గ్రామీణ్ బ్యాంకు

వికీపీడియా నుండి
Grameen Bank (GB)
రకం Body Corporate (Bank Ordinance)
Founded 1983
ప్రధానకార్యాలయం Dhaka, Bangladesh
Area served Bangladesh
కీలక వ్యక్తులు Muhammad Yunus, founder
పరిశ్రమ Finance
ఉత్పత్తులు Financial Services
Microfinance
ఆదాయం 6,335,566,324 Taka (92.3 million USD) (2006)[1]
నిర్వహణ రాబడి 5,959,675,013 Taka (86.9 million USD) (2006)[1]
Net income 1,398,155,030 Taka (20.3 million USD) (2006)[1]
ఆస్తులు 59,383,621,728 Taka (2006)[2]
ఉద్యోగులు 24,703 (Oct 2007)[3]
వెబ్‌సైటు www.grameen-info.org

గ్రామీణ్ బ్యాంకు బెంగాళీ: গ্রামীণ বাংক బంగ్లాదేశ్ లో ప్రారంభించబడిన ఒక సూక్ష్మ ఋణ సంస్థ మరియు సామాజిక అభివృద్ధి బ్యాంకు.ఈ బ్యాంకు చిన్న ఋణములు(అనగా లఘు ఋణములు లేదా "గ్రామీణ్ఋణం"[4]) ఎటువంటి హామీలులేకుండా పేదవర్గాలకు అందిస్తుంది. "గ్రామీణ్" అనే పదం "గ్రామ్" అను పదం నుండి సంగ్రహించబడింది. బాంగ్లా భాషలో దాని అర్ధం "గ్రామీణ" లేక "గ్రామము".[5] ఈ బ్యాంకు యొక్క పద్ధతి పేదలకు నేర్పరితనము ఉన్నా, దానిని సరిగా ఉపయోగించటం లేదు అనే భావనపై ఆధారపడి ఉన్నది. ఒక ఉమ్మడి వ్యవస్థపై ఆధారపడిన ఋణ విధానము ఆ కూటమిలోని సన్నిహితుల-వత్తిడిని ఉపయోగించుకుని ఋణగ్రహీతలు తమ ఆర్ధిక వ్యవహారాలను క్రమశిక్షణతో జరిపి, ఋణాన్ని సరిగ్గా తిరిగి చెల్లించేలా చేస్తుంది. బ్యాంకు డిపాసిట్లను కూడా స్వీకరిస్తుంది, ఇతర సేవలను అందిస్తుంది మరియు దుస్తులు, టెలిఫోన్ మరియు ఇందన సంస్థలు వంటి పలు అభివృద్ధి-ఆధారిత వ్యాపారాలను నడుపుతుంది. బ్యాంకు యొక్క మరొక విశేష అంశం ఏమంటే, ఋణగ్రహీతలలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు.

గ్రామీణ్ బ్యాంకు యొక్క మూలం 1976లో ప్రారంభమయింది వండేర్బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఫుల్‌బ్రైట్ పండితుడు మరియు చిట్టగోంగ్ విశ్వవిద్యాలయంలో ప్రోఫెస్సోరైన ముహమ్మద్ యూనుస్ అనే ప్రొఫెసర్, గ్రామీణ పేదవారికి బ్యాంకు సేవలను అందించే లక్ష్యంతో ఒక ఋణ పంపిణి వ్యవస్థను రూపొందిచడానికి ఒక పరిశోదనను ప్రారంభించారు. అక్టోబర్ 1983లో, ఈ గ్రామీణ్ బ్యాంకు ప్రాజెక్ట్ ప్రభుత్వ చట్టాల ప్రకారం ఒక స్వతంత్ర బ్యాంకుగా అవతారం ఎత్తింది. ఈ సంస్థ మరియు దాని వ్యవస్థాపకుడైన ముహమ్మద్ యూనస్కు ఉమ్మడిగా నోబెల్ శాంతి బహుమతి 2006లో బహుకరించబడింది;[6] సంస్థ యొక్క తక్కువ-ఖర్చుతో కూడిన గృహ నిర్మాణ కార్యక్రమం వరల్డ్ హబిటాట్ అవార్డును 1998లో అందుకుంది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

మహమ్మద్ యూనస్, బ్యాంకు యొక్క వ్యవస్థాపకుడు యునైటెడ్ స్టేట్స్ లోని వండర్బిల్ట్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఘోరమైన 1974 నాటి బంగ్లాదేశ్ కరువు దుర్బిక్షం ఈయనని ప్రేరేపించింది. 42 కుటుంబాలు కలిగిన ఒక వర్గానికి చిన్నపాటి ఋణముగా US$27.00 మొత్తాన్ని ఇచ్చారు. వారు చిన్న చిన్న వస్తువులు తయారు చేసి అమ్ముకోవడానికి వీలు కల్పించారు. దోపిడీ ఋణం నుంచి వారిని తప్పించారు.[7] ఇటువంటి ఋణాలను విస్తృతంగా ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉంఛితే, బంగ్లాదేశ్లోని నిరుపేద ప్రజల జీవితంపై మంచి ప్రభావం చూపుతుందని యూనుస్ నమ్మారు.

నోబెల్ పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనుస్, బ్యాంకు వ్యవస్థాపకుడు

గ్రామీణ్ బ్యాంకు (బంగ్లా భాషలో "గ్రామాల బ్యాంకు" అని అర్ధం) యూనుస్ ఆలోచనల నుంచి పుట్టినది. ఈ బ్యాంకు యొక్క మూలం, బంగ్లాదేశ్ లోని చిట్టగోంగ్ విశ్వవిద్యాలయంలో యూనుస్ రూపొందించిన గ్రామీణ ఆర్ధికవ్యవస్థ ప్రాజక్ట్. గ్రామీణ పేదలకు ఋణాలు మరియు బ్యాంకు సేవలను అందించడానికి అతను రూపొందించిన పద్ధతులను పరీక్షించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. 1976లో, చిట్టగోంగ్ విశ్వవిద్యాలయం చుట్టూ ఉన్న జోబ్ర మరియు ఇతర గ్రామాలు గ్రామీణ్ బ్యాంకు నుంచి సేవలు పొందడానికి అర్హత పొందిన తొలి ప్రాంతాలు.[8] ఈ బ్యాంకు అద్బుతమైన విజయం సాధించింది. కేంద్ర బంగ్లాదేశ్ బ్యాంకు సహాయంతో టాన్గైల్ జిల్లా (ధాకాకు ఉత్తరంలో).[8] బ్యాంకు యొక్క విజయం కొనసాగింది. ఈ విజయం త్వరలోనే బంగ్లాదేశ్ లోని ఇతర జిల్లాలకు వ్యాపించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ చట్టం అక్టోబర్ 2, 1983 నాడు ఒక స్వతంత్ర బ్యాంకుగా మారింది.[8] చికాగోలోని షార్బాంక్ అనే ఒక సామాజిక అభివృద్ధి బ్యాంకుకు చెందిన రాన్ గ్రజివిన్స్కి మరియు మేరీ హౌటన్ అనే ఇద్దరు, యూనుస్ కు ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి ఆర్ధిక సహాయం అందించేలా మరియు బ్యాంకును అధికారంగా స్థాపించడానికి సహాయం చేశారు.[9] 1998లో బంగాళాదేశ్ లో సంభవించిన వరద వలన బ్యాంకు యొక్క ఋణ వసూలు దెబ్బ తిన్నది. కాని తరువాత సంవత్సరాలలో మళ్ళీ పుంజుకుంది. 2005 ప్రారంభములో, బ్యాంకు పేదవారికి USD 4.7 బిలియను[10] కంటే ఎక్కువ ఋణం ఇచ్చింది. 2008 నాటికి ఇది USD 7.6 బిలియను[11]కు పెరిగింది.

ప్రస్తుతం బ్యాంకు దేశమంతట విస్తరణ చెందుతూ గ్రామీణ పేదలకు చిన్న ఋణములు అందిస్తూ ఉంది. 2006 నాటికి, గ్రామీణ్ బ్యాంకుకు 2100 కు పైగా శాఖలు ఉండేవి.[12] దీని విజయం చూసి, ప్రపంచవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ దేశాలలో ఇదే తరహా ప్రాజక్ట్ లు రూపొందించబడ్డాయి. దీని చూసి ప్రపంచ బ్యాంకు గ్రామీణ్-తరహా బ్యాంకులకు ఆర్ధిక సహాయం అందిస్తుంది.[13]

బ్యాంకుకు వివిధ చోట్లనుండి నిధులు వస్తున్నాయి. ప్రధాన దాతలలో కాలక్రమేణా మార్పు వచ్చింది. ప్రారంభదశలో, అతి తక్కువ వడ్డీకే దాత సంస్థలు నిధులు ఇచ్చేవి. 1990ల మధ్యలో బ్యాంకుకు కావలిసిన నిదులను బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు నుండి వచ్చింది. ఇటీవల, గ్రామీణ్ కు బాండ్ అమ్మకమే ప్రధాన నిధులకు మూలాధారంగా మారింది. బాండ్లకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తరపున పూచి ఉంటుంది కనుక, అవి ఇప్పటికి బ్యాంకు రేట్ కంటే ఎక్కువ రేట్ లో అమ్మబడుతున్నాయి.[14]

[మార్చు] సూక్ష్మఋణ అనువర్తన

16 నిర్ణయాలు[15]
  1. మేము క్రమశిక్షణ, ఐక్యత, ధైర్యం, శ్రమించడం అనే నాలుగు గ్రామీణ్ బ్యాంకు సూత్రాలను మా జీవితం యొక్క అన్ని రంగాలలో పాటిస్తాం.
  2. మా కుటుంబాలకు మంచి సంపదను సమకూరుస్తాం.
  3. మేము శిధిలమైన గృహాలలో నివసించము. మా ఇళ్ళను మరమత్తు చేసుకుంటాం. వీలైనంత త్వరలో క్రొత్త ఇల్లు కట్టుకోవడానికి కృషి చేస్తాం.
  4. సంవత్సరం పొడుగుతా మేము కూరగాయిలు పండిస్తాం. వాటిని మేము పుష్కలంగా తిని మిగిలనవాటిని అమ్ముకుంటాం.
  5. పంట సీజన్లో, వీలైనంత ఎక్కువ మొక్కలను నాటుతాము.
  6. కుటుంబ నియంత్రణ పాటించడానికి కృషి చేస్తాం. మా ఖర్చులను తగ్గిస్తాం. మా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటాం.
  7. మా పిల్లలను చదివించి, వారి చదువుకు అవసరమైన డబ్బును వారే సంపాదించుకునేలా చేస్తాం.
  8. మా పిల్లలు మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాం.
  9. గుంట-మురుగు దొడ్డిని నిర్మించి దానినే వాడుతాము.
  10. మేము ట్యూబ్ వెల్ నుండి మాత్రమే మంచి నీళ్ళు తాగుతాము. అది లేకపోతే, నీళ్ళను మరిగించి తాగుతాం లేదా యాలం వాడుతాం.
  11. మా అబ్బాయిల పెళ్ళికి ఎటువంటి వరకట్నాలు తీసుకోము. మా కూతురుల పెళ్ళికి ఎటువంటి వరకట్నం ఇవ్వము. మేము మా కేంద్రాన్ని వరకట్న-రహితంగా ఉంచుకుంటాం. మేము బాల్య వివాహాన్ని ఆచరించము.
  12. మేము ఎవరికీ అన్యాయం చేయము, ఎవరినీ చేయనివ్వము.
  13. ఆదాయం పెంచడానికి పెద్దస్థాయిలో పెట్టుబడి పెట్టడానికి ఉమ్మడిగా కృషి చేస్తాం.
  14. మేము ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఎవరైనా కష్టాల్లో ఉంటే, వారికి మేము అందరమూ సహాయం చేస్తాం.
  15. ఏ కేంద్రములోనైనా క్రమశిక్షణ ఉల్లంఘించబడిందని తెలిస్తే, మేమందరమూ అక్కడకి వెళ్లి, క్రమశిక్షణ పునరుద్దరించడానికి కృషి చేస్తాం.
  16. మేము అన్ని సామాజిక కార్యక్రమాలలో ఉమ్మడిగా పాల్గొంటాం.
ఢాకాలోని గ్రామీణ్ బ్యాంకు భవనం

గ్రామీణ్ బ్యాంకు సాలిడారిటీ ఋణం పద్దతికి పేరొందింది.[13] బంగ్లాదేశ్లో నెలకొల్పిన పదహారు నిర్ణయాల ను బ్యాంక్ పాటిస్తుంది.[16] గ్రామీణ్ బ్యాంకు యొక్క ప్రతి శాఖలో ఋణగ్రహీతలు ఈ నిర్ణయాలను చదివి వాటిని పాటిస్తామని హామీ ఇస్తారు. ఈ పదహారు నిర్ణయాల వలన, గ్రామీణ్ ఋణగ్రహీతలు మంచి సామాజిక ఆచరణలను పాటించడానికి ప్రోత్సాహం ఉంటుంది. పిల్లలను పాఠశాలకు పంపించి చదివించాలనేది ఒక ఆచరణ. గ్రామీణ్ బ్యాంకు ఈ పదహారు నిర్ణయాలను పాటించడం మొదలు పెట్టిన తరువాత, దాదాపు అన్ని గ్రామీణ్ ఋణగ్రహీతలు వారి పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఇది ఒక సామాజిక మార్పుకు తోడ్పడి, మరుసటి తరానికి విద్యను అందించడంలో దారి తీస్తుంది.[17]

సాలిడారిటి ఋణం అనేది సూక్ష్మఋణం యొక్క ముఖ్య అంశం. ఈ పద్ధతి 43 కంటే ఎక్కువ దేశాలలో అమలు చేయబడుతుంది. ప్రతి ఋణగ్రహీత ఏదో యొక్క ఐదుగురు-సభ్యులు గల కూటమిలో సభ్యత్వం పొంది ఉండాలి. కాని ఆ సభ్యునికి ఋణం ఇవ్వాలంటే, ఆ కూటమి ఏ హామీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఋణం తిరిగి చెల్లించే బాధ్యత, ఆ ఋణగ్రహీత అయిన వ్యక్తి పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒకరు బాధ్యతగా వ్యవహరించటానికి కూటమి మరియు కేంద్రం పర్యవేక్షణ చేస్తుంది. ఏ ఒకరికి కూడా ఋణం తిరిగి చెల్లింపులో సమస్య రావడం లేదు. ఉమ్మడి బాధ్యత అనే పద్ధతి లేదు. అనగా, చెల్లింపులు చేయని సభ్యుడు తరఫున కూటమిలో ఉన్న మిగిలిన సభ్యులు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. ఐతే, ఇతర కూటమి సభ్యులు ఆ సభ్యుడు చెల్లించవలసిన డబ్బును వారే కలిసి కట్టుగా చెల్లిస్తారు. తరువాత ఆ సభ్యుని నుంచి డబ్బును తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. దీనికి ముఖ్య కారణం, ఒక కూటమిలో ఏ ఒకరు ఋణం తిరిగి చెల్లించక పోయినా, ఆ కూటమికి తరువాత ఋణం ఇవ్వబడదు అనే అంశం.[18]

గ్రామీణ్ బ్యాంకుకు ఋణగ్రహీతలకు మధ్య ఎటువంటి చట్ట పరమైన ఒప్పందాలు (వ్రాతపూర్వక ఒప్పందాలు) ఏమి ఉండదు. ఈ వ్యవస్థ పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంది.[19] ఋణం ఆశించే సభ్యులు చిన్న మొత్తాన్ని పొదుపు చేయాలనేది గ్రామీణ్ బ్యాంకు విధించే షరతు. అత్యవసర నిధి, కూటమి నిధి వంటి ఏదో యొక్క నిధిలో ఈ పొదుపును చేయవచ్చు. ఈ నిధి, అత్యావసర సమయాలలో సహాయపడుతుంది.[13]

మహిళలు పెద్ద బ్యాంకులనుంచి ఋణమే తీసుకొని ఈ దేశములో, గ్రామీణ్ మహిళా ఋణగ్రహీతలు పై కేంద్రీకరించింది. ఎందుకంటే, సభ్యులలో 97% మహిళలే.[3] మహిళలకు సూక్ష్మఋణం అందుబాటులో తీసుకురావటం వలన, వారికి వనరులు ఎక్కువ అందుబాటులో ఉండి, నిర్ణయాలు తీసుకోవడంపై వారి పట్టు పెరుగుతుందని ఒక ప్రపంచ బ్యాంకు అధ్యయనం చెపుతుంది. కాని సూక్ష్మ ఋణమునకు రాని మహిళల పురోగతికి ఉన్న సంబంధం అంత సులభంగా గణించలేమని ఇతర ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.[20] ఇతర రంగాలలో కూడా, గ్రామీణ్ యొక్క పురోగతి గణనీయంగా ఉంది. 98% కంటే ఎక్కువ ఋణాలు తిరిగి చెల్లింపును సాధించింది. ఐతే, వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, 2001లో, బ్యాంకు ఋణాలలో ఐదవవంతు ఋణాలు ఒక సంవత్సరానికంటే ఎక్కువగా నిల్వలో ఉన్నాయి.[21] బంగ్లాదేశ్ లోని ఋణగ్రహీతలలో సగానికంటే ఎక్కువ మంది (సుమారు 50 మిలియను) తామిచ్చిన ఋణం వలన పేదరికము నుంచి విముక్తి పొందారని గ్రామీణ్ పేర్కొంటుంది. పాఠశాలకు వెళ్ళే పిల్లలు, అందరు కుటుంబ సభ్యులు మూడు పూటలు భోజనం చేయడం, ఒక మురుగు దొడ్డి, వాన కారని ఇల్లు, సురక్షిత మంచి నీరు, వారానికి 300 టాకా (సుమారు 4 USD) ఋణాన్ని తిరిగి చెల్లించే సామర్ధ్యం వంటి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించారు.[22]

[మార్చు] గ్రామీణ ఫోన్ ప్రోగ్రాం

బ్యాంకు అందించే వివిధ సూక్ష్మఋణాల పధకాలలో ఒకటి గ్రామీణ ఫోన్ ప్రోగ్రాం. దీని ద్వారా, బంగ్లాదేశ్ లో వయర్లెస్ పే ఫోన్ సేవలను అందించే వ్యాపారాన్ని మహిళా వ్యాపారవేత్తలు ప్రారంభించడానికి ఈ ప్రోగ్రాం సహాయ పడుతుంది. అభివృద్ధికి తోడ్పడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినడానికి ఈ ప్రోగ్రాం EUR 100,000/- విలువగల 2004 పీటర్స్ బర్గ్ ప్రైజ్ ను గెలుచుకుంది.[23] ఈ ప్రైజ్ ను ప్రకటించిన డెవెలప్మెంట్ గెట్వే ఫౌండేషన్ సంస్థ, ఒక పత్రికా ప్రకటన చేసింది. దాంట్లో ఈ విధంగా పేర్కొన్నారు:

...గ్రామీణ్ ఒక క్రొత్త తరం మహిళా వ్యాపారవేత్తలను సృష్టించింది. వీరు పేదరికము నుండి విముక్తి పొందిన వారిని వారే పై స్థాయికి తెచ్చుకున్నారు. అంతే కాక, ఈ బ్యాంకు రీతులు మరియు ఇతర జీవితాన్ని మెరుగు పరిచింది. బంగ్లాదేశ్ లోని సుమారు 28,000 గ్రామాలలో అడవారికి అందుబాటులో లేని మార్కెట్ సమాచారాన్ని వారికి అందేలా చేసింది. 55,000 కంటే ఎక్కువ ఫోన్ లు ప్రస్తుతం వాడబడుతున్నాయి. 80 మిలియను కంటే ఎక్కువ జనం దీనివలన ప్రయోజనం పొందారు. మార్కెట్ సమాచారం, చుట్టాల నుంచి సమాచారం వంటిని పొందగలిగారు.[23]

[మార్చు] కష్టాలలో ఉన్న సభ్యుల పధకం

2003లో, గ్రామీణ్ బ్యాంకు ఒక నూతన పధకాన్ని ప్రారంభించింది. ఈ పధకం దాని సాంప్రదాయక కూటమి-ఆధారిత ఋణ పధకాల నుంచి వేరుగా ఉంది. ఈ పధకం బంగ్లాదేశ్ లోని యాచకుల కొరకు రూపొందించినది.[24] యాచకులకు చిన్న ఋణాలను పంపిణి చేయడమే ఈ పధకం యొక్క లక్ష్యం. బ్యాంకులో ప్రస్తుతం అమలులో ఉన్న నియమాలు ఈ ఋణాలకు వర్తించదు. ఈ ఋణాలకు పూర్తిగా వడ్డీ ఉండదు. ఋణము తిరిగి చెల్లించే కాల వ్యవది ఎంతైనా ఉండవచ్చు. ఉదాహరణకి , ఒక యాచకుడు 100 టాకా (సుమారు US $1.50) ఋణం తీసుకుని దానిని వారానికి 2.00 టాకా (సుమారు 3.4 US సెంట్లు) చొప్పున తిరిగి చెల్లించవచ్చు. అంతే కాక, ఋణగ్రహీతకు ఉచిత జీవిత భీమా కూడా ఉంటుంది.

ఋణగ్రహీతలు యాచనను మానివేయాలని బ్యాంకు పట్టుపట్టదు. ఋణము తీసుకుని ఆ డబ్బుతో చిన్న తక్కువ ఖరీదు గల వస్తువులను అమ్మి వారు ఆదాయం పొందడానికి ప్రోత్సాహిస్తుంది. 2006లో,బ్యాంకుకు చెందిన ఒక మేనేజర్ ప్రపంచ సూక్ష్మఋణం సమావేశంలో ఒక వ్యాసాన్ని వ్రాశారు. 2006 మే నాటికి, సుమారు 73000 యాచకులు సుమారు దానిలో Tk 58.32 మిలియను ఋణం తీసుకున్నారని పేర్కొన్నారు. (సుమారు USD 833,150). వారు Tk. 34.78 మిలియను (సుమారు USD 496,900) తిరిగి చెల్లించారు.[25]

[మార్చు] కార్యకలాపాల గణాంకాలు

గ్రామీణ్ బ్యాంకు యొక్క అసాధారణమైన అంశం ఏమంటే, పేద ఋణగ్రహీతలే ఈ బ్యాంకు యజమానులు. వారిలో చాలా మంది మహిళలు. బ్యాంకు యొక్క మొత్తం ఈక్విటిలో, 94% ఋణగ్రహీతలకు స్వంతం. మిగిలిన 6% బంగ్లాదేశ్ ప్రభుత్వానికి స్వంతం.[3]

2003-2007 మధ్య కాలములో బ్యాంకు గణనీయమైన అభివృద్ధి సాధించింది.

2007 అక్టోబర్ నాటికి, బ్యాంకు యొక్క మొత్తం ఋణగ్రహీతల సంఖ్య 7.34 మిలియనుగా ఉంది. వీరిలో 97% మహిళలు.[3]

2003 నుంచి ఋణగ్రహీతల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ అయింది. 2003లో బ్యాంకుకు 3.12 మిలియను సభ్యులే ఉన్నారు.[26] ఇదే తరహా అభివృద్ధి అనేక గ్రామాలలో కూడా చూడవచ్చు. అక్టోబర్ 2007 నాటికి, ఈ బ్యాంకులో 24703 మంది సిబ్బంది 80,257 గ్రామాలలో 2468 శాఖలలో పని చేస్తున్నారు.[3] 2003లో గ్రామాల సంఖ్య 43,681గా ఉండేది.[26] స్థాపించబడినప్పటినుంచి బ్యాంకు Tk 347.75 బిలియను (USD 6.55 బిలియను) ఋణము మంజూరు చేసింది. దీనిలో, Tk 313.11 బిలియను (USD 5.87 బిలియను) తిరిగి చెల్లించబడినది.[3] ఋణము తిరిగి చెల్లింపు 1998లో 95% గా ఉండగా అది 98.35% కు పెరిగింది.[27] 1996 నుంచి 95% ఋణాల తిరిగి చెల్లింపు రేట్ గురించి నవంబర్ 2001లో, వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వ్యాసంలో అనుమానాలు వ్యక్తం చేసింది.[21]

[మార్చు] నోబెల్ శాంతి బహుమతి

గ్రామీణ్ బ్యాంకు అనేక పురస్కారాలను అందుకుంది. 1994లో బంగ్లాదేశ్ యొక్క అత్యుత్తమ పౌర పురస్కారమైన స్వాతంత్ర దిన పురస్కారాన్ని అందుకుంది. ఐతే, బ్యాంకుకు గొప్ప గుర్తింపు అక్టోబర్ 31, 2006 నాడు లభించింది. గ్రామీణ్ బ్యాంకు మరియు దాని వ్యవస్థాపకుడు మహమ్మద్ యూనుస్ కు "క్రింద స్థాయినుంచి ఆర్ధిక మరియు సామాజిక అభివృద్ధిని సృష్టించడములో వారి కృషి" కు 2006 నోబెల్ శాంతి బహుమతిను, నోబెల్ కమిటి ప్రకటించింది.[28] ఈ బహుమతి ప్రకటనలో ఇంకా ఈ విధంగా పేర్కొన్నారు:

మూడు దశాబ్దాల క్రితం, ఒక చిన్న ప్రయత్నముగా యూనుస్ ప్రారంభించిన ఈ గ్రామీణ్ బ్యాంకు సూక్ష్మ-ఋణాన్ని పేదరిక వ్యతిరేక పోరాటములో ఒక ముఖ్య భాగముగా మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా స్థాపించబడిన సూక్ష్మ-ఋణ సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచి గ్రామీణ్ బ్యాంకు వివిధ నూతన పధకాలను సృష్టించింది.[28]

డిసంబర్ 10, 2006 నాడు మోసంమాట్ తస్లిమా బేగం అనే మహిళా గ్రామీణ్ బ్యాంకు, దాని పెట్టుబడిదారులు మరియు ఋణగ్రహీతల తరపున ఆస్లో సిటీ హాల్[29]లో జరిగిన ఒక కార్యక్రమములో నోబెల్ ప్రైజ్ ను స్వీకరించారు. ఈ మహిళా తన తొలి 16-యూరో (20-డాలర్) ఋణంతో ఒక మేకను కొని వ్యాపారం చేసి, తరువాత ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి, అనంతరం బ్యాంకు పాలక మండలి సభ్యురాలుగా ఎన్నుకోబడింది.[30]

నోబెల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక వ్యాపార సంస్థ, గ్రామీణ్ బ్యాంకు మాత్రమే. బహుమతి ప్రధాన సభలో ప్రసింగించిన నార్వేజియన్ నోబెల్ కమిటి అధ్యక్షుడైన ప్రొఫెసర్ ఒలె డాన్బోల్ట్ మ్జోస్ ఈ విధంగా చెప్పారు: ఈ ప్రైజ్ ను గ్రామీణ్ బ్యాంకు మరియు మహమ్మద్ యూనుస్ కు ఇవ్వడం ద్వారా నార్వేజియన్ నోబెల్ కమిటి మూడు అంశాలపై ప్రపంచ దృష్టిని మళ్ళించాలని భావిస్తుంది. అవి ముస్లీం ప్రపంచంతో సంప్రదింపులు, మహిళల అభిప్రాయాలు మరియు పేదరిక నిర్మూలన.[31]

నోబెల్ ప్రైజ్ ప్రకటన బంగ్లాదేశ్ లో మంచి ఉత్సాహాన్ని ఏర్పరిచింది.[32] ఈ బహుమతి నవ-ఉదారవాదాన్ని ధృడపరుస్తందని కొందరు విమర్శకులు విమర్శిస్తున్నారు.[20]

[మార్చు] సంబంధిత సంస్థలు

ప్రధాన వ్యాసం: Grameen family of organizations

గ్రామీణ్ బ్యాంకు కాలక్రమేణా రెండు డజను సంస్థలుగా ఎదిగి గ్రామీణ్ సంస్థల కుటుంబము అని పిలవబడుతుంది. ఈ సంస్థలు: గ్రామీణ్ ట్రస్ట్, గ్రామీణ్ నిధి, గ్రామీణ్ కమ్యూనికేషన్స్, గ్రామీణ్ శక్తి (గ్రామీణ్ ఎనేర్జి), గ్రామీణ్ టెలికాం, గ్రామీణ్ శిక్ఖ (గ్రామీణ్ ఎడ్యుకేషన్), గ్రామీణ్ మొత్శో (గ్రామీణ్ ఫిషరీస్), గ్రామీణ్ బయ్బోస బికాష్ (గ్రామీణ్ వ్యాపార అభివృద్ధి), గ్రామీణ్ ఫోన్, గ్రామీణ్ సాఫ్ట్‌వేర్ లిమిటేడ్, గ్రామీణ్ సైబర్‌నెట్ లిమిటేడ్, గ్రామీణ్ నిట్వేర్ లిమిటేడ్, మరియు గ్రామీణ్ ఉద్దోగ్ (గ్రామీణ్ చెక్ బ్రాండ్ కు యజమాని).[33]

జులై 11, 2005 నాడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజస్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆమోదము పొందిన గ్రామీణ్ మ్యూచువల్ ఫండ్ వొన్ (GMFO తొలి పబ్లిక్ విడుదలగా నమోదు చేయబడింది. మ్యూచువల్ ఫండ్ రకాలలో నూతనమైన GMFO ద్వారా నాలుగు మిలియను కంటే ఎక్కువ ఉన్న గ్రామీణ్ బ్యాంకు సభ్యులు బంగాళాదేశ్ కేపిటల్ మార్కెట్ లో కొనుగోలు చేయడానికి వీలు ఏర్పడింది. బ్యాంక్ మరియు దాని ఇతర భాగస్వాముల మొత్తం విలువ USD 7.4 బిలియను కంటే ఎక్కువ ఉంటుంది.[34]

బంగ్లాదేశ్ లో గ్రామీణ్ బ్యాంకు సాధించిన విజయం వలన గ్రామీణ్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ గ్రామీణ్ సిద్ధాంతాన్ని పాటించి ప్రపంచంలోని పేదవారికి సూక్ష్మఋణం అందేలా కృషి చేస్తుంది.[35] చారిటి వాచ్[36] సంస్థ చే A-రేటింగ్ పొందిన గ్రామీణ్ ఫౌండేషన్, USA లో సూక్ష్మఋణం ఐవ్వడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సూక్ష్మఋణ సంస్థలకు, ఋణం హామీలు, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించి సహాయం చేస్తుంది.[37] 2008 నాటికి, గ్రామీణ్ ఫౌండేషన్ ఈ క్రింద ప్రాంతాలలో సూక్ష్మఋణ సంస్థలకు సహాయం చేస్తుంది.[38]

2010 సన్డాన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించబడిన టు క్యాచ్ ఎ డాలర్ అనే చిత్రం 2008లో క్వీన్స్, న్యూ యార్క్ లో గ్రామీణ్ అమెరికా పధకాలను స్థాపించే ప్రక్రియను వివరిస్తుంది. ఈ డాక్యుమెంటరి సెప్టెంబర్ 2010న ప్రజలకు ప్రదర్శించబడుతుందని అంచనా.

[మార్చు] విమర్శ

సుదిరెంధర్ శర్మ అనే ఒక అభివృద్ధి విశ్లేషకుడు "బ్యాంకు పేదవారిని ఎల్లప్పుడూ ఒక ఋణ-వలలో చిక్కుకునే లాగ చేసింది"[39] అని విమర్శించాడు. ఆఖరికి దీని వల్ల ప్రయోజనం పొందినవారు ఎవరంటే, ఋణగ్రహీతలుకు పరికరాలు అమ్మినవారే అనే అతను చెప్పాడు.[40] మాజీ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హాసిన ఈ విధంగా వ్యాఖ్యానించారు: "వడ్డీ వ్యాపారస్తులకు [యూనస్] లంచగొండి వారికి తేడా లేదు".[41]

గ్రామీణ్ బ్యాంకు గురించి హసీనా చేసిన ఒక ముఖ్య విమర్శ: ఋణం తీసుకునే వారు నుంచి వసూలు చేయబడే అధిక వడ్డీ[42] అన్ని సూక్ష్మఋణ సంస్థల మాదిరిగానే, గ్రామీణ్ బ్యాంకు వసూలు చేసే వడ్డీ సాంప్రదాయక బ్యాంకులు వసూలు చేసేదాని కంటే ఎక్కువగానే ఉంటుంది. గ్రామీణ్ బ్యాంకు సుమారు 20% వడ్డీ వసూలు చేస్తుంది.[43] మిసెస్ ఇన్స్టిట్యూట్కు చెందిన జేఫ్ఫ్రేయ్ టకర్ బ్యాంకును విమర్శిస్తూ,[44] ఈ బ్యాంకు మరియు ఇటువంటి గ్రామీణ్ తరహా బ్యాంకులు ఆర్ధికంగా బలంగా ఉండవని, వీటిని నడపాలంటే రాయతీలు అవసరమని, అందువలన ఇవి కేవలం సంక్షేమ కార్క్యక్రమాలకు ఒక ఉదాహరణే అని విమర్శించారు. తాము ఋణగ్రహీతలకు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించి రాయతీలతో కూడిన ఆర్ధిక వ్యవస్థకు వ్యతిరేకంగా కృషి చేస్తున్నామని యూనస్ చెపుతున్న వాదనను వారు తిరస్కరిస్తున్నారు. మరొక విమర్శ ఏమంటే, గ్రామీణ్ యొక్క పదహారు నిర్ణయాలు గుర్తించింది.[45] పదహారు నిర్ణయాలు కుటుంబాలను బ్యాంకు యొక్క నియమ నిబంధనలకు కట్టుబడేలా బలవంత పెడుతుందని విమర్శకులు[ఎవరు?] వాదిస్తున్నారు. కాని ఎందుకు ఈ మార్గాదర్శక సూత్రాలు (ఐక్యత దైర్యం, క్రమశిక్షణ, శ్రమ; మరియు బ్యాంకు విధించిన కొన్ని అదనపు నియమాలు: మంచి గృహములో నివసించడం, సురక్షితం-కాని మంచినీరును తాగకుండా ఉండడం, కూతురులకు వరకట్నాలు ఇవ్వడానికి నిరాకరించడం) ఏ విధంగా ఋణగ్రహీతలకు మంచిది కాదు అని వారికి అర్ధమయ్యేలా చేయడం లేదు. ఒక సభ్యుడు ఋణాన్ని తిరిగి చెల్లించలేక పోయినప్పుడు, దానిని ఋణగ్రహీత కూటమి తిరిగి కట్టాలనే అంశాన్ని వారు తప్పు పటుతున్నారు. ఇది ఒక నిరకుశాత్వం అని సమాజ నిర్మాణం కాదని వారు ఆరోపిస్తునంరు. యూనుస్ తరచూ చెపుతున్న "గ్రామీణ్ ఋణగ్రహీతలలో 5% మంది ప్రతి ఏటా పెదరికమునుంచి బయటకు వస్తున్నారు" అనే గణాంకముతో డేవిడ్ రూడ్మాన్[46] మరియు జోనాథన్ మొర్డుక్[47] ఎకీభవించడం లేదు. అదే అధ్యయనాన్ని మరల విశ్లేషించే వారికి దానికి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అయితే మహిళలకు ఋణం ఇవ్వడం వలన కుటుంబాలు మరింత పేదరికములోకి వెళ్తున్నాయని వారు భావించలేదు. ఆ వ్యతిరేక ఫలితం మరొక దారిలో వెళ్ళవచ్చు: ధనవంతుల కుటుంబాలలోని మహిళలు తక్కువగా ఋణం తీసుకోవచ్చు.[48]

[మార్చు] వీటిని కూడా చూడండి

[[Image: |x28px]] Sustainable development portal
  • గ్రామా విడియాల్, భారత దేశ సూక్ష్మఋణ బ్యాంకు
  • గ్రామీణ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ లోని గ్రామీణ్ వారి సూక్ష్మఋణ పధకం
  • ఇస్లామిక్ బ్యాంకింగ్
  • ఆపర్చునిటి ఇంటర్నేషనల్

[మార్చు] సూచనలు

  1. 1.0 1.1 1.2 Ahmed & Ahmed (Chartered Accountants) (2007-08-01). GRAMEEN BANK Profit and Loss Account, for the year ended 31 December 2006 (PDF). Auditors’ Report and Financial Statements OF Grameen Bank. Grameen Communications. February 26, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-17.
  2. Ahmed & Ahmed (Chartered Accountants) (2007-08-01). GRAMEEN BANK Balance Sheet, As at 31 December 2006 (PDF). Auditors’ Report and Financial Statements OF Grameen Bank. Grameen Communications. February 26, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-17.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Grameen Bank At a Glance. Grameen Communications. తీసుకొన్న తేదీ: 2009-07-07.
  4. గ్రామీణ్ బ్యాంకు సూక్ష్మఋణం అనగా నేమి?
  5. <a href=http://www.గ్రామీణ్-info.org/index.php?option=com_content&task=view&id=19&Itemid=164.A Short History of Grameen Bank</a>
  6. The Nobel Prize for 2006. The Nobel Peace Prize for 2006 (2006-10-13). తీసుకొన్న తేదీ: 2006-10-13.
  7. Anand Giridharas and Keith Bradsher. "Microloan Pioneer and His Bank Win Nobel Peace Prize", New York Times, 2006-10-13. Retrieved on 2006-10-13.
  8. 8.0 8.1 8.2 Rahman, Aminur (2001). Women and Microcredit in Rural Bangladesh: Anthropological Study of Grameen Bank Lending. Boulder, Colorado: Westview Press. ISBN 0-8133-3930-8. 
  9. Brandon Glenn (2006-10-16). ShoreBank leaders had hand in Nobel prize. Chicago Business News. తీసుకొన్న తేదీ: 2007-05-15.
  10. Papa, Michael J.; Arvind Singhal and Wendy H. Papa (2006). Organizing for Social Change: A Dialectic Journey of Theory and Praxis. Sage Publications. ISBN 0761934359. 
  11. గ్రామీణ్ బ్యాంకు చారిత్రాత్మక వివరాలు. జూన్ 8, 2009న పునరుద్ధరించబడింది.
  12. "Bangladeshi banker wins Nobel Peace Prize", United Press International, 2006-10-13. Retrieved on 2008-01-16.
  13. 13.0 13.1 13.2 Khandker, Shahidur R.; Baqui, M. A. & Khan Z. H. [1995] (1995). Grameen Bank: Performance and Sustainability. World Bank Publications. ISBN 0821334638. Retrieved on 2008-01-16. 
  14. *Morduch, Jonathan (October 1999). "The role of subsidies in microfinance: evidence from the Grameen Bank" (PDF). Journal of Development Economics 60 (1). DOI:10.1016/S0304-3878(99)00042-5. Retrieved on 2008-01-16. 
  15. Sherraden, Margaret S. (1998). Community Economic Development and Social Work. Binghamton, New York: Haworth Press, 113–114. ISBN 0-7890-0506-9. 
  16. సిద్దికి, కమల్, గ్రామీణ్ బ్యాంకు కార్యకలాపాల గురించి ఒక నివేదిక (దాకా: నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ లోకల్ గవర్నమెంట్, 1984)
  17. Ghista, Garda (2004). Bangladesh:Towards Economic and Women’s Liberation Via Grameen Bank. ProutWorld. October 18, 2007న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-02-04.
  18. Hossain, Mahabub [1988] (February 1988). Credit for Alleviation of Rural Poverty: The Grameen Bank in Bangladesh. Int Food Policy Res Inst IFPRI. ISBN 0896290670. Retrieved on 2008-01-16. 
  19. Sinclair, Paul (2007-12-22). Grameen Micro-Credit & How to End Poverty from the Roots Up. One World One People. తీసుకొన్న తేదీ: 2008-02-04.
  20. 20.0 20.1 మూస:Cite document
  21. 21.0 21.1 Daniel Perl, Michael M. Phillips (2001-11-27). Grameen Bank, Which Pioneered Loans For the Poor, Has Hit a Repayment Snag. Wall Street Journal. తీసుకొన్న తేదీ: 2008-03-25.
  22. Fraser, Ian (2007-08-03). Microfinance comes of age. Cover Story. Scottish Banker magazine. October 07, 2007న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-30.
  23. 23.0 23.1 Grameen Bank-Village Phone Wins Global Competition for Contribution of Technology to Development (PDF). Development Gateway Foundation (Washington, DC) (2004-07-27). February 26, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-31.
  24. Yunus, Muhammad (July 2005). Grameen Bank's Struggling (Beggar) Members Programme. Grameen Communications. January 25, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-31.
  25. Barua, D. C. (2006-11-12). "Five Cents a Day: Innovative Programs for Reaching the Destitute with Microcredit, No-interest Loans, and other Instruments: The Experience of Grameen Bank" (PDF). Global Microcredit Summit; Nova Scotia, Canada. Retrieved on 2008-01-20. 
  26. 26.0 26.1 Grameen Bank Historical Data Series 2003. Grameen Communications (2004-07-21). January 15, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-17.
  27. Credit delivery system. Grameen Communications (2002-09-18). January 17, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-17.
  28. 28.0 28.1 The Nobel Peace Prize for 2006. The Nobel Peace Prize for 2006 (2006-10-13). తీసుకొన్న తేదీ: 2006-10-13.
  29. AFP, Oslo. "Yunus unveils vision to end global poverty", The Daily Star, 2006-12-11. Vol 5 Num 903. Retrieved on 2008-01-31.
  30. AFP, Oslo. "Yunus unveils vision to end global poverty", The Daily Star, 2006-12-11. Vol 5 Num 903. Retrieved on 2008-01-31.
  31. Mjøs, Ole Danbolt (2006-10-13). The Nobel Peace Prize for 2006: Presentation Speech. The Nobel Peace Prize for 2006. తీసుకొన్న తేదీ: 2008-02-04.
  32. "Nation parties on Nobel win", The Daily Star, 2006-10-15. Vol 5 Num 850. Retrieved on 2008-02-04.
  33. Grameen Family of Enterprises. Grameen Website. Grameen Communications (2007-11-28). August 22, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2009-07-08.
  34. "Credit where credit is due: The banker who changed the world", The Independent, 2006-10-14. Retrieved on 2008-01-17.
  35. Grameen Foundation Annual Report 2006 (PDF). Grameen Foundation, Washington, DC, USA (2007-08-01). February 26, 2008న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-01-31.
  36. Top Rated Carities. American Institute of Philanthropy (2008-01-15). తీసుకొన్న తేదీ: 2008-01-17.
  37. Grameen Foundation USA. 25 entrepreneurs who are changing the world. Fast Company Monitor Group. తీసుకొన్న తేదీ: 2008-01-29.
  38. Where we work | Grameen Foundation. Grameen Foundation<!. తీసుకొన్న తేదీ: 2009-12-20.
  39. Sharma, Sudhirendar. "Is micro-credit a macro trap?", The Hindu, 2002-09-25. Retrieved on 2006-12-02.
  40. Sharma, Sudhirendar. "Microcredit: Globalisation unlimited", The Hindu, 2002-01-05. Retrieved on 2006-12-02.
  41. "A new party for Bangladesh's fray", Economist, 2007-02-22. Retrieved on 2008-01-31.
  42. IANS (2007-02-18). Sheikh Hasina sneers at Nobel winner Yunus's bid to enter politics. Webindia123.com. తీసుకొన్న తేదీ: 2008-02-02.
  43. Fernando, Nimal A. (May 2006). Understanding and Dealing with High Interest Rates on Microcredit - A Note to Policy Makers in the Asia and Pacific Region (PDF), Manila, Philippines: ADB. 
  44. Tucker, Jeffrey (November 1995). The Micro-Credit Cult. The Free Market. Mises Institute.
  45. 16 decisions (PDF). Grameen Bank. తీసుకొన్న తేదీ: 2009-04-14.
  46. David Roodman : Center for Global Development : CGD Experts. Cgdev.org (2009-10-22). తీసుకొన్న తేదీ: 2009-12-20.
  47. Jonathan Morduch's Home Page. Nyu.edu. తీసుకొన్న తేదీ: 2009-12-20.
  48. New Challenge to Studies Saying Microcredit Cuts Poverty | David Roodman's Microfinance Open Book Blog. Blogs.cgdev.org. తీసుకొన్న తేదీ: 2009-12-20.

[మార్చు] మరింత చదవటానికి

[మార్చు] బాహ్య లింకులు

మూస:S-ach

ముందు
Mohamed ElBaradei
and
International Atomic
Energy Agency
Nobel Peace Prize Laureate
with Muhammad Yunus

2006
తరువాత
Al Gore
and
Intergovernmental Panel
on Climate Change

మూస:Nobel Peace Prize Laureates 2001-2025 మూస:Footer Gandhi Peace Prize laureates

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు