చంద్రకాంత (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రకాంత
కృతికర్త: దేవకి నందన్ ఖాత్రి
దేశం: భారతదేశం
విభాగం (కళా ప్రక్రియ): ఫాంటసీ నవల
ప్రచురణ: లాహిరీ బుక్ డిపో, వారణాసి, భారతదేశం
విడుదల:


చంద్రకాంత, దేవకీ నందన్ ఖత్రి రచించిన ఒక ప్రఖ్యాత హిందీ నవల. ఇది ఆధునిక హిందీ భాషలో వచ్చిన మొదటి గద్య రచనగా భావించబడుతోంది. 1964 నాటికి ఆ నవలపై గల ముద్రణాధికారానికి కాలంచెల్లింది. రచయిత యొక్క ఇతర రచనలతో పాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.[1]

కథ[మార్చు]

ప్రత్యర్థి రాజ్యాలకు చెందిన ఇద్దరు ప్రేమికులు విజయగఢ్ యువరాణి చంద్రకాంత, నౌగఢ్ యువరాజు వీరేంద్ర సింగ్ లకు సంబంధించిన కాల్పనిక ప్రేమ కథ గూర్చి ఈ నవలలో వ్రాసారు. విజయ్ ఘడ్ రాజ్య ఆస్థానంలోని క్రూర్ సింగ్, చంద్రకాంతను వివాహమాడి, సింహాసనం ఎక్కాలని కలలుకంటుండేవాడు. క్రూర్ సింగ్ ఎప్పుడైతే తన ప్రయత్నాలలో విఫలం అయ్యాడో, అతడు రాజ్యం విడిచి పారిపోయి శక్తివంతమైన పొరుగు రాజ్యం చునార్గడ్ రాజు శివదత్ తో స్నేహం చేసాడు. క్రూర్ సింగ్ శివదత్ ని మంచి మాటలతో వంచించి, చంద్రకాంతను వశపరచుకోవాలని అనుకున్నాడు. శివదత్ చంద్రకాంతను పట్టుకున్నాడు. శివదత్ నుండి పారిపోయే సమయంలో తను తిలిసం లో బందీగా ఉన్న విషయాన్ని చంద్రకాంత కనుగొంది. దాని తరువాత కున్వర్ వీరేంద్ర సింగ్ తిలిసంను ఛేదించి, ఐయ్యర్ల సహాయంతో శివదత్ తో యుద్ధం చేస్తాడు. చంద్రకాంత నవలకు తరువాత కథలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన 7 పుస్తకాల సంపుటి (చంద్రకాంత సంతతి) చంద్రకాంత, వీరేంద్రసింగ్ యొక్క పిల్లలు మరియొక పెద్ద తిలిసంలో చేసిన సాహసాల గురించి తెలియజేస్తుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రదేశాలు ఉత్తర్ ప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లా, బీహార్ లోని గయా, రోహతాస్ జిల్లాలలో ఉన్న వాస్తవప్రదేశాలు. నీరజ గులేరిచే నిర్మిచబడిన TV సీరియల్ "చంద్రకాంత" వాస్తవ నవలతో పూర్తిగా విభేదిస్తుంది.

తిలిసం, ఐయ్యర్లు[మార్చు]

"ఐయ్యర్", "తిలిసం" అనే పదాలు హిందీ సారస్వతానికి పరిచయం చేయటంలో చంద్రకాంత నవల పేరు పొందింది.

ఐయ్యర్ (పురుషుడు), ఐయ్యార (స్త్రీ)లు మాయా ద్రవాలు, కాషాయాల సహాయంతో కొన్ని గారడి విద్యలు, మారు వేషాలు వేయటంలో ప్రత్యేకితులైన రాజాస్థానంలో పని చేసే గూఢచారులు. ఏ వ్యక్తినైనా పోలి ఉండేటట్లు లేదా కొన్నిసార్లు జంతువుల వలె తమ ముఖాన్ని ప్రత్యేక ఆహార్యం ద్వారా ఐయ్యర్లు మార్పు చేసుకోగలరు. అతను సాధారణంగా ఒకరిపై గురిపెట్టి, అతనిని ఖైదు చేసి, తరువాత రాజు ఇష్టప్రకారం ఖైదీ మారు వేషాన్ని వీళ్ళు ధరిస్తారు.

తిలిసం అనేది ఒక రకమైన రావణుని కోట. ఇందులో చాల నిగూఢ ప్రదేశాలు, మలుపులు, కారాగారాలు ఉంటాయి. ఇది ఉద్దేశ్య పూర్వకంగా "ఛేదించిన" లేదా ఒక వ్యక్తిచే విడదీయబడినది, ఒక్కసారి ఛేదించబడితే, అందులోని తలుపులన్నీ తెరుచుకుంటాయి, అందులోని ఖైదీలు విడుదల చేయబడతారు. విజయవంతంగా తిలిసాన్ని ఛేదించిన వ్యక్తికి అందులో దాచి ఉంచిన అపారమైన నిధి నిక్షేపాలు కూడా లభిస్తాయి.

ఈ నవల అనేక మంది మిత్రులైన, శత్రువులైన ఐయ్యర్ లను పరిచయం చేస్తుంది..

వీరేంద్రసింగ్ వైపు ఉన్న ఐయ్యర్లు[మార్చు]

  • తేజ్ సింగ్
  • జీత్ సింగ్ (తేజ్ సింగ్ యొక్క తండ్రి)
  • దేవి సింగ్;

చంద్రకాంత వైపు ఉన్న ఐయ్యర్లు:[మార్చు]

  • చాప్ల
  • చంప

క్రూర్ సింగ్ వైపు ఉన్న ఐయ్యర్లు:[మార్చు]

  • నాజిమ్
  • అహ్మద్

శివదత్ వైపు ఉన్న ఐయ్యర్లు:[మార్చు]

  • బద్రీనాథ్
  • చున్నిలాల్
  • పండిట్ జగన్నాథ్
  • పన్నాలాల్
  • రామ్నారాయణ్
  • ఘసితా సింగ్
చంద్రకాంత సంతతి తరువాత చాల మంది ఐయ్యర్లు పరిచయం చేయబడ్డారు, వారు:[మార్చు]
  • భూత్నాథ్
  • భైరో సింగ్
  • తారా సింగ్
  • ఇంద్ర దేవ్
  • షేర్ సింగ్

పుస్తక వివరాలు[మార్చు]

చంద్రకాంత పుస్తకం ఒకే సంపుటంగా వుంది, దాని కథాశేషం చంద్రకాంత సంతితి ఆరు సంపుటాలను, భూత్ నాథ్ మొత్తం ఏడు సంపుటాలను కలిగివుంది. ఈ పుస్తకాలు మనకు లాహిరి ప్రెస్, రామ్ కటోర రోడ్, వారణాసి, యు.పి, ఇండియా లేదా రైల్వే స్టేషన్ల లోని ఏ. ఎస్ వీలర్ బుక్ షాప్స్ లోనూ లభ్యమౌతాయి. డైమండ్ పాకెట్ బుక్స్, & రాజ్ కమల్ పేపర్ బాక్స్, న్యూ ఢిల్లీ వారు దీన్ని పునర్ముద్రణ కుడా చేసారు.

అనుకరణలు[మార్చు]

1990 మధ్యకాలంలో చంద్రకాంత నవల దూరదర్శన్ ధారావాహికగా తీయబడింది, కానీ ఆర్థిక కారణాలవల్ల మొత్తం ఎప్పటికీ పూర్తి కాలేదు. అయితే ఈ దూరదర్శన్ ధారావాహికకి, నవలకి ఏవో కొన్ని పాత్రలలో మాత్రమే సారుప్యత ఉంది, మిగిలిన కథంతా పుస్తకంలో దానికి పూర్తిగా భిన్నం. ఈ దూరదర్శన్ ధారావాహిక చాల కొత్త పాత్రలను పరిచయం చేసింది, ఈ రెండు మార్పులు ప్రేక్షకులను రంజింపచేయలేకపోయాయి.

భారతీయ చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా ఈ పుస్తకం ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దానికి రామ్ మధ్వాని దర్శకుడు. ఆ చిత్రానికి తాలిస్మాన్ అని పేరు పెట్టారు, అందలి నటులలో ఐయ్యర్ పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ కూడా ఒకడు.

ఆ చంద్రకాంత సినిమా తెరపై ఒక పాత్రలో అభిషేక్ బచ్చన్ కూడా కనిపిస్తాడు. ముఖ్య పాత్రలు పోషిస్తున్న అమితాబ్, అభిషేక్ లు ఇద్దరూ చంద్రకాంత పాత్ర కోసం నిర్మాతలకు ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరును సూచించారు. అయితే, విధు వినోద్ చోప్రా ఆ పాత్రకు ఐశ్వర్యను తిరస్కరించాడు. ఎందుకంటే, అశుతోష్ గోవారికర్ తీసిన జోధా అక్బర్ లో ఆమె పోషించిన యువరాణి పాత్ర వలె ఉంటుందని, మరొకరికి ఆ అవకాశం ఇద్దామని అనుకున్నాడు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

ఆన్లైన్ వచనం[మార్చు]

  • దేవకినందన్ ఖత్రి. చంద్రకాంత (in hindi). Retrieved 2020-07-11.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • ఈ పుస్తక వచనాన్ని ఎస్నిప్స్ ఎకౌంటులో పొందండి.
  • Esinps Booksiwanttoshare