గౌతమి (నటి)
వికీపీడియా నుండి
తాడిమల్ల గౌతమి, తెలుగు మరియు తమిళ సినిమా నటి. ఈమె విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఈమె ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె గురు శిష్యన్ సినిమాతో తమిళ సినిమా రంగములో ప్రవేశించినది. ఇందులో రజనీకాంత్ సరసన నటించినది. ఈమె 1998, జూన్ 4న చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్‌లో సందీప్ భాటియాను వివాహమాడినది.
గౌతమి, జెంటిల్మన్ సినిమాలో ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా ప్రాచుర్యము పొందినది.
[మార్చు] గౌతమి నటించిన తెలుగు చిత్రాలు
- దయామయుడు (1987)
- శ్రీనివాస కల్యాణం
- అగ్గి రాముడు
- అన్న
- విచిత్ర సోదరులు (1989)
- జంటిల్ మేన్ (1993)