ఘంటసాల (కృష్ణా జిల్లా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఘంటసాల (కృష్ణా జిల్లా)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి కౌతరపు నాగరత్నం
జనాభా (2001)
 - మొత్తం 10,421
 - పురుషులు 5,127
 - స్త్రీలు 5,294
 - గృహాల సంఖ్య 2,949
పిన్ కోడ్ 521 133
ఎస్.టి.డి కోడ్ 08671
ఘంటసాల
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఘంటసాల మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఘంటసాల మండలం యొక్క స్థానము
ఘంటసాల is located in Andhra Pradesh
ఘంటసాల
ఆంధ్రప్రదేశ్ పటములో ఘంటసాల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°10′38″N 80°56′51″E / 16.177089°N 80.947552°E / 16.177089; 80.947552
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము ఘంటసాల
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 43,869
 - పురుషులు 21,761
 - స్త్రీలు 22,108
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.79%
 - పురుషులు 74.00%
 - స్త్రీలు 65.68%
పిన్ కోడ్ 521133

ఘంటసాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ 521 133., ఎస్.టి.డి. కోడ్ = 08671.

ఈ గ్రామము మచిలీపట్టణానికి 21 కి.మీ. దూరములో ఉన్నది.

ఈ గ్రామములో అరుదైన బౌద్ధ స్తూపాలు 1919-20 సంవత్సరాల మధ్య త్రవ్వకాలలో దొరికాయి. ఈ గ్రామము ఒకప్పటి కాలములో భారత-రోమనుల మధ్య వర్తకములో ప్రధాన పాత్ర వహించింది. బౌద్ధ స్తూపాలు మరియు హిందు శిల్పా శిధిలాలు అప్పటి శిల్ప కళను తెలుపుతున్నాయి. క్రీ.పూ. 2-3 శతాబ్దమునకు చెందిన పాలరాతి శిల్పాలు, ఒక రాతి ఇటుక మీద 12 నక్షత్ర మండలాలు చెక్కబడిన శిల్పము మొదలుగు కొన్ని స్తూపాలు ఫ్రాన్సు వంటి దేశాల సంగ్రహాలయాలలో ఉన్నాయి.


ఈ గ్రామంలో ఇటీవల మట్టి త్రవ్వకాలలో ఒక బుద్ధుడి ముఖ ప్రతిమ లభించినది. దానిని పురావస్తుశాఖ వారికి అందజేసినారు. [13]

ఘంటసాల గ్రామంలోని బౌద్ధమహా స్థూపం వద్ద, 2014,ఏప్రిల్ -15వ తేదీ, మంగళవారం నాడు, మహాచైత్రపౌర్ణమి సందర్భంగా, బౌద్ధభిక్షువు దమ్మతేజ బంతీజీ ఆధ్వర్యంలో, ప్రత్యేక పూజలు నిర్వహించినారు. గౌతమబుద్ధుని చిత్రపటానికి ధూప, దీప, ప్రత్యేక పూజలు నిర్వహించినారు. [9]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రము గా తీర్చిదిద్దవలెనని ప్రణాళిక జరుపుతున్నది.

ఈ గ్రామము లొ ఒక సంగ్రహాలయము ఉన్నది. కాని ప్రభుత్వ అలసత్వ ధోరణి వల్ల ఇది పర్యాటకులను ఆకర్షించలేకపోతోంది.

ఈ గ్రామం నుండి ఎందరో రాజకీయవేత్తలు స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో కౌతరపు నాగరత్నం సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గొర్రెపాటి సురేష్ ఎన్నికైనారు. [1]

చరిత్ర[మార్చు]

ఘంటసాలలో 1920ల నాటికి రామమోహన గ్రంథాలయం అనే ప్రైవేటు గ్రంథాలయం స్థాపించి చిరకాలం పాటు కొనసాగింది. 1928 నాటికి ధనలేమితో గ్రంథాలయం అసంతృప్తికరంగా పనిచేస్తూండడంతో స్థానిక సహకార పరపతి సంఘం వారు నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు.[1]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్.

గ్రామంలోని దర్శనీయ స్థలాలు/దేవాలయాలు[మార్చు]

 1. జలధీశ్వరాలయం :- హెచ్చు కన్ను, దిగంబరుడైన అంబరకేశుడు, త్రికాల సంధ్యాస్నానాలకు అనువుగా బంగాళాఖాతo జలధి తీరంలోని ఈ గ్రామంలో, బాలపార్వతీ సమేతంగా జలదీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి, 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించెదరు. పురాతనమైన ఈ ఆలయంలో గర్భాలయం శిధిలావస్థకు చేరడంతో, దేవాదాయశాఖ రు. 4.8 లక్షలు, దాత స్వాతి వారపత్రిక యజమాని శ్రీ వేమూరి బలరాం, రు. 2.4 లక్షల వితరణతో, మూడు నెలలపాటు ఈ ఆలయంలో మరమ్మత్తు పనులను, అభివృద్ధిపనులను నిర్వహించినారు. ఈ పనులు పూర్తి అవగానే, 2014, ఆగష్టు-22, శ్రావణ శుక్రవారం నాడు, ఈ ఆలయంలో, ఆలయ ముఖ మంటపం వద్ద, వాస్తుహోమం, నవగ్రహహోమం, ప్రత్యేకపూజల అనంతరం, నిత్య పూజలను పునఃప్రారంభించినారు. [2] & [11]
 2. శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయo:- ఘంటసాల, దేవరకోట పరిసర ప్రాంతాల గ్రామాల వారి ఇలవేలుపు అయిన శ్రీ ముతాలమ్మ అమ్మవారి ఆలయ ముఖద్వార ప్రారంభోత్సవం, అక్టోబరు 18, 2013,శుక్రవారం మధాహ్నం 3-30 గం. కు జరిగినది. దీనికి అయిన వ్యయం రు.4 లక్షలు. ఇదే సమయంలో రు. 2 లక్షలతో నిర్మాణమయిన ఆలయప్రాంగణంలోని సిమెంటు రహదారుల ప్రారంభోత్సవం గూడా జరిగినది. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-15, శుక్రవారం నాడు, అమ్మవారి గ్రామోత్సవం, డప్పు వాయిద్యాలతో, శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించినారు. భక్తులు ఆలయం వద్ద, మొక్కుబడులు తీర్చుకున్నారు. [3] & [10]
 3. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయo:- ఈ గ్రామములోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 200వ కళ్యాణోత్సవాలు 2013,డిసెంబరు 6 నుండి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాలు 4రోజులపాటు జరుగును. [4]
 4. రామమందిరం:- ఈ గ్రామములో పది లక్షల రూపాయలతో, గ్రామస్తులు, దాతల సహకారంతో, నూతనంగా నిర్మించిన రామమందిరంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2014,మార్చ్-15 నుండి 17 వరకూ నిర్వహించినారు. 15న విఘ్నేశ్వర పూజ, దీక్షా బంధన పూజ, జలాధివాసం, క్షీరాధివాసం పూజలు జరిగినవి. 16న లక్షణోధారణ , వాస్తుహోమం, పంచసూక్తిహోమం, పుష్పాధివాసం, శాంతిహోమం, యాగశాల పూజ జరిగినవి. 17న ఉదయం, 07-15 మంటలకు శ్రీ గణపతి పూజ, శ్రీ సీతారామలక్ష్మణ, భక్తాంజనేయస్వామి వారల నూతన విగ్రహ ప్రతిష్ఠాపన పూజాకార్యక్రమాలు, మహాకుంభాభిషేకం, మహా పూర్ణాహుతి, విశేషపూజలు నిర్వహించినారు. అదేరోజు భక్తులకు సామూహిక అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినారు. [6]
 5. ఘంటసాల పడమర వీధి రామాలయంలో, 2014,ఏప్రిల్-8న శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ, విఘ్నేశ్వర స్వామివార్ల నూతన విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించినారు. వేదపండితులు విశేషపూజలు జరిపినారు. గ్రామానికి చెందిన శ్రీ కె.నారాయణరావు, ఒక లక్ష రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం జరిపించినారు. విగ్రహదాతలు శ్రీ వేమూరి శ్రీనివాసరావు, వసుంధరాదేవి దంపతులు, ఒక లక్ష రూపాయలతో నూతన నల్లరాతి దేవతా మూర్తుల విగ్రహాలను బహుకరించినారు. తరువాత, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. [8]

గ్రామ విశేషాలు[మార్చు]

 1. ఘంటసాల గ్రామంలో, ఎన్నారైలు, గ్రామస్తులు, దాతల సహకారంతో "మన ఊరు పార్కు"ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పార్కులో, కమ్యూనిటీ భవనం, పూజల భవనం, శాంతిభవనాలను నూతనంగా నిర్మాణం చేసి అభివృద్ధి చేశారు. మన ఊరి పార్కును 2014,జనవరి-26 ప్రారంభించారు. ఈ పార్కు సమీపంలో, మరో శాంతివనం నిర్మాణానికి శంఖుస్థాపన నిర్వహించెదరు. [5]
 2. అపరాల పరిశోధనలో విశేషకృషి చేయుచున్న, ఘంటసాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎం.వి.రమణ కు, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం వారిచే, రాష్ట్రస్థాయిలో ప్రదానం చేసే, "డా.బి.నాగరాజారావు " బంగారు పతకాన్ని అందజేశారు . వీరికి ఈ పురస్కారాన్ని, 2014,మార్చ్-20న హైదరాబాదులో జరిగిన ఆచార్య ఎన్.జి.రంగా విశ్వ విద్యాలయ 44వ స్నాతకోత్సవం సందర్భంగా అందజేశారు. [7]
 3. ఈ గ్రామానికి చెందిన, రైతుకుటుంబం నుండి వచ్చిన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు, చాలా రోజులక్రితం ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, ఉపాధి కొరకు అమెరికా వెళ్ళినారు. కాలక్రమేణా అక్కడ పారిశ్రామికవేత్తగా ఎదిగినారు. అయినా గానీ తన జన్మభూమిపై మమకారంతో తన తల్లిదండ్రుల పేరుమీద, "గొర్రెపాటి వెంకట్రాయులు, ఉదయభాస్కరమ్మ విద్యా ట్రస్ట్" ను స్థాపించి గ్రామాభివృద్ధికై తనవంతు తోడ్పాటునందించుచున్నారు. అంతేగాక, తాను చేయుచున్న అభివృద్ధిపనులలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులను గూడా భాగస్వాములను చేయుచున్నారు. [12]

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు.

 • ఈ గ్రామం నుండి ఎందరో రాజకీయవేత్తలు స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము

గ్రామాలు[2][మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. బిరుదుగడ్డ 31 100 51 49
2. బొల్లపాడు 84 329 169 160
3. చిలకలపూడి 256 913 455 458
4. చినకళ్ళేపల్లి 387 1,378 673 705
5. చిట్టూర్పు 777 2,730 1,355 1,375
6. చిట్టూరు 318 1,132 582 550
7. దాలిపర్రు 445 1,451 698 753
8. దేవరకోట 415 1,537 763 774
9. ఎండకుదురు 355 1,344 671 673
10. ఘంటసాల 2,949 10,421 5,127 5,294
11. కొడాలి 959 3,407 1,695 1,712
12. కొత్తపల్లి 322 1,021 495 526
13. లంకపల్లి 726 2,454 1,244 1,210
14. మల్లంపల్లి 619 1,999 998 1,001
15. పుషాదం 285 1,087 547 540
16. శ్రీకాకుళం 1,976 7,835 3,877 3,958
17. తాడేపల్లి 446 1,646 794 852
18. తెలుగురావుపాలెం 345 1,247 642 605
19. వి.రుద్రవరం 270 822 417 405
20. వేములపల్లి 263 1,016 508 508

వనరులు[మార్చు]

 1. "రామమోహన గ్రంథాలయం". గ్రంథాలయ సర్వస్వము 7. January 1928. Retrieved 8 March 2015. 
 2. "ఘంటసాల మండలములొ ఉన్న గ్రామాలు". 
 3. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ ఆగష్టు 3, 2013. 1వ పేజీ. [2] ఈనాడు జిల్లా ఎడిషన్, 16 సెప్టెంబరు, 2013. 15వ పేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 19-10-2013. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 5,డిసెంబరు,2013. 3వ పేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,జనవరి-28; 3వ పేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-18; 10వ పేజీ. [7] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-26; 6వ పేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-9; 1వ పేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ;2014,ఏప్రిల్-16,1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-16; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-23; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-23; 9వ పేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 4-డిసెంబరు,2014. 3వ పేజీ.

చిత్రమాలిక[మార్చు]