గూగుల్ యాప్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Google Apps
Google Apps logo
250px
Google Apps Online Control Panel
Developer(s) Google Inc.
Operating system Any (Web-based application)
Type Web productivity tools
License Proprietary
Website www.google.com/apps

Google Apps (గూగుల్ యాప్స్) అనేది గూగుల్ (Google) అందిస్తున్న ఒక సేవ, ఇది గూగుల్ యొక్క అనేక ఉత్పత్తులను ఒక విశిష్ట డొమైన్ పేరుతో స్వతంత్ర నిర్దేశిత రూపాల్లో అందిస్తుంది. ఇది సాంప్రదాయిక ఆఫీస్ స్యూట్‌ల మాదిరిగానే సారూప్య క్రియతో అనేక వెబ్ అనువర్తనాలను కలిగివుంటుంది, అవి: జిమెయిల్ (Gmail), గూగుల్ గ్రూప్స్ (Google Groups), గూగుల్ వేవ్ (Google Wave), గూగుల్ క్యాలెండర్ (Google Calendar), టాక్ (Talk), డాక్స్ (Docs) మరియు సైట్‌లు (Sites).

ప్రామాణిక ఎడిషన్ ఉచితంగా అందుబాటులో ఉంది, సాధారణ జిమెయిల్ ఖాతాకి ఉన్నంత నిల్వ ప్రామాణిక ఎడిషన్ కూడా అందిస్తుంది.[1] అదనపు ఇ-మెయిల్ స్టోరేజ్‌ను అందించే ప్రీమియర్ ఎడిషన్ వార్షిక రుసుముతో అందుబాటులో ఉంది. ఉచితంగా అందుబాటులో ఉన్న ఎడ్యుకేషన్ ఎడిషన్‌లో ప్రామాణిక మరియు ప్రీమియర్ ఎడిషన్‌లలోని సౌకర్యాలు కలిసి ఉంటాయి.

చరిత్ర[మార్చు]

 • మే 24, 2010:

తరువాతి తరంలో (US ఇంగ్లీష్‌లో మాత్రమే) గూగుల్ యాప్స్ అందించే డొమైన్‌లకు గూగుల్ వేవ్ అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది. గూగుల్ వేవ్ అనేది ఒక ప్రత్యక్ష, పంచుకునే వీలున్న ప్రదేశం, దీనిలో మెరుగైన అమర్పులతో ఉన్న టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, మ్యాప్‌లు మరియు మరిన్ని సౌకర్యాలను ఉపయోగించి వ్యక్తులు చర్చ జరిపే వీలుండటంతోపాటు, కలిసి పనిచేయవచ్చు.[2] తాజా సమాచారం: 2 నెలల తరువాత, ఆగస్టు 4, 2010న, గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యుర్స్ హోల్జెల్ గూగుల్ వేవ్ అభివృద్ధిని తమ కంపెనీ నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.[3]

 • సెప్టెంబరు 15, 2009:

గూగుల్ GovCloud (గోవ్‌క్లౌడ్)ను అందించనున్నట్లు ప్రకటించింది, రాష్ట్ర మరియు దేశ భద్రతా ప్రమాణాలను అనుగుణంగా ఇది విస్తృతమైన సంకేతీకరణతో ఒక ప్రత్యేక సమాచార పర్యావరణంలో గూగుల్ యాప్స్‌ను నిర్వహిస్తుంది. [4]

 • జులై 7 2009:

గూగుల్ యాప్స్ పరిధిలోని అన్ని సేవలను గూగుల్ 'బీటా' స్థాయి నుంచి మెరుగుపరిచింది.[5]

 • జూన్ 9, 2009:

మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ (Microsoft Outlook) కోసం గూగుల్ యాప్స్ సింక్‌ను గూగుల్ పరిచయం చేసింది, దీని ద్వారా మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ సర్వర్ (Microsoft Exchange Server)పై నడుస్తున్న కంపెనీలు వారి ఇమెయిల్ బాక్స్‌లను ఎక్స్ఛేంజ్ నుంచి గూగుల్ యాప్స్‌కు మార్చుకునేందుకు వీలు ఏర్పడింది.[6][7].

 • ఏప్రిల్ 1, 2009:

మెయిల్ అంతర్ముఖానికి గూగుల్ థీమ్ మద్దతు జోడించింది[8][9].

 • జనవరి 29, 2009:

గూగుల్ ల్యాబ్స్ స్యూట్‌కు గూగుల్ యాప్స్‌ను గూగుల్ జోడించింది. దీని ద్వారా వినియోగదారులు వారి ఇన్‌బాక్స్‌లకు 'ఆఫ్‌లైన్', 'టాస్క్స్', 'వెకేషన్ టైమ్!' వంటి గాడ్జెట్‌లను (ఉపయోగపడే అమర్పులు) జోడించే వీలు ఏర్పడింది.[10]

 • జనవరి 14, 2009:

ప్రామాణిక ఎడిషన్ డొమైన్‌లకు అదనపు వినియోగదారులను జోడించుకునే వెసులుబాటును తొలగించడంతోపాటు, నూతన ప్రామాణిక ఎడిషన్ డొమైన్‌లకు అదనపు వినియోగదారులను జోడించుకునే అవకాశాన్ని 50 వినియోగదారులకు (గతంలో 100 వరకు ఉన్న ఈ సౌలభ్యాన్ని 50కి తగ్గించింది) పరిమితం చేసింది.

 • డిసెంబరు 1, 2008:

పుటను ప్రారంభించే (స్టార్ పేజ్) ఆప్షన్‌ను గూగుల్ కొత్త గూగుల్ యాప్స్ ఖాతాలకు తొలగించింది. కొత్త వినియోగదారులను సైట్‌లను ఉపయోగించేందుకు మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

 • సెప్టెంబరు 2008:

నూతన గూగుల్ యాప్స్ దరఖాస్తుదారులకు అందుబాటులో ఉండే సేవల నుంచి గూగుల్ పేజ్ క్రియేటర్ మరియు ఫైల్ అప్‌లోడర్‌లను తొలగించింది.

 • ఫిబ్రవరి 28, 2008:

గూగుల్ సైట్స్ గూగుల్ యాప్స్ ద్వారా అందించే డొమైన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గూగుల్ ప్రకటించింది. గూగుల్ సైట్స్ వెబ్‌సైట్‌ల భాగస్వామ్య ఎడిటింగ్‌కు, వినియోగదారులు తమ సైట్‌లోకి ఛాయాచిత్రాలు మరియు వీడియోలను ఎగుమతి (అప్‌లోడ్) చేసేందుకు వీలు కల్పిస్తాయి.[11]

 • అక్టోబరు 12, 2007:

గూగుల్ యాప్స్‌ను ఉపయోగిస్తున్న డొమైన్‌లకు ఇ-మెయిల్ నిల్వప్రదేశాన్ని (స్టోరేజ్) పెంచనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ప్రీమియర్ ఎడిషన్ ఖాతాలకు ఇప్పుడు ఒక్కోదానికి 25 GB నిల్వప్రదేశం (గతంలో 10 GB) అందుబాటులో ఉంది. ప్రామాణిక మరియు ఎడ్యుకేషన్ ఎడిషన్ ఖాతాలకు కూడా దీనిని పెంచారు (గతంలో 2 GB ఉండగా, ఆగస్టు 2008నాటికి అది 7 GBకి పెంచారు).[1]

 • అక్టోబరు 3, 2007:

ఇటీవల-సేకరించిన పోస్టినీ అందించే "భద్రత, అమలు, విధాన నిర్వహణ మరియు సందేశ పునఃప్రాప్తి సేవల"ను గూగుల్ ప్రీమియర్ ఎడిషన్‌లో చేర్చనున్నట్లు గూగుల్ ప్రకటించింది.[12][13]

 • జూన్ 2007:

గూగుల్ యాప్స్‌కు IMAP ఇమెయిల్ సేవల నుంచి ఇమెయిల్ బదిలీని జోడించారు.[14]

 • ఫిబ్రవరి 22, 2007:

వ్యాపారం కోసం గూగుల్ ఒక ప్రీమియర్ ఎడిషన్‌ను ప్రారంభించింది, అన్ని గూగుల్ యాప్స్ సేవలకు బహిరంగంగా నమోదును కూడా ఆరంభించింది. ఇదే సమయంలో, అన్ని ఉత్పత్తులను ఏకీకృతం చేసింది, ఆన్‌లైన్ నియంత్రణ సమితికి పునఃరూపకల్పన చేసింది.

 • అక్టోబరు 2006:

ఈ సేవకు నమోదు చేసుకునేందుకు గూగుల్ విద్యా సంస్థలకు వీలు కల్పించింది, ఈ సేవకు గూగుల్ యాప్స్ ఫర్ ఎడ్యుకేషన్ అనే పేరుపెట్టింది. గూగుల్ యాప్స్ యొక్క ఒక భారీ అమలు కెనడాలోని ఓంటారియాలో ఉన్న థండర్ బే‌లోని లేక్‌హీడ్ యూనివర్శిటీలో జరిగింది, ఇక్కడ 38,000 మంది ఖాతాదారులు జిమెయిల్ మరియ ఇన్-బ్రౌజర్ IM సౌలభ్యాలు కలిగివున్నారు.[15]

 • ఆగస్టు 2006:

గూగుల్ ఈ సేవను విస్తరించి, గూగుల్ యాప్స్ ఫర్ యువర్ డొమైన్‌ను అభివృద్ధి చేసింది, దీనిలో మరిన్ని ఇటీవల కాలానికి చెందిన గూగుల్ సేవలను చేర్చింది, దీనిలో గూగుల్ క్యాలెండర్, గూగుల్ టాక్ మరియు గూగుల్ పేజ్ క్రియేటర్, తదితరాలు చేర్చబడ్డాయి. తరువాత, గూగుల్ అన్ని ఖాతాలకు "స్టార్ పేజ్"ను జోడించింది, ఇది వారి ఐగూగుల్ (iGoogle) సేవ ఆధారంగా పనిచేస్తుంది.

 • ఫిబ్రవరి 2006:

ఆహ్వానంపై మాత్రమే అందుబాటులో ఉండే బీటాతో జిమెయిల్ ఫర్ యువర్ డొమైన్‌ను గూగుల్ సృష్టించింది, ఇది ఒక విశిష్ట డొమైన్ పేరుతో జిమెయిల్‌ను ఉపయోగించే వీలు కల్పిస్తుంది. దీనిలో 2 GB ఇ-మెయిల్ నిల్వప్రదేశం మరియు అనేక ప్రామాణిక జిమెయిల్ సౌకర్యాలు ఉంటాయి.

ఎడిషన్‌ల మధ్య వ్యత్యాసాలు[మార్చు]

ప్రతి ఎడిషన్‌లోనూ ఒక నిర్దిష్ట సమయంలో క్రియాశీలంగా ఉండే వినియోగదారుల సంఖ్యపై పరిమితి ఉంటుంది. గూగుల్ యాప్స్ 200 మంది ఖాతాదారులతో ఒక స్థిరమైన (డిఫాల్ట్) వినియోగదారు కేటాయింపుతో ప్రారంభమైంది, ఇది తరువాత కొద్దికాలానికే 100 మంది వినియోగదారులకు పరిమితం చేయబడింది. అంతేకాకుండా, ఖాతాదారులు ఆమోదానికి 1-2 వారాలు (కనీసం) సమయంపట్టే ఒక క్రమమైన ప్రక్రియ ద్వారా తమ పరిమితిని పెంచుకోవచ్చు. జనవరి2009లో, ఈ పరిమితి మార్చబడింది, తద్వారా అన్ని కొత్త ఖాతాలు కేవలం 50 మంది ఖాతాదారులను మాత్రమే పొందుతాయి, 100 వరకు పరిమితి ఉన్న ఖాతాదారుల మాదిరిగా కాకుండా, కొత్తవారు రుసుము చెల్లించకుండా అదనపు ఖాతాలు పొందే సౌకర్యాన్ని పొందలేరు. [16] గూగుల్ యాప్స్ వ్యాపార పునర్విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వెలువడింది. జనవరి 2009 ముందు నుంచి ప్రామాణిక ఎడిషన్‌ను ఉపయోగిస్తున్న ఖాతాదారులు వారి పాత కేటాయింపులను కలిగివుంటారు, అంతేకాకుండా మరింత మంది ఖాతాదారుల కోసం విజ్ఞప్తి చేసే సౌకర్యాన్ని కూడా పొందుతారు, అయితే ఇప్పుడు ఈ పరిమితి విజ్ఞప్తులకు సాధారణంగా మీ ఖాతా స్థాయి పెంచుకోవాలనే సూచనలతో సమాధానాలు వస్తున్నాయి. [17]

ఒక గూగుల్ యాప్స్ ఎడిషన్ యొక్క చందా స్థాయిని యాప్స్ ఖాతాలో అందుబాటులో ఉన్న ఖాతాదారుల మొత్తం సంఖ్య ఆధారంగా మరియు ఆ చందాలో అందరు వినియోగదారుల ఖాతాలకు వర్తింపజేసివున్న ఎడిషన్ సౌకర్యాలు ఆధారంగా నిర్ణయిస్తారు. ఖాతాదారుల ఒక ఉపసమితి స్థాయి పెంపులను కొనుగోలు చేయడం సాధ్యంకాదు: ఖాతాదారు పరిమితిని పెంచుకోవడానికి ఉపసమితికి వీలు లేదు, చందాను తప్పనిసరిగా అన్ని ఖాతాలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 50 మంది ఖాతాదారుల యొక్క ఒక ప్రామాణిక పరిమితిని 60 ఖాతాదారులకు పెంచుకునేందుకు, ఉపయోగించినా లేదా ఉపయోగించకపోయినా 60 ఖాతాదారులకు చందా చెల్లించాల్సి ఉంటుంది. [18]

ప్రామాణిక ఎడిషన్[19]
 • ఉచితం
 • సాధారణ gmail.com ఖాతాలకు ఒకే విధమైన నిల్వప్రదేశం అందుబాటులో ఉంటుంది (సెప్టెంబరు 22, 2010నాటికి 7500 MBకిపైగా)
 • టెక్స్ట్ ప్రకటనలు తప్పనిసరి
 • 50 మంది ఖాతాదారులకు పరిమితమై ఉంటుంది
 • ఇమెయిల్ అటాచ్‌మెంట్‌లు 25 మెగాబైట్‌ల కంటే పెద్దవి ఉండకూడదు,
 • ప్రతి ఇమెయిల్ ఖాతాకు రోజుకు 500 మంది వెలుపలి గ్రహీతలకు మాత్రమే ఇమెయిల్ పంపే వీలుంటుంది.[20]
ప్రీమియర్ ఎడిషన్
 • 50 USD/40 EUR/33 GBP / ఖాతా / ఏడాదికి
 • ఇ-మెయిల్ / ఖాతాకు 25 GB నిల్వప్రదేశం
 • టెక్స్ట్ ప్రకటనలు వద్దనుకుంటే మినహాయింపు ఉంటుంది
 • పోస్టినీ "భద్రత, అమలు, విధాన నిర్వహణ మరియు సందేశ పునఃప్రాప్తి సేవలు" సమగ్రపరచబడి ఉంటాయి
 • కాన్ఫెరెన్స్ రూమ్/రీసోర్స్ షెడ్యూలింగ్
 • 99.9% ఇ-మెయిల్ అప్‌టైమ్ పూచీ
 • ఒకసారి సైన్ ఆన్‌కు APIలు, ఇతరాలు.
 • 24/7 ఫోన్ మద్దతు
 • తృతీయ పక్ష అనువర్తనాలు మరియు సేవలు
 • గూగుల్ వీడియో (ప్రైవేట్ కంపెనీ వెర్షన్ యు ట్యూబ్.)
 • ప్రతి ఇమెయిల్ ఖాతాకు రోజుకు 2000 మంది వెలుపలి గ్రహీతలకు ఇమెయిల్ పంపే అవకాశం పరిమితం చేయబడివుంటుంది.[20]
ఎడ్యుకేషన్ ఎడిషన్
ప్రీమియర్ ఎడిషన్ మాదిరిగానే ఉంటుంది, అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి:
 • గుర్తింపు పొందిన లాభాపేక్షలేని K-12 పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఉచితం
 • అధ్యాపకులు, సిబ్బంది లేదా విద్యార్థులకు ఎటువంటి ప్రకటనలు ఉండవు
 • నమోదు చేసుకున్న విద్యార్థులకు సంబంధించని, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది లేదా సేవకుల ఖాతాలకు గూగుల్ ప్రకటనలు ఇవ్వవచ్చు [21] [22]
 • సాధారణ gmail.com ఖాతాలకు అందుబాటులో ఉండే పరిమాణంలోనే నిల్వప్రదేశం అందుబాటులో ఉంటుంది (సెప్టెంబరు 22, 2009నాటికి 7500 MBకిపైగా నిల్వప్రదేశం అందుబాటులో ఉంది) [1]

గూగుల్ ఖాతా రకం ఆధారంగా అందుబాటులో ఉన్న సేవలు[మార్చు]

నాన్-గూగుల్ అడ్రస్ జిమెయిల్ అడ్రస్ గూగుల్ యాప్స్ ఎకౌంటు
జిమెయిల్ లేదు ఉంది ఉంది ( డొమైన్ పేరు కావలెను )
గూగుల్ యాప్స్ సింక్ లేదు ఉంది (మైక్రోసాఫ్ట్ ఎక్ష్చేంజ్ ఉపయోగించి) ఉంది
గూగుల్ కేలేండర్ లేదు ఉంది ఉంది
గూగుల్ కాంటాక్ట్స్ లేదు ఉంది ఉంది (బేటా వలే నమోదు చేయబడింది)
గూగుల్ కాంటాక్ట్స్ సింక్ లేదు ఉంది (మైక్రోసాఫ్ట్ ఎక్ష్చేంజ్ ఉపయోగించి) ఉంది
గూగుల్ డాక్స్ లేదు ఉంది ఉంది
గూగుల్ గ్రూప్స్ లేదు ఉంది ఉంది
గూగుల్ సైట్స్ లేదు ఉంది ఉంది
గూగుల్ టాస్క్స్ లేదు ఉంది ఉంది
గూగుల్ వీడియో లేదు ఉంది ఉంది
గూగుల్ వాయిస్ లేదు ఉంది లేదు
గూగుల్ వేవ్ లేదు ఉంది ఉంది

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

 • ఆఫీస్ సూట్స్ యొక్క పోలిక
 • ఆన్ లైన్ ఆఫీస్ సూట్

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Rob Siemborski (2007-10-12). "More Gmail storage coming for all". Google. సంగ్రహించిన తేదీ 2008-05-29. 
 2. "Google Wave Available for Everyone". The Google Wave Blog (Englishలో). Google. 18 May 2010. సంగ్రహించిన తేదీ 3 June 2010. 
 3. "Update on Google Wave". The Google Wave Blog (Englishలో). Google. 4 August 2010. 
 4. "Google to Launch Government Cloud". 
 5. "Google Apps is out of beta (yes, really)". 
 6. http://jkontherun.com/2009/06/09/google-apps-sync-for-microsoft-outlook-treads-on-microsoft-exchange/
 7. http://www.readwriteweb.com/archives/google_and_microsoft_sitting_in_a_tree.php
 8. http://www.downloadsquad.com/2009/04/01/gmail-themes-finally-come-to-google-apps/
 9. http://lifehacker.com/5192677/google-apps-adds-support-for-themes
 10. "Gmail Gets Offline Support, Finally". shilpz. సంగ్రహించిన తేదీ 2009-01-29. 
 11. "Google Sites". Google. సంగ్రహించిన తేదీ 2008-05-29. 
 12. "Google Adds Postini's Security and Compliance Capabilities to Google Apps". Google Press Center. 2007-10-03. సంగ్రహించిన తేదీ 2008-05-29. 
 13. "Google Apps - Additional security and compliance options". Google. సంగ్రహించిన తేదీ 2008-05-29. 
 14. David Berlind (2007-06-25). "Google improves ‘Apps’, offers organizations clear path off Exchange, Notes, etc. to GMail". ZDNet. సంగ్రహించిన తేదీ 2008-05-29. 
 15. Lee Rickwood (2007-03-23). "Google Apps: Killer software or killer decision?". PCWorld.ca. సంగ్రహించిన తేదీ 2008-05-29. 
 16. "Google Help Center: Standard Edition user accounts". Google. 
 17. "Google Apps Blog - 50 user limit for new Standard Edition customers". Google. 
 18. "Google Help Center: Purchase and Renewals". Google. 
 19. "Google Apps - Google Apps Standard Edition helps groups build community". Google. సంగ్రహించిన తేదీ 2009-07-01. 
 20. 20.0 20.1 "Google Apps - Mail Sending Limits". Google. సంగ్రహించిన తేదీ 2009-12-14. 
 21. "Google Apps Education Edition agreement". Google. సంగ్రహించిన తేదీ 2008-05-29. 
 22. "Google Apps Education Edition agreement". Google. సంగ్రహించిన తేదీ 2008-05-29. 

మరింత చదవటానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

మూస:Cloud computing మూస:Google Inc.