గోత్రములు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు |
|
| వేదములు (శ్రుతులు) | |
|---|---|
| ఋగ్వేదం · యజుర్వేదం | |
| సామవేదము · అధర్వణవేదము | |
| వేదభాగాలు | |
| సంహిత · బ్రాహ్మణము | |
| అరణ్యకము · ఉపనిషత్తులు | |
| ఉపనిషత్తులు | |
| ఐతరేయ · బృహదారణ్యక | |
| ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
| కఠ · కేన · ముండక | |
| మాండూక్య ·ప్రశ్న | |
| శ్వేతాశ్వర | |
| వేదాంగములు (సూత్రములు) | |
| శిక్ష · ఛందస్సు | |
| వ్యాకరణము · నిరుక్తము | |
| జ్యోతిషము · కల్పము | |
| స్మృతులు | |
| ఇతిహాసములు | |
| మహాభారతము · రామాయణము | |
| పురాణములు | |
| ధర్మశాస్త్రములు | |
| ఆగమములు | |
| శైవ · వైష్ణవ | |
| దర్శనములు | |
| సాంఖ్య · యోగ | |
| వైశేషిక · న్యాయ | |
| పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
| ఇతర గ్రంథాలు | |
| భగవద్గీత · భాగవతం | |
| విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
| లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
| శివ సహస్రనామ స్తోత్రము | |
| త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
| పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
| ... · ... | |
| ఇంకా చూడండి | |
| మూస:హిందూ మతము | |
గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.గోత్రము అనగా గో అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా,ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు,కపిలగోవువారు,తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట,భరద్వాజ,వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువు కు సంబంధించిన వారమని,ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.ఆ తరువాత భూములను కలిగిన బోయ/క్షత్రియులు భూపని,భూపతి,మండల అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు.ముఖ్యముగా బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద,ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు.గోత్రాలు ఆటవిక కాలము/ ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి.తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి)పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి(మూల పురుషుడు) చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి. క్రైస్తవుల మతగ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద,ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి.(డా.చిప్పగిరి 2012)
విషయ సూచిక |
బ్రాహ్మణుల గోత్రములు[మార్చు]
- భారత దేశమునందు కల బ్రాహ్మణ కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక గోత్రము, ప్రతి గోత్రానికి ముగ్గురు (త్రయార్షేయ) లేదా అయిదుగురు(పంచార్షేయ) ఋషుల వరస ఉంటుంది. ఈ ఋషుల వరసే ఈ కుటుంబాల మధ్య వారధి. బ్రాహ్మణ వివాహ విధి ప్రకారము, స్వగోత్రీకులు(ఒకే గోత్రం ఉన్న అబ్బాయి, అమ్మాయి) వివాహమాడరాదు. అలానే, త్రయార్షులలో మొదటి ఋషి కలవరాదు. వీరు దాయాదుల లెక్కన వస్తారు. ప్రతి గోత్రము సప్తర్షులలో ఒకరి నుండి వచ్చినదే.
- బౌద్ధాయనస్రౌత-సూత్రము ప్రకారము విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి(క్రిష్ణాత్రియ), వశిష్ట, కాశ్యప, అగస్త్య అనే 8 మంది ఋషులు,వారి సంతానము పేర్లే బ్రాహ్మణ గోత్రములు. ప్రజాపతి కి, ఈ 8 మంది ఋషులకి సంబంధము లేదు. వీరిని, వీరి సంతానమును గోత్రములని, మిగతావారిని "గోత్రవ్యయవ" అని అందురు. గోత్రములన్నీ గుంపులుగా విభజింపబడ్డాయి. వశిష్ట గణము నాలుగు గా విభజింపబడింది. అవి ఉపమన్యు, పరాశర, కుండిన, వశిష్ట. వాటికి మళ్ళీ పక్షాలు వున్నాయి. గణము, పక్షము, గోత్రము, ఇలా వస్తాయి. గణము, పక్షము, గోత్రము, అన్నీ కలిపి చదవడానిని ప్రవర అంటారు. పరాశర గోత్రానికి ప్రవర "వశిష్ట, శాక్త్య, పరాశర". ఉపమన్యు కి "వశిష్ట, భరద్వసు, ఇంద్రప్రమద". 19 మంది ఋషులు దాకా, ఏకార్షేయ, ద్వార్షేయ, త్రయార్షేయ, ఇలా ఎంత మందితో అయినా ప్రవర ఉండవచ్చు. ఆంధ్రదేశము లో కాశ్యపస గోత్రానికి కనీసము రెండు ప్రవరలు ఉన్నాయి. ఒకటి త్రయార్షేయ ప్రవర, ఇంకొకటి సప్తార్షేయ ప్రవర. ప్రవరలు రెండు విధాలుగా వున్నాయి.
- శిష్య - ప్రశిష్య - ఋషి పరంపర
- పుత్ర పరంపర
- పుత్ర పరంపర లో ఒక ఋషి కలిసినా, వివాహము నిషిద్ధము. శిష్య - ప్రశిష్య - ఋషి పరంపరలో సగము, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఋషులు కలిస్తే వివాహము నిషిద్ధము
శాఖలు-ఋషులు[మార్చు]
వశిష్ట ఋషి
ఆర్య వైశ్య గోత్రములు[మార్చు]
| ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు.(అనువాదకులకు వనరులు) |
క్రమసంఖ్య గోత్రం పేరు సంకేతనామం
౧ అగస్థ్యస అనుభ గుల, అనుబాల, అనుబాల గుల
౨ ఆత్రేయస అరసకుల - అరిశిష్టకుల- ఎలిశిష్టకుల-అరిశెట్లకుల-హరిశిష్టకుల
౩ అచాయనస అక్రములకుల - అక్యములకుల - అమలకుల - ఆరక్యముల
౪ ఉగ్రసేనాశ కుమిరిశిష్ట - కుమర్శిష్ట - కొమర్శిష్టాకుల
౫ ఉద్గృష్టశ కన్యాకుల - కనుకుల - క్రనుకుల - క్రను
౬ ఉథమోజశ ఉథకలాకుల - ఉథకుల - ఉథశిష్టకుల - ఉహ్థమకుల
౭ ఋష్యశ్రుంగస అనంతకుల
౮ ఔశిత్యశ యనశకుల - యానశకలుల - యానశబికుల
౯ గన్వశ గర్నకుల
౧౦ గంధార్పస శరకుల - శెకొట్లకుల - శెగొల్ల - సమనకుల - శ్రేష్ట కుండలకుల
౧౧ కబిలశ మండు - మంధకుల - హస్తకుల - మందకుల
౧౨ కబీధశ వెంకలాకుల
౧౩ కశ్యబస గనముకు కుల
౧౪ గుథ్శస ఇక్ష్వాకుకుల
౧౫ కౌండిన్యస కనలోల - కనశ్రిల - కనశ్రిలకుల
౧౬ గౌంధేయస కమశిష్ట
౧౭ కౌశికస కరకపల
౧౮ కృష్ణస ధనకుల - థననకుల - థెనుకుల
౧౯ గార్క్యస ప్రహీనుకుల - ప్రహీనికుల - పైపికుల
౨౦ గృథ్శన్ మథస ఎశబకుల - ఎసుబకుల - ఎశుబకుల - శన్నకుల - జనకుల - జ్యనుకుల
౨౧ గోపకస ఇంజ్థపకుల - గోపకుల - కొండకుల - కొండకకుల
౨౨ గౌతమస గంథిశీల గంథశీలకుల - గంథశీల - గ్రంథిశీల
౨౩ చక్రపనిస చక్రములకుల - చక్రములశకుల
౨౪ చమర్శనస బెతశ్రేష్ట - బెతకిష్ట - పథశిష్తకుల -పథ్థశిష్టకుల
౨౫ జడబరథస కుండకుల - దురశిష్ట - దురశిష్టకుల
౨౬ జదుకర్ణస చంద్రకుల - చంద్రమూల - చంద్రమశిష్ట
౨౭ జంబశూతనస త్రిమూల - త్రిమూలకుల
౨౮ జరత్కరస శాంతకుల - జనకుల - జ్యనకుల
౨౯ జబాలిస సిరిశిష్టకుల - సిరశిష్టకుల
౩౦ పప్రేయస సనశిష్ట - సనశిష్టకుల - శినిశెట్ల
౩౧ జీవందిశ బుర్హ్తిలశిషకుల - బ్రుమశిష్టకుల - లృథ్థికుల
౩౨ తరనిశ తరివిక్రమ - శిష్టశ - తరివిక్రమశిష్టకుల
౩౩ తితిరిశ పంతకుల - ప్రహ్తమకుల - ప్రవతకుల
౩౪ త్రిజదశ ఉపరకుల -ఉశిరకుల
౩౫ తైత్రేయస శితురుబెల్లు - సితురుబెల్లు - శితరుబ - శితరుబకుల
౩౬ తల్ప్యశ పదినకుల - ప్లకకుల - పలకలకుల - పదనశిష్టకుల
౩౭ దుర్వశస తితిశ - తితినకుల - తెన్తశుల - తెన్తశల - తెతనకుల
౩౮ దేవరతస హారాశికుల
౩౯ దేవ కల్క్యశ ఉశిరకుల - దేశిష్టకుల
౪౦ నారదస పలకాకుల - పలకుల
౪౧ నేత్ర పహ్తస సందోకు - సందోకులకుల
౪౨ పరస్ పరాయన్యస దువ్విశిష్టకుల - పౌలతత్స్యకుల - శ్రిబుమ్శికుల
౪౩ పల్లవస కనపకుల - కంతకుల - కంతాశుకుల - కంతసూకుల - కంతస్థులకుల
౪౪ పరిత్ర పాణిశ దయశిష్టకుల - దయాశిష్టకుల - దశిష్టకుల - తైసెట్టకుల - తేశెట్లకుల - తేశిష్టకుల - తైశిష్టకుల
౪౫ పారాశర్యస కామథేనుకుల - పతకశీలకుల - పంచలకుల - పంచల్లకుల - ప్రాణశీలకుల - ప్రణశీలకుల - ప్రణుశీలకుల - ప్రణ శీల కుల - పంపాళ్ళ
౪౬ పింగలస అయనకుల
౪౭ పుండరీగస అనుశిష్ట - అనుశిష్టకుల - క్రనుకుల - తొండికుల
౪౮ బూదిమశస దుర్వదికుల - దులాశిష్టకుల - దుర్యదకుల - దులశిష్టకుల - దులశికుల - దొదకుల - దొదిలుల
౪౯ పౌండ్రకశ బుంశిమంశుకుల - బుంశిమనకుల - బ్రొశిష్టకుల - బ్రొశి - బ్రొలేకకుల
౫౦ పౌలస్థ్యస గోశీల - ఉత్తమగోశీల పల్లలగూశీల - అడుగోశీల - శ్రీగోశీల - పునగోశీల - సూర్యకుల -ఉత్తమశీల - పునగోర్శీల - పట్టుగోశీల - పనకశీలకుల భీమగోశీల - సత్యగోశీల - చందిగోశీల
౫౧ ప్రశీనస వనిశిష్టకుల లేనశిష్టకుల - లేలిశిష్టకుల
౫౨ ప్రభదస ఉద్వహకుల - పెండ్లికుల - రవిశిష్టకుల
౫౩ బృహతత్వస పేరుశిష్ట - బేరిశిష్టకుల - బైరుశిష్టకుల
౫౪ బోదయనస బుధికుల - బ్దనకుల
౫౫ భరద్వాజస బలశిష్ట - బలశేష్ట - బలిశిష్ట
౫౬ భార్గ్గవస పృథ్విశిష్ట - పృథ్విశ్రేష్ట
౫౭ మంతపలస విన్నశ - విన్నకుల - వినుకుల - వెన్నకుల
౫౮ మానవస మత్యకుల - మన్యుకుల - మరాశకుల - మానాచకుల
౫౯ మరీచస తిషమశిష్టకుల - తీశమకుల - తీశమశిష్టకుల - తీశమశ్రేష్ట
౬౦ మార్కండేయస మోనుకుల - మోరుక - మోరుస - మోర్కలకుల
౬౧ మునిరాజస పద్మశిష్టశ - పద్మశిష్టకుల - పద్మశ్రేష్ట
౬౨ మైత్రేయస మత్తికుల - మతనకుల - మత్యసకుల - మిథునకుల - మైత్రికుల
౬౩ తౌమ్యస చంద - చందకుల - చందకకుల - చనకలకుల
౬౪ మౌంజయ ముంజీకుల - మౌంజ్రిస - మౌంజికుల
౬౫ మౌత్కల్యస నాబిల్ల - నాబీలకుల - నాబీలశకుల - మునికుల - మూలకుల
౬౬ యాస్కశ వ్యలకోలస - వెల్గొల్ల - వైలిగొల్ల
౬౭ యాజ్ఞవాల్క్యస అబిమంచికుల
౬౮ వదుగస అనుమర్శనకుల
౬౯ వర్దంతుస మసంత - మసంత
౭౦ వారుణస యెలశిష్టకుల - వెలశిష్టకుల - వెలిశిష్టకుల - శిరిశిష్టకుల
౭౧ వశిష్టస వస్థి - వస్థిస - వస్థికుల - వస్థ్రికుల
౭౨ వామదేవస ఉపలకుల - ఉపమకుల - ఉపనకుల - ఉపమన్యకుల
౭౩ వసుదేవస భీమశిష్ట - భీమశిష్టకుల - భీమశ్రేష్టకుల
౭౪ వాయవ్యయ మ్రంగమకుల - వ్రహశిష్టకుల - వ్రకలముల - వ్రంగమకుల - వ్రంగముకుల
౭౫ వల్మీకస శుకలకుల - శకల్లకుల - శుచలకుల - గొల్లకుల
౭౬ విశ్వగ్సేనస ఉబరిశిష్ట - విబరిశిష్ట
౭౭ విశ్వమిత్రస విక్రమశిష్ట - విక్రమశిష్టకుల
౭౮ విష్ణువృంతస పిప్పలకుల - పుప్పలకుల
౭౯ వైరోహిత్యస వశ్నత - వశ్నతకుల
౮౦ వ్యశస తనుకు - తనతకుల
౮౧ శరబంకస క్రమశిష్ట - క్రమశిష్టకుల - క్రమశ్రేష్టకుల
౮౨ శార్జ్ఞారవస కుండకకుల కొండకకుల
౮౩ శాండిల్యస తుప్పల్ల - తుప్పలకుల
౮౪ శ్రీవత్సస శిలకుల - శ్రీరంగకుల - శ్రీలకుల
౮౫ శ్రీధరస సిరిశేష్ట - సిరిశేష్టకుల - శ్రీశిష్ట
౮౬ శుక్లస శ్రీశలకుల - శ్రీశల్ల - శ్రీశల్లకుల
౮౭ చౌచేయస ఇలమంచికుల - యలమంచికుల - హెలమంచికుల
౮౮ చౌనకస కమలకుల - దృగశిష్ట - దృగశిష్టకుల - తనతకుల - చానకలకుల - చౌనక
౮౯ సత్యస అంతిరకుల - చింతకుల - చంతమశిష్ట - చింత్యకుల - చింతల
౯౦ శనకస శనకుల - శనకుల
౯౧ సనత్కుమారస దంకరకుల - ముతుకుల
౯౨ శంతనస సమశిష్టకుల
౯౩ శంవర్తకస రెండుకుల - రెంటకుల
౯౪ శుకంచనస పుచకుల - పుచకశీల - పునీత - పునీతస - పుంతకుల
౯౫ సుదీశనస దంతకుల - ద్యంతకుల -ద్వంతకుల - దెంతకుల - దేవిశేట్ల - దొంతకుల
౯౬ సుందరస ఐన - ఇనకుల - ఇనకోల - వినుకుల
౯౭ సువర్ణస పోడయసకుల - ప్రోడజకుల - ప్రోయుదాయజ
౯౮ సుబ్రహ్మణ్యస - శంతనకుల - శనిక్తకుల
౯౯ సౌబర్ణస పుతురుకుల - పుతురుక్సకుల
౧౦౦ సౌమ్యస హస్థికుల
౧౦౧ సౌవర్ణస చుశలకుల - శకల్లకుల - సూచలకుల - సూకశల్లకుల - శూశలకుల
౧౦౨ హరివల్గయస కపట - కురట - కొరటకుల - గోరంతకుల
Courtesy: క్రిష్ణమూర్తి సుందరం
క్షత్రీయ గోత్రములు[మార్చు]
ధనుంజయ, కౌండిన్య, వశిష్ట, కాశ్యప, భరద్వాజ, ఆత్రియ.
గోత్రములు జాబితా[మార్చు]
గమనికలు[మార్చు]
^ http://www.vedah.net/manasanskriti/Brahmins.html ^ http://www.gurjari.net/ico/Mystica/html/gotra.htm ^ a b Sen, Ronojoy (May 15, 2010). "Same-gotra marriages okayed in ’45". TNN. Retrieved Junly 30, 2010. ^ Anand, Pinky (May 18, 2010). "The paradox of the 21st century". The Hindu (Chennai, India). Retrieved July 30, 2010. ^ Sen, Ronojoy (May 15, 2010). "Same-gotra marriage legal, court had ruled 65 years ago". TNN. Retrieved July 30, 2010. ^ http://www.merinews.com/article/same-gotra-marriages-lead-to-genetic-disorders/15827925.shtml ^ http://countrystudies.us/india/86.htm ^ http://neurologyasia.org/articles/20073_015.pdf ^ http://anthro.palomar.edu/marriage/marriage_3.htm ^ http://www.indianexpress.com/news/haryana-panchayat-takes-on-govt-over-samegotra-marriage/491548/ ^ HC throws out plea to forbid same gotra marriages, June 2010
సూచనలు[మార్చు]
- Ruegg, D. Seyfort (1976). 'The Meanings of the Term "Gotra" and the Textual History of the "Ratnagotravibhāga"'. Bulletin of the School of Oriental and African Studies, University of London, Vol. 39, No. 2 (1976), pp. 341–363
బయటి లింకులు[మార్చు]
- Brahmin Sages and Branches (Gotras and Subcastes)
- gotra
- Goelji.com is a community portal of baniyas
- Marriage Ceremonies
- Encyclopedia Britannica