గోపాలరావు గారి అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాలరావు గారి అబ్బాయి
దర్శకత్వంమణివణ్ణన్
రచనడి. వి. నరసరాజు (మాటలు), విజయ దుర్గ సినీ యూనిట్ (కథ), మణివణ్ణన్ (చిత్రానువాదం)
నిర్మాతమన్నె దుర్గా మల్లికార్జున ప్రసాద్
తారాగణంరాజేంద్ర ప్రసాద్, కార్తీక్, రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంఎ. సభాపతి
కూర్పుఅనిల్ మల్నాడ్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విజయ దుర్గ సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
1989 సెప్టెంబరు 23 (1989-09-23)
సినిమా నిడివి
123 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

గోపాలరావు గారి అబ్బాయి మణివణ్ణన్ దర్శకత్వంలో 1989లో విడుదలైన చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కార్తీక్, రమ్యకృష్ణ, రావు గోపాలరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మన్నె దుర్గా మల్లికార్జున ప్రసాద్ విజయ దుర్గ సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

కథ[మార్చు]

సినీ దర్శకుడైన గోపాలరావు తన కొడుకు రఘును కథానాయకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనుకుంటుంటాడు. అందుకోసం మురికివాడలో ఉండే ఒక అందమైన అమ్మాయి సీతను కథానాయికగా ఎన్నుకుంటాడు. సీతను చిన్నప్పటి నుంచి ఆమె మేనమామ రంగా పెంచుతూ ఉంటాడు. రంగా ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఉన్నా సీతకు మాత్రం ఆ అభిప్రాయం ఉండదు. సారా కొట్టు నడుపుకునే గంగ రంగాను అభిమానిస్తుంటుంది కానీ రంగా మాత్రం ఆమెను ఎగతాళి చేస్తూ ఉంటాడు.

సినిమా చిత్రీకరణ జరుగుతుండగా రఘు సీతను ప్రేమిస్తాడు. ఒక సీనులో ఆమెను నిజంగానే పెళ్ళి చేసుకుంటాడు కానీ గోపాలరావు మాత్రం ఆపెళ్ళికి అంగీకరించడు. ఈ విషయం తెలిసిన రంగా సీతను బలవంతంగానైనా పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు కానీ ఆమె మెడలో మంగళసూత్రం చూసి వెనుకడుగు వేస్తాడు. ఇదే సమయంలో గంగ అతన్ని ఓదారుస్తుంది. రంగాకు కూడా గంగ మీద అభిమానం కలుగుతుంది. ఇంతలో గాలి తిరుగుళ్ళు తిరిగే సీత అన్న బాలాజీ ఆమె పేరుతో నిర్మాతల దగ్గర డబ్బు వసూలు చేసి ఖర్చు చేసేస్తాడు. సీత రఘును నిజంగా పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిన బాలాజీ రఘు పాల్గొంటున్న ఒక చిత్రీకరణలో నకిలీ బాంబుల బదులు నిజం బాంబులు పెట్టిస్తాడు. ఈ విషయం ముందే తెలుసుకున్న రంగా, సీతతో కలిసి తమ ప్రాణాలకు తెగించి రఘును రక్షిస్తారు. వాళ్ళ మంచి మనసు తెలుసుకున్న గోపాలరావు సీతను తన కోడలిగా అంగీకరిస్తాడు. రఘు సీతకు మళ్ళీ పెళ్ళి చేయడంతో కథ ముగుస్తుంది.


తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం, చిత్రానువాదం - మణివణ్ణన్
  • మాటలు - డి. వి. నరసరాజు
  • సంగీతం - ఇళయరాజా
  • ఛాయాగ్రహణం - ఎ. సభాపతి
  • కూర్పు - అనిల్ మల్నాడ్

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. పాటలు ఎకో ఆడియో కంపెనీ ద్వారా విడుదల అయ్యాయి.

మూలాలు[మార్చు]