ఘరె బైరే (బెంగాలీ నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘరె బైరే
కృతికర్త: రవీంద్రనాథ్ టాగూర్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): ঘরে বাইরে
దేశం: భారతదేశం
భాష: బెంగాళీ
విభాగం (కళా ప్రక్రియ): స్వీయచరిత్రాత్మక నవల
ప్రచురణ:
విడుదల: 1916
ప్రచురణ మాధ్యమం: అచ్చు (హార్డ్‌బ్యాక్ & పేపర్‌బ్యాక్)
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): లేదు

ఇల్లు, ప్రపంచము (The Home and the World) 1916 (బెంగాలీలో గరె బైర్) రవీంద్రనాథ్ టాగూర్ 1916 లో రచించిన నవల.

ప్లాట్[మార్చు]

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.

ఈ కథ 20వ శతాబ్దపు తొలి భాగములో ఒక ధనిక బెంగాలీ జమిందారు నిఖిల్ మొక్క ఎస్టేటు చుట్టూ తిరుగుతుంది. నిఖిల్ తన అందమైన భార్య విమల (బెంగాలీలో బిమల) తో ఆనందముగా జీవిస్తూ ఉంటాడు. ఇంతలో ఆతని స్నేహితుడు,స్వదేశీ ఉద్యమములో ఉత్సాహముగా పాల్గొనే తీవ్రవాద లక్షణములు కల సందీప్ వారి జీవితాల లోకి ప్రవేశిస్తాడు. ఉత్సాహము రోషము కల సందీప్, శాంతి కాముకుడు నెమ్మది స్వభావము కల నిఖిల్ కు వ్యతిరేకము. సందీప్ అమాయకమైన విమలను సులువుగా ఆకర్షించి లవ్ ట్రయాంగిల్ ని సృష్టిస్తాడు.

జరిగేదంతా నిఖిల్ గమనిస్తున్నపటికీ,వారి పెళ్ళి విమల చిన్నపుడే జరిగిపోవడము వలన, పరిపక్వమైన (మెట్యూర్) వ్యక్తి కావడము వలన విమలకు తన జీవితములో ఇష్టము వచ్చినది ఎన్నుకునేలా పూర్తిగా స్వతంత్రము ఇస్తాడు. విమల ప్రేమ భావన ఎలా ఉంటుందో మొదటి సారి ఆస్వాదించి, ఈ కొత్త దృష్టితో నిఖిల్ మాత్రమే తనని నిజముగా ప్రేమించే వ్యక్తిగా తెలుసుకుంటుంది.

ఫిల్మ్, టి.వి., నాటక రూపములు[మార్చు]

సత్యజిత్ రే దర్శకత్వములో 1984 లో Ghare Baire (The Home and the World) విడుదలైంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

బైట లింకులు[మార్చు]

  • e-text of novel from ibiblio - సురేంద్రనాథ్ టేగోర్ గారి ఇంగ్లీషు అనువాదము