గోరా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గోపరాజు రామచంద్రరావు
Gora.jpg
గోరా
జన్మ నామం గోపరాజు రామచంద్రరావు
జననం 15 నవంబర్, 1902
ఒరిస్సా లోని చత్రపురం
మరణం 1975, జూలై 26
విజయవాడ
ఇతర పేర్లు గోరా
ప్రాముఖ్యత హేతువాది భారతీయ నాస్తికవాద నేత
భార్య/భర్త సరస్వతి గోరా
సంతానం 9 మంది పిల్లలు
గోరా దంపతులు
గాంధీజీతో గోరా

గోరా (Gora) (1902 -1975) గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు. 15 నవంబర్, 1902 న ఒరిస్సా లోని చత్రపురం లో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే. ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించిన రామచంద్రరాజు వృక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సే కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యాడు. గోరా అనేక రచనలను వ్రాశారు. 1922 లో సరస్వతి గోరా ని ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. సంఘం ఆర్ధిక సమత పత్రికలు నడిపారు.వర్ణవ్యవస్థ , అంటరానితనం పై తన యుద్ధాన్ని ప్రకటించిన గోరా 1940 లో ఆయన భార్య తో కలసి నాస్తిక కేంద్రం ను కృష్ణాజిల్లా లోని ఒక గ్రామంలో ప్రారంభించడం జగిరింది. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడ కు తరలించడం జరిగింది.కుమారులు ఉప్పు సత్యాగ్రహం కాలంలో పుట్టినందున లవణం, భారతీయులు ఛట్ట సభల్లొ నిలిచి గెలిచిన కాలంలో పుట్టినందున విజయం , రెండవ ప్రపంచ యుద్ద కాలంలొ పుట్టినందున సమరం ,నియంత. తొమ్మిదవ సంతానానికి నౌవ్ గా పేర్లు పెట్టారు. కుమార్తెలు మనోరమ, మైత్రి .25 ఏళ్ళ వయసు వరకు ఆస్తికుడే.తరువాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం కృషిసల్పిన గోరా విజయవాడ లో ప్రసంగిస్తూ 1975, జూలై 26న మరణించారు. 2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాలా బిళ్ళ ను 5 రూపాయల స్టాంపుని విడుదల చేశారు. గోరా శత జయంతి సందర్భంగా విడుదల చేశారు.గోరా గారికి 9 మంది పిల్లలు పుట్టారు. గోరా గారు తన భార్యకి గర్భం వచ్చిన ప్రతిసారి గ్రహణం సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెని బయటకి తీసుకువెళ్ళి తిప్పేవారు, గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంతమాత్రాన పుట్టబోయే పిల్లలకి గ్రహణం మొర్రి రాదు అని నిరూపించడానికి. గోరా గారి పిల్లలలో ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు

గోరా మాటలు[మార్చు]

 • దేవుడు అబద్ధం నీతి పెరగాలంటే దైవభావం పోవాలి.జాతి మతం కులం పేరుతో ప్రజల మధ్య విషం పెరుగుతున్నాయి.నాస్తికంలో ఈ వివక్షలకు తావులేదు.దేవుడు కర్మ అనే భావాలు పోతే మనిషి మతస్తుడిగా కాకుండా మానవుడిగా మిగులుతాడు.సోదరభావం పెరుగుతుంది.

ధర్మపత్ని సరస్వతి గోరా[మార్చు]

గోరా గారి భార్య సరస్వతీ గోరా సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు. నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కుల, మత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. విజయనగరంలో 1912లో జన్మించింది. పదేళ్ల వయసులో గోరాతో పెళ్ళయ్యింది. గోరాతో పాటు సరస్వతీ గోరా 1928 ప్రాంతాల్లో శ్రీలంకలో ఉన్నారు. మతాచారాల్ని ధిక్కంచారు. పైగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కావాలని గ్రహణం చూశారు. రాహువు, కేతువులు మానవ సమాజంలోనే ఉన్నారన్నారు. నిప్పులమీద నడవడమనేది దేవతల మాహత్మ్యం కాదని ఎవరైనా నడవవచ్చని ఆమె స్వయంగా నిప్పుల మీద నడిచారు. దేవదాసీలు భ్రష్టాచారమంటూ దేవదాసీలకు స్వయంగా వివాహం జరిపించారు కుల నిర్మూలన, నాస్తిక వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవించారు. అస్పృశ్యతా నివారణ ఉద్యమం చేపట్టారు.మహాత్మా గాంధీజీ ఆమె సేవల్ని గుర్తించి సేవాగ్రామ్ ఆహ్వానించారు. ఆహార కొరత ఉన్న రోజుల్లో కూరగాయలు పండించాలని ఉద్యమించారు. ఈనాం భూముల్ని పొలాలు లేని రైతులకు పంచాలని సత్యాగ్రహం చేపట్టారు. ఆచార్య వినోబాభావే చేపట్టిన సర్వోదయ ఉద్యమాన్ని చేపట్టి దేశమంతా పర్యటించి వినోబాభావే ఆశయాలకు వ్యాప్తి కల్పించారు.మతాన్ని సూచించే ఏ ఆభరణాలు, చిహ్నాలు ఆమె ధరించే వారు కాదు. పుణ్యవతిగా బొట్టు, కాటుక, గాజులు, మంగళసూత్రాలు వంటివి ధరించలేదు. 1975 జులై 26న గోరా మరణించినప్పుడు ఆమె అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు.

రాసిన పుస్తకాలు[మార్చు]

 1. నాస్తికత్వం(దేవుడులేడు) 1941
 2. దేవుని పుట్టుపూర్వోత్తరాలు 1951
 3. జీవితంనేర్పిన పాఠాలు 1976
 4. నేను నాస్తికుణ్ణి 1976
 5. సృష్టి రహస్యం 1976
 6. సంఘదృష్టి 1980
 7. ఆర్ధిక సమానత్వం 1980
 8. నాస్తికత్వం-ప్రశ్నోత్తరాలు 1980
 9. నాస్తికత్వం -ఆవశ్యకత 1980
 10. An Atheist with Gandhi 1951
 11. Positive Atheism 1972
 12. We become Atheists
 13. I learn 1976
 14. people and progress 1981
 15. A note on Atheism 1981
 16. The need of Atheism
 • గోరా ఆచరణ వాది . గ్రహణాల సందర్భంలో గర్భిణి గా వున్న తన భార్యను మూడు సార్లు ఆరు బయట త్రిప్పి ఏ విధమైన మొర్రిలు ఏర్పడవని ప్రజలకు తెలిసే విధంగా ఆచరించి చూపారు. తన పిల్లల పేర్లు సైతం ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో పుట్టిన అబ్బాయికి లవణం అని, భారతీయులు చట్ట సభల్లో గెలిచిన సందర్భంలో పుట్టిన అబ్బాయికి విజయం, రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో పుట్టిన అబ్బాయికి సమరం, గాంధి ఇర్విన్ ఒడంబడిక సందర్భంలో పుట్టిన అమ్మాయికి మైత్రి అని, తొమ్మిదవ సంతానం కు పేరు నౌ, అని పెట్టి సముచిత నామములు పెట్టే విధానానికి ఆద్యుడయ్యాడు.

యివి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=గోరా&oldid=1179062" నుండి వెలికితీశారు