చంద్రహారం
వికీపీడియా నుండి
| చంద్రహారం (1954) | |
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు (తొలి చిత్రం) |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, శ్రీరంజని, సావిత్రి, ఎస్.వి. రంగారావు |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
చంద్రహారం (Chandraharam) 1954లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని విజయా ప్రొడక్షన్స్ వారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించారు.
విషయ సూచిక |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.
[మార్చు] పాటలు
- ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం
- ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ - ఘంటసాల
- ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో - ఘంటసాల, ఎ.పి.కోమల
- ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది - కె. రాణి బృందం
- ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి - ఘంటసాల
- ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే నాటక సమాప్తి - ఘంటసాల
- ఏ సాధువులు యందు హింసల పడకుండ (పద్యం) - పి. లీల
- ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే అది - పిఠాపురం బృందం
- నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా - మాధవపెద్ది
- లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా - లలిత
- విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం
[మార్చు] వనరులు, మూలాలు
- ఘంటసాల గళామృతం బ్లాగు - "ఘంటసాల సంగీత పాఠశాల" - కొల్లూరి భాస్కరరావు నిర్వహణ