గౌతమ్ ఘోష్
వికీపీడియా నుండి
గౌతమ్ ఘోష్ ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ఫోటో జర్నలిస్ట్ కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్‌కతా లో జన్మించాడు.
[మార్చు] సినిమా ప్రస్థానం
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.
[మార్చు] ముఖ్యమైన సినిమాలు
- మా భూమి ( 1979 )
- దఖల్ ( 1981 )
- పార్ ( 1984 )
- అంతర్జలి జాత్రా ( 1987 )
- పద్మ నాదిర్ మఝి ( 1992 )
- పతంగ్ ( 1993 )
- గుడియా ( 1997 )
- అబర్ అరణ్యె ( 2003 )
- యాత్రా ( 2006 )
- కాల్ బేలా ( 2009 )
- సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పై తీసిన డాక్యుమెంటరీ )