన్ని అడ్డుకుంటాయి. సేకరించిన సమాచారంలో లీడ్స్‌టు హెల్స్ ఉంటాయి. టార్‌ వంటి ప్రైవసీ నెట్‌వర్కలు యూజర్‌ యొక్క లోకేషన్‌ మరియు ఇతర భౌగోళిక సమాచారాన్ని మాస్క్ చేస్తుంది. కొంత మంది యూజర్లు జావా స్క్రిప్ట్‌ ఎనేబుల్డ్‌/ క్యాపబుల్‌ బ్రౌజర్లు దీన్ని ఆఫ్‌ చేస్తాయి. అయితే ఈ పరిమితులు చాలా స్వల్పమైనవి. విజిట్స్‌కు సంబంధించి చాలా తక్కువ మొత్తంలో ప్రభావం చూపుతాయి.[7]

యూజర్‌ గూగుల్‌ ఎనలిటిక్స్‌ కుకీస్‌ను బ్లాక్‌ చేయడం లేదా డిలీట్‌ చేయడం వల్ల డేటా యాక్యురెసీపై పెద్ద మొత్తంలో ప్రభావం పడుతుంది.[8] కుకీస్‌ లేకుండా జీఏ సమాచారాన్ని సేకరించలేదు. ఎవరైనా వ్యక్తిగత వెబ్‌ యూజర్‌ ఈ కుకీస్‌ను బ్లాక్‌ చేయడం లేదా డిలీట్‌ చేయడం వల్ల జీఏను ఉపయోగించేవారు, ఆ విజిట్స్‌కు సంబంధించిన డేటాను పొందలేకపోతారు. దీన్ని నిరోధించడానికి వెబ్‌సైట్‌ యజమాని తన వెబ్‌సైట్‌లో బెస్ట్‌ ప్రాక్టీస్‌ పాలసీలను ప్రవేశపెడుతుండాలి. విజిటర్‌కు సంబంధించిన ఏ డేటాను సేకరిస్తున్నారు, ఈ డేటాను ఎలా ఉపయోగిస్తారన్న విషయంలో పారదర్శకంగా ఉండాలి. ఈ సమాచారాన్ని సాధారణంగా ప్రైవసీ పాలసీ స్టేట్‌మెంట్‌ పేజీలో ఉంచుతారు.

GA జావా స్క్రిప్ట్ మరియు కుకీస్‌ల సంయుక్త సహకారంతో విజటర్‌ యొక్క సమాచారాన్ని పేజ్‌ ట్యాగ్‌ టెక్నిక్‌ను ద్వారా సేకరిస్తుంటాయి. వెబ్‌సైట్లను మొబైల్‌ ద్వారా చూసే వారి విషయంలో కొన్ని లిమిటేషన్స్‌ ఉంటాయి. లేటెస్టు ఫోనులు మాత్రమే ప్రస్తుతం జావా స్క్రిప్ట్ లేదా సెట్‌ కుకీస్‌ను కలిగి ఉండటమే దీనికి కారణం (స్మార్ట్ ఫోన్లు మరియు పీడీఎలు).

ఈ లిమిటేషన్లు పేజ్‌ ట్యాగ్‌ ద్వారా ఆన్‌సైట్‌ విజిటర్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ఆన్‌సైట్‌ వెబ్‌ ఎనలిటిక్స్ ‌పై ప్రభావం చూపుతాయి. అదే చిన్న కోడ్‌ (సాధారణంగా జావా స్క్రిప్టు) బీకాన్‌లా వ్యవహరించి విజిటర్‌ డేటాను సేకరిస్తుంది.

పెద్ద వెబ్‌సైట్లకు సంబంధించి వివిధ రకాల రిపోర్టులు తయారు చేయడంలో ఉపయోగించే శాంపిలింగ్‌ విధానానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. తమ సర్వర్ల పై లోడ్‌ తగ్గించడానికి వివిధ రకాల ప్రశ్నలకు త్వరగా స్పందించడం కోసం ఒక్కో ప్రొఫైల్‌కు సంబంధించి జీఏ రెండు లక్షల శాంపుల్‌ విజిట్స్‌ మాత్రమే తమ కాలిక్యులేషన్స్‌కు పరిగణనలోకి తీసుకుంటుంది. తప్పులుండే అవకాశాన్ని విజిట్‌ మెట్రిక్స్‌ లో పేర్కొంటారు. GA రిపోర్ట్‌ లో ఇతర ఏ అంశంలో తప్పులుండే అవకాశం లేదు. చిన్నమొత్తంలో ఉండే డేటాకు సంబంధించి తప్పులు పెద్దస్థాయిలో ఉంటాయి.[9]

బగ్స్ మరియు సపోర్ట్[మార్చు]

సపోర్ట్ కోసం చాలా విధానాలున్నాయి. గూగుల్‌ అనేక భాషల్లో నేరుగా ఈ మెయిల్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. యూజర్‌ ఏదైనా సందేహం వచ్చినా, గూగుల్‌ ఎనలిటిక్‌ సపోర్ట్ టీమ్‌ను నేరుగా సంప్రదించవచ్చు. గూగుల్‌ ప్రత్యేకంగా ఒక హెల్ప్‌ వెబ్‌సైట్‌ను సైతం ఏర్పాటు చేసింది, గూగుల్‌ ప్రత్యేకంగా ఒక హెల్ప్ వెబ్‌సైట్‌ను సైతం ఏర్పాటు చేసింది గూగుల్‌ ఎనలిటికల్‌ యూజర్లు ఏదైనా సాయం కావాలంటే ఎనలిటికల్‌ హెల్ప్‌ఫోరంను ఆశ్రయించవచ్చు. తమ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవచ్చు లేదా కొత్త ప్రశ్నలు సంధించవచ్చు.

ప్రైవసీ విషయాలు[మార్చు]

దీనికున్న ప్రత్యేక లక్షణం కారణంగా ప్రైవసీ విషయంలో ఎన్నో సందేహాల తలెత్తుతాయి. గూగుల్‌ ఎనలిటక్‌ను ఉపయోగించే వెబ్‌సైట్‌ను ఎవరైనా ఉపయోగిస్తే గూగుల్‌ యూజర్‌ యొక్క ఐపీ అడ్రస్సును ట్రాక్‌ చేస్తుంది. గూగుల్‌ ఎనలిటిక్స్ ‌ను చాలా వెబ్‌సైట్లకు ఉపయోగిస్తుండటంతో, గూగుల్‌ అన్ని వెబ్‌సైట్లను సంబంధించిన విజిటర్స్‌ను ట్రాక్‌ చేయగలుగుతుంది, సిద్ధాంతపరంగా చెప్పాలంటే వెబ్‌కు సంబంధించిన ట్రాఫిక్‌లో అత్యధిక భాగాన్ని రియల్‌ టైమ్‌లో చూసేది గూగులే అని చెప్పాలి.

గూగుల్‌ బ్రౌజర్‌ ఫ్లగ్‌ఇన్‌ను విడుదల చేసింది. ఇది పేజ్‌ విజిట్‌కు సంబంధించిన సమాచారాన్ని గూగుల్‌కు పంపకుండా ఆపుతుంది. [10]

గూగుల్ విశ్లేషకులచే ఉపయోగించబడుచున్న చాలా ఎక్కువ ప్రొఫైల్ సైట్స్[మార్చు]

హై ప్రొఫైల్‌ సైట్లలో అంటే ప్రజాదరణ పొందిన పదివేల వెబ్‌సైట్లలో గూగుల్‌ ఎనలిటిక్‌ను ఉపయోగిస్తున్నవి 3813 లేదా 38.13 శాతం( అలెక్సా ర్యాంకుల ఆధారంగా)అని BackendBattles.com రిపోర్ట్ పేర్కొంటోంది.

ఇది కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

  1. "Usage of traffic analysis tools for websites". W3Techs. సంగ్రహించిన తేదీ 2009-12-10. 
  2. "Google Analytics Usage Statistics". BuiltWith. సంగ్రహించిన తేదీ 2010-02-17. 
  3. గూగుల్ అనలిటిక్స్ హెల్ప్: దస్ గూగుల్ అనలిటిక్స్ హావ్ ఎ పేజ్ వ్యూ లిమిట్?
  4. http://గూగుల్ బ్లాగ్.బ్లాగ్ స్పాట్.కాం/2006/02/హియర్ -కమ్స్-మెజర్-మాప్.html
  5. యు నౌ హావ్ యాక్సెస్ టు ద న్యు గూగుల్ అనలిటిక్స్! యట్ ద గూగుల్ అనలిటిక్స్ బ్లాగ్
  6. అనౌన్సింగ్ న్యు గ్రాఫింగ్ టూల్స్ అండ్ ga.js ట్రాకింగ్
  7. EU అండ్ US జావా స్క్రిప్ట్ దిసబుల్డ్ ఈన్దెక్ష్ నంబర్స్ + వెబ్ అనలిటిక్స్ డాటా కల్లెక్షన్ ఇంపాక్ట్
  8. ఇంక్రీజింగ్ యాక్యురచి ఫర్ ఆన్ లైన్ బిజినెస్ గ్రోత్ –ఎ వెబ్ అనలిటిక్స్ యాక్యురసి వైట్ పేపర్
  9. సిగ్మెంతెషన్ ఆప్షన్స్ ఇన్ గూగుల్ అనలిటిక్స్
  10. http://www.pcmag.com/ఆర్టికల్ 2/0,2817,2364174,00.asp "ఓప్ట్ అవుట్ అఫ్ గూగుల్ అనలిటిక్స్ డాటా గాదరింగ్ విత్ న్యు బీటా టూల్" బై క్లో అల్బెనిసియస్ మే 25, 2010
  • ప్లాజా, B (2009) మానిటరింగ్ వెబ్ ట్రాఫిక్ సోర్స్ ఎఫ్ఫెక్తివ్ నెస్ విత్ గూగుల్ అనలిటిక్స్: యాన్ ఎక్స్ పెరి మెంట్ విత్ టైం సీరీస్ . అస్లిబ్ ప్రొసీడింగ్స్ , 61(5): 474–482. ఆర్టికల్ URL: [1]
  • ప్లాజా, B (2009) యూసింగ్ గూగుల్ అనలిటిక్స్ ఫర్ మెజరింగ్ ఇన్లింక్స్ ఎఫ్ఫెక్తివ్ నెస్. ఎంపిఆర్ఎ పేపర్ నం. 19676. ఆర్టికల్ URL: http://ఎంపిఆర్ఎ.ub.uni-muenchen.de/19676/

వెలుపలి లింకులు[మార్చు]


మూస:Google Inc.