చంద్రయాన్
Chandrayaan-1 lifts off on the PSLV-C11 |
|
| సంస్థ | ఇస్రో |
|---|---|
| మిషన్ టైపు | Orbiter |
| దీనికి ఉపగ్రహం | చంద్రుడు |
| లాంచ్ తేదీ | జూలై 2008 |
| లాంచ్ వాహనం | కొన్ని మార్పులు చేయబడిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ |
| మిషన్ ఎంత కాలం | 2 years |
| NSSDC ID | CHANDRYN1 |
| హోమ్ పేజి | చంద్రయాన్-1 |
| మాస్ (ద్రవరాశి) | 523 kg |
| పవర్ | 750 W |
| కక్ష్య వివరాలు | |
| ఎక్సింట్రిటీ | దాదాపు వృత్తాకార కక్ష్య |
| ఎపో యాప్సిస్ | తొలుత 1000 కి.మీ. |
చంద్రయాన్ 1 Chandrayaan I (चंद्रयान-1), భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మానవ రహిత చంద్రయాన కార్యక్రమము. ఈ మిషన్ లో, లూనార్ ఆర్బిటర్ మరియు ఇంపాక్టర్ వున్నాయి. పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ చే, ఈ నౌక ప్రయోగించబడింది.
రిమోట్ తో నడిచే ఈ ఉపగ్రహం యొక్క బరువు 1304 కి.గ్రా. (590 కి.గ్రా. ప్రారంభ కక్ష్య బరువు మరియు 504 కి.గ్రా. పొడి బరువు) మరియు సమీప పరారుణ (నియర్ ఇన్ఫ్రారెడ్) మరియు సాఫ్ట్ మరియు హార్డ్ ఎక్స్-కిరణాల పౌనఃపున్యాల వద్ద దృష్టికి గోచరమయ్యే హై రెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ పరికరాలను మోసుకెళ్తుంది.[1]
మైల్‌స్వామి అన్నాదురై ను ఈ ప్రాజెక్టు అధినేతగా ఇస్రో నియమించింది. తొలుత ఈ చంద్ర ఉపగ్రహాన్ని 2008 జూలైలో ప్రయోగించాలని నిర్ణయించుకున్నది. కానీ అక్టోబర్ 24న ప్రయోగించారు. ఈ కార్యక్రమం కొరకు ఇస్రో 380 కోట్ల రూపాయలు ఖర్చు చేసినది. ఈ కార్యక్రమంలో ఇస్రో కు చెందిన ఐదు పే లోడ్లు, ఇతర దేశాలకు చెందిన ఆరు పేలోడ్లు గలవు. ఇతర దేశాల పేలోడ్లు 'నాసా' మరియు 'ఎసా' మరియు బల్గేరియాకు చెందిన ఏజెన్సీలవి.
విషయ సూచిక |
కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యాలు [మార్చు]
- చంద్రుని ఉపరితలాన్ని, త్రీ.డీ.లలో చిత్రీకరించడం, వివిధ ఖనిజాలు వాటి రసాయనిక స్పీసీస్‌లను, వాటి రేడియో ధార్మికత ను, న్యూక్లియడ్ల పంపకాలను, వాటి ప్రక్రియలను అధ్యయనం చేయడం. దీని కొరకు రిమోట్ సెన్సింగ్ పేలోడ్ల సెట్ లను ఉపయోగించడం. ఈ డేటా, సౌరమండలము యొక్క రహస్యాలను ఛేదించడానికి ఉపయోగించడము.
- చంద్రనౌకల ఉపయోగాలను సాధారణీకరణ చేయడం, శాస్త్రప్రయోగాల పేలోడ్లు, గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్, డి.ఎస్.ఎన్. స్టేషన్లను ఏర్పాటు చేయడం వగైరా. లో-కక్ష్య లో పరీక్షలు నిర్వహించడం, కమ్యూనికేషన్లు, డేటా రిసెప్షన్ వగైరా.
పరిశోధనా మరియు అధ్యయనా మైదానాలు [మార్చు]
- ఎల్లప్పుడూ భూమినుండి కనిపించకుండా నీడలో ఉండే ఉత్తర దక్షిణ ధృవ ప్రాంతాల యొక్క ఖనిజ మరియు రసాయన, హై రెజెల్యూషన్ చిత్రీకరణ.
- చంద్రుడి ఉపరితలంపై మరియు ఉపరితలం క్రింద, ముఖ్యంగా ధృవాలలో ఘనీభవించిన నీటిని మరియు మంచును వెదకడం.
- చంద్రుడిపై గల ఎత్తైన శిలా ప్రదేశాలలో రసాయనచర్యా అవశేషాలకై వెదకడం.
- చంద్రుడి క్రస్ట్ లో మరియు క్రేటార్ లలో రసాయన స్ట్రాటిగ్రఫీ ను పరిశోధించడం.
- కృత్తిమ ఉపగ్రహ మార్గంలో చంద్రుడి ఉపరితల ఎత్తుపల్లాల విషయాలను మ్యాపింగ్ చేయడం.
- 10 కె.ఎ.వా (keV)ల కంటే ఎక్కువ గల ఎక్స్-కిరణాల స్పెక్ట్రమ్ ను అధ్యయనం చేయడము. దీని వలన చంద్రుడి వయస్సు, ఏర్పడిన కాలముల గూర్చి సరైన సమాచారము దొరికే అవకాశం ఉన్నది.
బరువులు [మార్చు]
ఈ సైంటిఫిక్ పేలోడ్ లోని మొత్తం బరువు 90 కి.గ్రా., ఇందులో ఆరు భారతీయ పరికరాలు మరియు ఆరు విదేశీ పరికరాలు గలవు.
- ఉపరితల స్వరూప చిత్రీకరణ కెమెరా The Terrain Mapping Camera (TMC), ఇది 5 మీటర్ల రెజెల్యూషన్‌తో 40 కి.మీ.ల మేరకు గల ప్రాంతాలను పాన్-క్రోమాటిక్ బ్యాండ్ లతో చంద్రుడి హై రెజెల్యూషన్ చిత్రాలను తీస్తుంది. [2]
- హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ Hyper Spectral Imager (HySI), ఇది ఖనిజాల అధ్యయనాన్ని దాని మ్యాపింగును చేస్తుంది, ఇది 400-900 ఎన్.ఎమ్. బ్యాండ్ లో 15 ఎన్.ఎమ్. మరియు 80 ఎన్.ఎమ్. స్పేషియల్ రెజెల్యూషన్ ను కలిగి వుంది.
- చంద్రుడి లేజర్ రేంజింగ్ పరికరం, Lunar Laser Ranging Instrument (LLRI), ఇది చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది.
- ఎక్స్-కిరణాల ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ An X-ray fluorescence spectrometer C1XS 1- 10 keV వరకు 25 కి.మీ. గ్రౌండ్ రెజెల్యూషన్ తోనూ మరియు ఒక సోలార్ ఎక్-కిరణాల మానిటర్, a Solar X-ray Monitor (XSM) ఇది సోలార్ ఫ్లక్స్ ను డిటెక్ట్ చేయడానికినూ, 1–10 keV రేంజి గలది.
- ఒక హై ఎనర్జీ ఎక్స్-కిరణ/గామా కిరణాల స్పెక్ట్రోమీటర్, A High Energy X-ray/gamma ray spectrometer (HEX) 30- 200 keV కొలతలకొరకు, 40 కి.మీ.ల గ్రౌండ్ రెజెల్యూషన్ తో, HEX, యురేనియం మరియు థోరియం ను 210Pb, 222Rn డీగ్యాసింగ్, మరియు ఇతర రేడియోధార్మిక పదార్థాలు.
- మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, Moon Impact probe(MIP), దీనిని ఇస్రో అభివృద్ధి చేసింది.
- విదేశీ పేలోడ్ లలో, ఈ.ఎస్.ఏ నుండి The Sub-keV Atom Reflecting Analyzer (SARA), [3]
- జె.పి.ఎల్. నుండి బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి.
- ఈ.ఎస్.ఏ. నుండి Near infrared spectrometer (SIR-2). [4]
- జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి ఎస్.బ్యాండ్ miniSAR. [5]
- బల్గేరియా నుండి రేడియేషన్ డోస్ మానిటర్, Radiation Dose Monitor (RADOM-7).
చంద్రయాన్-II [మార్చు]
ఇస్రో తన రెండవ చంద్రయాన్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. 2010 లేదా 2011 లో చంద్రుడిపై రోవర్ ప్రవేశపెట్టడానికి సన్నాహం చేస్తున్నది. ఈ విషయం ఇస్రో ఛైర్మన్ జీ. మాధవన్ నాయర్ చెప్పారు. [6]
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
Robot for India's moon mission
- ↑ Bhandari N. (2005). "Title: Chandrayaan-1: Science goals". Journal of Earth System Science 114: 699.
- ↑ A. S. Kiran Kumar, A. Roy Chowdhury (2005). "Terrain mapping camera for Chandrayaan-1". J. Earth Syst. Sci. 114 (6): 717–720.
- ↑ Bhardwaj, A., S. Barabash, Y. Futaana, Y. Kazama, K. Asamura, D. McCann, R. Sridharan, M. Holmström, P. Wurz, R. Lundin (2005). "Low energy neutral atom imaging on the Moon with the SARA instrument aboard Chandrayaan-1 Mission". J. Earth System Sci 114 (6): 749-760.
- ↑ Basilevsky A. T., Keller H. U., Nathues A., Mall J., Hiesinger H., Rosiek M. (2004). "Scientific objectives and selection of targets for the SMART-1 Infrared Spectrometer (SIR)". Planetary and Space Science 52: 1261-1285. DOI:10.1016/j.pss.2004.09.002.
- ↑ P. D. Spudis, B. Bussey, C. Lichtenberg, B. Marinelli, S. Nozette (2005). "mini-SAR: An Imaging Radar for the Chandrayaan 1 Mission to the Moon". Lunar and Planetary Science 26.
- ↑ "India, Russia to expand n-cooperation, defer Kudankulam deal". Earthtimes.org.
B. H. Foing (2004). "The case for the first Indian robotic mission to the Moon". Current Science 87: 1061-1065.
బయటి లింకులు [మార్చు]
- Offical Homepage of Chandrayaan-1
- Chandrayaan-1 Mission Profile by NASA's Solar System Exploration
- Chandrayaan-1 Announcement of Opportunity and home page from ISRO
- Video Overview of chandrayaan mission
- European Space Agency to cooperate with India's first lunar mission
- NSSDC Chandrayaan-1 page
- M3 fact sheet
- space.com: U.S. radar on Chandrayaan-1?
- Chandrayaan-II - ISRO plans moon rover
- SPACE.COM Moonbase: In the Dark On Lunar Ice
- The case for Chandrayaan
- Chandrayaan News and Forum
- Chandrayaan Animation by Thejes on YouTube
- Download High Resolution Chandrayaan Animation by Thejes
- C1XS X-ray Spectrometer Instrument