చండీగఢ్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ఛండీగఢ్ | |
| రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
ఛండీగఢ్† - |
| పెద్ద నగరము | ఛండీగఢ్† |
| జనాభా (2001) - జనసాంద్రత |
900,635 (29వ స్థానం) - 7,900/చ.కి.మీ |
| విస్తీర్ణము - జిల్లాలు |
114 చ.కి.మీ (33వ స్థానం) - 1 |
| సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
| అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
మార్చి 1948 - జనరల్(Retd) ఎస్.ఎఫ్ రోడ్రిగ్స్ - లేడు - కేంద్ర పాలితం (సీట్లు లేవు) |
| అధికార బాష (లు) | పంజాబీ, హిందీ |
| పొడిపదం (ISO) | IN-CH |
| † మొత్తం కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ నగరమే. | |
చండీగఢ్ (Chandigarh) ఉత్తర భారతదేశంలో ఒక నగరము మరియు కేంద్రపాలిత ప్రాంతం. దీని విశిష్టత ఏమంటే ఇది రెండు రాష్ట్రాలకు (పంజాబ్ మరియు హర్యానా) రాజధాని. కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతం.
చరిత్ర [మార్చు]
జవహర్‌లాల్ నెహ్రూ ప్రేరేపణపై 1950 దశకంలో ఫ్రెంచి భవన నిర్మాణకారుడు లీ కార్బోషర్ (architect Le Corbusier) చండీగఢ్ నగరాన్ని, అందులో చాలా భవనాలను రూపొందించాడు. అప్పుడే స్వతంత్రమైన భారతదేశపు ప్రగతిశీల పధం ఇందులో ప్రతిఫలించాలని వారి సంకల్పం.
నిర్మాణ శైలి [మార్చు]
చండీగఢ్ నగరం చదరాలు అమర్చినట్లుగా సెక్టార్లుగా డిజైన్ చేయబడింది. ప్రతి సెక్టారు షుమారుగా 1.5 కి.మీ x 1.5 కి.మీ. చదరం వైశాల్యం ఉంటుంది. ప్రతి సెక్టారు ఒక చిన్న పట్టణంలా, దాని స్వంత మార్కెట్, పూజా స్థలాలు, స్కూళ్ళు, కాలేజీలు కలిగి ఉంటుంది. 1 నుండి 60 వరకు సెక్టారులు ఉన్నాయి. కాని సెక్టారు నెం.13 మాత్రం లేదు. 13వ సంఖ్య అదృష్టానికి దూరమని లీ కార్బోషర్ నమ్మడమే దీనికి కారణం కావచ్చును.
సెక్టారు-17: నగరానికి ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళతో కళకళలాడుతుంటుంది. నగరవాసులకు సాయంత్రాలు గడపడానికి ఇష్టమైన స్థలం.
సెక్టారు-35: కూడా రెస్టారెంట్లు, బార్ల మయం.
సెక్టారు-4: రాళ్ళ తోట (Rock Garden) - పారవేసిన, వదిలేసిన వస్తువులతో నేక్ చంద్ అనే కళాకారుడు 30 సంవత్సరాలు శ్రమించి రూపొందించిన విశేష ఉద్యానవనం.
సెక్టారు-16: గులాబీ తోటలు
సెక్టారు-10: సుఖానా సరస్సు
చండీగఢ్ అక్షరాస్యత 97%. ఇక్కడ ఎన్నో మంచి ప్రమాణాలు గల విద్యా సంస్థలున్నాయి. చండీగఢ్ జనాభాలో షుమారుగా హిందువులు 78.6%, సిక్కులు 16.1%, ముస్లిములు 4%.
బయటి లింకులు [మార్చు]
- http://www.pals.org/pec/chandigarh/chandigarh.html
- http://www.whereincity.com/india/chandigarh/
- Nek Chand Foundation
- Government Museum and Art Gallery
|
|
|
|---|---|
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · అరుణాచల్ ప్రదేశ్ · అసోం · బీహార్ · ఛత్తీస్గఢ్ · గోవా · గుజరాత్ · హర్యానా · హిమాచల్ ప్రదేశ్ · జమ్మూ కాశ్మీరు · జార్ఖండ్ · కర్ణాటక · కేరళ · మధ్య ప్రదేశ్ · మహారాష్ట్ర · మణిపూర్ · మేఘాలయ · మిజోరాం · నాగాలాండ్ · ఒరిస్సా · పంజాబ్ · రాజస్థాన్ · సిక్కిం · తమిళనాడు · త్రిపుర · ఉత్తరాంచల్ · ఉత్తర ప్రదేశ్ · పశ్చిమ బెంగాల్ |
| కేంద్రపాలిత ప్రాంతములు | అండమాన్ నికోబార్ దీవులు · చండీగఢ్ · దాద్రా నగరు హవేలీ · డామన్ డయ్యు · లక్షద్వీపములు · పుదుచ్చేరి |