గెలీలియో గెలీలి
Portrait of Galileo Galilei by Giusto Sustermans |
|
| జననం | ఫిబ్రవరి 15 1564[1] పిసా, టుస్కానీ - ఇటలీ[1] |
|---|---|
| మరణం | 1642 (వయసు 77)[1] అర్సెట్రీ, టుస్కానీ - ఇటలీ[1] |
| నివాసం | Grand Duchy of Tuscany |
| రంగము | ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు గణిత శాస్త్రము |
| మాతృ సంస్థ | పిసా యూనివర్శిటీ |
| ప్రాముఖ్యత | Kinematics టెలీస్కోపు సౌరమండలము |
| మతం | రోమన్ కేథలిక్ |
గెలీలియో గెలీలి (19 ఫిబ్రవరి 1564[2] – 8 జనవరి 1642)[1][3] ఇటలీ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను కనుగొన్నాడు.
గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్ధిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.
విషయ సూచిక |
అరిస్టాటిల్ తో విభేదం [మార్చు]
గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు.
గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 17 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలంనాటికి ఖచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. వైద్య విధ్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం పై పరిచయం ఉంది కాబట్టి కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో "పల్స్ మీటరు" రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. ఈ వాళ మనం వాడుతున్న పెండులం క్లాక్ కు కూడా మూలసూత్రం యిదే.
పాడువా విశ్వవిద్యాలయం [మార్చు]
ఈ ప్రయోగం మూలంగా అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని నమ్మే పీసా విద్యాలయ మేధావులను ఇబ్బంది పెట్టింది. అందువలన స్వేచ్ఛ, సౌకర్యాలు కొరవడిన గెలీలియో అక్కడనుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రధానాచార్యునిగా చేరారు. అక్కడే గెలీలియో యాంత్రిక శాస్త్రం రచించారు. ఇది సామాన్యులకు కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడానికి ఉపకరించింది.
పాడువా లోనే గెలీలియోకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో డబ్బుకోసం కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒక్కటే అతనికి మార్గంగా కనిపించింది. ఆ సమయంలొనే వాయు థర్మామీటర్ ను, పల్లపు ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసి వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు, వర్గమూలాలు కనుగొనే కంపాస్ పరికరాన్ని కనుగొన్నారు. ఆ సమయంలోనే లోలకాలు మరియు వాయుతలాలపై కూడా కీలకమైన ప్రయోగాలు చేశారు.
టెలిస్కోప్ [మార్చు]
గెలీలియో మొట్టమొదటి టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.
విశ్వ రహస్యాలు [మార్చు]
ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. మన పాలపుంత లో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతం ను బలపరిచాడు. క్రీ.శ 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు.
మతాధికారుల ఆగ్రహం [మార్చు]
అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంధాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. దీంతో క్రీ.శ.1630 వరకు గెలీలియో నోరు విప్పలేక పోయాడు. అయినా ఆయన తన వాదాలను విదిచి పెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ "Dialogues concerning the two chief world systems" అనే గ్రంధం యూరప్ ఖండంలో సారస్వత వేదాంత గ్రంధానికి ఉదాహరణగా పేర్కొంటారు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు. అయితే ఈ గ్రంధాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. క్రీ.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది.
|
|
|
|---|---|
| పైథాగరస్ · హిప్పోక్రటిస్ · అరిస్టాటిల్ · ఆర్కిమెడిస్ · యూక్లిడ్ · టోలెమీ · లియొనార్డో డావిన్సి · నికోలస్ కోపర్నికస్ · జాన్ నేపియర్ · గెలీలియో గెలీలి · విలియం హార్వె · ఆట్టో వాన్ గెరిక్ · ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి · బ్లైసీ పాస్కల్ · ఐజాక్ న్యూటన్ · బెంజమిన్ ఫ్రాంక్లిన్ · ఎడ్వర్డ్ జెన్నర్ · సర్ హంప్రీ డేవి · మైకేల్ ఫెరడే · చార్లెస్ డార్విన్ · గ్రెగర్ జోహన్ మెండల్ · ఫ్రెడరిక్ ఆగస్టు కెకులే · మాక్స్ వెల్ · ఆల్ఫ్రెడ్ నోబెల్ · విల్ హెల్ం కొన్ రాడ్ రాయింట్జెన్ · గ్రహంబెల్ · థామస్ అల్వా ఎడిసన్ · జగదీశ్ చంద్రబోస్ · మాక్స్ ప్లాంక్ · థేల్స్ · ప్రపుల్ల చంద్ర రే · మేడం క్యూరీ · విల్బర్ ఆర్విల్లె రైట్ సోదరులు · ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ · మార్కోనీ · ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ · అలెగ్జాండర్ ఫ్లెమింగ్ · శ్రీనివాస రామానుజన్ · జాన్ లోగి బయర్డ్ · సర్ సి.వి.రామన్ · జేమ్స్ చాడ్విక్ · సత్యేంద్రనాథ్ బోస్ · సలీం ఆలీ · ఎన్ రికో ఫెర్మి · హోమీ జహంగీర్ బాబా · హరగోవింద ఖురానా |
మూలాలు [మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 J J O'Connor and E F Robertson. "Galileo Galilei". The MacTutor History of Mathematics archive. University of St Andrews, స్కాట్లాండ్. Retrieved 2007-07-24.
- ↑ Drake (1978, p.1). The date of Galileo's birth is given according to the Julian calendar, which was then in force throughout the whole of Christendom. In 1582 it was replaced in Italy and several other Catholic countries with the Gregorian calendar. Unless otherwise indicated, dates in this article are given according to the Gregorian calendar.
- ↑ మూస:Ws by John Gerard. Retrieved 11 August 2007
బయటి లింకులు [మార్చు]
- Portraits of Galileo
- Original documents on the trial of Galileo Galilei in the Vatican Secret Archives
- Galileo Affair catholic.net
- The Galileo Project at Rice University
- CCD Images through a Galilean Telescope Modern recreation of what Galileo might have seen;.
- Electronic representation of Galilei's notes on motion (MS. 72)
- PBS Nova Online: Galileo's Battle for the Heavens
- Stanford Encyclopedia of Philosophy entry on Galileo
- The Galilean Library, educational site.
- Galileo and the Catholic Church article at Catholic League
- LIFE top 100 events of the millennium: Galileo Galilei (nr 5 in this list)
- Works by Galileo Galilei: text with concordances and frequencies.
- Galilei, Galileo. Le Operazioni del Compasso Geometrico et Militare 1610 Rome. From Rare Book Room. Scanned first edition.
- Galilei, Galileo. Istoria e Dimostrazioni Intorno Alle Macchie Solar 1613 Rome. From Rare Book Room. Scanned first edition.