చర్చ:ఆది పర్వము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంకెల వినియోగం[మార్చు]

వికీపీడియా నలుగురుకీ అందుబాటులో ఉండాలంటే తెలుగు అంకెలకి (౯,౯౮౪ వగైరా)బదులు హిందూ అంకెలు (1, 2, వగైరా)వాడితే బాగుంటుంది. - ఈ వాక్యం పేజి నుండి ఇక్కడకు తెచ్చాను.

భారతం ఆది కావ్యం కాదనుకొంటాను, రామాయణము ఆది కావ్యం కదా!!!--మాటలబాబు 21:08, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును! అంకెలు 1,2,3 వాడితేనే మంచిది. తెలుగు అంకెలు మనకి తెలియటం ఎంతగానో అవసరం. కాబట్టి రెంటికి మధ్యగా, తెలుగు అంకె ఆ తరువాత సంబంధిత 1,2,3 బ్రాకెట్‌లో ఉంచితే తెలియని నాలాంటి వారు తెలుసుకొనే అవకాశం ఉన్నది.--SIVA 03:56, 25 డిసెంబర్ 2008 (UTC)


వాక్యాల పొడవు[మార్చు]

సుజాతగారూ! చాలా కాలం అలా ఉండిపోయిన ఈ పర్వాలను మీరు విస్తరించడానికి ప్రయత్నించడం చాలా సంతోషం. ఒకో అధ్యాయం సారాంశాన్ని చాలా పెద్ద వాక్యంగా వ్రాస్తున్నారు. అది ఇప్పటి వారికి చదవడానికి అంత వీలుగా ఉండదు. చిన్న వాక్యాలైతే బాగుంటుంది. ఉదాహరణకు మీరు వ్రాసిన ఒక వాక్యం -

వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగ చిరంజీవత్వం లభించిందని మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని సంకల్పించగా ఏలా పుత్రుడనే పాము అమ్మ శాపం ఇచ్చే సమయంలో అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాట విన్నానని హాని కలిగించే పాములు మరణించటం మంచిదే అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తీకుడు చేస్తాడని చెప్పగా వాసుకి తన సోదరి జరత్కారువుని వివాహమాడటానికి జరత్కారుని కోసం ఎదురు చూసే సమయంలో అతడు పితృరుణం తీర్చుకొనే నిమిత్తం వివాహం చేసుకుని జరత్కారువు గర్భవతి కాగానే వారి ఒప్పందం కాణంగా ఆమెను విడిచి తపస్సునిమిత్తం వెళ్ళుట.

అదే విషయాన్ని ఇలా వ్రాయవచ్చునని నా అభిప్రాయం.

వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగా చిరంజీవత్వం లభించిందని చెప్పాడు. మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని సంకల్పించాడు. ఏలా పుత్రుడనే పాము అమ్మ శాపం ఇచ్చే సమయంలో అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాట విన్నానని తెలిపాడు. హాని కలిగించే పాములు మరణించటం మంచిదే అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తీకుడు చేస్తాడని చెప్పాడు. వాసుకి తన సోదరి జరత్కారువుని వివాహమాడటానికి జరత్కారుని కోసం ఎదురు చూసే సమయంలో అతడు పితృరుణం తీర్చుకొనే నిమిత్తం వివాహం చేసుకున్నాడు. జరత్కారువు గర్భవతి కాగానే వారి ఒప్పందం కాణంగా ఆమెను విడిచి తపస్సునిమిత్తం వెళ్ళాడు.

పరిశీలించగలరు - --కాసుబాబు 18:28, 22 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.వ్యాసం నిడివి పెరుగుతుందని ఇలావ్రాస్తున్నాను.మీ అభిప్రాయం చక్కగా ఉంది కనుక వ్రాసిన దానిని కూడా చిన్న వాక్యాలుగా మార్చి వ్రాస్తూ కొనసాగిస్తాను. -t.sujatha 06:58, 23 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం విభజన[మార్చు]

సుజాతగారూ! ఇప్పుడు వ్రాసినంతవరకు పరిశీలిస్తే వ్యాసం బాగా పొడవయ్యేలా ఉంది. మీరు వ్రాయడానికి ఏమీ అభ్యంతరం లేదు. కొనసాగించండి. 100 కిలోబైట్లు దాటితే గనుక వ్యాసాన్ని రెండుగా గాని, ఇంకా ఎక్కువగా కాని విభజిస్తాను (ఆదిపర్వము-1, ఆదిపర్వము-2, ... ఇలా) --కాసుబాబు 18:16, 23 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీరందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.నాకు వ్రాయాలని ఉంది.కనీసం ఇలా వ్రాస్తేకానీ చదివిన తృప్తి కలగదు.వ్యాసాన్ని ఇలానే కొనసాగిస్తాను.నాకు వీలైతే పద్ధెనిది పర్వాలు పూర్తి చేస్తాను.
సుజాత గారూ! మహాభారతం చదవడం కానీ వ్రాయడం కానీ అద్భుతమైన అనుభవం. మీరు ఈ తెలుగు వికీ బృహత్కార్యానికి పూనుకున్నందుకు అభినందనలు. (1) వ్యాసం నిడివిని దృష్టిలో ఉంచుకొని ఈ పేజీని ఇంతకుముందు చెప్పినట్లుగా విభజిస్తాను. (2) మీరు వ్రాసేటపుడు Fullstop మరియు comma ల తరువాత space ఇవ్వడం మరచిపోతున్నారు. గమనించండి. నేను search & replace ద్వారా కొన్నింటికి స్పేస్ పెట్టాను. (3) తెలుగు వికీలో రామాయణం మొదటి ఆరు కాండాలూ వ్రాసే భాగ్యం నాకు దక్కింది. అది తలుచుకొంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అవి ఒకమారు మీరు చూసి మీ అభిప్రాయం చెబితే సంతోషిస్తాను. ఉత్తరకాండం వేరేవారు వ్రాశారు. (4) మీకు తెలిసే ఉంటుంది. తి.తి.దే. వారు మహాభారతాన్ని 15 సంపుటాలుగా ప్రచురించారు. రెండు వేల రూపాయలు. నేను క్రిందటి సెలవుల్లో విశాలాంధ్రలో కొన్నాను. వూళ్ళో ఉంచాను గనుక ఇప్పుడు నాకు అందుబాటులో లేదు. --కాసుబాబు 08:46, 28 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
నిజంగానే భారతంలాంటి పురాణాలు చదవినా విన్నా చూసినా మధురాతి మధురమన అనుభవమే.మీలాంటి వారు వీకీలో వ్రాయడానికి నాకిచ్చిన ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.వీకీలో భారతం వ్రాయడం నాభాగ్యంగా భావిస్తున్నాను.నా దగ్గర కొంతభాగం భారతం ఉంది.మీ సలహాలు పాటిస్తూ మిగిలిన భాగాలు వ్రాస్తాను.అలాగే మీరందించిన రామాయణం చదువుతాను.నిజానికి రామాయణం,భాగవతం,శివపురాణం ప్రవచనాలు ఆసక్తిగా వింటూ వీకీలో వ్రాయడం

తగ్గించాను.నాకు ఆసక్తి ఉన్నది వ్రాయాలని భారతంతో మొదలు పెట్టాను.--t.sujatha 14:39, 28 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

సుజాతగారూ నమస్తే, చక్కటి వ్యాసం వ్రాస్తున్నారు, బృహత్కార్యాన్ని చేపట్టారు అభినందనలు. అహ్మద్ నిసార్ 16:47, 28 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]