గూగుల్ డెస్క్‌టాప్
| Google Desktop | |
|---|---|
| Google Desktop's logo | |
| The GDS Sidebar sits on the user's desktop and displays relevant information. The GDS Sidebar sits on the user's desktop and displays relevant information. (Google Desktop on Microsoft Windows Vista) |
|
| అభివృద్ధిచేసినవారు | |
| సరికొత్త విడుదల | 5.9.1005.12335 |
| నిర్వహణ వ్యవస్థ | Cross-platform |
| రకము | Desktop search |
| లైసెన్సు | Proprietary |
| వెబ్‌సైట్ | desktop.google.com |
గూగుల్ డెస్క్‌టాప్ అనేది Linux, Mac OS X మరియు Microsoft Windows కోసం గూగుల్ తయారు చేసిన ఒక డెస్క్‌టాప్ శోధన సాఫ్ట్‌వేర్. ఈ ప్రోగ్రామ్ యూజర్లకు సంబంధించిన ఇ-మెయిళ్లు, కంప్యూటర్ ఫైళ్లు, మ్యూజిక్, ఫోటోలు, చాట్‌లు, వీక్షించిన వెబ్‌పేజీలు మరియు ఇతర "గూగుల్ వ్యవస్థల"ను శోధించడానికి అనుమతిస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] విశిష్టతలు
జనవరి, 2008 నాటికి, గూగుల్ డెస్క్‌టాప్ దిగువ తెలిపిన విశిష్టతలను కలిగి ఉంది:
[మార్చు] ఫైల్ ఇండెక్సింగ్
గూగుల్ డెస్క్‌టాప్‌ను తొలుత ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, కంప్యూటర్‌లోని అన్ని ఫైళ్ల యొక్క వర్గీకరణను ఈ సాఫ్ట్‌వేర్ పూర్తి చేస్తుంది. ప్రాథమిక వర్గీకరణ పూర్తయ్యాక, ఈ సాఫ్ట్‌వేర్ అవసరమైన విధంగా ఫైళ్ల వర్గీకరణను నిర్వహిస్తుంది. ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే యూజర్లు తమకు అవసరమైన ఫైళ్ల కోసం శోధించవచ్చు. శోధనలు జరిపిన తర్వాత, ఫలితాలు గూగుల్ డెస్క్‌టాప్ హోమ్ పేజీపైన ఒక ఇంటర్నెట్ బ్రౌజర్‌లో దర్శనమిస్తాయి. ఈ ఫలితాలు చాలావరకు గూగుల్ వెబ్ శోధనల మాదిరిగానే కన్పిస్తాయి.
ఇమెయిల్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మరియు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లకు సంబంధించిన వెబ్ బ్రౌజింగ్ చరిత్ర, ఓపెన్‌డాక్యుమెంట్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫార్మాట్‌లలోని ఆఫీస్ డాక్యుమెంట్లు, AOL, గూగుల్, MSN, స్కైప్, టెన్సెంట్ QQ మరియు వివిధ మల్టీమీడియా ఫైలు రకాల నుంచి ఇన్‌స్టాంట్ మెసెంజర్ లిఖితప్రతులు వంటి అనేక విభిన్న రకాల సమాచారాన్ని గూగుల్ డెస్క్‌టాప్ వర్గీకరించగలదు. ప్లగ్-ఇన్‌లను ఉపయోగించి, అదనపు ఫైలు రకాలను వర్గీకరించవచ్చు.[1] ప్రోగ్రామ్ వర్గీకరించిన వివిధ రకాల డాటాను నియంత్రించే విధంగా గూగుల్ డెస్క్‌టాప్ యూజర్‌కు అవకాశం కల్పిస్తుంది.
ప్రాథమిక వర్గీకరణ సమయంలో గూగుల్ డెస్క్‌టాప్ ఒక్కో డ్రైవ్‌కు 100,000 ఫైళ్లను మాత్రమే వర్గీకరిస్తుంది. ఒకవేళ యూజర్లు గనుక ఒక ప్రత్యేక డ్రైవ్‌లో 100,000 ఫైళ్లకు పైగా కలిగి ఉంటే, ఈ సమయంలో గూగుల్ డెస్క్‌టాప్ ఆయా ఫైళ్లన్నింటినీ గుర్తించదు. అయితే యూజర్లు ఫైళ్ల బదిలీ లేదా వాటిని తెరవాలని అనుకున్నప్పుడు, నిర్దిష్ట వర్గీకరణ సమయంలో గూగుల్ డెస్క్‌టాప్ వాటిని సూచికి జోడిస్తుంది.[2]
[మార్చు] సైడ్‌బార్
గూగుల్ డెస్క్‌టాప్‌లో ప్రబలమైన విశిష్టతగా సైడ్‌బార్‌ను చెప్పుకోవచ్చు. ఇది వివిధ సాధారణ వ్యవస్థలను డెస్క్‌టాప్‌కు ఒక భాగాన అమర్చుతుంది. గూగుల్ డెస్క్‌టాప్ యొక్క మైక్రోసాఫ్ట్ విండోస్ మరియు లైనక్స్ వెర్షన్లలో ఈ సైడ్‌బార్ లభ్యమవుతుంది. దిగువ తెలిపిన వ్యవస్థల్లో సైడ్‌బార్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది:
- ఇమెయిల్ – ప్యానల్‌గా చెప్పబడే ఇది ఒకరి Gmail సందేశాలను వీక్షించే విధంగా చేస్తుంది.
- స్క్రాచ్ ప్యాడ్ – ఇక్కడ గమనికల భద్రపరచవచ్చు. ఇవి స్వీయాత్మకంగా భద్రపరచబడతాయి.
- ఫోటోస్ – ఇది "మై పిక్చర్స్" ఫోల్డర్ (అడ్రస్ మార్చుకోవచ్చు)లోని ఛాయాచిత్రాల స్లైడ్‌షో (ఒక ఫోటో తర్వాత మరొకటి స్వీయాత్మకంగా ప్రదర్శితం కావడం)ని ప్రదర్శిస్తుంది.
- న్యూస్ – గూగుల్ న్యూస్ నుంచి తాజా వార్తలు మరియు అవి ఎంతకాలం ముందు రాయబడినవో చూపుతుంది. మీరు చదివే వార్తలను బట్టి, ఈ న్యూస్ ప్యానెల్ వ్యక్తిగతీకరించబడుతుంది.
- వెథర్ – యూజర్ గుర్తించిన ఒక ప్రదేశం యొక్క వాతావరణం చూపిస్తుంది.
- వెబ్ క్లిప్స్ – RSS మరియు Atom వెబ్ సమాచారాలకు సంబంధించి, అప్‌డేట్ చేసిన కంటెంట్‌ను చూపిస్తుంది.
- గూగుల్ టాక్ – గూగుల్ టాక్‌ను గనుక ఇన్‌స్టాల్ చేస్తే, సదరు విండో టైటిల్‌ను రెండుసార్లు నొక్కడం ద్వారా అది ఒకరి సైడ్‌బార్‌కు తీసుకెళుతుంది.
విండోస్ టాస్క్‌బార్ మాదిరిగా గూగుల్ డెస్క్‌టాప్ సైడ్‌బార్‌ను ఆటో-హైడ్ స్థితిలో ఏర్పాటు చేయొచ్చు. అది ఉంటున్న భాగం వైపుగా మౌస్ సూచిని యూజర్ తీసుకెళ్లడం ద్వారా మాత్రమే అది కన్పిస్తుంది. ఆటో-హైడ్ స్థితిలో లేకుంటే, యథాపూర్వస్థితిలో, సైడ్‌బార్ ఎల్లప్పుడూ స్క్రీన్‌లోని దాదాపు 1/6 – 1/9 భాగాన్ని (స్క్రీన్ రిజల్యూషన్ ఆధారంగా)ను ఆక్రమిస్తుంది. అందువల్ల ఇతర విండోల పరిమాణం నిర్బంధంగా మార్చబడుతుంది. అయితే తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించే విధంగా సైడ్‌బార్ పరిమాణాన్ని మళ్లీ కుదించవచ్చు. ఆప్షన్స్‌లోని "ఆల్వేస్ ఆన్ టాప్" విశిష్టతను యూజర్లు పనిచేయకుండా చేయొచ్చు. ఆటో-హైడ్ విశిష్టతను పనిచేసే స్థితిలో ఉంచడం ద్వారా సైడ్‌బార్ తాత్కాలికంగా పెద్దవిగా చేయబడిన విండోలపై ఆవరిస్తుంది.
సైడ్‌బార్‌లోని మరో విశిష్టత అలెర్ట్స్. సైడ్‌బార్ కుదించబడినప్పుడు, విండోస్ టాస్క్‌బార్ పైభాగంలోని ఒక పాప్-అప్ విండోపై కొత్త ఇ-మెయిల్ మరియు న్యూస్ దర్శనమిస్తుంది.
[మార్చు] క్విక్ ఫైండ్
సైడ్‌బార్, డెస్క్‌బార్ లేదా ఫ్లోటింగ్ డెస్క్‌బార్‌లో శోధిస్తున్నప్పుడు, గూగుల్ డెస్క్‌టాప్ ఒక "క్విక్ ఫైండ్" విండోని ప్రదర్శిస్తుంది. ఈ విండో యూజర్ కంప్యూటర్‌లోని అత్యంత సుసంగతమైన ఫలితాల్లో ఆరింటిని (యథాపూర్వస్థితిగా) కలిగి ఉంటుంది. యూజర్ టైపు చేయడం ద్వారా ఈ ఫలితాలు అప్‌డేట్ చేయబడుతాయి. అంతేకాక మరో బ్రౌజర్ విండోని తెరవకుండా ఉపయోగించుకునే విధంగా యూజర్‌ను అనుమతిస్తాయి.
[మార్చు] డెస్క్‌బార్స్
డెస్క్‌బార్స్ అనేవి బాక్సులు (డబ్బాలు) మాదిరిగా ఉంటాయి. ఇవి డెస్క్‌టాప్ నుంచి నేరుగా శోధించే విధంగా అనుమతిస్తాయి. వెబ్ ఫలితాలు ఒక బ్రౌజర్ విండోలో దర్శనమిస్తాయి. అలాగే ఎంపికచేసిన కంప్యూటర్ ఫలితాలు "క్విక్ ఫైండ్" బాక్సు (పైన చూడండి)లో కన్పిస్తాయి. డెస్క్‌బార్ అనేది విండోస్ టాస్క్‌బార్‌లో స్థాపితమయ్యే ఒక నిర్దిష్ట డెస్క్‌బార్ లేదా డెస్క్‌టాప్‌పై ఎక్కడైనా ఏర్పాటు చేయగలిగే ఒక ఫ్లోటింగ్ డెస్క్‌బార్‌గా ఉంటుంది.
[మార్చు] ఇమెయిల్ ఇండెక్సింగ్
గూగుల్ డెస్క్‌టాప్‌లో ప్లగ్-ఇన్‌లు ఉంటాయి. ఇవి స్థానిక మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, IBM లోటస్ నోట్స్ మరియు మొజిల్లా థండర్‌బర్డ్ ఇమెయిల్ డాటాబేస్‌ల మరియు శోధన పనులకు అంతర్గతంగా నిర్మించిన క్లయింట్ అప్లికేషన్ల వెలుపల కంటెంట్లను వర్గీకరించడం మరియు శోధించడానికి అవకాశం కల్పిస్తాయి. లోటస్ నోట్స్‌కు సంబంధించి, శోధనకు స్థానిక డాటాబేస్‌లు మాత్రమే వర్గీకరించబడతాయి. గూగుల్ డెస్క్‌టాప్ యొక్క ఇమెయిల్ ఇండెక్సింగ్ విశిష్టత గూగుల్ యొక్క వెబ్ ఆధారిత ఇమెయిల్ సర్వీసు, Gmailతో పాటు కలిసి ఉంటుంది. Gmail ఖాతాల్లోని ఇమెయిల్ సందేశాలను ఇది వర్గీకరించడం మరియు శోధించడం చేయగలదు.
[మార్చు] వ్యవస్థలు & ప్లగ్-ఇన్స్
- ప్రధాన వ్యాసం: Google Gadgets
డెస్క్‌టాప్ వ్యవస్థలు ప్రతిస్పందించే చిన్న-అప్లికేషన్లు. వీటిని యూజర్ యొక్క డెస్క్‌టాప్‌పై ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు లేదా కొత్త ఇమెయిల్, వాతావరణం, ఫోటోలు మరియు వ్యక్తిగతీకరించిన వార్తలను చూపించడానికి సైడ్‌బార్‌లో ఉంచవచ్చు. పూర్వ నిర్మిత వ్యవస్థల యొక్క గ్యాలరీని అధికారిక వెబ్‌సైటు నుంచి డౌన్‌లోడ్ చేసుకునే విధంగా గూగుల్ అవకాశం కల్పిస్తోంది. డెవలపర్లకు, ఒక SDK మరియు గూగుల్ డెస్క్‌టాప్ కోసం వ్యవస్థలు లేదా ప్లగ్-ఇన్‌లను రాయాలనుకున్న ఎవరికైనా ఒక అధికారిక బ్లాగును గూగుల్ అందిస్తోంది. ఒక స్వీయాత్మక వ్యవస్థ "గూగుల్ డెస్క్‌టాప్ హాల్ ఆఫ్ ఫేమ్" పేరుతో ఒక డెవలపర్ అధిక్రమాన్ని సృష్టిస్తుంది. అక్కడ ప్రోగ్రామర్లు వారి వ్యవస్థల యొక్క సంఖ్య మరియు ఆదరణను బట్టి, ఆధిక్యతను సాధించవచ్చు.
గూగుల్ డెస్క్‌టాప్ సెర్చ్ అందించే శోధన సదుపాయాలను ఉపయోగించుకునేలా తృతీయ పక్ష అప్లికేషన్లను SDK కూడా అనుమతిస్తుంది. ఉదాహరణకు, ఫైల్ మేనేజర్ డైరెక్టరీ ఓపస్ సంస్థీకరించిన గూగుల్ డెస్క్‌టాప్ సెర్చ్ మద్దతును అందిస్తుంది.
[మార్చు] ఫలితాల జాబితా: టైటిల్ మేటా-డాటా
ఫైళ్ల సమాచారాన్ని ఇతర డెస్క్‌టాప్ సెర్చ్ ప్రోగ్రామ్‌లు శోధించగలిగినప్పటికీ, గూగుల్ డెస్క్‌టాప్ (విండోస్‌కు) మాత్రమే దాని మొత్తం ఫైళ్ల (లైనక్స్‌లో html ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే చూపుతుంది. అదే pdf ఫైళ్ల సమాచారాన్ని చూపదు) యొక్క ఫలితాల జాబితా కోసం "టైటిల్" ట్యాగును ఉపయోగిస్తోంది. ఇతర ప్రోగ్రామ్‌లు వాటి ఫలితాల జాబితాకు ఫైలు పేర్లను ఉపయోగించుకుంటాయి. "టైటిల్" ట్యాగు వినియోగం అనేది ప్రత్యేకంగా ఒక అత్యుత్తమ యూజర్ అనుభూతిని అందిస్తుంది. అందువల్ల మేటాడాటా టైటిళ్లు (ఉనికిలో ఉన్నప్పుడు) సాధారణ భాషలోనే రాయబడుతాయి. అదే ఫైలు పేర్లు మాత్రం తెలియచెప్పే విధంగా ఉంటాయి. ఒక ఫైలు నుంచి టైటిల్ మేటాడాటా తప్పిపోయినప్పుడు, గూగుల్ డెస్క్‌టాప్ దాని ఫైలు పేరును ఉపయోగించుకునే విధంగా మళ్లీ పూర్వస్థితికి తెస్తుంది.
[మార్చు] విడుదల చరిత్ర
నిజానికి గూగుల్ శోధనకు సంబంధించిన టెక్నాలజీని డెస్క్‌టాప్‌కు తీసుకొచ్చే ఉద్దేశంతో గూగుల్ డెస్క్‌టాప్ అభివృద్ధి చేయబడింది. గూగుల్ యాజమాన్య శోధన ఆల్గోరిథం యొక్క రివర్స్ ఇంజినీరింగ్‌ను అనుమతించే అవకాశం ఉన్నందున గూగుల్ డెస్క్‌టాప్ అందరి దృష్టిని ఆకర్షించింది.
యూజన్ అనుభవాన్ని విక్రేత యొక్క ఉపకరణంతో చేర్చే ఒక కేంద్రీయ నియంత్రిత వెర్షన్[3] కూడా ఉంది.
- మైక్రోసాఫ్ట్ విండోస్
- గూగుల్ డెస్క్‌టాప్ సెర్చ్ మొదటి విడుదల ఒక బీటా వెర్షన్‌గా 14 అక్టోబరు 2004న విడుదలయింది.[4]
- వెర్షన్ 2 కూడా ఒక బీటా వెర్షన్‌గా 22 ఆగస్టు 2005న విడుదలయింది. డెస్క్‌టాప్ నుంచి డెస్క్‌టాప్ 2ని వేరుగా చూపించే కొత్త విశిష్టతగా సైడ్‌బార్ జోడింపును చెప్పుకోవచ్చు. ఇది వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని చూపే ఒక ప్యానెల్. దీనిని విండోస్ డెస్క్‌టాప్ యొక్క ఏదో ఒక భాగాన ఏర్పాటు చేయొచ్చు. ఇది తాజా వార్తలు, ఇమెయిల్, ఫోటోలు, స్టాకులు మరియు వాతావరణంను చూపిస్తుంది. సైడ్‌బార్‌లో ఒక శోధన బాక్సు ఉంటుంది. ఇది PC లేదా గూగుల్ యొక్క ఇతర శోధన రకాల (అంటే వెబ్, ఇమేజెస్, న్యూస్, గ్రూప్స్ వంటివి)ను మాత్రమే శోధించగలదు. 3 నవంబరు 2005న బీటా వెర్షన్ నుంచి తయారు చేసిన గూగుల్ డెస్క్‌టాప్ 2 విడుదలయింది. గూగుల్ మ్యాపులు మరియు మరింత ప్లగ్-ఇన్ డెవలపర్ మద్దతును కొత్త విశిష్టతలుగా చెప్పొచ్చు.[5]
- అదే విధంగా గూగుల్ డెస్క్‌టాప్ 3 బీటా వెర్షన్ 9 ఫిబ్రవరి 2006న విడుదలయింది. ఇందులో ఒక నెట్‌వర్క్‌పై పలు కంప్యూటర్లను శోధించే సదుపాయం ఉంది.[6] బీటా నుంచి తయారు చేసిన గూగుల్ డెస్క్‌టాప్ 3 వెర్షన్ 14 మార్చి 2006న విడుదలయింది. ఇందులో ముఖ్యంగా క్విక్ సెర్చ్ బాక్సును చెప్పుకోవాలి. "కంట్రోల్" కీని రెండుసార్లు నొక్కిన తర్వాత ఇది డెస్క్‌టాప్‌పై ఎక్కడైనా కన్పిస్తుంది.[7]
- గూగుల్ డెస్క్‌టాప్ 4 బీటా 10 మే 2006న విడుదలయింది. ఇందులో వరుస సమాచారాన్ని విడుదల చేసే గూగుల్ వ్యవస్థలు (గ్యాడ్జెట్స్), మాడ్యుళ్లు ఉన్నాయి. శోధన ఫలితాల ద్వారా తొలగించిన ఫైళ్లను స్వీయాత్మకంగా తీసివేసే సదుపాయాన్ని కూడా ఇది అందించింది.[8] బీటా నుంచి అభివృద్ధి చేయబడిన గూగుల్ డెస్క్‌టాప్ 4 వెర్షన్ 27 జూన్ 2006న విడుదలయింది.
- గూగుల్ డెస్క్‌టాప్ v4.5 నవంబరు 14, 2006న విడుదలయింది. ఇది సైడ్‌బార్ మరియు "ఫ్లోటింగ్" (తేలియాడే) వ్యవస్థలకు పారదర్శక సౌందర్యాన్ని అందించింది. సైడ్‌బార్ యొక్క రేఖాత్మక ఇంటర్‌ఫేస్ కూడా వార్తలు, స్టాకులు, వాతావరణం, ఫోటోలు మొదలైన వాటిని సూచించే అత్యంత ఆకర్షణీయమైన ఐకాన్లతో అభివృద్ధి చేయబడింది. రిలీజ్ 4.5 కూడా విండోస్ విస్టాకు అదనపు మద్దతుగా చెప్పొచ్చు.
- గూగుల్ డెస్క్‌టాప్ 5 బీటా 6 మార్చి 2007న విడుదలయింది.
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.1 (డెస్క్‌టాప్ 5 బీటా విడుదల తర్వాత రిలీజైన మొట్టమొదటిది) 27 ఏఫ్రిల్ 2007న డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అందుబాటులోకి వచ్చింది.[9]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.5 వెర్షన్ 2 అక్టోబరు 2007న విడుదలయింది.[9]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.5 (5.7.0802.22438) 29 ఫిబ్రవరి 2008న విడుదలయింది.[9]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.5 (5.8.0806.18441) 1 జులై 2008న విడుదలయింది.[9]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.8 (5.8.0809.08522) 11 సెప్టెంబరు 2008న విడుదలయింది.[9]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.8 (5.8.0809.23506) 5 అక్టోబరు 2008న విడుదలయింది.[9]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.9 (5.9.0906.04286) 8 జులై 2009న విడుదలయింది. క్రోమ్ బ్రౌజర్‌కు ఇది మద్దతును అందించింది. అంతేకాక ఇది విడుదల గమనికల్లో తెలిపిన ఆఖరి వెర్షన్.[9]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.9.0909.02235 అనేది ఫైర్‌ఫాక్స్ 3 మరియు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ యొక్క ప్రైవేటు బ్రౌజింగ్ విశిష్టతలకు మద్దతిచ్చింది.[10]
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.9.0909.30391 విడుదలయింది.
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.9.0911.03589 విడుదలయింది.
- గూగుల్ డెస్క్‌టాప్ v 5.9.1005.12335 మే, 2010లో విడుదలయింది.
- మ్యాక్
- ఏప్రిల్ 2007లో, Mac OS X కోసం డెస్క్‌టాప్ 1.0ను గూగుల్ విడుదల చేసింది. ఇది Mac OS X v10.4లోని స్పాట్‌లైట్ సెర్చ్ టూల్‌తో పాటు పనిచేయగలదు.[11]
- 20 నవంబరు 2007న, Mac OS X,[12] కోసం డెస్క్‌టాప్ v 1.4.0.826 బీటాను గూగుల్ విడుదల చేసింది. వ్యవస్థలకు మద్దతు కోసం దీనిని డాష్‌బోర్డ్‌లో ఏర్పాటు చేస్తారు.
- గూగుల్ డెస్క్‌టాప్‌కు చెందిన మ్యాక్ వెర్షన్ యొక్క వెర్షన్ 1.6 స్నో లియోపార్డ్ కింద పనిచేయదు. 27 మే 2010 నాటికి అందిన సమాచారం ప్రకారం, స్నో లియోపార్డ్ సపోర్డ్‌కు ఒక అప్‌డేట్‌ను విడుదల చేయలేదు.
- లైనక్స్
- 27 జూన్ 2007న లైనక్స్ కోసం డెస్క్‌టాప్ 1.0ను గూగుల్ విడుదల చేసింది.[13] ఇది ప్రస్తుతం విండోస్ వెర్షన్ యొక్క ప్రధాన ప్రయోజకత్వాన్ని కలిగి ఉంది. అయితే ఇందులో సైడ్‌బార్ ప్రయోజకత్వం (ఫంక్షనాలిటీ) లేదు.
- వెర్షన్ 1.1.1.0075 ద్వారా లైనక్స్ కోసం రూపొందించిన గూగుల్ డెస్క్‌టాప్‌కు 64-బిట్ సపోర్ట్‌ను గూగుల్ చేర్చింది.[14]
- 11 ఏప్రిల్ 2008న లైనక్స్ యొక్క గూగుల్ డెస్క్‌టాప్ వెర్షన్ విడుదలయింది.[14]
[మార్చు] విమర్శలు
[మార్చు] భద్రత
ఫిబ్రవరి, 2007లో వాచ్‌ఫైర్‌కి చెందిన యాయిర్ అమిత్ గూగుల్ డెస్క్‌టాప్‌లోని వరుస దుర్బలత్వాలను[15] గుర్తించారు. ఇవి ఒక ప్రమాదకర వ్యక్తి సున్నితమైన సమాచారాన్ని రిమోట్, నిరంతర ప్రయత్నం ద్వారా పొందడమే కాక కొన్నిసార్లు మొత్తం సిస్టమ్‌పై నియంత్రణ సాధించే విధంగా అనుమతిస్తాయి. గణనీయమైన ప్రభావం మరియు తేలికగా దోపిడీకి అవకాశం ఉండటం గూగుల్‌ను గూగుల్ డెస్క్‌టాప్ వెర్షన్ 5లోని కొన్ని గూగుల్ డెస్క్‌టాప్ యొక్క తర్కాన్ని మార్చే విధంగా ప్రోత్సహించింది.
[మార్చు] గోప్యత
- చూడండి: Criticism of Google#Privacy
ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్ (EFF) వంటి అనేక గోప్య మరియు పౌర స్వతంత్రతల గ్రూపులు వ్యక్తుల కంప్యూటర్‌పై ఉండే వ్యక్తిగత సమాచారం యూజర్ల హార్డ్ డ్రైవ్‌ల నుంచి శరవేగంగా కాపీ చేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.[16]
గూగుల్ డెస్క్‌టాప్ వెర్షన్ 3లోని కొన్ని విశిష్టతలు తీవ్రమైన భద్రతా పరమైన మరియు గోప్యతా ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా, డెస్క్‌టాప్ నుంచి డెస్క్‌టాప్‌కు కంటెంట్‌ను శోధించే సామర్థ్యాన్ని ఆవిష్కరించిన షేర్ ఎక్రాస్ కంప్యూటర్స్ విశిష్టత యూజర్ గోప్యతకు ప్రమాదం వాటిల్లేటట్లు చేస్తోంది. గూగుల్ డెస్క్‌టాప్ V.3 అనేది సెర్చ్ ఎక్రాస్ కంప్యూటర్స్ ను అనుమతించేటట్లయితే, గుర్తించిన కంప్యూటర్‌పై ఉండే ఫైళ్లు గూగుల్ సర్వర్లకు కాపీ చేయబడతాయి. ఒకవేళ వాటి కంప్యూటర్లపై గూగుల్ డెస్క్‌టాప్ వెర్షన్ 3 యొక్క ఈ విశిష్టతను అవి పనిచేసే విధంగా చేస్తే, ఇతరుల చేత ఉపయోగించుకోబడే వాటి కంప్యూటర్లపై ఉండే సమాచార సంభావ్యత అనేది తీవ్రమైనదిగా పరిగణించాలి. అందువల్ల ఈ విశిష్టతను వినియోగించవద్దని EFF సూచిస్తోంది.[16] అంతేకాక క్షేత్ర లేదా ఇంట్లోని కంప్యూటర్లపై రహస్య సమాచారం కలిగి ఉన్న వారు ఈ విశిష్టతను పని చేయించరాదు. ఈ విశిష్టతను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా గోప్యతా చట్టాలు మరియు కంపెనీ పాలసీలు ఉల్లంఘించబడే అవకాశముంది. ముఖ్యంగా, SB 1386, HIPAA, FERPA, GLBA మరియు సర్బేన్స్-ఆక్స్‌లీ వంటివి.[17]
అలాగే ప్యాకేజింగ్ మరియు అంతిమ వినియోగదారు అనుమతి ఒప్పందం పరంగా కూడా ఆందోళనలు తలెత్తవచ్చు. ప్రధానంగా, స్థానిక యంత్రంపై చొరబాటు స్థాయి మరియు డిస్‌క్లెయిమర్లు (ఖండనలు). అంటే యూజర్లు భవిష్యత్‌లో చేపట్టబోయే మార్పులను నిజానికి చూడకుండానే వాటికి తాము ఒప్పుకుంటున్నామంటూ అవ్యక్తంగా ఒప్పేసుకోవడం.[18][19]
[మార్చు] అవుట్‌లుక్ ఇండెక్సింగ్
మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఇండెక్సింగ్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి.[20] తొలగించిన ఇమెయిల్ జాబితాలు దూరం చేయబడవు మరియు ఏదైనా కొత్త ఆర్కైవ్డ్ మెయిల్ జాబితాగా చేర్చబడేందుకు గూగుల్ డెస్క్‌టాప్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరముంది. అవుట్‌లుక్ ఇండెక్సింగ్ కోసం వివిధ వెర్షన్లు విడుదల చేయబడ్డాయి.[21] 2009 ప్రథమార్థంలో, ఇండెక్స్ ఫైలు పరిమాణం సుమారు 4GBకి చేరగానే ఈ ఉత్పత్తి ఇండెక్సింగ్‌ను ఆపేసిందని గూగుల్ డెస్క్‌టాప్ యూజర్లు భారీ సంఖ్యలో ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి అన్‌ఇన్‌స్టాల్ (భౌతికంగా ఇండెక్స్‌లను తొలగించడం సహా) మరియు తర్వాత తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఈ సమస్యకు తాత్కాలికంగా కళ్లెం వేయొచ్చు. అయితే ఇండెక్స్ ఫైలు పరిమాణం గనుక తిరిగి 4GBకి చేరితే, సమస్య పునరావృతమవుతుంది. ఈ సమస్య గూగుల్ డెస్క్‌టాప్ సెర్చ్ వెర్షన్ 5.9లో పరిష్కరించబడింది.[22] ప్రస్తుతం అవుట్‌లుక్ 2010 బీటాలోని ఇమెయిల్ లేదా కాంటాక్టులను గూగుల్ డెస్క్‌టాప్ సూచించదు. [23]
[మార్చు] వీటిని కూడా చూడండి
- డెస్క్‌టాప్ సర్చ్
- డెస్క్‌టాప్ సెర్చ్ ఇంజిన్స్ యొక్క జాబితా
- గూగుల్ సేవలు మరియు సాధనాల జాబితా
[మార్చు] సూచనలు
- ↑ All Indexing Plugins. తీసుకొన్న తేదీ: 2007-10-22.
- ↑ ఐ కాంట్ ఫైండ్: ఫైల్స్ – విండోస్ సహాయం కై డెస్క్‌టాప్ – గూగుల్
- ↑ ఏంట్రప్రైస్ ఏడిషన్ లక్షణములు
- ↑ గూగుల్ ప్రెస్ సెంటర్: ప్రెస్ విడుదల
- ↑ అధికారిక గూగుల్ బ్లాగ్: డెస్క్‌టాప్ గ్రోస్ అప్
- ↑ అధికారిక గూగుల్ బ్లాగ్: డెస్క్‌టాప్ లో కొత్తది
- ↑ అధికారిక గూగుల్ బ్లాగ్: Ctrl Ctrl తో ఉండుము
- ↑ అధికారిక గూగుల్ బ్లాగ్: యస్, వి ఆర్ స్టిల్ ఆల్ అబౌట్ సెర్చ్
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 Latest Updates for Google Desktop.
- ↑ Indexing issues: Private Browsing Mode in IE8 or Firefox 3.5 Beta. Google. తీసుకొన్న తేదీ: 30 జూలై 2010.
- ↑ Mike Pinkerton (2007-04-04). Google Desktop for Mac. Official Google Mac Blog. తీసుకొన్న తేదీ: 2007-04-19.
- ↑ Google (November 28, 2007). "Where can I obtain a list of known issues or release notes?" – "Current Version". Desktop for Mac Help Center. తీసుకొన్న తేదీ: 2007-11-29.
- ↑ Google (2007-06-27). Google Desktop for Linux. Google Desktop for Linux. తీసుకొన్న తేదీ: 2007-07-27.
- ↑ 14.0 14.1 Where can I obtain a list of known issues or release notes?. Google Inc..
- ↑ ఓవర్టేకింగ్ గూగుల్ డెస్క్‌టాప్ (ప్రత్యామ్నాయ లింక్)
- ↑ 16.0 16.1 ప్రెస్ విడుదల: ఫిబ్రవరి, 2006 | ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్
- ↑ మోర్ వర్రీస్ అబౌట్ గూగుల్ డెస్క్‌టాప్ 3 – ఇంటర్నెట్ – వార్తలు – ZDNet ఆసియా
- ↑ http://rixstep.com/2/20070621,00.shtml గూగుల్ డెస్క్‌టాప్ ట్రాక్డ్: సేవా షరతులు (గూగుల్ కు స్వాగతం)
- ↑ http://rixstep.com/2/20070621,05.shtml గూగుల్ డెస్క్‌టాప్ ట్రాక్డ్: ది ఆఫ్టర్మత్
- ↑ అవుట్ లుక్ ఈన్దెక్ష్ మరియు సెర్చ్
- ↑ గూగుల్ డెస్క్‌టాప్ లో కడపటి కి తెలిసిన అబ్బందులు
- ↑ గూగుల్ డెస్క్‌టాప్ సపోర్ట్ థ్రెడ్
- ↑ [1]