గోపరాజు లవణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపరాజు లవణం
లవణం
జననం
గోపరాజు లవణం

అక్టోబరు 10 1930
మరణంఆగష్టు 14, 2015
ఇతర పేర్లులవణం
వృత్తి'నాస్తికమార్గం' పత్రికల సంపాదకుడు
భారత నాస్తిక కేంద్రం (విజయవాడ) డైరెక్టర్
1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హేతువాది , నాస్తికుడు
జీవిత భాగస్వామిహేమలతా లవణం
తల్లిదండ్రులు(s)కీ.శే. గోపరాజు రామచంద్రరావు
కీ.శే. సరస్వతీ గోరా
బంధువులువడ్డాది సౌభాగ్య గౌరి (మేనత్త)
చెన్నుపాటి విద్య(సోదరి)
చెన్నుపాటి శేషగిరిరావు(బావ)
గోపరాజు విజయం(సోదరుడు)
గోపరాజు సమరం(సోదరుడు)
గోపరాజు రశ్మి(మరదలు)
గుర్రం జాషువా(మామ)

గోపరాజు లవణం (అక్టోబరు 10 1930 - ఆగష్టు 14, 2015), గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. సంఘం, ది ఎథీస్ట్ (The Atheist), నాస్తికమార్గం పత్రికల సంపాదకుడు. భారత నాస్తిక కేంద్రం (విజయవాడ) డైరెక్టర్[1].

జీవిత విశేషాలు[మార్చు]

చిన్నతనంలోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. అస్పృశ్యతా నిర్మూలన కులనిర్మూలన కోసం కృషిచేశాడు. నవయుగ కవిచక్రవర్తి, పద్మవిభూషణ్ గుర్రంజాషువా యొక్క కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నాడు. గాంధేయ విలువలకు కట్టుబడి సామాజిక అభ్యున్నతికి అంకితమై పనిచేస్తున్నందుకు జమునాలాల్ బజాజ్ అవార్డుకు 5.10.2009న ఎంపికయ్యాడు. సామాజిక జాగృతికి అనేక విధాల కృషి చేస్తున్న లవణం హేతువాదం, నాస్తిక వాదంపై అనేక గ్రంథాలు రచించాడు. సమాజంలో వేళ్లూనుకున్న మూఢ విశ్వాసాలు, మత మౌఢ్యానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపాడు. సంస్కార్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, నిజామాబాద్ జిల్లాలో జోగిని వ్యవస్థను రూపుమాపేందుకు కృషి చేశాడు. డాక్టర్ సమరం లవణంకి సోదరుడు.

రచనలు[మార్చు]

  1. నాస్తికత్వం-అభివృద్ధి-చరిత్ర 1978
  2. కోవూర్ జీవితం 1980

విశేషాలు[మార్చు]

  • ఏడో తరగతి వరకే చదివాడు.
  • మహాత్మాగాంధీ వ్యక్తిత్వం, వినోబా భావేల ప్రభావం ఎక్కువగా ఉంది. నిరాడంబరంగా ఎలా జీవించాలో వారి నుంచే నేర్చుకున్నాడు.
  • సిగరెట్‌, మద్యం వంటి అలవాట్లు ఏమీ లేవు. సిద్ధాంతాలు. ఇతరులకు చెప్పే ముందు తాను పాటించాలని చెడు అలవాట్లను దగ్గరికి రానీయలేదు.
  • డబ్బు కోసం తాపత్రయపడలేదు.
  • లక్ష్యం లేని జీవితాలు గజిబిజిగా ఉంటాయి. అదే అనారోగ్యం!
  • నేను నాస్తికుడిని. దేవుని నమ్మను. పూజించను. ఇతరులు ఎంతోమంది నమ్ముతారు. పూజిస్తారు. ఒకరి భావాలు మరొకరికి నచ్చవు. కొందరు నన్ను వ్యతిరేకిస్తారు. ఇంకొందరు ముఖం మీదనే తిడతారు. అయినా నేను వారి పట్ల ద్వేషభావం పెంచుకోను. పోట్లాటకు, వాదనలకు దిగను. నేను స్వతహాగా హాస్యప్రియుడిని. ఎప్పుడూ సరదాగా ఉండాలనుకునే మనస్తత్వం నాది.

మరణం[మార్చు]

గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఈయన 2015, ఆగష్టు 14విజయవాడ లోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.[2]

మూలాలు[మార్చు]