Jump to content

ఘంటసాల (కృష్ణా జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 16°10′11.136″N 80°56′42.396″E / 16.16976000°N 80.94511000°E / 16.16976000; 80.94511000
వికీపీడియా నుండి
ఘంటసాల (కృష్ణా జిల్లా)
బౌద్ధ స్తూపం అవశేషాలు, ఘంటసాల
బౌద్ధ స్తూపం అవశేషాలు, ఘంటసాల
పటం
ఘంటసాల (కృష్ణా జిల్లా) is located in ఆంధ్రప్రదేశ్
ఘంటసాల (కృష్ణా జిల్లా)
ఘంటసాల (కృష్ణా జిల్లా)
అక్షాంశ రేఖాంశాలు: 16°10′11.136″N 80°56′42.396″E / 16.16976000°N 80.94511000°E / 16.16976000; 80.94511000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంఘంటసాల
విస్తీర్ణం12.21 కి.మీ2 (4.71 చ. మై)
జనాభా
 (2011)
9,248
 • జనసాంద్రత760/కి.మీ2 (2,000/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు4,585
 • స్త్రీలు4,663
 • లింగ నిష్పత్తి1,017
 • నివాసాలు3,187
ప్రాంతపు కోడ్+91 ( 08671 Edit this on Wikidata )
పిన్‌కోడ్521133
2011 జనగణన కోడ్589702

ఘంటసాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా, ఘంటసాల మండలం లోని గ్రామం.ఇది సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 26 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3187 ఇళ్లతో, 9248 జనాభాతో 1221 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4585, ఆడవారి సంఖ్య 4663. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3257 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 379. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589702[2].సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]
ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము

ఈ గ్రామంలో అరుదైన బౌద్ధ స్తూపాలు 1919-20 సంవత్సరాల మధ్య త్రవ్వకాలలో దొరికాయి. ఈ గ్రామం ఒకప్పటి కాలంలో భారత-రోమనుల మధ్య వర్తకంలో ప్రధాన పాత్ర వహించింది. బౌద్ధ స్తూపాలు, హిందు శిల్పా శిథిలాలు అప్పటి శిల్ప కళను తెలుపుతున్నాయి. క్రీ.పూ. 2-3 శతాబ్దానికి చెందిన పాలరాతి శిల్పాలు, ఒక రాతి ఇటుక మీద 12 నక్షత్ర మండలాలు చెక్కబడిన శిల్పం మొదలుగు కొన్ని స్తూపాలు ఫ్రాన్సు వంటి దేశాల సంగ్రహాలయాలలో ఉన్నాయి.ఘంటసాల గ్రామంలోని బౌద్ధమహా స్థూపం వద్ద, 2014, ఏప్రిల్ -15వ తేదీ, మంగళవారం నాడు, మహాచైత్రపౌర్ణమి సందర్భంగా, బౌద్ధభిక్షువు దర్మతేజ బంతీజీ ఆధ్వర్యంలో, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమబుద్ధుని చిత్రపటానికి ధూప, దీప, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలో ఇటీవల మట్టి త్రవ్వకాలలో ఒక బుద్ధుడి ముఖ ప్రతిమ లభించింది. దానిని పురావస్తుశాఖ వారికి అందజేసినారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

బుద్ధుని గుర్రం "కంఠక" పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఘంటసాల అని వచ్చింది.

సమీప గ్రామాలు

[మార్చు]

కొత్తపల్లి 1 కి.మీ, చిలకలపూడి 2 కి.మీ, దేవరకోట 3 కి.మీ, చిట్టూర్పు 4 కి.మీ, మల్లంపల్లి 4 కి.మీ

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఘంటసాలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఘంటసాలలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఘంటసాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 398 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 822 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 822 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఘంటసాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 822 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఘంటసాలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, చెరకు, మినుము

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలోనూ ఉన్నాయి.

గ్రంథాలయం

[మార్చు]

ఘంటసాలలో 1920ల నాటికి రామమోహన గ్రంథాలయం అనే ప్రైవేటు గ్రంథాలయం స్థాపించి చిరకాలం పాటు కొనసాగింది. 1928 నాటికి ధనలేమితో గ్రంథాలయం అసంతృప్తికరంగా పనిచేస్తూండడంతో స్థానిక సహకార పరపతి సంఘం వారు నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు.[3]

వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల

[మార్చు]

వ్యవసాయాధారితమైన ఈ ప్రాంతంలోని ఈ గ్రామంలో నూతనంగా మంజూరయిన ఈ కళాశాలను, 2016,నవంబరు-3వతేదీ మద్యాహ్నం 3-30 కి ప్రారంభించెదరు. ఈ కేంద్రం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహింపబడును.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాల పూర్వవిద్యార్థిని శ్రీమతి వేమూరి ఉషారాణి, ఇపుడు హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో కేంద్రప్రభుత్వ వ్యవసాయధికారిణిగా పనిచేస్తున్నారు.

సమైక్యతానగర్ పాఠశాల

[మార్చు]

గురు విద్యా నికేతన్

[మార్చు]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

వ్యవసాయ పరిశోధనా కేంద్రం

[మార్చు]

కృషి విఙాన కేంద్రం

[మార్చు]

కృషి విఙాన కేంద్రం వద్ద, మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం, 2020,అక్టోబరు-28న నిర్వహించారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]
  1. ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్.
  2. భారతీయ స్టేట్ బ్యాంక్.
  3. ఆంధ్రా బ్యాంకు

దాసరివారి కళ్యాణ వేదిక

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి వెంకటేశ్వర్లు, తన భార్య, దివంగత ఉపాధ్యాయురాలు కీ.శే.దాసరి వెంకటకుమారి ఙాపకార్ధం స్థానిక విశ్వేశ్వరస్వామి కళ్యాణ మండపం ప్రాంగణంలో, మూడు లక్షల రూపాయల నిధులతో, దీనిని నిర్మాణం చేసారు. ఈ వివాహ వేదిక కుల, మతరహితంగా అందరికీ అందుబాటులో ఉంది

ఏ.ఎస్.ఎం.సామాజిక భవనం

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ 1918,ఏప్రిల్-14న ఏర్పడింది.

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో కౌతరపు నాగరత్నం సర్పంచిగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా గొర్రెపాటి సురేష్ ఎన్నికైనాడు.

దర్శనీయ స్థలాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ జలధీశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

హెచ్చు కన్ను, దిగంబరుడైన అంబరకేశుడు, త్రికాల సంధ్యాస్నానాలకు అనువుగా బంగాళాఖాతం జలధి తీరంలోని ఈ గ్రామంలో, బాలపార్వతీ సమేతంగా జలదీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి, 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించెదరు. పురాతనమైన ఈ ఆలయంలో గర్భాలయం శిథిలావస్థకు చేరడంతో, దేవాదాయశాఖ రు. 4.8 లక్షలు, దాత స్వాతి వారపత్రిక యజమాని శ్రీ వేమూరి బలరాం, రు. 2.4 లక్షల వితరణతో, మూడు నెలలపాటు ఈ ఆలయంలో మరమ్మత్తు పనులను, అభివృద్ధిపనులను నిర్వహించారు. ఈ పనులు పూర్తి అవగానే, 2014, ఆగష్టు-22, శ్రావణ శుక్రవారం నాడు, ఈ ఆలయంలో, ఆలయ ముఖ మంటపం వద్ద, వాస్తుహోమం, నవగ్రహహోమం, ప్రత్యేకపూజల అనంతరం, నిత్య పూజలను పునఃప్రారంభించారు. [2]&[11]

ఈ ఆలయానికి దాత సహకారంతో, ఒకటిన్నర లక్షల రూపాయల విలువైన ఒక స్టీలు రథాన్ని తయారుచేయించారు. [14]

శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయo

[మార్చు]

ఘంటసాల, దేవరకోట పరిసర ప్రాంతాల గ్రామాల వారి ఇలవేలుపు అయిన శ్రీ ముతాలమ్మ అమ్మవారి ఆలయ ముఖద్వారా ప్రారంభోత్సవం, అక్టోబరు 18, 2013,శుక్రవారం మధాహ్నం 3-30 గం.కు జరిగింది. దీనికి అయిన వ్యయం రు.4 లక్షలు. ఇదే సమయంలో రు. 2 లక్షలతో నిర్మాణమయిన ఆలయప్రాంగణంలోని సిమెంటు రహదారుల ప్రారంభోత్సవం గూడా జరిగింది. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-15, శుక్రవారం నాడు, అమ్మవారి గ్రామోత్సవం, డప్పు వాయిద్యాలతో, శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయం వద్ద, మొక్కుబడులు తీర్చుకున్నారు. [3] & [10]

శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయo

[మార్చు]

ఈ గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 200వ కళ్యాణోత్సవాలు 2013,డిసెంబరు 6 నుండి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాలు 4రోజులపాటు జరుగును.

శ్రీరామమందిరం

[మార్చు]

ఈ గ్రామంలో పది లక్షల రూపాయలతో, గ్రామస్థులు, దాతల సహకారంతో, నూతనంగా నిర్మించిన రామమందిరంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2014,మార్చ్-15 నుండి 17 వరకూ నిర్వహించారు. 15న విఘ్నేశ్వర పూజ, దీక్షా బంధన పూజ, జలాధివాసం, క్షీరాధివాసం పూజలు జరిగినవి. 16న లక్షణోధారణ, వాస్తుహోమం, పంచసూక్తిహోమం, పుష్పాధివాసం, శాంతిహోమం, యాగశాల పూజ జరిగినవి. 17న ఉదయం, 07-15 మంటలకు శ్రీ గణపతి పూజ, శ్రీ సీతారామలక్ష్మణ, భక్తాంజనేయస్వామి వారల నూతన విగ్రహ ప్రతిష్ఠాపన పూజాకార్యక్రమాలు, మహాకుంభాభిషేకం, మహా పూర్ణాహుతి, విశేషపూజలు నిర్వహించారు. అదేరోజు భక్తులకు సామూహిక అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

శ్రీరామాలయం

[మార్చు]

ఘంటసాల పడమర వీధి శ్రీరామాలయంలో, 2014,ఏప్రిల్-8న శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ, విఘ్నేశ్వర స్వామివార్ల నూతన విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించారు. వేదపండితులు విశేషపూజలు జరిపినారు. గ్రామానికి చెందిన శ్రీ కె.నారాయణరావు, ఒక లక్ష రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం జరిపించారు. విగ్రహదాతలు శ్రీ వేమూరి శ్రీనివాసరావు, వసుంధరాదేవి దంపతులు, ఒక లక్ష రూపాయలతో నూతన నల్లరాతి దేవతా మూర్తుల విగ్రహాలను బహుకరించారు. తరువాత, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

స్థానిక బాలాజీనగరులో ఉన్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో, 3 రోజులపాటు, వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ పెన్నేరమ్మ తల్లి ఆలయం

[మార్చు]

ఈ గ్రామంలో గత 130 సంవయ్స్తరాలుగా కొలువైయున్న ఈ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజాకార్యక్రమాలు నిర్వహించేటందుకు అనివార్యకారణాలవలన, ఐదు దశాబ్దాలుగా అమలుచేయలేదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందువలన, ఈ ఆలయంలో 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, గ్రామోత్సవాన్ని భారీ యెత్తున నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు.

బుద్ధ విగ్రహం

[మార్చు]

ఈ గ్రామంలో 18 అడుగుల ఎత్తయిన బుద్ధ విగ్రహ నిర్మాణానికి, 2016,మే-21వ తేదీ శనివారం, బుద్ధ (వైశాఖ) పౌర్ణమి రోజున భూమిపూజ చేసారు. ఈ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాధబాబు, ఈ విగ్రహ నిర్మాణానికై రెండున్నర లక్షల రూపాయలను వితరణ చేసారు. ఘంటసాలలోని ప్యాలెస్ మ్యూజియంలో ఉన్న నమూనా ఆధారంగా దీనిని తయారుచేసెదరు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

ఈ గ్రామం నుండి ఎందరో రాజకీయవేత్తలు స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.

  • గొట్టిపాటి బ్రహ్మయ్య - ఇతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు.
  • పండిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్య - ఇతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు. వీరు ఆనాటి కాలంలోనే ఘంటసాల చరిత్రను వ్రాసిన ఘనులు. వీరు అనేక ఇతర గ్రంథాలను గూడా రచించారు. వీరి రచనలు తెలుగు భాషా సమితి, అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందినవి. ఇతను వ్రాసిన గ్రంథాలను వెలుగులోనికి తీసికొనివచ్చే ప్రయత్నాలు జరుగుచున్నవి. గ్రామంలో వీరి విగ్రహాన్ని, 2016,జనవరి-13న, ప్రవాసాంధ్రులు గొర్రెపాటి రంగనాథబాబు, తానా (Telugu Association of North America) మాజీ అధ్యక్షులు గొర్రెపాటి నవనీత కృష్ణలు సంయుక్తంగా అవిష్కరించారు. [19]
  • యు.వి.వర్లుగా ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర్లు గారు.
  • ఉప్పలపాటి వెంకటేశ్వర్లు -ఇతను యు.వి.వర్లుగా ప్రసిద్ధి చెందారు.
  • కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ -ఇతను ఉదయం దినపత్రికకు సంపాదకులుగా పనిచేసారు.ఇతను స్నేహ పత్రికకు గూడా సంపాదకులుగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, పద్మభూషణ్ బిరుదాంకితులు అయిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారికి వీరు మనుమలు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలెనని ప్రణాళిక జరుపుతున్నది.
  2. ఈ గ్రామంలో ఒక సంగ్రహాలయము ఉంది. కాని ప్రభుత్వ అలసత్వ ధోరణి వల్ల ఇది పర్యాటకులను ఆకర్షించలేకపోతోంది.
  3. ఘంటసాల గ్రామంలో, ఎన్నారైలు, గ్రామస్థులు, దాతల సహకారంతో "మన ఊరు పార్కు"ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పార్కులో, కమ్యూనిటీ భవనం, పూజల భవనం, శాంతిభవనాలను నూతనంగా నిర్మాణం చేసి అభివృద్ధి చేశారు. మన ఊరి పార్కును 2014,జనవరి-26 ప్రారంభించారు. ఈ పార్కు సమీపంలో, మరో శాంతివనం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించెదరు.
  4. అపరాల పరిశోధనలో విశేషకృషి చేయుచున్న, ఘంటసాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎం.వి.రమణ కు, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం వారిచే, రాష్ట్రస్థాయిలో ప్రదానం చేసే, "డా.బి.నాగరాజారావు " బంగారు పతకాన్ని అందజేశారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2014,మార్చ్-20న హైదరాబాదులో జరిగిన ఆచార్య ఎన్.జి.రంగా విశ్వ విద్యాలయ 44వ స్నాతకోత్సవం సందర్భంగా అందజేశారు. [7]
  5. ఈ గ్రామానికి చెందిన, రైతుకుటుంబం నుండి వచ్చిన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు, చాలా రోజులక్రితం ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, ఉపాధి కొరకు అమెరికా వెళ్ళినారు. కాలక్రమేణా అక్కడ పారిశ్రామికవేత్తగా ఎదిగినారు. అయినా గానీ తన జన్మభూమిపై మమకారంతో తన తల్లిదండ్రుల పేరుమీద, "గొర్రెపాటి వెంకట్రాయులు, ఉదయభాస్కరమ్మ విద్యా ట్రస్ట్"ను స్థాపించి గ్రామాభివృద్ధికై తనవంతు తోడ్పాటునందించుచున్నారు. అంతేగాక, తాను చేయుచున్న అభివృద్ధిపనులలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులను గూడా భాగస్వాములను చేస్తున్నారు.
  6. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఘంటశాలకు చెందిన శ్రీ మూల్పూరి చెన్నారావు, గ్రామాభివృద్ధిలో అవిరళ కృషి చేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "రామమోహన గ్రంథాలయం". గ్రంథాలయ సర్వస్వము. 7. January 1928. Retrieved 8 March 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]