గొల్ల భక్తురాలు

వికీపీడియా నుండి

తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాల తో వున్న చిన్న మండపాన్ని కట్టించిన గొల్లపడుచు. తిరుమల దేవాలయం నిర్మించే సమయం లో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలూ, పెరుగూ ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది. ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా, ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పై నుండి వచ్చిన (బెజవాడ దుర్గమ్మ పంపిన) సొమ్మంతా అయ్యిపోయింది అన్నారట. అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బు తో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను ఆ డబ్బును మూడు కొండ రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమద్యలో దాసుకొన్నాను ఆ డబ్బు తో కట్టండని కట్టించిందట అదే నేటి గొల్ల మండపం..........(కోర్ల సంబరం లోని కథ ఇది.)

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె