ఘట్టమనేని కృష్ణ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఘట్టమనేని కృష్ణ
Krishna Actor.jpg
ఘట్టమనేని కృష్ణ
జన్మ నామం ఘట్టమనేని కృష్ణ
జననం 1942 మే 31
గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం
ఇతర పేర్లు సూపర్ స్టార్
ప్రాముఖ్యత నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు మరియు నిర్మాత
పదవి భారత పార్లమెంటు సభ్యుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
మతం హిందూ మతము
భార్య/భర్త విజయ నిర్మల
సంతానం మహేష్ బాబు
తండ్రి ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి
తల్లి నాగరత్నమ్మ

సూపర్ స్టార్ కృష్ణగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈయన 1942 మే 31గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో శ్రీ వీరరాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్న దంపతులకు జన్మించాడు. బి.యస్.సి. వరకు చదువుకున్నారు. సినీ పరిశ్రమలో మంచి మనిషిగా కూడా పేరు పొందాడు. 1962 లో ప్రారంభమైన తన సుదీర్ఘ కెరీర్లో ఐదు దశాబ్దాలపాటు తెలుగు సినిమారంగంలో 350 చిత్రాలలో నటించారు. 2008 లో, అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందాడు. 2009 లో, భారతదేశం ప్రభుత్వం భారతీయ సినిమా తన సేవలకు గాను పద్మ భూషణ్ గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఏలూరు నుండి పార్లమెంట్ సభ్యత్వానికి ఎన్నికయ్యారు. రాజకీయ రంగ ప్రవేశం కూడ చేసి, 1989 లో 9వ లోక్‌సభ కు ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు.

• తోబుట్టువులు : నలుగురు , ఈయన తో మొత్తం ఐదుగురు ఇతనే పెద్దవారు. • భార్య : ఇందిరా (1965 లో పెళ్లి అయినది ) • పిల్లలు : ఐదుగురు - • కుమారులు : ఇద్దరు 1)రమేష్ బాబు (సిని నిర్మాత ), 2)మహేష్ బాబు (సిని నటుడు ) ; • కుమార్తెలు -ముగ్గురు : పద్మావతి , ప్రియదర్శని , మంజుల , • 1969 లో విజయనిర్మల (నటి / సిని దర్శకురాలు) ని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నారు. • పెద్ద కుమారుడు రమేష్ బాబు, చిన్నకుమారుడు మహేష్ బాబు కూడా తెలుగు సినిమా నటులు.

సినీ ప్రస్థానం[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులతో "సూపర్ స్టార్ కృష్ణ" అనిపించుకున్నారు.అంతేకాక సాహసానికి మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఎందరో తలపెట్టి సాధ్యంకాక వదలివేసిన అల్లూరి సీతారామ రాజు చిత్రాన్ని ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని విజయవంతంగా తీశాడు.1950 లలో నభూతో నభవిష్యతిగా విజయవంతం చెందిన దేవదాసు చిత్రాన్ని 1970 లలో తాను దేవదాసు పాత్ర ధరించి విజయనిర్మల దర్శకత్వంలో మళ్ళీ తీసి చూపించాడు. తెలుగులో కౌబాయ్ గా ప్రసిద్ధి చెందాడు. పౌరాణిక, డ్రామా, సామాజిక, కౌబాయ్, క్లాసిక్, జానపద, మరియు చారిత్రక సినిమాల్లో నటించారు.అతను మొట్టమొదటి ఈస్ట్ మన్ కలర్ చిత్రం ఈనాడు (1982), మొదటి స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, మొదటి 70mm చిత్రం సింహసనం, మొదటి డి.టి.ఎస్. చిత్రం తెలుగు వీర లేవరా (1988) వంటి టెక్నాలజీలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా తెలుగు తెరకు కౌబాయ్ మరియు జేమ్స్ బాండ్ శైలులు పరిచయం చేశారు. అనేక ఆంగ్లచిత్రాలను కలగలిపి మోసగాళ్ళకు మోసగాడు సినిమా తీసి, అందులో తాను ప్రధాన పాత్ర ధరించి ప్రేక్షకులను అలరించాడు. సినీ ప్రారంభ సంవత్సరాల్లో సాక్షి వంటి చిత్రాలలో నటించి 1968 లో 'తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్' విమర్శకుల ప్రశంసలు పొందారు. పద్మలయా సినిమా స్టూడియోను స్థాపించి అనేక చిత్రాలను నిర్మించి, 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూధనరావు, కె. విశ్వనాధ్, బాపు, దాసరి నారాయణరావు మరియు కె. రాఘవేంద్రరావు వంటి దర్శకులతో పనిచేశారు. విజయనిర్మల తో 50కి పైగా సినిమాలలో, జయప్రద తో 47 సినిమాలలో నటించారు. డిసెంబర్ 2012 లో, 69 ఏళ్ళ వయసులో, కృష్ణ సినిమాలు మరియు రాజకీయాలు నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించారు.

1962 - 1965 సినీ జీవితం[మార్చు]

పదండి ముందుకు, కులగోత్రాలు, మరియు పరువు ప్రతిష్ట వంటి చిత్రాలలో చిన్న పాత్రలతో తన కెరీర్ ప్రారంభమైంది. తేనే మనసులు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. దీనికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఆ తరువాత మళ్లీ ఆదుర్తి గారి దర్శకత్వంలోనే కన్నె మనసులు లో నటించారు.

1966 - 1977 సినీ జీవితం[మార్చు]

సుందర్ లాల్ నేత మరియు డూండీ యొక్క గూఢచారి 116 ప్రధాన పాత్రకు ఎంపికయ్యాడు. యాక్షన్ చిత్రాలు చేసిన నైపుణ్యత ఉన్నప్పటికీ, మరుపురాని కథ, అత్తగారు కొత్తకోడలు, ఉండమ్మా బొట్టు పెడతా వంటి చిత్రాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి స్త్రీ జన్మ, నిలువు దోపిడీ, విచిత్ర కుటుంబం, అక్కా చెల్లెలు మరియు మంచి కుటుంబం వంటి చిత్రాలలో నటించారు. కృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ స్థాపించి మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు మళ్లీ పుట్టాడు మరియు అగ్నిపరీక్ష వంటి అధిక బడ్జెట్ సినిమాలను నిర్మించాడు. 1976 లో తన సొంత బ్యానర్ లో నిర్మించిన పాడి పంటలు బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది. ఇందులో అనేక సమకాలీన వ్యవసాయ సమస్యలు వాటికి పరిష్కారమార్గాలు చూపించడం జరిగింది. విజయ పతాకంపై తన రెండవ చిత్రం రాజా రాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్, మూడవ సినిమా రామరాజ్యంలో రక్తపాతం కూడా విజయవంతం అయ్యాయి. 1976లో ఒకప్రక్కన ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ, కొల్లేటి కాపురం, భలే దొంగలు (హిందీ చిత్రం చోర్ మచాయూ షూర్ రిమేక్- బుల్స్ ఐ హిట్), మరియు దేవుడే గెలిచాడు వంటి చిత్రాలలో నటించాడు.

1978 - 1989 సినీ జీవితం[మార్చు]

1978-1986 సంవత్సరాల మధ్య కాలంలో కృష్ణ కెరీర్ ఎక్కువ స్థాయికి చేరుకుంది. ఈ కాలంలో, అన్నాదమ్ముల సవాల్', కుమార రాజా' మరియు ఏజెంట్ గోపి మరియు ఇంద్రధనస్సు మరియు అల్లరి బుల్లోడు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. 1979లో వియ్యాలవారి కయ్యాలు, మండేగుండెలు, హేమా-హేమీలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు వంటి చిత్రాలలో నటించారు. ఇవన్నీ కమర్షియల్ గా విజయవంతమయ్యాయి. 1980 లో కృష్ణ మరియు శ్రీదేవి జోడి సూపర్ హిట్ అయింది. శ్రీదేవితో కలిసి ఘరానా దొంగ, మామ అల్లుల్ల సవాల్, చుట్టాలున్నారు జాగ్రత్త మరియు రామ్ రాబర్ట్ రహీమ్ మొదలైన సినిమాల్లో నటించాడు. 1981 లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని చిత్రాలలో కృష్ణ నటించిన ఊరికి మొనగాడు సినిమా అతిపెద్ద హిట్ అయింది. 1982 తన జీవితంలో మరొక కీలకమైన సంవత్సరం. పాడిపంటలు విజయం సాధించిన స్ఫూర్తితో తీసిన బంగారు భూమి కూడా ఘనవిజయాన్ని సాధించింది. సంవత్సరం చివరలో, 200 సినిమాలు పూర్తిచేశారు. వీటన్నీటీలో కృష్ణ ప్రధాన పాత్రను పోషించాడు. ఈ సంవత్సరంలోనే స్టూడియో యజమానిగా మారి తొలి సినిమా ఈనాడు ను నిర్మించారు. 1983 లో ముందడుగు, కిరాయి కోటిగాడు, అడవి సింహాలు, శక్తీ, ప్రజారాజ్యం మరియు 1984లో ఇద్దరు దొంగలు, బంగారు కాపురం, ముఖ్యమంత్రి (సినిమా), కంచుకాగడా వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. 1985 లో కృష్ణ కెరీర్ ఉన్నతస్థానానికి ఎగబాకింది. అతను ఈ సంవత్సరంలో అగ్నిపర్వతం (సినిమా), పల్నాటి సింహం, వజ్రాయుధం (సినిమా) వంటి హిట్స్ సినిమాల్లో నటించారు. అద్భుతమైన పాత్రలను రూపొందించడంలో రచయితద్వయం పరుచూరి బ్రదర్స్ కృషి చాలాఉంది. శోభన్ బాబుతో కలిసి సూర్యచంద్ర, పచ్చని కాపురం మరియు మహాసంగ్రామం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. 1986లో సింహాసనం సినిమాకు దర్శకత్వం వహించారు. ఖైదీ రుద్రయ్య తన కెరీర్ లో మరో గొప్ప చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనేక రికార్డులను సృష్టించింది. సూపర్ స్టార్ తన తన సొంత బ్యానర్ లో నా పిలుపే ప్రభంజనం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఇది తెలుగుదేశం పార్టీ విధానాలను, రాజకీయ నమ్మకాలను వ్యతిరేకించి తీసిన చిత్రం. కానీ, ఆ పార్టీ మద్దతుదారులు మరియు నాయకులు అనేక ప్రదేశాల్లో ఈ చిత్ర ప్రదర్శనకు వ్యతిరేకంగా నిరసనలుచేశారు. అది మరింత ప్రచారంగా మారి చిత్రం విజయవంతం అయింది. అనంతరం ముద్దాయి, దొంగోడొచ్చాడు, తండ్రి కొడుకుల ఛాలెంజ్ వంటి ఇతర విజయవంతమైన సినిమాల్లో నటించారు. తన పెద్ద కుమారుడైన రమేష్ బాబును అక్టోబర్ 2 న సామ్రాట్ సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా పరిచయం చేశారు. 1988లో కృష్ణ పది సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందులో నాలుగు (కలియుగ కర్ణుడు, అశ్వత్థామ (సినిమా), రౌడీ నెంబర్ 1, ముగ్గురు కొడుకులు) మాత్రమే విజయవంతం అయ్యాయి. 1989లో కొడుకు దిద్దిన కాపురం, గూడాచారి 117 మరియు గూండారాజ్యం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు.

1990 - ప్రస్తుతం[మార్చు]

కృష్ణ 1990-1992 సంవత్సరాల మధ్యకాలాన్ని తన జీవితంలో చీకటి కాలం అని పేర్కొంటారు. ఈమధ్య వచ్చిన సినిమాలు నాగాస్రం, రక్తతర్పణం (చివరి దర్శకత్వం)వంటి సినిమాలు సరిగా ఆడలేదు. రమేష్ యొక్క బజార్ రౌడీ వైఫల్యం చూపడంతో మరింత అతనికి కలత కలిగింది. తరువాత 1993 లో పచ్చని సంసారం ఊహించని సూపర్ విజయం సాధించింది. ఆ తర్వాత వారసుడు, నెంబర్ వన్, అమ్మదొంగ (1995) విజయం సాధించాయి. 2004 లో తన దర్శకత్వంలో పద్మాలయా టెలీఫిలీం బ్యానర్ లో తెలుగు సినిమా "సంపంగి" ని హిందీలో ఇష్క్ హై తుమ్సే గా రిమేక్ చేశారు. దీనిలో డినో మోరియా, బిపాస బసు నటించారు.

నటించిన చిత్రాలు[మార్చు]

అవార్డులు[మార్చు]

పౌర పురస్కారం 
నంది అవార్డులు 

ఉత్తమ నటుడుగా నంది అవార్డు - అల్లూరి సీతారామరాజు - 1974

ఎన్టీఆర్ జాతీయ అవార్డు 

2003 ఎన్టీఆర్ జాతీయ అవార్డు

ఫిలింఫేర్ అవార్డులు దక్షిణ 

ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు - 1997

ఇతర వివరాలు[మార్చు]

1970లో కృష్ణ "పద్మాలయా పిక్చర్స్' పతాకంపై చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఈ సంస్థ నిర్మించే చిత్రాలను ఆయన సోదరులు జి. హనుమంతరావు, జి. ఆదిశేషగిరిరావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పద్మాలయా పతాకంపై ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ "అగ్ని పరీక్ష, మోసగాళ్లకు మోసగాడు" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మొత్తం రాజస్తాన్‌ ఎడారిలో తీయడబడింది. డూండీ నిర్మించిన "గూఢచారి 116" చిత్రంతో నటుడు కృష్ణ జేమ్స్‌ బాండ్‌ తరహా పాత్రకు గుర్తింపు రాగా, కౌబాయ్‌ హీరోగా గుర్తింపు తెచ్చిన చిత్రం "మోసగాళ్లకు మోసగాడు'. నటుడు ఎమ్‌. ప్రభాకరరెడ్డి భాగస్థడుగా "పండంటి కాపురం" 45 రోజుల్లో 60 రోల్స్‌ (రోల్‌ అంటే ఆ రోజుల్లో వెయ్యి అడుగులు) నెగిటివ్‌తో చిత్రాన్ని తీశారు. తర్వాత ఎన్‌.టి. రామారావుతో "దేవుడు చేసిన మనుషులు". ఈ చిత్రం అవుట్‌డోర్‌ షూటింగ్‌ను అశేష జనవాహిని మధ్య ప్రముఖ హీరోలతో క్లయిమాక్స్‌ దృశ్యాల్ని బందరులో చిత్రీకరించారు. తర్వాత తీసిన చిత్రం "అల్లూరి సీతారామరాజు". ఆనాడు పరిశ్రమలో వున్న నటీనటులందరూ ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ జరిగింనంత కాలం మద్రాసులో కొరతతో 10-15 సినిమాలు నిర్మాణం ఆగిపోయింది. విజయావారి "మాయాబజార్‌" తర్వాత అంత మంది నటీనటులు పాల్గొన్న చిత్రం "అల్లూరి సీతారామరాజు". ఈ చిత్రానికి వి. రామచంద్రరావును దర్శకుడిగా నియమించి, టైటిల్స్‌లో ఆయన పేరే వేసినా, చిత్రం ప్రారంభ దశలోనే మరణించటం వల్ల చిత్రం మొదటి నుంచి చివరి వకూ నటుడు కృష్ణే దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి రచన చేసింది త్రిపురనేని మహారధి. మహాకవి శ్రీశ్రీ రాసిన "తెలుగు వీరలేవరా" పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అంజలి పిక్చర్స్‌ అధినేత ఆదినారాయణరావు. అల్లూరి సీతారామరాజు సోదరుడు అల్లూరి సూర్యనారాయణరాజు చిత్రం విడుదల సమయంలో మా అనుమతి లేకుండా చిత్రం ఎలా తీస్తారని కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పలేదు. కానీ ఈ చిత్రం శతదినోత్సవ సభలో కృష్ణ సోదరులు ఆయన్ని పిలిచి కొంత మొత్తాన్ని అందజేసి కృతజ్జతలు తెలుపుకున్నారు. "సీత" అనే పాత్రలేదని సినిమా కోసం పెట్టారని ఆయన వాదన, ప్రభుత్వ రికార్డుల్లో సీత గురించి సమాచారం లేకపోయినా, జనబాహుళ్య ప్రచారంలో ఉండటం వలన నిర్మాతలు ఆ పాత్రను చిత్రంలో ఉంచారు. తర్వాత "పాడిపంటలు, రామరాజ్యంలో రక్తపాతం, పండంటి సంసారం" వంటి ఎన్నో చిత్రాల్ని నిర్మించారు. 1980లో పద్మాలయా సంస్థ హిందీ చిత్ర రంగంలో కూడా ప్రవేశించింది. పద్మాలయా వారు తమ హిందీ చిత్రాలన్నీ మద్రాస్‌లోనే నిర్మించారు. కృష్ణ దర్శకత్వంలో తెలుగులో తొలి 70 ఎం.ఎ.ఎం. చిత్రం "సింహాసనం". ఇదే చిత్రాన్ని జితేంద్ర హీరోగా హిందీలో కూడా నిర్మించారు.

వంశవృక్షం[మార్చు]

 
 
 
 
 
 
 
 
 
 
ఘట్టమనేని రాఘవయ్య చౌదరి
 
నాగరత్నమ్మ
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఘట్టమనేని హనుమంతరావు
 
పార్వతి
 
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
 
ప్రమీల
 
ఇందిరాదేవి
 
ఘట్టమనేని శివరామకృష్ణ
 
విజయనిర్మల
 
ఘట్టమనేని అలివేలు
మంగమ్మ
 
చేకూరి సత్యనారాయణ
 
ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు
 
ఘట్టమనేని లక్ష్మి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఘట్టమనేని రమేష్ బాబు
 
* *
 
ఘట్టమనేని ప్రియదర్శిని
 
జయదేవ్‌ గల్లా
 
ఘట్టమనేని మంజుల
 
సంజయ్ స్వరూప్
 
ఘట్టమనేని మహేశ్ ‌బాబు
 
నమ్రతా శిరోద్కర్
 
ఘట్టమనేని ప్రియదర్శిని
 
పోసాని సుధీర్‌బాబు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
భారతి
 
జయకృష్ణ
 
**
 
***
 
 
 
****
 
 
 
గౌతంకృష్ణ
 
సితార
 
చరణ్ మానస
 
దర్శన్
 
 

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]